← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అహో రాత్రి విదః ahō rātri vidaḥ

Original — తెలుగు

“సహస్ర యుగ పర్యంతమహర్య ద్బ్రహ్మణో విదుః |

రాత్రిం యుగ సహస్రాంతాం తే అహోరాత్ర విదో జనాః |

అవ్యకాద్వ్యక్త యః సర్వాః ప్రభవంత్య హరాగమే |

రాత్ర్యాగమే ప్రలీయంతే తత్త్రైవా వ్యక్త సంజ్ఞికే ||“. (శ్రీమద్భగవద్గీత - 8 - 17, 18)

(చతుర్ముఖ బ్రహ్మయొక్క పగలు ప్రమాణము సహస్ర యుగములు. అతని యొక్క రాత్రి ప్రమాణము కూడ సహస్ర యుగములు - ఇచ్చట యుగము అనగా చతుర్యుగములు కలిసినది. అందుచేత చతుర్యుగములువేయి పగలు, వేయి రాత్రులు.ఈ రెండును కలిసి చతుర్ముఖ బ్రహ్మకు ఒక అహోరాత్రములుగల ఒక దినము.ఈ చతుర్ముఖ బ్రహ్మనే అవ్యక్తమందురు. ఈ చతుర్ముఖ బ్రహ్మ యొక్క పగటికాలము ప్రారంభముకాగానే అంతవఱకు అతనిలో సూక్ష్మరూపములో ఉన్న వస్తువులన్నియు వ్యక్తమగును, పైకి కనబడును, స్థూలరూపమును పొందినవగును. అదియే సృష్టి, సృష్టి ప్రారంభము. చతుర్ముఖ బ్రహ్మ పగటికాలములో ఇవన్నియు ఉండి అతని రాత్రి కాలము ప్రారంభముకాగానే అతనిలోనే లీనమగును - కలిసిపోవును - అనగా, చతుర్ముఖ బ్రహ్మ మేలుకొనియున్నపుడు ప్రపంచ సృష్టిజరుగును. అతను నిద్రపోయినఫుడు ప్రలయమగును. అవ్యక్తమునుండి సమస్త వస్తువులు ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టుట సృష్టి;ఇదియే చతుర్ముఖుని యొక్క పగలు -ప్రపంచములోని వస్తువులన్నియు నశించి, వాటి వాటి కారణములలో లీనమై మొత్తమంతయు అవ్యక్తములో లీనమగుట ప్రపంచ ప్రళయము. ఇదియే చతుర్ముఖబ్రహ్మ యొక్క రాత్రికాలము అని చెప్పబడినది. ఈ ప్రకారముగా చతుర్ముఖబ్రహ్మ యొక్క రాత్రి, పగలు - అహో రాత్రములు తెలిసినవారే జ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు, సృష్టి ప్రారంభము, దాని అంతము తెలిసినవారు, సూక్ష్మ దృష్టి, సూక్ష్మజ్ఞానము గలవారు).

“స్వపావస్తా విధేరస్య ప్రోక్తేహా వ్యక్త శబ్ద తః |

విధేః ప్రబోధసమయే స్వాపావస్థాత్మనస్తతః |

శరీర విష యాద్యాత్మ వ్యక్త యో భోగ భూమయః |

వ్యవహారక్షమత్వేన ప్రభవంత్యహ రాగమే |

స్వాపకాలే విధే రాత్ర్యాగమే తత్రైవ కారణే |

అవ్యక్త సంజ్ఞికే సర్వా లీయంతే వ్యక్త యస్తదా ||“. (గీతాభావప్రకాశము - 8 - 117 to 119)

(చతుర్ముఖ బ్రహ్మయొక్క స్వాపావస్త ఇచ్చట అవ్యక్తమని చెప్పబడినది. బ్రహ్మకు పగలు రాగానే ఈ స్వప్నావస్థనుండి శరీరములు, విషయములు మొదలగునవి వ్యవహరించుటకు తగిన శక్తి సంపాదించుకొనినవస్తువులన్నియు వ్యక్తమగుచున్నవి - పుట్టుచున్నవి. ఈ ప్రకారముగా వ్యక్తమైనవన్నియు చతుర్ముఖ బ్రహ్మ యొక్క రాత్రికాలమందు - స్వాపావస్థయందు - అవ్యక్తమను పేరుగలవాటి కారణమందు - లీనమగుచున్నవి. ఈ ప్రకారముగా జరుగుట సూక్ష్మాతి సూక్ష్మ దృష్టిగల యోగీశ్వరులే చూడగలరు. అట్టివారు అహోరాత్రవిదులు.)

  1. “కాల సంఖ్యా విదః” (శ్రీశంకరః)

(కలమానము తెలిసినవారు).

  1. యుగసహస్రేణాంతః సమాప్తిర్యస్య తత్ బ్రాహ్మం అహః, తత్పరిమాణంచ రాత్రిం యేజానంతి తే అహోరాత్రిజ్ఞాః -

(సహస్రయుగములు గడిచినకాలము బ్రహ్మకు పగలు, అంత పరిమాణము రాత్రి - ఈ సంగతి తెలిస్నవారు అహోరాత్రవిదులు).

  1. మనుష్యాది చతుర్ముఖాం తానాం మత్సంకల్ప కృతా మహఓ రాత్ర్యవస్థా విదః జనాః.

(మనుష్యులుమొదలు చతుర్ముఖ బ్రహ్మవరకుగలవారికి నా సంకల్పము మాత్రమున కలుగు పగలు, రాత్రి అను అవస్థలు - సృష్టిస్థితిలయములగువాటిని తెలిసినవారు - దీనిని తెలియుట అనగా బ్రహ్మ తత్వమును తెలిసినవారన్నమాట).

“సీ. భూర్భువస్స్వర్లోకముల కంటె బొడుపున గడు నొప్పు సత్యలోకంబులందు

నుండు బ్రహ్మకు జతుర్యుగ సహస్రములేక దినమొక్కటియగు, రాత్రియును నిట్ల

చన, ధాత నిద్రవో జగములడంగు, మేల్కని చూడ మరల లోకములు పుట్టు

దద్దినమున జతుర్దశమనులగుదురు - --“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 11 - 352)

Transliteration

“sahasra yuga paryaṃtamaharya dbrahmaṇō viduḥ |

rātriṃ yuga sahasrāṃtāṃ tē ahōrātra vidō janāḥ |

avyakādvyakta yaḥ sarvāḥ prabhavaṃtya harāgamē |

rātryāgamē pralīyaṃtē tattraivā vyakta saṃjñikē ||“. (śrīmadbhagavadgīta - 8 - 17, 18)

(caturmukha brahmayokka pagalu pramāṇamu sahasra yugamulu. atani yokka rātri pramāṇamu kūḍa sahasra yugamulu - iccaṭa yugamu anagā caturyugamulu kalisinadi. aṃducēta caturyugamuluvēyi pagalu, vēyi rātrulu.ī reṃḍunu kalisi caturmukha brahmaku oka ahōrātramulugala oka dinamu.ī caturmukha brahmanē avyaktamaṃduru. ī caturmukha brahma yokka pagaṭikālamu prāraṃbhamukāgānē aṃtavaṟaku atanilō sūkṣmarūpamulō unna vastuvulanniyu vyaktamagunu, paiki kanabaḍunu, sthūlarūpamunu poṃdinavagunu. adiyē sṛṣṭi, sṛṣṭi prāraṃbhamu. caturmukha brahma pagaṭikālamulō ivanniyu uṃḍi atani rātri kālamu prāraṃbhamukāgānē atanilōnē līnamagunu - kalisipōvunu - anagā, caturmukha brahma mēlukoniyunnapuḍu prapaṃca sṛṣṭijarugunu. atanu nidrapōyinaphuḍu pralayamagunu. avyaktamunuṃḍi samasta vastuvulu okadānilōnuṃḍi okaṭigā puṭṭuṭa sṛṣṭi;idiyē caturmukhuni yokka pagalu -prapaṃcamulōni vastuvulanniyu naśiṃci, vāṭi vāṭi kāraṇamulalō līnamai mottamaṃtayu avyaktamulō līnamaguṭa prapaṃca praḷayamu. idiyē caturmukhabrahma yokka rātrikālamu ani ceppabaḍinadi. ī prakāramugā caturmukhabrahma yokka rātri, pagalu - ahō rātramulu telisinavārē jñānulu, brahmajñānulu, sṛṣṭi prāraṃbhamu, dāni aṃtamu telisinavāru, sūkṣma dṛṣṭi, sūkṣmajñānamu galavāru).

“svapāvastā vidhērasya prōktēhā vyakta śabda taḥ |

vidhēḥ prabōdhasamayē svāpāvasthātmanastataḥ |

śarīra viṣa yādyātma vyakta yō bhōga bhūmayaḥ |

vyavahārakṣamatvēna prabhavaṃtyaha rāgamē |

svāpakālē vidhē rātryāgamē tatraiva kāraṇē |

avyakta saṃjñikē sarvā līyaṃtē vyakta yastadā ||“. (gītābhāvaprakāśamu - 8 - 117 to 119)

(caturmukha brahmayokka svāpāvasta iccaṭa avyaktamani ceppabaḍinadi. brahmaku pagalu rāgānē ī svapnāvasthanuṃḍi śarīramulu, viṣayamulu modalagunavi vyavahariṃcuṭaku tagina śakti saṃpādiṃcukoninavastuvulanniyu vyaktamagucunnavi - puṭṭucunnavi. ī prakāramugā vyaktamainavanniyu caturmukha brahma yokka rātrikālamaṃdu - svāpāvasthayaṃdu - avyaktamanu pērugalavāṭi kāraṇamaṃdu - līnamagucunnavi. ī prakāramugā jaruguṭa sūkṣmāti sūkṣma dṛṣṭigala yōgīśvarulē cūḍagalaru. aṭṭivāru ahōrātravidulu.)

  1. “kāla saṃkhyā vidaḥ” (śrīśaṃkaraḥ)

(kalamānamu telisinavāru).

  1. yugasahasrēṇāṃtaḥ samāptiryasya tat brāhmaṃ ahaḥ, tatparimāṇaṃca rātriṃ yējānaṃti tē ahōrātrijñāḥ -

(sahasrayugamulu gaḍicinakālamu brahmaku pagalu, aṃta parimāṇamu rātri - ī saṃgati telisnavāru ahōrātravidulu).

  1. manuṣyādi caturmukhāṃ tānāṃ matsaṃkalpa kṛtā mahaō rātryavasthā vidaḥ janāḥ.

(manuṣyulumodalu caturmukha brahmavarakugalavāriki nā saṃkalpamu mātramuna kalugu pagalu, rātri anu avasthalu - sṛṣṭisthitilayamulaguvāṭini telisinavāru - dīnini teliyuṭa anagā brahma tatvamunu telisinavārannamāṭa).

“sī. bhūrbhuvassvarlōkamula kaṃṭe boḍupuna gaḍu noppu satyalōkaṃbulaṃdu

nuṃḍu brahmaku jaturyuga sahasramulēka dinamokkaṭiyagu, rātriyunu niṭla

cana, dhāta nidravō jagamulaḍaṃgu, mēlkani cūḍa marala lōkamulu puṭṭu

daddinamuna jaturdaśamanulaguduru - --“. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 11 - 352)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.