← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అఘాయుః aghāyuḥ

Original — తెలుగు
  1. “అఘం పాపం ఆయుః జీవనం యస్య సః అఘాయుః, పాపజీవనః” (శ్రీ శంకరః)

“అఘం పాపరూపం ఆయుః యస్య సః” (శ్రీధరీయ వ్యాఖ్యా)

(అఘనము అనగా పాపము; ఆయుః అనగా జీవనము - పాపరూపమైన జీవనము చేయువాడు, పాపములు చేయుచు జీవించువాడు.)

  1. అఘారంభాయైవ యస్య ఆయుః, అఘ పరిణితం, వోభయరూపం వా సో అఘాయుః.

(పాపము చేయుటకే ఎవడు జీవించునో, ఎవడు చేసిన వన్నియు పాపములుగా పరిణమించునో వాడు అఘాయువు.)

  1. “పాప జీవనః” (నీలకంఠవ్యాఖ్యా.) (పాపము చేయుచు జీవించువాడు.)

  2. అఘం వ్యర్థమేవ జీవతి ఇతి. (వ్యర్ధముగా జీవించువాడు, జీవించి యుండటలో ప్ర్తయోజనము లేనివాడు.)

  3. ఈశ్వరేణ వేదయజ్ఞ పూర్వకం జగచ్చక్రం ప్రవర్తితం | యః కర్మణి అధికృతస్సన్ న అనువర్తయతి స అఘాయుః. (శ్రీ శంకరః)

(భగవంతుని చేత వేదములో చెప్పిన ప్రకారము యజ్ఞముల ద్వారా నడిపించ బడిన జగచ్చక్రమును ఎవడు కర్మలు చేయుచు అనుసరించడో వాడు అఘాయువు.)

  1. “ఇహ సాధనే వర్తమానో యః కర్మయోగాధికారీ, జ్ఞానయోగాధికారీవా, నాను వర్తయతి, నప్రవర్తయతి యజ్ఞ శిష్టేన దేహ ధారణ మకుర్యన్, సః అఘాయుర్భవతి” (శ్రీ రామానుజః)

(కర్మయోగాధికారి గాని, జ్ఞానయోగాధికారి గాని, తను యోగసాధన చేయుచు, యజ్ఞము చేయుచు దేవతలకు సమర్పించిన దానిలో మిగిలిన దానితో దేహమును పోషించుకొనుచు ఎవడు ప్రవర్తింపడో - దేవతలకు నివేదన చేసి, మిగిలిన దానిని తినక, తనకున్నదంతయు తానే తినునో అట్టివాడు అఘాయువు.)

  1. “యో జగచ్చక్రం న అనువర్తయతి, సః తద్వినాశకత్వాత్ అఘాయుః, పాపనిమిత్తమేవ యస్య ఆయుః సః అఘాయుః.

(శ్రీ ఆనందతీర్థః)

(ఎవడు జగచ్చక్రము ననుసరించి చేయడో వాడు దానిని నశింప చేయువాడు గనుక అఘాయువు, పాపజీవి,పాపము చేయుట కొఱకే అతని జీవితము గనుక వాడు అఘాయువు.)

  1. పైన చెప్పబడిన జగచ్చక్రము శ్రీమద్భగవద్గీతలో ఈ క్రిందవిధముగా చెప్పబడినది:-

“అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః |

యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః |

కర్మ బ్రహ్మాద్భవం విధ్ధి బ్రహ్మాక్షర సముద్భవం |

తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్టితం |

ఏవం ప్రవర్తితం చక్రం నాను ప్రవర్తయతీహయః |

అఘాయు రింద్రియా రామో మోఘం పార్ధ స జీవతి ||” (శ్రీమద్భగవద్గీత - 3 - 14,15,16)

పై శ్లోకమునకు వ్యాఖ్యానము : -

“న కేవలం విధేర్వక్యాదేవ కర్తవ్యమస్తి తత్ |

కర్మ కింతు జగచ్చక్ర ప్రవృత్తేః కారణాదపి |

శుక్ర శోణితరూపేణ హ్యన్నాత్పరిణ తాత్కిల |

శరీరాణి ప్రజాయంతే వృష్టేరన్నస్య జన్మచ |

యజ్ఞాధ్ధర్మా దీ పూర్వాఖ్యా జ్జాయంతే వృష్టి రర్కతః |

అగ్నౌ ప్రాప్తాహుతిః సమ్య గాదిత్య ముపతిష్టతే |

ఆదిత్యాజ్జాయ తే వృష్టిర్వృష్టే రన్నం తతః ప్రజాః |

సూక్ష్మో ధర్మః సయజ్ఞాఖ్య ఋత్విగాదేశ్చ కర్మణః |

అపూర్వాఖ్యస్య యజ్ఞస్య విహితం కర్మ కారణం |

వేదప్రమాణకం కర్మాపూర్వా పూర్వస్యో త్పాదకం భవేత్ |

నతు పాషండ సంసిద్ధం ధర్మ స్యో త్పాదకం భవేత్ |

ననుపాషండ శాస్త్రాత్కిం వైలక్షణ్యం శ్రుతేర్యతః |

శ్రుతి ప్రమాణకో ధర్మో నాన్యోస్తీతి శ్రుణూత్తరం |

ఆవిర్భావోపి వేదస్య హ్య క్షరాత్సరమాత్మనః |

తధా చాపౌరుషే యత్వాత్ నిరస్తాఖిల సంశయః |

అర్ధే హ్యతీంద్రియే వేదః ప్రమాణం స్వత ఏవసః |

నతు ప్రమాదమాయాది దోషవద్రచితం హి తత్ |

పాషండ వాక్యం ప్రామాణ్య జనకం స్యాదతీంద్రియే |

తస్మాత్సాక్షాత్సర బ్రహ్మ హేతుత్వాత్ సర్వ భాసకం |

అవినాశిచ వేదాఖ్యం బ్రహ్మ యజ్ఞే ప్రతిష్టితం |

అతోప్యదీంద్రియో ధర్మో అనుష్టేయో వేద బోధితః |

త్యక్త్వాప బోధితం పాషండ బోధితం సర్వథా జనైః ||”

ఆదౌ సర్వేశ్వరా ద్వేదః కర్మజ్ఞానం తతో భవేత్ |

తతో ధర్మ స్తతో (అ) నుష్టానతో వృష్టిస్తతః పరం |

అన్నమనాచ్ఛరీ రాణి పునస్తేషాం తధైవ చ |

కర్మ ప్రవృత్తి రిత్యేవ మీశ్వరేణ ప్రవర్తితం |

జగన్నిర్వాహకం చక్రం మూఢోయో నాను తిష్ఠతి |

స పాపజీవితో వ్యర్ధమేవ జీవతి కేవలం |

యతో (అ) సా వింద్రియైర్యోగేరమతే హి స్వభావతః |

సకర్మాధికృతో భూత్వా (అ) కుర్వన్కర్మ ప్రయాత్యఘం ||” (గీతాభావప్రకాశము -3 - 90 to 104)

(తినిన అన్నము శుక్ల శోణిత రూపములుగా మారి శరీరములగుచున్నవి. వర్షములు పడుట వలన సస్యములు పుట్టుచున్నవి - అన్నము పుట్టుచున్నది. యజ్ఞము ద్వారా అగ్నిలో ఆహుతి చేయబడినది సూర్యుని పొందు చున్నది. ఆ సూర్యుని వలన వర్షములు కురియుచున్నవి. ఈ వర్షముల వలన సస్యములు, తద్వారా అన్నము కలుగుచున్నవి. ఈ అన్నము పైనచెప్పిన ప్రకారము శరీరములుగా మారుచున్నది. అందుచేత ఋత్విక్కులు మొదలగు వారిచేత చేయబడు కర్మ అపూర్వము – అతి సూక్ష్మము. దాని ఫలితము కూడ సూక్ష్మమగుట వలన ఎట్లు పరిణమించునో అనవగాహ్యము. అపూర్వమను యజ్ఞకర్మ వేదములో విధించబడినది. వేదము అపౌరుషేయము - పురుషుడు - (మానవ మాత్రుడు) - చేసినది కాదు. సాక్షాత్తు పరబ్రహ్మ వలన పుట్టినది. అందుచేత వేదము ప్రమాణము. దానిలో చెప్పిన ప్రకారము కర్మ - యజ్ఞకర్మ – చేసిన యెడల అందులో చెప్పబడిన ఫలము కలుగును. అందుచేత ఈ చెప్పిన ప్రకారము ప్రపంచము చక్రమువలె తిరుగుచున్నది. పరబ్రహ్మ ఈ పరిణామ క్రమము అంతటిలోను ఉండి పరిణమించుటకు తానే కారణమై యున్నాడు. ఈ క్రమమును అవగాహన చేసుకొని ఎవడు వేదవిహితకర్మ చేయడో వాడు పాపజీవి, అఘాయువు. అతని జీవితము వ్యర్ధము - ప్రపంచ క్రమమునకు పనికిరానిది, తోడ్పడనిది. అందుచేత వాడు వ్యర్ధ జీవి – జీవించి యుండినను ఏ ఫలితము లేనివాడు.)

Transliteration
  1. “aghaṃ pāpaṃ āyuḥ jīvanaṃ yasya saḥ aghāyuḥ, pāpajīvanaḥ” (śrī śaṃkaraḥ)

“aghaṃ pāparūpaṃ āyuḥ yasya saḥ” (śrīdharīya vyākhyā)

(aghanamu anagā pāpamu; āyuḥ anagā jīvanamu - pāparūpamaina jīvanamu cēyuvāḍu, pāpamulu cēyucu jīviṃcuvāḍu.)

  1. aghāraṃbhāyaiva yasya āyuḥ, agha pariṇitaṃ, vōbhayarūpaṃ vā sō aghāyuḥ.

(pāpamu cēyuṭakē evaḍu jīviṃcunō, evaḍu cēsina vanniyu pāpamulugā pariṇamiṃcunō vāḍu aghāyuvu.)

  1. “pāpa jīvanaḥ” (nīlakaṃṭhavyākhyā.) (pāpamu cēyucu jīviṃcuvāḍu.)

  2. aghaṃ vyarthamēva jīvati iti. (vyardhamugā jīviṃcuvāḍu, jīviṃci yuṃḍaṭalō prtayōjanamu lēnivāḍu.)

  3. īśvarēṇa vēdayajña pūrvakaṃ jagaccakraṃ pravartitaṃ | yaḥ karmaṇi adhikṛtassan na anuvartayati sa aghāyuḥ. (śrī śaṃkaraḥ)

(bhagavaṃtuni cēta vēdamulō ceppina prakāramu yajñamula dvārā naḍipiṃca baḍina jagaccakramunu evaḍu karmalu cēyucu anusariṃcaḍō vāḍu aghāyuvu.)

  1. “iha sādhanē vartamānō yaḥ karmayōgādhikārī, jñānayōgādhikārīvā, nānu vartayati, napravartayati yajña śiṣṭēna dēha dhāraṇa makuryan, saḥ aghāyurbhavati” (śrī rāmānujaḥ)

(karmayōgādhikāri gāni, jñānayōgādhikāri gāni, tanu yōgasādhana cēyucu, yajñamu cēyucu dēvatalaku samarpiṃcina dānilō migilina dānitō dēhamunu pōṣiṃcukonucu evaḍu pravartiṃpaḍō - dēvatalaku nivēdana cēsi, migilina dānini tinaka, tanakunnadaṃtayu tānē tinunō aṭṭivāḍu aghāyuvu.)

  1. “yō jagaccakraṃ na anuvartayati, saḥ tadvināśakatvāt aghāyuḥ, pāpanimittamēva yasya āyuḥ saḥ aghāyuḥ.

(śrī ānaṃdatīrthaḥ)

(evaḍu jagaccakramu nanusariṃci cēyaḍō vāḍu dānini naśiṃpa cēyuvāḍu ganuka aghāyuvu, pāpajīvi,pāpamu cēyuṭa koṟakē atani jīvitamu ganuka vāḍu aghāyuvu.)

  1. paina ceppabaḍina jagaccakramu śrīmadbhagavadgītalō ī kriṃdavidhamugā ceppabaḍinadi:-

“annādbhavaṃti bhūtāni parjanyādanna saṃbhavaḥ |

yajñāt bhavati parjanyō yajñaḥ karma samudbhavaḥ |

karma brahmādbhavaṃ vidhdhi brahmākṣara samudbhavaṃ |

tasmāt sarvagataṃ brahma nityaṃ yajñē pratiṣṭitaṃ |

ēvaṃ pravartitaṃ cakraṃ nānu pravartayatīhayaḥ |

aghāyu riṃdriyā rāmō mōghaṃ pārdha sa jīvati ||” (śrīmadbhagavadgīta - 3 - 14,15,16)

pai ślōkamunaku vyākhyānamu : -

“na kēvalaṃ vidhērvakyādēva kartavyamasti tat |

karma kiṃtu jagaccakra pravṛttēḥ kāraṇādapi |

śukra śōṇitarūpēṇa hyannātpariṇa tātkila |

śarīrāṇi prajāyaṃtē vṛṣṭērannasya janmaca |

yajñādhdharmā dī pūrvākhyā jjāyaṃtē vṛṣṭi rarkataḥ |

agnau prāptāhutiḥ samya gāditya mupatiṣṭatē |

ādityājjāya tē vṛṣṭirvṛṣṭē rannaṃ tataḥ prajāḥ |

sūkṣmō dharmaḥ sayajñākhya ṛtvigādēśca karmaṇaḥ |

apūrvākhyasya yajñasya vihitaṃ karma kāraṇaṃ |

vēdapramāṇakaṃ karmāpūrvā pūrvasyō tpādakaṃ bhavēt |

natu pāṣaṃḍa saṃsiddhaṃ dharma syō tpādakaṃ bhavēt |

nanupāṣaṃḍa śāstrātkiṃ vailakṣaṇyaṃ śrutēryataḥ |

śruti pramāṇakō dharmō nānyōstīti śruṇūttaraṃ |

āvirbhāvōpi vēdasya hya kṣarātsaramātmanaḥ |

tadhā cāpauruṣē yatvāt nirastākhila saṃśayaḥ |

ardhē hyatīṃdriyē vēdaḥ pramāṇaṃ svata ēvasaḥ |

natu pramādamāyādi dōṣavadracitaṃ hi tat |

pāṣaṃḍa vākyaṃ prāmāṇya janakaṃ syādatīṃdriyē |

tasmātsākṣātsara brahma hētutvāt sarva bhāsakaṃ |

avināśica vēdākhyaṃ brahma yajñē pratiṣṭitaṃ |

atōpyadīṃdriyō dharmō anuṣṭēyō vēda bōdhitaḥ |

tyaktvāpa bōdhitaṃ pāṣaṃḍa bōdhitaṃ sarvathā janaiḥ ||”

ādau sarvēśvarā dvēdaḥ karmajñānaṃ tatō bhavēt |

tatō dharma statō (a) nuṣṭānatō vṛṣṭistataḥ paraṃ |

annamanāccharī rāṇi punastēṣāṃ tadhaiva ca |

karma pravṛtti rityēva mīśvarēṇa pravartitaṃ |

jagannirvāhakaṃ cakraṃ mūḍhōyō nānu tiṣṭhati |

sa pāpajīvitō vyardhamēva jīvati kēvalaṃ |

yatō (a) sā viṃdriyairyōgēramatē hi svabhāvataḥ |

sakarmādhikṛtō bhūtvā (a) kurvankarma prayātyaghaṃ ||” (gītābhāvaprakāśamu -3 - 90 to 104)

(tinina annamu śukla śōṇita rūpamulugā māri śarīramulagucunnavi. varṣamulu paḍuṭa valana sasyamulu puṭṭucunnavi - annamu puṭṭucunnadi. yajñamu dvārā agnilō āhuti cēyabaḍinadi sūryuni poṃdu cunnadi. ā sūryuni valana varṣamulu kuriyucunnavi. ī varṣamula valana sasyamulu, tadvārā annamu kalugucunnavi. ī annamu painaceppina prakāramu śarīramulugā mārucunnadi. aṃducēta ṛtvikkulu modalagu vāricēta cēyabaḍu karma apūrvamu – ati sūkṣmamu. dāni phalitamu kūḍa sūkṣmamaguṭa valana eṭlu pariṇamiṃcunō anavagāhyamu. apūrvamanu yajñakarma vēdamulō vidhiṃcabaḍinadi. vēdamu apauruṣēyamu - puruṣuḍu - (mānava mātruḍu) - cēsinadi kādu. sākṣāttu parabrahma valana puṭṭinadi. aṃducēta vēdamu pramāṇamu. dānilō ceppina prakāramu karma - yajñakarma – cēsina yeḍala aṃdulō ceppabaḍina phalamu kalugunu. aṃducēta ī ceppina prakāramu prapaṃcamu cakramuvale tirugucunnadi. parabrahma ī pariṇāma kramamu aṃtaṭilōnu uṃḍi pariṇamiṃcuṭaku tānē kāraṇamai yunnāḍu. ī kramamunu avagāhana cēsukoni evaḍu vēdavihitakarma cēyaḍō vāḍu pāpajīvi, aghāyuvu. atani jīvitamu vyardhamu - prapaṃca kramamunaku panikirānidi, tōḍpaḍanidi. aṃducēta vāḍu vyardha jīvi – jīviṃci yuṃḍinanu ē phalitamu lēnivāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.