(అహి అనగా పాము, కుండలి అనగా చుట్టుకొనియున్న పాము - రెండునూ పాములే, రెండింటినీ పాము అనుటలో భేదములేదు, కాని ఒకటి భూమిమీద పాకురుచున్నది, రెండవది కుండలమువలె చుట్టుకొనియున్నది. రెండింటికీ భేదము చుట్టుకొనియుండుటే - అనగా, - రెండూ పామే అయినప్పటికీ, ఒకటి పొడుగుగా ఉంది, రెండవది చుట్టుకొని యున్నది - అందుచేత భేదము - అవస్థావిశేషమువలన ఈ భేదము కలిగినది - ఒకటి పాము, రెండవది కుండలి యని, నిజానికి రెండూ పాములే - ఈ రెండింటికీ భేదము ఏలాగుననగా ఒకటి తిన్నగా, కర్రవలెనున్నది, ఇంకొకటి చుట్టవలె చుట్టుకొనియున్నది; ఒకదానికి పడగఎత్తుకొనియున్నది, రెండవదానికి పడగముడుచుకొనియున్నది. ఈ ప్రకారముగానే జీవేశ్వరులు - జీవాత్మ, పరమాత్మ - ఒకటే అయినను, ధ్యానించువాడు, ధ్యేయము అను భావమువలన - అనగా, జీవుడు పరమాత్మను ధ్యానించువాడు, పరమాత్మ జీవునిచేత ధ్యానింపబడువాడు - అని శ్రుతులు ఈ ఇద్దఱికి భేదములేదని, భేదము కలదని చెప్పుటచేత జీవేశ్వరులకు భేదము, అభేదము అని చెప్పినట్లగుచున్నది. ఈ భేదము వ్యవహరించుతలోనేకాని, వాస్తవముగా జీవేశ్వరులకు భేదము లేదు.- పాము, కుండలి అనుటలో భేదము లేనట్లు).
జీవాత్మకు పరమాత్మకు ఈ క్రింద చెప్పినప్రకారము శ్రుతులలో భేదము చెప్పబడినది : -
(నిష్కలుడగు పరమాత్మను ధ్యానము చేయుచు జీవుడు అతనిని చూచుచున్నాడు. జీవుడు వేరు, పరమాత్మ వేరు అని చెప్పబడినది; జీవుడు ధ్యానించువాడు, పరమాత్మ ధ్యేయము - ధ్యానము చేయబడుచున్నవాడు).
(పరాత్పరుడు, దివ్యపురుషుడు అయినవానిని జీవుడు పొందుచున్నాడు. పొందవలసిన స్థానము పదముపరమపురుషుడు, పొందువాడు జీవుడు - ఇట్లు చెప్పుటచేత జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అని యర్థమగుచున్నది).
(ఎవడు సమస్త భూతములలోను అంతరాత్మగా - అంతర్యామిగా నుండి వాటిని నియమించుచున్నాడో - నియమించువాడు పరమాత్మయని నియమింపబడువాడు జీవుడు అని జీవేశ్వరులు వేరు అని చెప్పబడినది. 3.జీవాత్మ పరమాత్మలకు ఈ క్రింద శ్రుతులలో అభేదము చెప్పబడినది : -
(ఆ పరబ్రహ్మ నీవే అయి యున్నావు).
(నేను ఆ బ్రహ్మైతిని - నేనే ఆ బ్రహ్మను).
(ahi anagā pāmu, kuṃḍali anagā cuṭṭukoniyunna pāmu - reṃḍunū pāmulē, reṃḍiṃṭinī pāmu anuṭalō bhēdamulēdu, kāni okaṭi bhūmimīda pākurucunnadi, reṃḍavadi kuṃḍalamuvale cuṭṭukoniyunnadi. reṃḍiṃṭikī bhēdamu cuṭṭukoniyuṃḍuṭē - anagā, - reṃḍū pāmē ayinappaṭikī, okaṭi poḍugugā uṃdi, reṃḍavadi cuṭṭukoni yunnadi - aṃducēta bhēdamu - avasthāviśēṣamuvalana ī bhēdamu kaliginadi - okaṭi pāmu, reṃḍavadi kuṃḍali yani, nijāniki reṃḍū pāmulē - ī reṃḍiṃṭikī bhēdamu ēlāgunanagā okaṭi tinnagā, karravalenunnadi, iṃkokaṭi cuṭṭavale cuṭṭukoniyunnadi; okadāniki paḍagaettukoniyunnadi, reṃḍavadāniki paḍagamuḍucukoniyunnadi. ī prakāramugānē jīvēśvarulu - jīvātma, paramātma - okaṭē ayinanu, dhyāniṃcuvāḍu, dhyēyamu anu bhāvamuvalana - anagā, jīvuḍu paramātmanu dhyāniṃcuvāḍu, paramātma jīvunicēta dhyāniṃpabaḍuvāḍu - ani śrutulu ī iddaṟiki bhēdamulēdani, bhēdamu kaladani ceppuṭacēta jīvēśvarulaku bhēdamu, abhēdamu ani ceppinaṭlagucunnadi. ī bhēdamu vyavahariṃcutalōnēkāni, vāstavamugā jīvēśvarulaku bhēdamu lēdu.- pāmu, kuṃḍali anuṭalō bhēdamu lēnaṭlu).
jīvātmaku paramātmaku ī kriṃda ceppinaprakāramu śrutulalō bhēdamu ceppabaḍinadi : -
(niṣkaluḍagu paramātmanu dhyānamu cēyucu jīvuḍu atanini cūcucunnāḍu. jīvuḍu vēru, paramātma vēru ani ceppabaḍinadi; jīvuḍu dhyāniṃcuvāḍu, paramātma dhyēyamu - dhyānamu cēyabaḍucunnavāḍu).
(parātparuḍu, divyapuruṣuḍu ayinavānini jīvuḍu poṃducunnāḍu. poṃdavalasina sthānamu padamuparamapuruṣuḍu, poṃduvāḍu jīvuḍu - iṭlu ceppuṭacēta jīvuḍu vēru, īśvaruḍu vēru ani yarthamagucunnadi).
(evaḍu samasta bhūtamulalōnu aṃtarātmagā - aṃtaryāmigā nuṃḍi vāṭini niyamiṃcucunnāḍō - niyamiṃcuvāḍu paramātmayani niyamiṃpabaḍuvāḍu jīvuḍu ani jīvēśvarulu vēru ani ceppabaḍinadi. 3.jīvātma paramātmalaku ī kriṃda śrutulalō abhēdamu ceppabaḍinadi : -
(ā parabrahma nīvē ayi yunnāvu).
(nēnu ā brahmaitini - nēnē ā brahmanu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.