← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అధోలోకములు adhōlōkamulu

Original — తెలుగు
  1. “అధస్తా దవనేస్సప్త, దేవర్షే, వివరా స్స్మృతాః |

ఏకైకశః యోజనానా మాయామోచ్ఛ్రాయతః పునః |

ఆయుతాంతర విఖ్యాతాః సర్వర్తు సుఖదాయకాః |

అతలం ప్రధమం ప్రొక్తం ద్వితీయం వితలం తథా |

త్రుతీయం సుతలం ప్రోక్తం చతుర్ధం వై తలాతలం |

మహాతలం పంచమంచ షష్టం ప్రోక్తం రసాతలం |

సప్తమం,విప్ర, పాతాళం సప్తై తేవివరా స్మృతాః |

ఏతేషు బిలనర్గేషు దివోవ్యధి కమేవచ ||” (దేవీ భాగవతము)

(భూమికి క్రిందను ఏడు దివరములున్నవి. అవి అన్ని ఋతువులందు సుఖమును కలుగచేయునవియే. ఈ లోకముల పేర్లు - 1.అతలము, 2. వితలము, 3. సుతలము, 4. తలాతలము, 5. మహాతలము, 6. రసాతలము, 7. పాతాళము.

“తత్కట్యాం అతలం క్లప్తం ఊరుభ్యాం వి తలం విభోః |

జానుభ్యాం సుతలం శుద్ధం, జంఘాభ్యాంతు తలాతలం |

మహాతలంతు గుల్భాఖ్యాం ప్రవదాభ్యాం రసాతలం |

పాతాళం పాద తలతః ఇతి లోకమ యః పుమాన్ ||” (శ్రీమద్భాగవతం)

  1. వ. “--- భగవంతుని పాదమూలంబు పాతాళంబు, పార్షి భాగ (మడమ) పాదాగ్ర భాగంబులు రసాతలంబు, గుల్ఫంబు (చీలమండలు) మహాతలంబు, జంఘులు(పిక్కలు) తలాతలంబు, జానుద్వయంబు (మోకాళ్ళు) సుతలంబు, ఊరువులు వితలా తలంబులు, ---”

(శ్రీ మదాంధ్ర మహాభాగవతము- 2 - 1 - 16)

  1. ప్రపంచమంతా పరబ్రహ్మమే, ఈ ప్రపంచములో ఉన్న ప్రతి వస్తువు పరబ్రహ్మమే యగుటవలన, సృష్టిలో > అత్యుత్తమమైన తత్వము జీవతత్వమగుటవలనను, జీవరాసులలో మానవరూపము జ్ఞానము కలిగియున్న > ఉత్కృష్ట రూపముగనుకను, అట్టిమానవరూపముతో భగవంతుని విశ్వరూపమును పోల్చి, దానికి > అవయవములు కల్పించడములో ఈ అంగవిభజన మహానుభావులైన బ్రహ్మజ్ఞానులు పై ప్రకారముగా అవయవ > నిర్ణయము చేసిరి.

మ. బహు పా దోరు భుజాన నేక్షణ శిరః ఫాల శ్రవో యుక్తుడై

విహరించున్ బహుదేహి దేహగతుడై విద్వాంసు లూహించి త

ద్బహురూ పావయవంబులన్ భువన సంపత్తిన్ విచారింతురు --- (శ్రీమదాంధ్ర మహాభాగవతము- 2 - 5 - 88)

  1. “అధోగచ్ఛంతి తామసాః” (శ్రీమద్భగవద్గీత - 14 - 18)

(తామస గుణము కలవారు అధోలోకములకు పోవుదురు.)

Transliteration
  1. “adhastā davanēssapta, dēvarṣē, vivarā ssmṛtāḥ |

ēkaikaśaḥ yōjanānā māyāmōcchrāyataḥ punaḥ |

āyutāṃtara vikhyātāḥ sarvartu sukhadāyakāḥ |

atalaṃ pradhamaṃ proktaṃ dvitīyaṃ vitalaṃ tathā |

trutīyaṃ sutalaṃ prōktaṃ caturdhaṃ vai talātalaṃ |

mahātalaṃ paṃcamaṃca ṣaṣṭaṃ prōktaṃ rasātalaṃ |

saptamaṃ,vipra, pātāḷaṃ saptai tēvivarā smṛtāḥ |

ētēṣu bilanargēṣu divōvyadhi kamēvaca ||” (dēvī bhāgavatamu)

(bhūmiki kriṃdanu ēḍu divaramulunnavi. avi anni ṛtuvulaṃdu sukhamunu kalugacēyunaviyē. ī lōkamula pērlu - 1.atalamu, 2. vitalamu, 3. sutalamu, 4. talātalamu, 5. mahātalamu, 6. rasātalamu, 7. pātāḷamu.

“tatkaṭyāṃ atalaṃ klaptaṃ ūrubhyāṃ vi talaṃ vibhōḥ |

jānubhyāṃ sutalaṃ śuddhaṃ, jaṃghābhyāṃtu talātalaṃ |

mahātalaṃtu gulbhākhyāṃ pravadābhyāṃ rasātalaṃ |

pātāḷaṃ pāda talataḥ iti lōkama yaḥ pumān ||” (śrīmadbhāgavataṃ)

  1. va. “--- bhagavaṃtuni pādamūlaṃbu pātāḷaṃbu, pārṣi bhāga (maḍama) pādāgra bhāgaṃbulu rasātalaṃbu, gulphaṃbu (cīlamaṃḍalu) mahātalaṃbu, jaṃghulu(pikkalu) talātalaṃbu, jānudvayaṃbu (mōkāḷḷu) sutalaṃbu, ūruvulu vitalā talaṃbulu, ---”

(śrī madāṃdhra mahābhāgavatamu- 2 - 1 - 16)

  1. prapaṃcamaṃtā parabrahmamē, ī prapaṃcamulō unna prati vastuvu parabrahmamē yaguṭavalana, sṛṣṭilō > atyuttamamaina tatvamu jīvatatvamaguṭavalananu, jīvarāsulalō mānavarūpamu jñānamu kaligiyunna > utkṛṣṭa rūpamuganukanu, aṭṭimānavarūpamutō bhagavaṃtuni viśvarūpamunu pōlci, dāniki > avayavamulu kalpiṃcaḍamulō ī aṃgavibhajana mahānubhāvulaina brahmajñānulu pai prakāramugā avayava > nirṇayamu cēsiri.

ma. bahu pā dōru bhujāna nēkṣaṇa śiraḥ phāla śravō yuktuḍai

vihariṃcun bahudēhi dēhagatuḍai vidvāṃsu lūhiṃci ta

dbahurū pāvayavaṃbulan bhuvana saṃpattin vicāriṃturu --- (śrīmadāṃdhra mahābhāgavatamu- 2 - 5 - 88)

  1. “adhōgacchaṃti tāmasāḥ” (śrīmadbhagavadgīta - 14 - 18)

(tāmasa guṇamu kalavāru adhōlōkamulaku pōvuduru.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.