“అమానిత్వా దంభిత్వం”
ఇత్యాదినా గీతాశాస్తే తృతీయ షట్కే ప్రతిపాద్యమానః అమానిత్వాది ధర్మః.
(అమానిత్వము,
అదంభిత్వము అని మొదలగునవి శ్రీమద్భగవద్గీతలో 13వ అధ్యాయములో చెప్పబడిన ధర్మములు. ఇవి కలిగియుండుట
జ్ఞానమని అచ్చట చెప్పబడినది.)
“అమానిత్వమదంభిత్వమహింసా క్షాంతిరార్జవం |
ఆచార్యో పాసనం,
శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహః |
ఇంద్రియార్థేషు
వైరాగ్యమనహకార ఏవచ |
జన్మ
మృత్యుజరావ్యాధి దుఃఖ దోషాను దర్శనం |
ఆసక్తి రనభిష్వంగః
పుత్రదారగృహాదిషు |
నిత్యం చ
సమచిత్తత్వమిష్టా నిష్టో పపత్తిషు |
మ యి చానన్య యోగేన
భక్తిరవ్యభిచారిణీ |
వివిక్త
దేశదేశసేవిత్వమరతిర్జన సంసది |
ఆధ్యాత్మాజ్ఞాన
నిత్యత్వం, తత్వజ్ఞార్థ దర్శనం |
ఏతద్
జ్ఞానమితిప్రోక్తం’అజ్ఞానం యదతో (అ)న్యథా ||” (శ్రీమద్భగవద్గీత- 13 - 7 to 11)
(తన్నుతాను
పొగడుకొనకుండుట; స్వధర్మమును ప్రకటింపకుండుట; పరులను పీడింపకుండుట; క్షమ (ఓర్పు);
కుటిలత లేక తిన్నగా నడచుకొనుట; గురువును కొలుచుట శరీరము లోపల బైట శుభ్రముగానుండుట -
మనసులో దురాలోచన లేకయుండుట, శరీరమును నిర్మలముగా నుంచుట); సన్మార్గమున స్థిరముగా
నిష్టకలిగియుండుట; మనస్సును, స్వభావమును స్వాధీనములో నుంచుకొనుట; విషయములందు ఆసక్తిలేక
విరక్తికలిగియుండుట; నేను, నాది యను అహంకార మమకారములుగల అభిమానము లేకుండుట; జన్మము,
మృత్యువు, ముసలితనము, రోగము,వీటియందు, దుఃఖము దోషములు ఉన్నవని వాటి దోషయుక్తముగాచూచుట;
పుత్రుడు, భార్య, గృహము మొదలగువాటియందు ఆసక్తి లేకపోవుట; వారికి ఏ విధమైన బాధ కలిగినను తనకే
కలిగినదని బాధపడకుండుట; తనకు ఇష్టమైనవికాని ఇష్టముకానివికాని - అనగా సుఖ దుఃఖములు కలిగినప్పుడు
ఎల్లపుడూ వాటియందు సమానభావమేకలిగియుండుట; ఇతరమైనదానియందు ధ్యానములేక భగవంతునియందే ఏకాంతభక్తి
కలిగియుండుట; నిర్జనప్రదేశమున, శాంతియుత వాతావరణమందు నివసించుట, నీచజనులు తరుచుగా ఉండు
స్థలములోనుండుటకు ఇచ్ఛలేకుండుట; అధ్యాత్మజ్ఞానమందే నిత్యము నిష్ఠకలిగియుండుట; తత్వజ్ఞానమే -
బ్రహ్మజ్ఞానమే పరమార్థముగా దృష్టిలోనుంచుకొనుట. ఇవన్నియు కలిగియుండుట జ్ఞానమని చెప్పబడును -ఇవికానివి
- వీటికి వేరైనవి అజ్ఞానమని చెప్పబడును.)
Transliteration
“amānitvā
daṃbhitvaṃ” ityādinā gītāśāstē tṛtīya ṣaṭkē pratipādyamānaḥ amānitvādi
dharmaḥ.
(amānitvamu,
adaṃbhitvamu ani modalagunavi śrīmadbhagavadgītalō 13va adhyāyamulō
ceppabaḍina dharmamulu. ivi kaligiyuṃḍuṭa jñānamani accaṭa
ceppabaḍinadi.)
“amānitvamadaṃbhitvamahiṃsā
kṣāṃtirārjavaṃ |
ācāryō pāsanaṃ,
śaucaṃ, sthairyamātma vinigrahaḥ |
iṃdriyārthēṣu
vairāgyamanahakāra ēvaca |
janma
mṛtyujarāvyādhi duḥkha dōṣānu darśanaṃ |
āsakti ranabhiṣvaṃgaḥ
putradāragṛhādiṣu |
nityaṃ ca
samacittatvamiṣṭā niṣṭō papattiṣu |
ma yi cānanya yōgēna
bhaktiravyabhicāriṇī |
vivikta
dēśadēśasēvitvamaratirjana saṃsadi |
ādhyātmājñāna
nityatvaṃ, tatvajñārtha darśanaṃ |
ētad
jñānamitiprōktaṃ’ajñānaṃ yadatō (a)nyathā ||” (śrīmadbhagavadgīta- 13 -
7 to 11)
(tannutānu
pogaḍukonakuṃḍuṭa; svadharmamunu prakaṭiṃpakuṃḍuṭa; parulanu
pīḍiṃpakuṃḍuṭa; kṣama (ōrpu); kuṭilata lēka tinnagā naḍacukonuṭa;
guruvunu kolucuṭa śarīramu lōpala baiṭa śubhramugānuṃḍuṭa - manasulō
durālōcana lēkayuṃḍuṭa, śarīramunu nirmalamugā nuṃcuṭa); sanmārgamuna
sthiramugā niṣṭakaligiyuṃḍuṭa; manassunu, svabhāvamunu svādhīnamulō
nuṃcukonuṭa; viṣayamulaṃdu āsaktilēka viraktikaligiyuṃḍuṭa; nēnu, nādi
yanu ahaṃkāra mamakāramulugala abhimānamu lēkuṃḍuṭa; janmamu, mṛtyuvu,
musalitanamu, rōgamu,vīṭiyaṃdu, duḥkhamu dōṣamulu unnavani vāṭi
dōṣayuktamugācūcuṭa; putruḍu, bhārya, gṛhamu modalaguvāṭiyaṃdu āsakti
lēkapōvuṭa; vāriki ē vidhamaina bādha kaliginanu tanakē kaliginadani
bādhapaḍakuṃḍuṭa; tanaku iṣṭamainavikāni iṣṭamukānivikāni - anagā sukha
duḥkhamulu kaliginappuḍu ellapuḍū vāṭiyaṃdu samānabhāvamēkaligiyuṃḍuṭa;
itaramainadāniyaṃdu dhyānamulēka bhagavaṃtuniyaṃdē ēkāṃtabhakti
kaligiyuṃḍuṭa; nirjanapradēśamuna, śāṃtiyuta vātāvaraṇamaṃdu
nivasiṃcuṭa, nīcajanulu tarucugā uṃḍu sthalamulōnuṃḍuṭaku
icchalēkuṃḍuṭa; adhyātmajñānamaṃdē nityamu niṣṭhakaligiyuṃḍuṭa;
tatvajñānamē - brahmajñānamē paramārthamugā dṛṣṭilōnuṃcukonuṭa. ivanniyu
kaligiyuṃḍuṭa jñānamani ceppabaḍunu -ivikānivi - vīṭiki vērainavi
ajñānamani ceppabaḍunu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.