← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అఖిలకారకశక్తి ధరః akhilakārakaśakti dharaḥ

Original — తెలుగు
  1. అఖిలానాం ప్రాణినాం యోనిః కారకాణి ఇంద్రియాణి, తేషాం శక్తిః ధారయతి, ప్రవర్తయతి ఇతి.

(సమస్తమైన ప్రాణులయొక్క ఇంద్రియముల శక్తిని ధరించువాడు. - లేక, ప్రేరేపించువాడు; సమస్త ప్రాణులయొక్క యోని - జన్మ స్తానము అయినవాడు.)

  1. నిమిత్తోపాదాన సంప్రదానాపా దానాది కరణాద్యాత్మ కాని కారకాణి, తత్తచ్ఛక్తీశ్చ ధరుతీతి తధా - సకల కారక తత్తచ్ఛక్తి నిర్వాహకః ఇత్యర్ధః.

(కారకము అనగా నిమిత్తోపాదాన సంప్రదానా పాదనములు - మొదలగు కారణములు. వాటి శక్తిని ధరించినవాడు - సమస్తమైన కారణములను, వాటి శక్తులను నిర్వహించువాడు.)

(సృష్టి మహా విశాలమైనది. దానిలో అసంఖ్యాకములైన వస్తువులున్నవి. అన్నింటిని పుట్టించుటకు అనంతమైన శక్తి గలవాడు భగవంతుడు. సృష్టికి ఆదిబీజము తానే యగుచు అఖిల కారణవస్తువులలో నుండి వాటి కార్యవస్తువులను సృష్టించుటకు వలయు బీజము కూడా తానే –

“బీజం మాం సర్వభూతానాం విథ్థిపార్థ |

సనాతనం ||” (శ్రీమద్భగవద్గీత - 7 - 10)

- ‘సనాతనం’ అనుటవలన సృష్టి ప్రారంభమునుండి ఇప్పటి వరకు, ఇకముందు కూడా భూతములన్నింటికీ, ఒక్కొక్క దానికీ, బీజము తానే - అతను కారణవస్తువులో లేనిదే అందులోనుండి కార్యవస్తువు పుట్టదు

వ. “గగనంబు గాలమాయాంశ యోగంబునం బుండరీకాక్షు నిరీక్షణంబున స్పర్శతన్మాత్రంబు వలన వాయువు గలిగించె. పవనుండు నభోబలంబున రూప తన్మాత్రంబు వలన లోకలోచనంబైన తేజంబును త్పాదించె. తేజంబు గాలమాయాంశ యోగంబున నుత్తమ శ్లోకుని విలోకనంబున బవమానయుక్తంబగు రసతన్మాత్రంబు వలన నంబువులం బుట్టించె.” –

(శ్రీమదాంధ్ర మహాభాగవతము - 3 - 5 - 202.) (చూడుము ‘బీజము’)

Transliteration
  1. akhilānāṃ prāṇināṃ yōniḥ kārakāṇi iṃdriyāṇi, tēṣāṃ śaktiḥ dhārayati, pravartayati iti.

(samastamaina prāṇulayokka iṃdriyamula śaktini dhariṃcuvāḍu. - lēka, prērēpiṃcuvāḍu; samasta prāṇulayokka yōni - janma stānamu ayinavāḍu.)

  1. nimittōpādāna saṃpradānāpā dānādi karaṇādyātma kāni kārakāṇi, tattacchaktīśca dharutīti tadhā - sakala kāraka tattacchakti nirvāhakaḥ ityardhaḥ.

(kārakamu anagā nimittōpādāna saṃpradānā pādanamulu - modalagu kāraṇamulu. vāṭi śaktini dhariṃcinavāḍu - samastamaina kāraṇamulanu, vāṭi śaktulanu nirvahiṃcuvāḍu.)

(sṛṣṭi mahā viśālamainadi. dānilō asaṃkhyākamulaina vastuvulunnavi. anniṃṭini puṭṭiṃcuṭaku anaṃtamaina śakti galavāḍu bhagavaṃtuḍu. sṛṣṭiki ādibījamu tānē yagucu akhila kāraṇavastuvulalō nuṃḍi vāṭi kāryavastuvulanu sṛṣṭiṃcuṭaku valayu bījamu kūḍā tānē –

“bījaṃ māṃ sarvabhūtānāṃ viththipārtha |

sanātanaṃ ||” (śrīmadbhagavadgīta - 7 - 10)

- ‘sanātanaṃ’ anuṭavalana sṛṣṭi prāraṃbhamunuṃḍi ippaṭi varaku, ikamuṃdu kūḍā bhūtamulanniṃṭikī, okkokka dānikī, bījamu tānē - atanu kāraṇavastuvulō lēnidē aṃdulōnuṃḍi kāryavastuvu puṭṭadu

va. “gaganaṃbu gālamāyāṃśa yōgaṃbunaṃ buṃḍarīkākṣu nirīkṣaṇaṃbuna sparśatanmātraṃbu valana vāyuvu galigiṃce. pavanuṃḍu nabhōbalaṃbuna rūpa tanmātraṃbu valana lōkalōcanaṃbaina tējaṃbunu tpādiṃce. tējaṃbu gālamāyāṃśa yōgaṃbuna nuttama ślōkuni vilōkanaṃbuna bavamānayuktaṃbagu rasatanmātraṃbu valana naṃbuvulaṃ buṭṭiṃce.” –

(śrīmadāṃdhra mahābhāgavatamu - 3 - 5 - 202.) (cūḍumu ‘bījamu’)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.