స్వబాహ్యం
అన్యత్ న విద్యతే ఇతి అబాహ్యం, బహిరంగ వ్యతురిక్తః.
(తనకి వెలుపల
అయినది ఏదియు లేనివాడు - అంతయు తనే అయినవాడు, అంతయు తనలోనే కలవాడు.)
స్వా
వ్యాప్త దేశ శూన్యం ఇత్యర్థః. (తాను వ్యాపించియుండని ప్రదేశము లేనివాడు.)
అద్వితీయం. (తనకంటె వేరు
వస్తువు లేనిది, తనలాంటి మఱియొక వస్తువు లేనివాడు.)
ద్వితీయ కారణా భావాత్
అనుత్పన్నమిదం జగత్ |
తిష్ఠతి
బ్రహ్మణి స్ఫారే ప్రతిభా మాత్ర రూపదృక్ ||
ఇదం జగత్ కారణా భావాత్
బాహ్య వ్యతిరిక్తస్య ద్వితీయస్య కారణస్యా భావాత్ అబాహ్యం.
(ప్రపంచమునకు
పరబ్రహ్మ ఒకటే కారణము. బ్రహ్మకాక మఱియొక కారణము లేకపోవుటవలన, బ్రహ్మకంటె వేరుకానప్పటికీ బ్రహ్మలోనే
ఉండినట్లు కనబడుచుండుటవలన, బ్రహ్మకాక మఱియొకటి లేకుండుటవలన బ్రహ్మకు పైన (బహిరంగమందు)
ఏమియులేదు - “అనంత రమ బాహ్యం” (తనలోపలగాని, పైనగాని ఇతరవస్తువు లేనివాడు) అని శ్రుతి
చెప్పుచున్నది.
బహిరస్య
నవిద్యతే ఇతి అబాహ్యం. “నను బ్రహ్మణః” కారణా భావేసి స్వయం సర్వకారణత్వాత్ బ్రహ్మణః అఖండైక రసత్వేన
అంతరాలే జాత్యంతరా భావేపి బాహ్యస్యకాశాది ప్రపంచస్చోద్యక్ష మీక్షమాణత్వాత్ కధమే తద్యుప పద్యత ఇతిచేత్, న -
ప్రపంచస్య కల్పితత్వేన ప్రతిభామాత్ర శరీరత్వాత్ నకాబిదనుప పత్తిః.
(బ్రహ్మకు
పైన - వెలుపల - ఏమియును లేదు, ఉన్నదంతా అతనే కనుక - అందుచేత ‘అబాహ్యం’ అని
చెప్పబడుచున్నాడు.)
(పరబ్రహ్మకు
కారణము లేకపోయినప్పటికీ తానే అంతటికీ, అన్నింటికీ కారణమగుటచేతనున్నూ, పరబ్రహ్మ అఖండైకరసము - తాను
అన్నింటిలోను ఎల్లపుడు ఒకే రసము (తత్వము) గలవాడుగ నుండుటచేతను, అంతకాలమందు విజాతీయ
వస్తువు (ఇంకొక పరబ్రహ్మ, లేక, ఇంకొక వస్తువు) లేకపోయినప్పటికీ, పైగానున్నట్లు కనబడుచున్న
ఆకాశము మొదలగు ప్రపంచమును అధివసించి సాక్షివలె చూచుచుండుటవలననూ, ఇట్లు చెప్పుట - అనగా,
పరబ్రహ్మకు వెలుపల ఏమియు లేదనుట - ఎట్లు పొసగును అనిన పై ప్రపంచము పరబ్రహ్మలో కల్పితము -
ప్రపంచము పరబ్రహ్మకు ప్రతిభామాత్ర శరీరము.)
Transliteration
svabāhyaṃ
anyat na vidyatē iti abāhyaṃ, bahiraṃga vyaturiktaḥ.
(tanaki
velupala ayinadi ēdiyu lēnivāḍu - aṃtayu tanē ayinavāḍu, aṃtayu tanalōnē
kalavāḍu.)
svā
vyāpta dēśa śūnyaṃ ityarthaḥ. (tānu vyāpiṃciyuṃḍani pradēśamu
lēnivāḍu.)
advitīyaṃ.
(tanakaṃṭe vēru vastuvu lēnidi, tanalāṃṭi maṟiyoka vastuvu
lēnivāḍu.)
dvitīya kāraṇā
bhāvāt anutpannamidaṃ jagat |
tiṣṭhati
brahmaṇi sphārē pratibhā mātra rūpadṛk ||
idaṃ
jagat kāraṇā bhāvāt bāhya vyatiriktasya dvitīyasya kāraṇasyā bhāvāt
abāhyaṃ.
(prapaṃcamunaku
parabrahma okaṭē kāraṇamu. brahmakāka maṟiyoka kāraṇamu
lēkapōvuṭavalana, brahmakaṃṭe vērukānappaṭikī brahmalōnē uṃḍinaṭlu
kanabaḍucuṃḍuṭavalana, brahmakāka maṟiyokaṭi lēkuṃḍuṭavalana brahmaku
paina (bahiraṃgamaṃdu) ēmiyulēdu - “anaṃta rama bāhyaṃ” (tanalōpalagāni,
painagāni itaravastuvu lēnivāḍu) ani śruti ceppucunnadi.
bahirasya
navidyatē iti abāhyaṃ. “nanu brahmaṇaḥ” kāraṇā bhāvēsi svayaṃ
sarvakāraṇatvāt brahmaṇaḥ akhaṃḍaika rasatvēna aṃtarālē jātyaṃtarā
bhāvēpi bāhyasyakāśādi prapaṃcascōdyakṣa mīkṣamāṇatvāt kadhamē tadyupa
padyata iticēt, na - prapaṃcasya kalpitatvēna pratibhāmātra śarīratvāt
nakābidanupa pattiḥ.
(brahmaku
paina - velupala - ēmiyunu lēdu, unnadaṃtā atanē kanuka - aṃducēta
‘abāhyaṃ’ ani ceppabaḍucunnāḍu.)
(parabrahmaku
kāraṇamu lēkapōyinappaṭikī tānē aṃtaṭikī, anniṃṭikī
kāraṇamaguṭacētanunnū, parabrahma akhaṃḍaikarasamu - tānu anniṃṭilōnu
ellapuḍu okē rasamu (tatvamu) galavāḍuga nuṃḍuṭacētanu, aṃtakālamaṃdu
vijātīya vastuvu (iṃkoka parabrahma, lēka, iṃkoka vastuvu)
lēkapōyinappaṭikī, paigānunnaṭlu kanabaḍucunna ākāśamu modalagu
prapaṃcamunu adhivasiṃci sākṣivale cūcucuṃḍuṭavalananū, iṭlu ceppuṭa -
anagā, parabrahmaku velupala ēmiyu lēdanuṭa - eṭlu posagunu anina pai
prapaṃcamu parabrahmalō kalpitamu - prapaṃcamu parabrahmaku
pratibhāmātra śarīramu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.