← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అజహ ల్లక్షణ ajaha llakṣaṇa

Original — తెలుగు
  1. “శోణోధావతి” (రక్తము పరుగెత్తుచున్నది.)

రక్తము పరుగెత్తదు; రక్తము రంగు గల గుఱ్ఱము పరుగెత్తుచున్నది అనుటకు బదులుగా రక్తము పరుగెత్తుచున్నది అని చెప్పబడుచున్నది. రక్తమురంగు గుణము, ఆ రంగుగల గుఱ్ఱము - ఆ గుణము కలగుణి - గుణమునకు గుణికి గల సంబంధము లక్షణ - తాదాత్మ్యసంబంధము – లక్షణ. పదము యొక్క అసలు అర్ధమును వదలివేయక అధికార్ధమును గ్రహించుట ‘అజహతి’, ఈ రెండును కలిసి - అజహతి + లక్షణ = అజహల్లక్షణ.

  1. వాచ్యార్ధము కన్న అధికముగా గ్రహించుట అజవల్లక్షణ. “కాకిభ్యో దధి రక్ష్యతాం” - కాకులనుండి పెరుగునుకాపాడుకోవలెను - అని అర్ధము. కాకుల నుండేకాక కాకులవంటి ఇతరములనుండి - పెరుగును తినివేయువాటినుండికూడ - పెరుగును రక్షించవలెను అని కూడ యర్ధము - ఇతరములు కూడ ఉద్ధేశింపబడినవి. అందుచేత ఇది లక్షణ. కాకులు అను అసలువాటిని వదలివేయక అటువంటివాటినికూడ ఉద్ధేశించి చెప్పుట -

  2. “ఛత్రిణో యాంతి” -గొడుగులవారు వెళ్ళుచున్నారు - అని అర్ధము, గొడుగులు పట్టుకొన్నవారు వెళ్ళుచున్నారు. గొడుగులున్నవారితో మఱికొంతమంది కూడ వెళ్ళుచున్న యెడల వారు కూడ వెళ్ళుచున్నారనియే దీని యర్ధముమని భావింపవలెను - గొడుగులున్నవారే కాక మఱికొంతమందికూడా వెళ్ళుచున్నారని అధికము గ్రహించుట అజహల్లక్షణ.

  3. ముఖ్యార్ధమును, ముఖ్యార్ధము తో పాటు మఱి యొక్క అర్ధమును గ్రహించుట - “కుంతా ప్రవిశంతి” - ఈ టెలు ప్రవేశించుచున్నవి అని దీని యర్ధము - ఈ టెలు అచేతనములు, ప్రవేశించలేవు - అందుచేత ఈ టెలు పట్టుకున్న మనుష్యులు ప్రవేశించుచున్నారు అని చెప్పబడినట్లే భావించవలెను. ఈ టెలు ముఖ్యార్ధము - కాని పైని చెప్పుటలో ఈ టెలు, వాటిని పట్టుకొన్న పురుషులు కూడా అని భావించుట అజహల్లక్షణ.

  4. శ్రుతి వాక్యములలో పరమాత్మయొక్క “సచ్చిదానందం” అను లక్షణములలో ఏ ఒక్క లక్షణ చెప్పినను, అన్నింటినీ చెప్పినట్లే యని భావించుట అజహ ల్లక్షణ.

Transliteration
  1. “śōṇōdhāvati” (raktamu parugettucunnadi.)

raktamu parugettadu; raktamu raṃgu gala guṟṟamu parugettucunnadi anuṭaku badulugā raktamu parugettucunnadi ani ceppabaḍucunnadi. raktamuraṃgu guṇamu, ā raṃgugala guṟṟamu - ā guṇamu kalaguṇi - guṇamunaku guṇiki gala saṃbaṃdhamu lakṣaṇa - tādātmyasaṃbaṃdhamu – lakṣaṇa. padamu yokka asalu ardhamunu vadalivēyaka adhikārdhamunu grahiṃcuṭa ‘ajahati’, ī reṃḍunu kalisi - ajahati + lakṣaṇa = ajahallakṣaṇa.

  1. vācyārdhamu kanna adhikamugā grahiṃcuṭa ajavallakṣaṇa. “kākibhyō dadhi rakṣyatāṃ” - kākulanuṃḍi perugunukāpāḍukōvalenu - ani ardhamu. kākula nuṃḍēkāka kākulavaṃṭi itaramulanuṃḍi - perugunu tinivēyuvāṭinuṃḍikūḍa - perugunu rakṣiṃcavalenu ani kūḍa yardhamu - itaramulu kūḍa uddhēśiṃpabaḍinavi. aṃducēta idi lakṣaṇa. kākulu anu asaluvāṭini vadalivēyaka aṭuvaṃṭivāṭinikūḍa uddhēśiṃci ceppuṭa -

  2. “chatriṇō yāṃti” -goḍugulavāru veḷḷucunnāru - ani ardhamu, goḍugulu paṭṭukonnavāru veḷḷucunnāru. goḍugulunnavāritō maṟikoṃtamaṃdi kūḍa veḷḷucunna yeḍala vāru kūḍa veḷḷucunnāraniyē dīni yardhamumani bhāviṃpavalenu - goḍugulunnavārē kāka maṟikoṃtamaṃdikūḍā veḷḷucunnārani adhikamu grahiṃcuṭa ajahallakṣaṇa.

  3. mukhyārdhamunu, mukhyārdhamu tō pāṭu maṟi yokka ardhamunu grahiṃcuṭa - “kuṃtā praviśaṃti” - ī ṭelu pravēśiṃcucunnavi ani dīni yardhamu - ī ṭelu acētanamulu, pravēśiṃcalēvu - aṃducēta ī ṭelu paṭṭukunna manuṣyulu pravēśiṃcucunnāru ani ceppabaḍinaṭlē bhāviṃcavalenu. ī ṭelu mukhyārdhamu - kāni paini ceppuṭalō ī ṭelu, vāṭini paṭṭukonna puruṣulu kūḍā ani bhāviṃcuṭa ajahallakṣaṇa.

  4. śruti vākyamulalō paramātmayokka “saccidānaṃdaṃ” anu lakṣaṇamulalō ē okka lakṣaṇa ceppinanu, anniṃṭinī ceppinaṭlē yani bhāviṃcuṭa ajaha llakṣaṇa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.