← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అచలం acalaṃ

Original — తెలుగు
  1. గమనాదిక్రియా రహితం; చలన వర్జితః -

(కదలుట అను క్రియ లేనిది, చలనము లేనిది; చలింపనిది, స్థిరమైనది.)

  1. “న స్వరూన్న సామర్ధ్యాన్నచ జ్ఞానాదికాత్ గుణాత్ చలనం విద్యతే (అ) స్యేత్ అచలః” (శ్రీశంకరః)

(స్వరూపము నుండి కాని, సామర్ధ్యము నుండి కాని, జ్ఞానాది గుణముల నుండి కాని చలనము నొందనివాడు - అనగా, సర్వకాలము లందు ఒకే రీతిగా నుండు వాడు, ప్రపంచమును సృష్టించు శక్తిలోగాని, దానికి కావలసిన సర్వజ్ఞత్వము నుండి కాని చలింపని వాడు - ఎల్లపుడు ఈ శక్తులు కలిగియుండు వాడు.)

  1. కూటస్తాత్ అచలం, యస్మాత్ అచలం తస్మాత్ ధృవం, నిత్యం.

(కూటస్థము అనగా, త్రికాలములందు ఏవిధమైన మార్పులు లేకుండ ఉండునది. కూటమువలె ఏ కాలమందు ఏ విధమైన మార్పు లేకుండ ఉండునది. గనుక అచలము, అచలము గనుకనే ధ్రువము - స్థిరము - నిత్యమైనది),

  1. “పూర్వరూపా పరిత్యాగీ” (శ్రీధరీయ వ్యాఖ్యా)

(మొదట ఉన్న రూపమును వదలని వాడు. ఎప్పుడూ ఒకే రూపముతో ఉండు వాడు - అనగా, సృష్టి పూర్వము ఏ రూపములో ఉండెనో స్థితికాలమందు ఎన్ని రూపములుగా మారినను, ఎన్ని రూపములలో ఉండినను, ప్రళయకాలమందైనా ఒకేరీతిగా నుండు వాడు.)

  1. “అపరిణామిత్వేన స్వాసాధారణాకారాత్ నచలతి, నచ్యవతి. ఇత్యచలం, తత ఏవ ధ్రువం, నిత్యం” (శ్రీశంకరః)

అహమర్థోహిసుఖీ,దుఃఖీ పరిణామ్యావిర్భావతిరో భావశీలశ్చ |

అతః చంచలః.ఆత్మాతు న తధా (చలం = వికారం.)

(పరిణామము లేక పోవుట చేత- మార్పు లేక పోవుట చేత తనయొక్క అసాధారణాకారము - స్వస్వరూపము - నుండి చలించనిది, తనస్వంత ఆకారమును విడువనిది. అట్లు చలించకుండుట వలన ధ్రువము - స్థిరము - నిత్యము.)

(అహమని చెప్పుచున్న జీవుడనగు నేను సుఖము ననుభవించు చున్నాను, దుఃఖము ననుభవించు చున్నాను అను పరిణామములను పొందు వాడు; అందుచేత చంచలుడు - వికారములు కలవాడు. ఆత్మ అట్లుకాదు, అవికారుడు, వికారములు లేనివాడు.)

  1. అధ్యస్తస్య అవిద్యాదేః గుణదోషాభ్యాం గుణదోషవత్వేన స్వ స్వరూపాత్ న చలతి ఇత్య చలం ఇత్యర్ధః.

(అధ్యస్తమై యున్న అవిద్య మొదలగు వాటి యొక్క గుణదోషముల చేత తన స్వస్వరూపము - (ఆత్మ తత్వము) నుండి చలింపడు. అందుచేత అచలము. అనగా, ఆత్మ తత్వమునకు త్రిగుణములతో కలిసియున్నందు వలన కలుగు మార్పులేదు - అని అర్ధము.)

  1. స్పందన రహితం = స్పందనము లేనివాడు.

  2. నిర్వికల్పక చిధ్ధాతుః, విక్రియా వైరల్యాత్.

(నిర్వికల్పక చైతన్యము, వికారములు లేనివాడు.)

  1. “సర్వత్రగమచిత్యంచ కూటస్థమచలం ధ్రువం”. (శ్రీ మద్బగవద్గీత - 12 - 3)

పై శ్లోకమునకు వ్యాఖ్యానము :-

“మాయా తత్కార్యరూపే యత్కూటే (అ) ధిష్ఠాన భావతః |

తిష్టత్యా ధ్యాసి కేనైవ సంబంధే నా వికారిచ |

కూటస్థత్వేన సర్వేషాం దోషాణాం వారణం కృతం |

అతో మాయా వికారాణా మధిష్ఠాన తయా (అ) చలం |

అత ఏవ ధ్రువం నిత్యం పరిణామ వివర్జితం ||” (గీతాభావ ప్రకాశము - 12 - 27 to 29)

(మాయ యనదగు నజ్ఞానమును కార్య ప్రపంచముతో పాటుగ మిధ్యా భూతమైనను లోకులకు - సత్యముగా భాసించుటచే కూటము అయినది (అబద్ధము) అట్టి కూటమున అధ్యా సిక సంబంధమున అధిష్ఠానముగ నుండునది కావున కూటస్థము - అజ్ఞాన తత్కార్యము లకు అధిష్ఠానమని యర్ధము. ఇది అవికారి కావుననే ఇది అచలం. చలనమనగా వికారము - అది లేనిది అచలము. మాయా వికారములకు అధిష్ఠానమగుటచే అచలము.)

  1. ఆవిర్భావ తిరోభావములు - కనబడుట, కనబడకుండుట - మొదలగు వికారములు (మార్పులు) లేనందువలన అచంచలము.)
Transliteration
  1. gamanādikriyā rahitaṃ; calana varjitaḥ -

(kadaluṭa anu kriya lēnidi, calanamu lēnidi; caliṃpanidi, sthiramainadi.)

  1. “na svarūnna sāmardhyānnaca jñānādikāt guṇāt calanaṃ vidyatē (a) syēt acalaḥ” (śrīśaṃkaraḥ)

(svarūpamu nuṃḍi kāni, sāmardhyamu nuṃḍi kāni, jñānādi guṇamula nuṃḍi kāni calanamu noṃdanivāḍu - anagā, sarvakālamu laṃdu okē rītigā nuṃḍu vāḍu, prapaṃcamunu sṛṣṭiṃcu śaktilōgāni, dāniki kāvalasina sarvajñatvamu nuṃḍi kāni caliṃpani vāḍu - ellapuḍu ī śaktulu kaligiyuṃḍu vāḍu.)

  1. kūṭastāt acalaṃ, yasmāt acalaṃ tasmāt dhṛvaṃ, nityaṃ.

(kūṭasthamu anagā, trikālamulaṃdu ēvidhamaina mārpulu lēkuṃḍa uṃḍunadi. kūṭamuvale ē kālamaṃdu ē vidhamaina mārpu lēkuṃḍa uṃḍunadi. ganuka acalamu, acalamu ganukanē dhruvamu - sthiramu - nityamainadi),

  1. “pūrvarūpā parityāgī” (śrīdharīya vyākhyā)

(modaṭa unna rūpamunu vadalani vāḍu. eppuḍū okē rūpamutō uṃḍu vāḍu - anagā, sṛṣṭi pūrvamu ē rūpamulō uṃḍenō sthitikālamaṃdu enni rūpamulugā mārinanu, enni rūpamulalō uṃḍinanu, praḷayakālamaṃdainā okērītigā nuṃḍu vāḍu.)

  1. “apariṇāmitvēna svāsādhāraṇākārāt nacalati, nacyavati. ityacalaṃ, tata ēva dhruvaṃ, nityaṃ” (śrīśaṃkaraḥ)

ahamarthōhisukhī,duḥkhī pariṇāmyāvirbhāvatirō bhāvaśīlaśca |

ataḥ caṃcalaḥ.ātmātu na tadhā (calaṃ = vikāraṃ.)

(pariṇāmamu lēka pōvuṭa cēta- mārpu lēka pōvuṭa cēta tanayokka asādhāraṇākāramu - svasvarūpamu - nuṃḍi caliṃcanidi, tanasvaṃta ākāramunu viḍuvanidi. aṭlu caliṃcakuṃḍuṭa valana dhruvamu - sthiramu - nityamu.)

(ahamani ceppucunna jīvuḍanagu nēnu sukhamu nanubhaviṃcu cunnānu, duḥkhamu nanubhaviṃcu cunnānu anu pariṇāmamulanu poṃdu vāḍu; aṃducēta caṃcaluḍu - vikāramulu kalavāḍu. ātma aṭlukādu, avikāruḍu, vikāramulu lēnivāḍu.)

  1. adhyastasya avidyādēḥ guṇadōṣābhyāṃ guṇadōṣavatvēna sva svarūpāt na calati itya calaṃ ityardhaḥ.

(adhyastamai yunna avidya modalagu vāṭi yokka guṇadōṣamula cēta tana svasvarūpamu - (ātma tatvamu) nuṃḍi caliṃpaḍu. aṃducēta acalamu. anagā, ātma tatvamunaku triguṇamulatō kalisiyunnaṃdu valana kalugu mārpulēdu - ani ardhamu.)

  1. spaṃdana rahitaṃ = spaṃdanamu lēnivāḍu.

  2. nirvikalpaka cidhdhātuḥ, vikriyā vairalyāt.

(nirvikalpaka caitanyamu, vikāramulu lēnivāḍu.)

  1. “sarvatragamacityaṃca kūṭasthamacalaṃ dhruvaṃ”. (śrī madbagavadgīta - 12 - 3)

pai ślōkamunaku vyākhyānamu :-

“māyā tatkāryarūpē yatkūṭē (a) dhiṣṭhāna bhāvataḥ |

tiṣṭatyā dhyāsi kēnaiva saṃbaṃdhē nā vikārica |

kūṭasthatvēna sarvēṣāṃ dōṣāṇāṃ vāraṇaṃ kṛtaṃ |

atō māyā vikārāṇā madhiṣṭhāna tayā (a) calaṃ |

ata ēva dhruvaṃ nityaṃ pariṇāma vivarjitaṃ ||” (gītābhāva prakāśamu - 12 - 27 to 29)

(māya yanadagu najñānamunu kārya prapaṃcamutō pāṭuga midhyā bhūtamainanu lōkulaku - satyamugā bhāsiṃcuṭacē kūṭamu ayinadi (abaddhamu) aṭṭi kūṭamuna adhyā sika saṃbaṃdhamuna adhiṣṭhānamuga nuṃḍunadi kāvuna kūṭasthamu - ajñāna tatkāryamu laku adhiṣṭhānamani yardhamu. idi avikāri kāvunanē idi acalaṃ. calanamanagā vikāramu - adi lēnidi acalamu. māyā vikāramulaku adhiṣṭhānamaguṭacē acalamu.)

  1. āvirbhāva tirōbhāvamulu - kanabaḍuṭa, kanabaḍakuṃḍuṭa - modalagu vikāramulu (mārpulu) lēnaṃduvalana acaṃcalamu.)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.