కర్మాకరణం (కర్మ చేయకుండుట)
కర్మ విహితం, అకర్మతద్విపరీతం, నిషిద్ధం.
(కర్మ అనగా శాస్త్రములో విధింపబడినది; అకర్మ యనగా దానికి విపరీతమైనది, శాస్త్రములో చేయకూడదని నిషేదించబడినది)
(అకర్మ యనగా లోకములో ప్రసిద్ధిగా నున్నట్లు - అందఱూ సామాన్యముగా అర్ధము చేసుకొనినట్లు - ఏ పనియు చేయక ఊరకుండుట కాదు)
(నేను కర్తను అను అభిమానముతో కర్మల యందు ప్రవృత్తి లేకుండుట వలన కర్మ లేకపోవుట అకర్మ యనబడును)
(అకర్మ యనగా కర్మ కానిది, ఇచ్చట - ఈ సందర్భములో అకర్మ యనగా ఆత్మజ్ఞానమని చెప్పబడుచున్నది.)
(దేహము, ఇంద్రియములు, మనస్సు మొదలగునవి చేయు వ్యాపారము - పని - కర్మ; అనగా, మనోవాక్కాయముల చేత చేయు పని కర్మ. దానికి విపరీతమైనది అకర్మ.)
“తూష్ణీభావం” (పని చేయక ఊరక యుండుట - సోమరి యొక్క స్థితి.)
“కర్తృత్వ భోక్తృత్వాద్యహంకారతయా బంధాదిరూపం జన్మాది కారణం కర్మ, నిత్య నైమిత్తక యాగవ్రత తపోదానాదిషు ఫలాభిసంధానం యత్, తత్ అకర్మ” (నిరాలంబోపనిషత్)
(కర్త కానిది, భోక్త కానిది, యగు నాత్మయందు కర్తృత్వమును అరోపించి చేయునది కర్మ. ఇది జన్మము మొదలగునవి కలుగుటకు కారణము. నిత్య నైమిత్తిక కర్మలగు యాగము, తపస్సు, దానము, వ్రతము, మొదలగువాని వలన ఫలము కోరక చేయుట అకర్మ.)
(బ్రహ్మ జ్ఞానులు లోకసంగ్రహార్థము నిమిత్తము - లోకమునకు శుభము కలుగచేయుటకు - చేయునది కర్మకాదు, ఆ కర్మలు చేయుటలో అభిమానము లేకపోవుట చేత.)
(‘జీవించియున్నంతకాలము కర్మ చేయవలయును’ అని శ్రుతులలో చెప్పబడినది. విద్వాంసుల విషయములో - బ్రహ్మజ్ఞానుల విషయములో - కర్మ బంధము కొఱకు కాదు, వారు భగవత్ జ్ఞానులు కనుక.)
(జనకమహారాజు మొదలగు కర్మయోగులు ‘నేను ఈ కర్మ చేయుచున్నాను’ అను అభిమానము లేకపోవుట చేత వారు చేసినకర్మలు అకర్మలే. అందుచేత వారు చేసినకర్మలు ఫలమునీయక దుర్బలమై యుండును.)
కార్యతేహ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః ||
నియతం కురు కర్మ త్వం; కర్మ జ్యా యోహ్య కర్మణః ||” (శ్రీమద్భగవద్గీత- 3 - 5, 8)
(ఒక క్షణమైనను కర్మ చేయక ఎవరును ఉండలేరు – ఏపని చేసినను కర్మయే. వారివారి స్వభావము వలన – ప్రకృతి వలన కలిగిన గుణముల వలన - అనగా, సత్వరజస్తమోగుణములు గాని, రాగము, ద్వేషము మొదలగు వాటి వలనకాని - కర్మ చేయుచుండును. స్వతంత్రుడుకాక అట్టి గుణముల స్వాధీనములోనుండి కర్మలు చేయును. శాస్త్రములలో ఈ కర్మ చేయవలసినది అని ఏవి చెప్పబడినవో అట్టి కర్మలు చేయుము. ఏ కర్మయు చేయక సోమరిగా ఊరకుండుట కన్న విహితకర్మ చేయుట శ్రేష్టము.)
(ఏ పనియు చేయకయుండుటచేత జీవితము గడవదు.)
న సిధ్ధ్యేన్మనసః శుధ్ధిః కర్మాభావేన కేవలం |
కింతు స్వధర్మశూన్యస్యదేవస్థితి రసీహతే |
నైవ నిధ్ధ్యేత్ ప్రకర్షేణ తతః కర్మ సమాచర ||” (గీతాభావప్రకాశము - 3 - 62, 64)
(చిత్తశుధ్ధి లేనివానికి కర్మ చేయక యుండుట కన్న కర్మ చేయుటయే మేలు. ఎందుచేతననగా – కేవలము ఏకర్మను చేయక యుండుట వలననే చిత్త శుధ్ధి కలుగదు. ఆంతే కాక కర్మ చేయకయుండుట వలన, స్వధర్మము చేయకపోవుట వలన, తాను చేయవలసినది చేయకపోవుట వలన, తనకులధర్మము చేయకపోవుట వలన శరీరయాత్ర కూడ జరగదు - జీవము గడవదు.)
స బుధ్ధిమాన్ మనుష్యేషు, స యుక్తః కృత్స్న కర్మకృత్ ||“. (శ్రీమద్భగవద్గీత - 4 - 18)
“దేహేంద్రియాది వ్యాపారే నిషిధ్ధే విహతే తధా |
కర్మణి అహం కరోమీతి ధర్మాధ్యాసే ప్రకల్పితే |
స్వాత్మన్యసంగ చిద్రూపే నిరీహే నిష్క్రియే (అ)మలే |
పశ్యత్య కర్మయో వస్తుదృష్ట్యా సమ్యగ్వివేకతః |
యధా నౌస్థేవ తీరవృక్షేష్వ విచలేష్వపి |
కల్పితం చలనం తద్వ దక్రియే కర్మ కల్పితః |
అకర్త్రాత్మ విచారేణ కర్మాభావం చ వస్తుతః |
క్షీరస్థ వృక్షేష్వివ యః పశ్యత్యాత్మ స్వరూపవిత్ |
తధా మాయా వికారేషు సదా దేహేంద్రియాదిషు |
స్వవ్యాపారేషు తచ్ఛూన్యస్తూ ష్ణీమాసే సుఖం త్వితి |
ఆరోపితాభిమానేన వ్యాపారో పరమాభిధే |
గచ్ఛత్స్వ గమనం యద్వత్కల్పితం నృషు దూరగైః |
తధా దేహేంద్రియా దీనాం స వ్యాపార విచారణాత్|
యశ్చ కర్మనివృత్తాఖ్యం వ్యాపారం పరిపశ్యతి |
ఉదాసీన దశాయా మప్యహ మాసే నతా దృశః |
ఏవం రూపో (అ)చిమానోస్తి కర్మయశ్చేతి పశ్యతి |
ఏవం భూతస్స ఆత్మజ్ఞో బుధ్ధిమత్వాది భిర్గుణైః |
స్తూయతే వాసు దేవేన సమ్యగ్ద్దర్శితయామునిః ||“. (గీతాభావప్రకాశము - 4 - 110 to 119)
(దేహము, ఇంద్రియములు యొక్క వ్యాపారములకు సంబంధించిన కర్మలు - శాస్త్రములో ఇవి చేయవలసినవి యని విధించబడినవైనను, ఇవి చేయకూడదు అని నిషేదించబడిన వైనను, వాటియందు నేను ఈ కర్మలను చేయుచున్నాను అని అనంగ చిద్రూపుడు, నిష్క్రియుడు, అమలుడు అయిన స్వాత్మయందు ఆరోపించుకొనును. అప్పుడు అట్టి కర్మయందు అకర్మ అకర్మ యనియే భావము కలిగియుండును. పడవ నడుచు చుండగా ఆ పడవలోనున్న వానికి ఒడ్డున నున్న చెట్లు కదలక పోయినను నీటిలో కదలినట్లు కనబడును. కాని వాస్తవముగా కదలక యున్నవని తెలుసుకొనును. ఇదియే కర్మ అకర్మగా భావించుట, సమ్యక్ జ్ఞానముచే కర్మను అకర్మగా చూచుట.)
(మాయా వికారములగు దేహము, ఇంద్రియములు మొదలగునవి పనులు చేయుచున్నను, నేను ఏ పనియుచేయలేదు అని అనుకొనును. అట్టి అకర్మయందు దేహేంద్రియాదుల కర్మ యున్నట్లు చూచుట అకర్మయందు కర్మను చూచుట. దూరముగా పోవుచున్న రైలుబండిని చూచిన కదలుచున్నట్లు అగపడదు. అట్టి అకర్మయందు అది నిజముగ కదులుచున్నదను జ్ఞానము కలిగియుండుట అకర్మయందు కర్మను చూచుట. ఇట్టివాడు పరమార్ధదర్శి - ఆత్మ తత్వమును తెలిసినవాడు.)
కర్మను అనాసక్తముగా నాచరించుట చేత చిత్త శుద్ధి వలన కలుగు నైష్కర్మ్య ఆత్మస్థితి శరీరముచే కర్మ చేయుచున్నను మనస్సునందు కర్తృత్వభావము - “ఈ పని నేను చేయుచున్నాను” అను భావము - కాని, ఆ కర్మయందాసక్తి కాని, దానివలన కలుగు ఫలమందు కోరిక గాని, లేనియెడల అదియే అకర్మ.
“తూష్ణీం ఆసనం” (ఊరకనే కూర్చుని యుండుట) (చూడుము - 7; ‘అకర్మ కరణం’)
karmākaraṇaṃ (karma cēyakuṃḍuṭa)
karma vihitaṃ, akarmatadviparītaṃ, niṣiddhaṃ.
(karma anagā śāstramulō vidhiṃpabaḍinadi; akarma yanagā dāniki viparītamainadi, śāstramulō cēyakūḍadani niṣēdiṃcabaḍinadi)
(akarma yanagā lōkamulō prasiddhigā nunnaṭlu - aṃdaṟū sāmānyamugā ardhamu cēsukoninaṭlu - ē paniyu cēyaka ūrakuṃḍuṭa kādu)
(nēnu kartanu anu abhimānamutō karmala yaṃdu pravṛtti lēkuṃḍuṭa valana karma lēkapōvuṭa akarma yanabaḍunu)
(akarma yanagā karma kānidi, iccaṭa - ī saṃdarbhamulō akarma yanagā ātmajñānamani ceppabaḍucunnadi.)
(dēhamu, iṃdriyamulu, manassu modalagunavi cēyu vyāpāramu - pani - karma; anagā, manōvākkāyamula cēta cēyu pani karma. dāniki viparītamainadi akarma.)
“tūṣṇībhāvaṃ” (pani cēyaka ūraka yuṃḍuṭa - sōmari yokka sthiti.)
“kartṛtva bhōktṛtvādyahaṃkāratayā baṃdhādirūpaṃ janmādi kāraṇaṃ karma, nitya naimittaka yāgavrata tapōdānādiṣu phalābhisaṃdhānaṃ yat, tat akarma” (nirālaṃbōpaniṣat)
(karta kānidi, bhōkta kānidi, yagu nātmayaṃdu kartṛtvamunu arōpiṃci cēyunadi karma. idi janmamu modalagunavi kaluguṭaku kāraṇamu. nitya naimittika karmalagu yāgamu, tapassu, dānamu, vratamu, modalaguvāni valana phalamu kōraka cēyuṭa akarma.)
(brahma jñānulu lōkasaṃgrahārthamu nimittamu - lōkamunaku śubhamu kalugacēyuṭaku - cēyunadi karmakādu, ā karmalu cēyuṭalō abhimānamu lēkapōvuṭa cēta.)
(‘jīviṃciyunnaṃtakālamu karma cēyavalayunu’ ani śrutulalō ceppabaḍinadi. vidvāṃsula viṣayamulō - brahmajñānula viṣayamulō - karma baṃdhamu koṟaku kādu, vāru bhagavat jñānulu kanuka.)
(janakamahārāju modalagu karmayōgulu ‘nēnu ī karma cēyucunnānu’ anu abhimānamu lēkapōvuṭa cēta vāru cēsinakarmalu akarmalē. aṃducēta vāru cēsinakarmalu phalamunīyaka durbalamai yuṃḍunu.)
kāryatēhyavaśaḥ karma sarvaḥ prakṛtijairguṇaiḥ ||
niyataṃ kuru karma tvaṃ; karma jyā yōhya karmaṇaḥ ||” (śrīmadbhagavadgīta- 3 - 5, 8)
(oka kṣaṇamainanu karma cēyaka evarunu uṃḍalēru – ēpani cēsinanu karmayē. vārivāri svabhāvamu valana – prakṛti valana kaligina guṇamula valana - anagā, satvarajastamōguṇamulu gāni, rāgamu, dvēṣamu modalagu vāṭi valanakāni - karma cēyucuṃḍunu. svataṃtruḍukāka aṭṭi guṇamula svādhīnamulōnuṃḍi karmalu cēyunu. śāstramulalō ī karma cēyavalasinadi ani ēvi ceppabaḍinavō aṭṭi karmalu cēyumu. ē karmayu cēyaka sōmarigā ūrakuṃḍuṭa kanna vihitakarma cēyuṭa śrēṣṭamu.)
(ē paniyu cēyakayuṃḍuṭacēta jīvitamu gaḍavadu.)
na sidhdhyēnmanasaḥ śudhdhiḥ karmābhāvēna kēvalaṃ |
kiṃtu svadharmaśūnyasyadēvasthiti rasīhatē |
naiva nidhdhyēt prakarṣēṇa tataḥ karma samācara ||” (gītābhāvaprakāśamu - 3 - 62, 64)
(cittaśudhdhi lēnivāniki karma cēyaka yuṃḍuṭa kanna karma cēyuṭayē mēlu. eṃducētananagā – kēvalamu ēkarmanu cēyaka yuṃḍuṭa valananē citta śudhdhi kalugadu. āṃtē kāka karma cēyakayuṃḍuṭa valana, svadharmamu cēyakapōvuṭa valana, tānu cēyavalasinadi cēyakapōvuṭa valana, tanakuladharmamu cēyakapōvuṭa valana śarīrayātra kūḍa jaragadu - jīvamu gaḍavadu.)
sa budhdhimān manuṣyēṣu, sa yuktaḥ kṛtsna karmakṛt ||“. (śrīmadbhagavadgīta - 4 - 18)
“dēhēṃdriyādi vyāpārē niṣidhdhē vihatē tadhā |
karmaṇi ahaṃ karōmīti dharmādhyāsē prakalpitē |
svātmanyasaṃga cidrūpē nirīhē niṣkriyē (a)malē |
paśyatya karmayō vastudṛṣṭyā samyagvivēkataḥ |
yadhā nausthēva tīravṛkṣēṣva vicalēṣvapi |
kalpitaṃ calanaṃ tadva dakriyē karma kalpitaḥ |
akartrātma vicārēṇa karmābhāvaṃ ca vastutaḥ |
kṣīrastha vṛkṣēṣviva yaḥ paśyatyātma svarūpavit |
tadhā māyā vikārēṣu sadā dēhēṃdriyādiṣu |
svavyāpārēṣu tacchūnyastū ṣṇīmāsē sukhaṃ tviti |
ārōpitābhimānēna vyāpārō paramābhidhē |
gacchatsva gamanaṃ yadvatkalpitaṃ nṛṣu dūragaiḥ |
tadhā dēhēṃdriyā dīnāṃ sa vyāpāra vicāraṇāt|
yaśca karmanivṛttākhyaṃ vyāpāraṃ paripaśyati |
udāsīna daśāyā mapyaha māsē natā dṛśaḥ |
ēvaṃ rūpō (a)cimānōsti karmayaścēti paśyati |
ēvaṃ bhūtassa ātmajñō budhdhimatvādi bhirguṇaiḥ |
stūyatē vāsu dēvēna samyagddarśitayāmuniḥ ||“. (gītābhāvaprakāśamu - 4 - 110 to 119)
(dēhamu, iṃdriyamulu yokka vyāpāramulaku saṃbaṃdhiṃcina karmalu - śāstramulō ivi cēyavalasinavi yani vidhiṃcabaḍinavainanu, ivi cēyakūḍadu ani niṣēdiṃcabaḍina vainanu, vāṭiyaṃdu nēnu ī karmalanu cēyucunnānu ani anaṃga cidrūpuḍu, niṣkriyuḍu, amaluḍu ayina svātmayaṃdu ārōpiṃcukonunu. appuḍu aṭṭi karmayaṃdu akarma akarma yaniyē bhāvamu kaligiyuṃḍunu. paḍava naḍucu cuṃḍagā ā paḍavalōnunna vāniki oḍḍuna nunna ceṭlu kadalaka pōyinanu nīṭilō kadalinaṭlu kanabaḍunu. kāni vāstavamugā kadalaka yunnavani telusukonunu. idiyē karma akarmagā bhāviṃcuṭa, samyak jñānamucē karmanu akarmagā cūcuṭa.)
(māyā vikāramulagu dēhamu, iṃdriyamulu modalagunavi panulu cēyucunnanu, nēnu ē paniyucēyalēdu ani anukonunu. aṭṭi akarmayaṃdu dēhēṃdriyādula karma yunnaṭlu cūcuṭa akarmayaṃdu karmanu cūcuṭa. dūramugā pōvucunna railubaṃḍini cūcina kadalucunnaṭlu agapaḍadu. aṭṭi akarmayaṃdu adi nijamuga kadulucunnadanu jñānamu kaligiyuṃḍuṭa akarmayaṃdu karmanu cūcuṭa. iṭṭivāḍu paramārdhadarśi - ātma tatvamunu telisinavāḍu.)
karmanu anāsaktamugā nācariṃcuṭa cēta citta śuddhi valana kalugu naiṣkarmya ātmasthiti śarīramucē karma cēyucunnanu manassunaṃdu kartṛtvabhāvamu - “ī pani nēnu cēyucunnānu” anu bhāvamu - kāni, ā karmayaṃdāsakti kāni, dānivalana kalugu phalamaṃdu kōrika gāni, lēniyeḍala adiyē akarma.
“tūṣṇīṃ āsanaṃ” (ūrakanē kūrcuni yuṃḍuṭa) (cūḍumu - 7; ‘akarma karaṇaṃ’)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.