‘నేను’ అనుట, గర్వము, అవిద్య.
“ఈ వసుంధరనున్న చరణంబులకు నెక్కుడు జంఘలు, ఆమీదజానువులా పొడవున నూరువులందులకు నుపరి ప్రదేశంబున మధ్యంబటమీదనురమందులకు నెక్కువ కంఠంబటమీద స్కందం బందులదారువా దారువునశిబిక, శిబికయందు రాజుననియెడి యభిమానంబుగలిగి నీవున్నాడవు. ఇట్టి చోద్యంబయిన కష్టదశంబొందిన నీవు ప్రజా పాలనంబు సేయుచున్నవాడనను గర్వంబున మావంటి మహాత్ముల సభలలోనం బూజ్యుండవుగాక యున్నవాడవు. ఈ స్థావర జంగమంబులకునివాసస్థానంబు వసుంధరయైన చందంబున సత్క్రియలచేత నెఱుంగందగిన జగత్కారణంబైన తత్వంబు నెఱింగించెద. పరమాణు సముదయంబీ ధరిత్రియైన చందంబున అవిద్యామనంబులచేతం గల్పితంబైన కృశస్థూల బృహదణు సదసజ్జీవా జీవ ద్రవ్య స్వభావాశయ కాలనామ బుద్ధి రూపంబైన మాయచే జగత్తు రెండవది యై కల్పింపం బడియె. బాహ్యభ్యంతరంబులం గలిగి స్వప్రకాశంబై భగవచ్చబ్ద వాచ్యంబును విశుద్ధంబును బరమార్థంబునుజ్ఞానరూపంబును నైన బ్రహ్మంబొకటి సత్యంబు, జగత్తు సత్యం బగును”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 - 12 - 159)
(రహూగణుడను రాజు ఆధ్యాత్మతత్త్వము నెఱుగదలచి పల్లకినెక్కి పోవుచు తాను రాజునను నహంభావముతో భరతుని - జడభరతుని, జడుడువలె వర్తించుచున్న అవధూత అయిన భరతుని - పల్లకిని సమముగా మోయుకుండుటకు శిక్షింపచూచెను. తాను రాజునను గర్వము పల్లకిలో కూర్చుండుటవలన, తాను గొప్పవాడనని తలచుటవలన కలిగెను. కాని ఆ ఉన్నతస్థాయికి ఆధారము భూమి, పల్లకిమో యువారు భూమిమీదగాని నిలబడలేరు, నడువలేరు. వారికి కూడ కాళ్ళు మొదలగు అవయవములున్నవి. వాటి కంటె ఎత్తున పల్లకి, దానిలో కూర్చుని ఉన్నానని రాజు అహంభావము కలిగియుండెను - ఈ పల్లకికి అధారము భూమి ఎట్లు అగుచున్నదో, అట్లే ఈ భూమికి, దానిమీద ఉన్న వస్తువులన్నిటికీ పరబ్రహ్మ ఆధారము. పరబ్రహ్మ మాయచేత ఈ జగత్తు బ్రహ్మ కంటె వేఱుగా, రెండవ వస్తువుగా కల్పించబడినది. ఇవన్నియు కల్పితవస్తువులే. వీటిమీద అధారపడిన రాజు గొప్పతనమేముంది, గర్వపడుటకేముంది ? కల్పిత వస్తువులు అసత్తులే, నశించవలసినవే. ఈజగత్తును కల్పించినటువంటి పరబ్రహ్మమే సత్పదార్థము - ఎల్లకాలముండునది. నశించు వస్తువులగుఱించి గర్వపడుట బుద్ధిహీనత. సృష్టిలో నొకదానికంటె నొకటి గొప్పది యుండనే యున్నది. అన్నింటికంటె గొప్పది పరమాత్మ. అందుచేత మనకంటె తక్కువ స్థితిలోనున్నవారిని చూచి మనము గర్వపడుట అవివేకము. అందఱికంటె గొప్పవాడగు భగవంతుడున్నాడని తెలుసుకొని అణగియుండుట వివేకము).
‘nēnu’ anuṭa, garvamu, avidya.
“ī vasuṃdharanunna caraṇaṃbulaku nekkuḍu jaṃghalu, āmīdajānuvulā poḍavuna nūruvulaṃdulaku nupari pradēśaṃbuna madhyaṃbaṭamīdanuramaṃdulaku nekkuva kaṃṭhaṃbaṭamīda skaṃdaṃ baṃduladāruvā dāruvunaśibika, śibikayaṃdu rājunaniyeḍi yabhimānaṃbugaligi nīvunnāḍavu. iṭṭi cōdyaṃbayina kaṣṭadaśaṃboṃdina nīvu prajā pālanaṃbu sēyucunnavāḍananu garvaṃbuna māvaṃṭi mahātmula sabhalalōnaṃ būjyuṃḍavugāka yunnavāḍavu. ī sthāvara jaṃgamaṃbulakunivāsasthānaṃbu vasuṃdharayaina caṃdaṃbuna satkriyalacēta neṟuṃgaṃdagina jagatkāraṇaṃbaina tatvaṃbu neṟiṃgiṃceda. paramāṇu samudayaṃbī dharitriyaina caṃdaṃbuna avidyāmanaṃbulacētaṃ galpitaṃbaina kṛśasthūla bṛhadaṇu sadasajjīvā jīva dravya svabhāvāśaya kālanāma buddhi rūpaṃbaina māyacē jagattu reṃḍavadi yai kalpiṃpaṃ baḍiye. bāhyabhyaṃtaraṃbulaṃ galigi svaprakāśaṃbai bhagavaccabda vācyaṃbunu viśuddhaṃbunu baramārthaṃbunujñānarūpaṃbunu naina brahmaṃbokaṭi satyaṃbu, jagattu satyaṃ bagunu”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 - 12 - 159)
(rahūgaṇuḍanu rāju ādhyātmatattvamu neṟugadalaci pallakinekki pōvucu tānu rājunanu nahaṃbhāvamutō bharatuni - jaḍabharatuni, jaḍuḍuvale vartiṃcucunna avadhūta ayina bharatuni - pallakini samamugā mōyukuṃḍuṭaku śikṣiṃpacūcenu. tānu rājunanu garvamu pallakilō kūrcuṃḍuṭavalana, tānu goppavāḍanani talacuṭavalana kaligenu. kāni ā unnatasthāyiki ādhāramu bhūmi, pallakimō yuvāru bhūmimīdagāni nilabaḍalēru, naḍuvalēru. vāriki kūḍa kāḷḷu modalagu avayavamulunnavi. vāṭi kaṃṭe ettuna pallaki, dānilō kūrcuni unnānani rāju ahaṃbhāvamu kaligiyuṃḍenu - ī pallakiki adhāramu bhūmi eṭlu agucunnadō, aṭlē ī bhūmiki, dānimīda unna vastuvulanniṭikī parabrahma ādhāramu. parabrahma māyacēta ī jagattu brahma kaṃṭe vēṟugā, reṃḍava vastuvugā kalpiṃcabaḍinadi. ivanniyu kalpitavastuvulē. vīṭimīda adhārapaḍina rāju goppatanamēmuṃdi, garvapaḍuṭakēmuṃdi ? kalpita vastuvulu asattulē, naśiṃcavalasinavē. ījagattunu kalpiṃcinaṭuvaṃṭi parabrahmamē satpadārthamu - ellakālamuṃḍunadi. naśiṃcu vastuvulaguṟiṃci garvapaḍuṭa buddhihīnata. sṛṣṭilō nokadānikaṃṭe nokaṭi goppadi yuṃḍanē yunnadi. anniṃṭikaṃṭe goppadi paramātma. aṃducēta manakaṃṭe takkuva sthitilōnunnavārini cūci manamu garvapaḍuṭa avivēkamu. aṃdaṟikaṃṭe goppavāḍagu bhagavaṃtuḍunnāḍani telusukoni aṇagiyuṃḍuṭa vivēkamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.