← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అధియజ్ఞము adhiyajñamu

Original — తెలుగు
  1. యజ్ఞాధిష్టాతా, ఈశ్వరః శ్రీ విష్ణుః,

(యజ్ఞమును అధిష్టించియుండువాడు, యజ్ఞాధిష్టాన దేవత - శ్రీమహావిస్ణువు.)

  1. యజ్ఞే సంబధ్య మానః అధియజ్ఞః, తత్ర చ సర్వేశ్వరస్య ఆరాధ్యతయా సంబంధః.

(యజ్ఞములో - యజ్ఞకర్మలో - సంబంధము కలిగియుండువాడు - యజ్ఞము ద్వారా ఆరాధించ బడుటయే పరమాత్మకు - విష్ణువునకు - యజ్ఞముతో గల సంబంధము.)

  1. “అస్మిన్ దేహే స్థితః అహమేవ అధి యజ్ఞః, యజ్ఞస్య అధిష్ఠాత్రీ దేవతా, యజ్ఞాది కర్మ ప్రవర్తకః, > తత్ఫలదాతాచ” (శ్రీధరస్వామి)

(ఈ దేహములో నున్నటువంటి నేనే అధియజ్ఞము, అనగా - యజ్ఞాధిష్ఠాన దేవత, యజ్ఞము మొదలగు కర్మ చేయించువాడు, యజ్ఞకర్మ ఫలమునిచ్చువాడున్నూ.)

  1. అస్మిన్ దేహే అంతర్యామిత్వేన స్థితో (అ) హమధియజ్ఞః యజ్ఞాది కర్మ ప్రవర్తకః, తత్ఫలదాతాచ.

(ఈ దేహములో అంతర్యామిగానున్న నేనే అధియజ్ఞము, యజ్ఞము మొదలగు కర్మ చేయించువాడను, ఆ కర్మల ఫలము నిచ్చువాడనుకూడ.)

  1. “యజ్ఞై రారాధ్య తయా వర్తమానః అత్ర ఇంద్రాదౌ మమ దేహ భూతౌ ఆత్మ తయాస్థితౌ, అహమేవ యజ్ఞైః ఆరాధ్యః > ఇతి. మహాయజ్ఞాది నిత్య నైమిత్తికానుష్ఠాన వేలాయాం త్రయాణాం అధికారిణాం అనుసంధేయః ఏ తత్” (శ్రీ > రామానుజః)

(యజ్ఞములచేత నారాధింపబడువాడు. ఇంద్రుడు మొదలగు దేవతల దేహములు నావే - ఆ దేహములలోని ఆత్మ నేనే. అందుచేత యజ్ఞములచేత నారాధింపబడువాడను నేనే. అందుచేత అధియజ్ఞమనగా నేనే. మహా యజ్ఞములు చేయునపుడును నిత్య నైమిత్తిక కర్మలు చేయునపుడును ఆ సమయములలో ఈ విషయమే మనసులో పట్టించుకొని చేయవలెను.)

  1. సర్వయజ్ఞాభిమానీ విష్ణ్వాఖ్యా దేవతా (యజ్ఞములన్నింటినీ అభిమానించు విష్ణువు అను దేవుడు.)

  2. అత్ర అస్మిన్ దేహే యో యజ్ఞః తస్య అహం అధి యజ్ఞః - యజ్ఞోనామ దేహ నిర్వర్త్యత్వేన దేహ సమవాయి ఇతి > దేహాధి కరణో భవతి.

(ఈ దేహములో యజ్ఞము అనునది ఏది కలదో దానికి నేను అధియజ్ఞము - యజ్ఞమనగా దేహముచేత చేయబడునది కనుక దేహసమవాయి, దేహాధికరణము.)

  1. “అధియజ్ఞో (అ) హమేవాత్ర దేహే దేహ భృతాంవర ||” (శ్రీమద్భగవద్గీత - 8 - 4)

పై శ్లోకభాగమునకు వ్యాఖ్యానము : -

“విష్ణ్వా ఖ్యా దేవతా శ్రౌతీ సర్వయజ్ఞాభిమానినీ |

స విష్ణుశ్చాధి యజ్ఞోహం వాసుదేవో న మత్పరః |

యతో బ్రహ్మద్వయా నందా దత్యం తా భేదతో హరేః |

ప్రతి పత్తవ్య ఏవాస్మిన్ నృదేహే యజ్ఞరూపతః |

బుద్ధ్యాది వ్యతిరిక్తో స్తి విస్ణురూప తయా స్థితః |

మనుష్య దేహే యజ్ణ స్యావస్థానం హరిణేరితం |

యతో మనుష్య దేహేన నిర్వర్తిత్వం హి కర్మణః. || (గీతాభావప్రకాశము - 8 - 25 to 29)

(శ్రుతిలో చెప్పబడిన సమస్త యజ్ఞములను అభిమానించు వాడు అని చెప్పబడిన విష్ణువు అను దేవత నేనే. ఆ విష్ణువు అను అధియజ్ఞము వాసుదేవుడనైన నేనే. నాకన్న పరుడు, ఇతరుడు, ఉత్కృష్టమైనవాడు, అధియజ్ఞమైనవాడు ఎవడూ లేడు. ఎందుచేతననగా, అద్వయానందుడైన పరబ్రహ్మము అగు విష్ణువుకన్న వేరు కానటువంటివాడు ఈ మానవదేహమందు యజ్ఞరూపముతో నున్నాడు. బుద్ధి మొదలగువాటికంటె వ్యతిరిక్తమై విష్ణురూపముతో నున్నాడు. మానవ దేహముతోనే కర్మ నిర్వర్తించవలసియున్నది కనుక మానవదేహమందు యజ్ఞము ఉన్నదని - యజ్ఞరూపముతో భగవంతుడున్నాడని శ్రీకృష్ణభగవానునిచే చెప్పబడినది.)

  1. “మాం సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణకాలే (అ) పి చ మాం తే విదుర్యుక్త చేతసః ||” (శ్రీమద్భగవద్గీత- 7 - 30)
Transliteration
  1. yajñādhiṣṭātā, īśvaraḥ śrī viṣṇuḥ,

(yajñamunu adhiṣṭiṃciyuṃḍuvāḍu, yajñādhiṣṭāna dēvata - śrīmahāvisṇuvu.)

  1. yajñē saṃbadhya mānaḥ adhiyajñaḥ, tatra ca sarvēśvarasya ārādhyatayā saṃbaṃdhaḥ.

(yajñamulō - yajñakarmalō - saṃbaṃdhamu kaligiyuṃḍuvāḍu - yajñamu dvārā ārādhiṃca baḍuṭayē paramātmaku - viṣṇuvunaku - yajñamutō gala saṃbaṃdhamu.)

  1. “asmin dēhē sthitaḥ ahamēva adhi yajñaḥ, yajñasya adhiṣṭhātrī dēvatā, yajñādi karma pravartakaḥ, > tatphaladātāca” (śrīdharasvāmi)

(ī dēhamulō nunnaṭuvaṃṭi nēnē adhiyajñamu, anagā - yajñādhiṣṭhāna dēvata, yajñamu modalagu karma cēyiṃcuvāḍu, yajñakarma phalamuniccuvāḍunnū.)

  1. asmin dēhē aṃtaryāmitvēna sthitō (a) hamadhiyajñaḥ yajñādi karma pravartakaḥ, tatphaladātāca.

(ī dēhamulō aṃtaryāmigānunna nēnē adhiyajñamu, yajñamu modalagu karma cēyiṃcuvāḍanu, ā karmala phalamu niccuvāḍanukūḍa.)

  1. “yajñai rārādhya tayā vartamānaḥ atra iṃdrādau mama dēha bhūtau ātma tayāsthitau, ahamēva yajñaiḥ ārādhyaḥ > iti. mahāyajñādi nitya naimittikānuṣṭhāna vēlāyāṃ trayāṇāṃ adhikāriṇāṃ anusaṃdhēyaḥ ē tat” (śrī > rāmānujaḥ)

(yajñamulacēta nārādhiṃpabaḍuvāḍu. iṃdruḍu modalagu dēvatala dēhamulu nāvē - ā dēhamulalōni ātma nēnē. aṃducēta yajñamulacēta nārādhiṃpabaḍuvāḍanu nēnē. aṃducēta adhiyajñamanagā nēnē. mahā yajñamulu cēyunapuḍunu nitya naimittika karmalu cēyunapuḍunu ā samayamulalō ī viṣayamē manasulō paṭṭiṃcukoni cēyavalenu.)

  1. sarvayajñābhimānī viṣṇvākhyā dēvatā (yajñamulanniṃṭinī abhimāniṃcu viṣṇuvu anu dēvuḍu.)

  2. atra asmin dēhē yō yajñaḥ tasya ahaṃ adhi yajñaḥ - yajñōnāma dēha nirvartyatvēna dēha samavāyi iti > dēhādhi karaṇō bhavati.

(ī dēhamulō yajñamu anunadi ēdi kaladō dāniki nēnu adhiyajñamu - yajñamanagā dēhamucēta cēyabaḍunadi kanuka dēhasamavāyi, dēhādhikaraṇamu.)

  1. “adhiyajñō (a) hamēvātra dēhē dēha bhṛtāṃvara ||” (śrīmadbhagavadgīta - 8 - 4)

pai ślōkabhāgamunaku vyākhyānamu : -

“viṣṇvā khyā dēvatā śrautī sarvayajñābhimāninī |

sa viṣṇuścādhi yajñōhaṃ vāsudēvō na matparaḥ |

yatō brahmadvayā naṃdā datyaṃ tā bhēdatō harēḥ |

prati pattavya ēvāsmin nṛdēhē yajñarūpataḥ |

buddhyādi vyatiriktō sti visṇurūpa tayā sthitaḥ |

manuṣya dēhē yajṇa syāvasthānaṃ hariṇēritaṃ |

yatō manuṣya dēhēna nirvartitvaṃ hi karmaṇaḥ. || (gītābhāvaprakāśamu - 8 - 25 to 29)

(śrutilō ceppabaḍina samasta yajñamulanu abhimāniṃcu vāḍu ani ceppabaḍina viṣṇuvu anu dēvata nēnē. ā viṣṇuvu anu adhiyajñamu vāsudēvuḍanaina nēnē. nākanna paruḍu, itaruḍu, utkṛṣṭamainavāḍu, adhiyajñamainavāḍu evaḍū lēḍu. eṃducētananagā, advayānaṃduḍaina parabrahmamu agu viṣṇuvukanna vēru kānaṭuvaṃṭivāḍu ī mānavadēhamaṃdu yajñarūpamutō nunnāḍu. buddhi modalaguvāṭikaṃṭe vyatiriktamai viṣṇurūpamutō nunnāḍu. mānava dēhamutōnē karma nirvartiṃcavalasiyunnadi kanuka mānavadēhamaṃdu yajñamu unnadani - yajñarūpamutō bhagavaṃtuḍunnāḍani śrīkṛṣṇabhagavānunicē ceppabaḍinadi.)

  1. “māṃ sādhiyajñaṃ ca yē viduḥ prayāṇakālē (a) pi ca māṃ tē viduryukta cētasaḥ ||” (śrīmadbhagavadgīta- 7 - 30)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.