← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అఖిలదేవతాత్మా akhiladēvatātmā

Original — తెలుగు
  1. అఖిల దేవతాంతర్యామి తయా తత్స్వరూపః.

(సమస్త దేవతలలోను అంతర్యామిగా నుండుట వలన ఆయా దేవతా స్వరూపములు గలవాడు, ఆయా దేవతాస్వరూపములు తానే అయినవాడు)

  1. “యద్యపి దేవతాః సర్వామమైవ తనవో హరేః |

తత్పూ జనం మమై వాస్తి పూజనం పరమార్ధతః |

సమస్తాంతర్యామితయా ఫలదాతా హమేవచ |” (గీతాభావప్రకాశము - 7 - 142, 143)

(దేవతలందఱూ నాశరీరములే. అందుచేత పరమార్ధ దృష్ట్యా వారిని పూజించిన నన్ను పూజించినట్లే - ఎందుచేతననగా దేవతలతో పాటు అన్నింటి లోను అంతర్యామిగా నేను ఉండుట చేతను, వారిచ్చునట్టి ఫలము యదార్ధముగా నేనే ఇచ్చుట చేతనున్నూ.)

  1. తస్యా శ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః |

స బ్రహ్మ స శివస్సహరి స్సేంద్రస్సో (అ) క్షరః పరమస్వరాట్ ||” (మంత్రపుష్పము)

(జఠరాగ్ని శిఖామధ్యను పరమాత్మ యున్నాడు. ఆ పరమాత్మయే బ్రహ్మ, అతనే శివుడు, అతనే విష్ణువు - త్రిమూర్తులు అతనే అన్నమాట - అతనే ఇంద్రుడు, అతనే అక్షరపరబ్రహ్మ, అతనే పరముడు, అతనే స్వరాట్ - అనగా, స్వయం ప్రకాశరూపుడు.)

  1. “ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయుః, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్సురోం నమః” (మంత్రపుష్పము)

(‘తత్’ అనగా పరబ్రహ్మ యనియే యర్ధము - నిర్దేశము - ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ స్త్రివిధః స్మృతః” (శ్రీమద్భగవద్గీత -17 - 23)

- ‘ఓం’ అనినను, ‘తత్’ అనినను, ‘సత్’ అనినను, ఈ మూడు విధముల పరబ్రహ్మమే నిర్దేశింప బడుచున్నాడు.) ప్రణవాత్మకము, ‘తత్’ అను పదార్ధము - అదియే పరబ్రహ్మము, అదియే వాయువు, అదియే ఆత్మ, అదియే సత్యము, - అనగా, సత్పదార్థము, - త్రికాలములందు ఉండునది, అదియే సర్వమున్నూ - సమస్తమున్నూ - ఈ సృష్టిలో ఉన్న సమస్త వస్తువులు ఆ పరబ్రహ్మయే.

  1. “త్వం యజ్ఞస్త్వం వషట్కార, స్త్వమింద్ర, స్త్వం రుద్ర, స్త్వం విష్ణు, స్త్వం బ్రహ్మ, త్వం ప్రజాపతిః” (మంత్రపుష్పం)

(తత్పదార్ధముగా నిర్ణీతమైన నీవే యజ్ఞము, - యజ్ఞరూపుడవు నీవే, వషట్కారము నీవే, ఇంద్రుడవు నీవే. నీవే బ్రహ్మవు, రుద్రుడవు నీవే, నీవే విష్ణువు, నీవే ప్రజాపతివి - అనగా, పరమాత్మయే ఈ రూపములన్నియు ధరించినవాడు.)

  1. వాయుర్యమోగ్నిర్వరుణ శ్శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ ” (శ్రీమద్భగవద్గీత - 11 - 39)

(నీవే వాయువు, నీవే అగ్నివి, నీవే వరుణుడవు, నీవే చంద్రుడవు, నీవే ప్రజాపతివి, - కొంతమంది దేవతులనే యిక్కడ చెప్పుటచే మిగిలిన దేవతల నందఱిని చెప్పినట్లే భావింపవలెను.)

Transliteration
  1. akhila dēvatāṃtaryāmi tayā tatsvarūpaḥ.

(samasta dēvatalalōnu aṃtaryāmigā nuṃḍuṭa valana āyā dēvatā svarūpamulu galavāḍu, āyā dēvatāsvarūpamulu tānē ayinavāḍu)

  1. “yadyapi dēvatāḥ sarvāmamaiva tanavō harēḥ |

tatpū janaṃ mamai vāsti pūjanaṃ paramārdhataḥ |

samastāṃtaryāmitayā phaladātā hamēvaca |” (gītābhāvaprakāśamu - 7 - 142, 143)

(dēvatalaṃdaṟū nāśarīramulē. aṃducēta paramārdha dṛṣṭyā vārini pūjiṃcina nannu pūjiṃcinaṭlē - eṃducētananagā dēvatalatō pāṭu anniṃṭi lōnu aṃtaryāmigā nēnu uṃḍuṭa cētanu, vāriccunaṭṭi phalamu yadārdhamugā nēnē iccuṭa cētanunnū.)

  1. tasyā śśikhāyā madhyē paramātmā vyavasthitaḥ |

sa brahma sa śivassahari ssēṃdrassō (a) kṣaraḥ paramasvarāṭ ||” (maṃtrapuṣpamu)

(jaṭharāgni śikhāmadhyanu paramātma yunnāḍu. ā paramātmayē brahma, atanē śivuḍu, atanē viṣṇuvu - trimūrtulu atanē annamāṭa - atanē iṃdruḍu, atanē akṣaraparabrahma, atanē paramuḍu, atanē svarāṭ - anagā, svayaṃ prakāśarūpuḍu.)

  1. “ōṃ tadbrahma, ōṃ tadvāyuḥ, ōṃ tadātmā, ōṃ tatsatyaṃ, ōṃ tatsarvaṃ, ōṃ tatsurōṃ namaḥ” (maṃtrapuṣpamu)

(‘tat’ anagā parabrahma yaniyē yardhamu - nirdēśamu - ōṃ tatsaditi nirdēśō brahmaṇa strividhaḥ smṛtaḥ” (śrīmadbhagavadgīta -17 - 23)

- ‘ōṃ’ aninanu, ‘tat’ aninanu, ‘sat’ aninanu, ī mūḍu vidhamula parabrahmamē nirdēśiṃpa baḍucunnāḍu.) praṇavātmakamu, ‘tat’ anu padārdhamu - adiyē parabrahmamu, adiyē vāyuvu, adiyē ātma, adiyē satyamu, - anagā, satpadārthamu, - trikālamulaṃdu uṃḍunadi, adiyē sarvamunnū - samastamunnū - ī sṛṣṭilō unna samasta vastuvulu ā parabrahmayē.

  1. “tvaṃ yajñastvaṃ vaṣaṭkāra, stvamiṃdra, stvaṃ rudra, stvaṃ viṣṇu, stvaṃ brahma, tvaṃ prajāpatiḥ” (maṃtrapuṣpaṃ)

(tatpadārdhamugā nirṇītamaina nīvē yajñamu, - yajñarūpuḍavu nīvē, vaṣaṭkāramu nīvē, iṃdruḍavu nīvē. nīvē brahmavu, rudruḍavu nīvē, nīvē viṣṇuvu, nīvē prajāpativi - anagā, paramātmayē ī rūpamulanniyu dhariṃcinavāḍu.)

  1. vāyuryamōgnirvaruṇa śśaśāṃkaḥ prajāpatistvaṃ prapitāmahaśca ” (śrīmadbhagavadgīta - 11 - 39)

(nīvē vāyuvu, nīvē agnivi, nīvē varuṇuḍavu, nīvē caṃdruḍavu, nīvē prajāpativi, - koṃtamaṃdi dēvatulanē yikkaḍa ceppuṭacē migilina dēvatala naṃdaṟini ceppinaṭlē bhāviṃpavalenu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.