← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అక్షరాత్ పరతః పరః akṣarāt parataḥ paraḥ

Original — తెలుగు
  1. “అక్షరం అవ్యాకృతం, నామరూపబీజశక్తి రూపం, భూతసూక్ష్మం, ఈశ్వరాశ్రయం, తస్యైవ ఉపాధిభూతం సర్వస్మాత్ వికారాత్ పరోయో అవికారః, తస్మాత్ పరతః పరః”. (శ్రీశంకరః - బ్రహ్మ సూత్రభాష్యే)

(అక్షరమనగా అవ్యాకృతము. ఇప్పుడు నామరూపములతో ఉన్న ఈ ప్రపంచమంతయు నామరూపములులేక సూక్ష్మావస్థలోనున్న ప్రకృతి, అనగా, నామరూపములకు బీజము, కారణము - అయిన శక్తిరూపము, అట్టి అవస్థలోనున్న ప్రకృతి, భూతములు సూక్ష్మ రూపములో ఉన్న అవస్థ, పరమాత్మను ఆశ్రయించుకొనియున్నది, పరమాత్మకు ఉపాధి అయినది, అటుతర్వాత వికారమును - మార్పును - పొంది అనేక వస్తువులుగా మారినది. అటువంటి వికారమును పొందెడిదానికన్నపరమైనది, ఉత్కృష్టమైనది,వాటివలె వికారమును పొందనది, ఇదియే పరమాత్మునిమాయాశక్తి, చతుర్ముఖ బ్రహ్మ, అవ్యక్తము అనియు చెప్పబడుచున్నది. ఇది అక్షరము - నాశములేనిది. అందుచేత అక్షరము - దీనికన్న పరముడు, శ్రేష్టమైనవాడు, ఉత్కృష్టుడు గొప్పవాడు పరమాత్మ).

” అశ్నోతి వ్యాప్నోతి స్వవికారజాతం ఇత్యక్షరం, అవ్యాకృతం అకృతం అనాది ఇతి యావత్, నామ రూపయోర్బీజం ఈశ్వరః. తస్య శక్తిరూపం పరతంత్రత్వాత్ ఉపాదానమపి శక్తిరుత్యుక్తం భూతానాంసూక్ష్మాః సంస్కారాః యత్ర తద్భూతసూక్ష్మం ఈశ్వరః, చిన్మాత్రః ఆశ్రయోయత్ తత్తథా. తస్యైవ చిన్మాత్రస్య జీవేశ్వరోపాధిభూతం యత్తు ఈశ్వరో ఆశ్రయో విషయో యస్యేతి“.

(పైన చెప్పబడిన శంకరభాష్యమునకు ఈ క్రిందవిధముగా వ్యాఖ్యానము చెయబడినది : - తనలోనుండి పుట్టి తన పార్పులే, వికారములే, అయిన ప్రపంచములోని సమస్త వస్తువులలోను వ్యాపించియుండునది కనుక అక్షరమని చెప్పబడుచున్నది. అవ్యాకృతము అనగా అకృతం = కార్యముకానిది, కారణములేనిది. అందుచేత అనాది. ఆది అనగా కారణము, అదిలేనిది కనుక అక్షరము - నామరూపములుగల వస్తువులకు బీజము, కారణము, పరమాత్మ. ఆ పరమాత్మ శక్తి భగవదధీనమై, స్వతంత్రమైనది కాకయుండునది కనుక నామరూపములకు ఉపాదానమైనను పరమాత్మ శక్తి యనిపించుకొనుచున్నది. భూతములయొక్క సూక్ష్మాంశలు - సంస్కారము చేయబడినవి - దీనిలో నుండుటవలన - అనగా ముందు పుట్టబోవు భూతములు సూక్ష్మరూపములో దీనిలో ఇమిడి యున్నందున - ఇది భూతసూక్ష్మమని చెప్పబడినది. చిన్మాత్రుడు, చిద్రూపుడు అయిన ఈశ్వరుడు, పరమాత్మ దీనికి ఆశ్రయము - జీవేశ్వరులకు ఉపాధి అయినది).

  1. “నామరూప బీజోపాధి లక్షిత స్వరూపాత్ సర్వకార్య కారణ బీజత్వేన ఉపలక్ష్యమాణత్వాత్ పరంతత్వ ముపాధి లక్షణ మవ్యాకృతాఖ్యమక్షరం, సర్వ వికారేభ్యః, తస్మాత్ అక్షరాత్ పరః. నిరుపాధిక పురుష ఇత్యర్థః -”.

(నామరూపములుగల సమస్త వస్తువులకు బీజము, ఉపాధి అగుటవల్లను, సమస్త కార్యాకారణములకు బీజము, కారణము, ఉత్పత్తిస్థానము అగుటవల్లను, పరతత్వము అన్నింటికంటె ఉత్కృష్టమైనదగుటవల్లను, అవ్యాకృతమై, విస్తరింపని స్థితిలోనున్న ప్రకృతి అక్షరమనిపించుకొనుచున్నది. మిగిలినవాటికంటె ఉత్కృష్టమైన అక్షరప్రకృతికన్న ఉత్కృష్టమైనవాడు, ఏ విధమైన ఉపాధియు లేనివాడు, పురుషుడు, పురుషోత్తముడు, పరమాత్మ, పరబ్రహ్మ).

Transliteration
  1. “akṣaraṃ avyākṛtaṃ, nāmarūpabījaśakti rūpaṃ, bhūtasūkṣmaṃ, īśvarāśrayaṃ, tasyaiva upādhibhūtaṃ sarvasmāt vikārāt parōyō avikāraḥ, tasmāt parataḥ paraḥ”. (śrīśaṃkaraḥ - brahma sūtrabhāṣyē)

(akṣaramanagā avyākṛtamu. ippuḍu nāmarūpamulatō unna ī prapaṃcamaṃtayu nāmarūpamululēka sūkṣmāvasthalōnunna prakṛti, anagā, nāmarūpamulaku bījamu, kāraṇamu - ayina śaktirūpamu, aṭṭi avasthalōnunna prakṛti, bhūtamulu sūkṣma rūpamulō unna avastha, paramātmanu āśrayiṃcukoniyunnadi, paramātmaku upādhi ayinadi, aṭutarvāta vikāramunu - mārpunu - poṃdi anēka vastuvulugā mārinadi. aṭuvaṃṭi vikāramunu poṃdeḍidānikannaparamainadi, utkṛṣṭamainadi,vāṭivale vikāramunu poṃdanadi, idiyē paramātmunimāyāśakti, caturmukha brahma, avyaktamu aniyu ceppabaḍucunnadi. idi akṣaramu - nāśamulēnidi. aṃducēta akṣaramu - dīnikanna paramuḍu, śrēṣṭamainavāḍu, utkṛṣṭuḍu goppavāḍu paramātma).

” aśnōti vyāpnōti svavikārajātaṃ ityakṣaraṃ, avyākṛtaṃ akṛtaṃ anādi iti yāvat, nāma rūpayōrbījaṃ īśvaraḥ. tasya śaktirūpaṃ parataṃtratvāt upādānamapi śaktirutyuktaṃ bhūtānāṃsūkṣmāḥ saṃskārāḥ yatra tadbhūtasūkṣmaṃ īśvaraḥ, cinmātraḥ āśrayōyat tattathā. tasyaiva cinmātrasya jīvēśvarōpādhibhūtaṃ yattu īśvarō āśrayō viṣayō yasyēti”.

(paina ceppabaḍina śaṃkarabhāṣyamunaku ī kriṃdavidhamugā vyākhyānamu ceyabaḍinadi : - tanalōnuṃḍi puṭṭi tana pārpulē, vikāramulē, ayina prapaṃcamulōni samasta vastuvulalōnu vyāpiṃciyuṃḍunadi kanuka akṣaramani ceppabaḍucunnadi. avyākṛtamu anagā akṛtaṃ = kāryamukānidi, kāraṇamulēnidi. aṃducēta anādi. ādi anagā kāraṇamu, adilēnidi kanuka akṣaramu - nāmarūpamulugala vastuvulaku bījamu, kāraṇamu, paramātma. ā paramātma śakti bhagavadadhīnamai, svataṃtramainadi kākayuṃḍunadi kanuka nāmarūpamulaku upādānamainanu paramātma śakti yanipiṃcukonucunnadi. bhūtamulayokka sūkṣmāṃśalu - saṃskāramu cēyabaḍinavi - dīnilō nuṃḍuṭavalana - anagā muṃdu puṭṭabōvu bhūtamulu sūkṣmarūpamulō dīnilō imiḍi yunnaṃduna - idi bhūtasūkṣmamani ceppabaḍinadi. cinmātruḍu, cidrūpuḍu ayina īśvaruḍu, paramātma dīniki āśrayamu - jīvēśvarulaku upādhi ayinadi).

  1. “nāmarūpa bījōpādhi lakṣita svarūpāt sarvakārya kāraṇa bījatvēna upalakṣyamāṇatvāt paraṃtatva mupādhi lakṣaṇa mavyākṛtākhyamakṣaraṃ, sarva vikārēbhyaḥ, tasmāt akṣarāt paraḥ. nirupādhika puruṣa ityarthaḥ -”.

(nāmarūpamulugala samasta vastuvulaku bījamu, upādhi aguṭavallanu, samasta kāryākāraṇamulaku bījamu, kāraṇamu, utpattisthānamu aguṭavallanu, paratatvamu anniṃṭikaṃṭe utkṛṣṭamainadaguṭavallanu, avyākṛtamai, vistariṃpani sthitilōnunna prakṛti akṣaramanipiṃcukonucunnadi. migilinavāṭikaṃṭe utkṛṣṭamaina akṣaraprakṛtikanna utkṛṣṭamainavāḍu, ē vidhamaina upādhiyu lēnivāḍu, puruṣuḍu, puruṣōttamuḍu, paramātma, parabrahma).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.