← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అఖిలలోకనిదానం akhilalōkanidānaṃ

Original — తెలుగు

అఖిల లోకస్య విశ్వస్య నిదానం ఆదికారణం - “నిదానం త్వాది కారణం” ఇత్యమరః.

(సమస్త లోకములకు, సమస్త ప్రపంచమునకును, ఆదికారణము -మొదటి కారణమైనవాడు. ‘నిదానం’ అనగా ఆదికారణము అని అమరము చెప్పుచున్నది. పుట్టిన వస్తువు కార్యము. అది ఎందులోనుండి పుట్టినదో అది దానికి కారణము. పరబ్రహ్మము నుండి ప్రకృతి, దానిలో నుండి మహత్తత్వము, దానిలో నుండి – ఒక దానిలో నుండి ఒకటిగా - ఈ సృష్టిలోని వస్తువులన్నియు పుట్టినవి. అందుచేత ఈ సృష్టిలోని వస్తువులకు - ఈ సృష్టికి- అవి ఎందులోనుండి పుట్టినవో అవి వాటి వాటికి కారణములు కాగా, అన్నింటికి మొదటి కారణము - ఆదికారణము - పరబ్రహ్మమే.)

Transliteration

akhila lōkasya viśvasya nidānaṃ ādikāraṇaṃ - “nidānaṃ tvādi kāraṇaṃ” ityamaraḥ.

(samasta lōkamulaku, samasta prapaṃcamunakunu, ādikāraṇamu -modaṭi kāraṇamainavāḍu. ‘nidānaṃ’ anagā ādikāraṇamu ani amaramu ceppucunnadi. puṭṭina vastuvu kāryamu. adi eṃdulōnuṃḍi puṭṭinadō adi dāniki kāraṇamu. parabrahmamu nuṃḍi prakṛti, dānilō nuṃḍi mahattatvamu, dānilō nuṃḍi – oka dānilō nuṃḍi okaṭigā - ī sṛṣṭilōni vastuvulanniyu puṭṭinavi. aṃducēta ī sṛṣṭilōni vastuvulaku - ī sṛṣṭiki- avi eṃdulōnuṃḍi puṭṭinavō avi vāṭi vāṭiki kāraṇamulu kāgā, anniṃṭiki modaṭi kāraṇamu - ādikāraṇamu - parabrahmamē.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.