కశ్చిత్కిల దుష్టాత్మా మహారణ్య మార్గే పతితమంధం స్వబంధునగరం జిగమిషుం బబాషే – “కిమత్ర ఆయుష్మతా దుఃఖితేన స్థీయతి” ఇతి. స చాందః సుఖాం వాణీమాకర్ణ్యతం ఆప్తం మత్వా ఉవాచ – “అహో! మద్భాగ ధేయం యదత్ర భవాన్ మాందీనం స్వాభీష్టనగర ప్రావ్త్య సమర్థంభాషత” ఇతి. సచ విప్రలుప్సుః దుష్టం గోయనానం ఆనీయ తదీయ లాంగూలమంధం గ్రాహయామాస, ఉపది దేశచ ఏవమంధం :-
“ఏ ష గోయుదా త్వాం నగరం నేష్యతి, మా త్యజ లాంగూలం” ఇతి. స చాంధః
“శ్రధ్ధాళుతయా తదత్యజన్ స్వాభీష్టం అప్రాప్య అనర్ధ పరంపరాం ప్రాప్తఃఇతి న్యాయం” (శ్రీ శంకరః - బ్రహ్మ సూత్రభాష్యే)
(ఆభరణములతోనున్న ఒక ధనవంతుని పుత్రుని దొంగలు ఎత్తుకొని పోయి అడవిలో వాని ఆభరణములన్నియు తీసుకొని, వాడి కన్నులు పొడిచి వెళ్ళిపోయిరి. అక్కడ ఏడ్చుచున్న ఆబాలుని ఒక దుర్మార్గుడు చూచి ఎందుకు ఏడ్చుచున్నావని యడిగెను.ఆ బాలుడు ఈ పలకరింపు మంచివాక్యమని నమ్మి, ఆ దుర్మార్గుని ఆప్తుడని తలచి - తన మేలు కోరువాడని నమ్మి - అతనితో ఇట్లనెను : - “ఆహా ! నా అదృష్టము ! నాస్వగ్రామమును చేరుకొనుట తెలియని నాతో మాటలాడుచున్నావు”. ఆ దుర్మార్గుడు ఒక పెంకి యెద్దును తీసుకొనివచ్చి దాని తోకను యీ గ్రుడ్డి వాని చేతిలో పెట్టి “ఈ తోకను విడిచి పెట్టకుము, ఇది నిన్ను నీ ఊరు చేర్చును” అని చెప్పెను. ఆ గుడ్డివాడు ఆ దుర్మార్గుని మాటయందు నమ్మకము కలిగి యుండెను.ఆ యెద్దు తోక పట్టుకొనినందుకు ఆ అంధుని ముప్ప తిప్పలు పెట్టి, విపరీతమైన బాధలు కలుగచేసెను. అంధుడు తన గమ్యస్తానమైన తన నగరము చేరకపోవడమే కాక, నానావిధమైన బాధలు పడెను - ఇదియే గోలాంగూలన్యాయము. (ఈ న్యాయము ఆధ్యాత్మమార్గములో ఏ ప్రకారము ఉపచరించుననగా : - “యదిచా జ్ఞస్య సతో ముముక్షోః అచేతనమాత్మానం ఆత్మాఇత్యుపదిశేత్ ప్రమాణ భూతం శాస్త్రం స శ్రద్ధ ధానతయా అంధగోలాంగూలన్యాయేన తదాత్మ దృష్టిం, నపరిత్యజేత్ తద్వ్యతి రిక్తం చాత్మానం న ప్రతిపద్యేత, తదా మోక్షాత్ విహన్యేత, అనర్ధం వా బుచ్ఛేత్.” (శ్రీశంకరః - బ్రహ్మ సూత్ర భాష్యే)
(బ్రహ్మ జ్ఞానము లేని ముముక్షువునకు - మోక్షము కోరువానికి - అనాత్మ అయినటువంటి - ఆత్మ కానటువంటి - శరీరమే ఆత్మ యని ఉపదేశించినచో, వాడు, గోలాంగూల న్యాయము ననుసరించి, అదే నిజమని నమ్మి ఆ ఉపదేశింపబడిన అనాత్మయే ఆత్మ యని నమ్మి, దాని యందే శ్రద్ధ వహించి, దానిని వదలక యుండును. అందుచేత దానికివ్యతిరేకమైన ఆత్మను - పరబ్రహ్మమును - పొందకయుండును - మోక్షమును పొందకయుండును.)
(ఈ పై విషయము ఆధ్యాత్మ దృష్టిలో ఈ విధముగా నన్వ యించుకొన వచ్చును : - “దొంగలు విషయములు. అంధుని ఆభరణములు, ఆత్మ సుఖరూపమైన వైభవము. ఆ అంధుని నేత్రములు తీసివేయుట జ్ఞాననేత్రము లేకుండగ చేయుటయే. అరణ్యమను సంసారములో వాడిని పడవేయుట - జ్ఞాననేత్రము పోయినందున అంతా అరణ్యమే, అంతా చీకటే. అటువంటి సంసారములో ఆ అంధుడు పడి పోయెను. తిరిగి స్వగ్రామముచేరుట అను కోరిక తిరిగి ఆత్మ జ్ఞానము సంపాదించు నుద్దేశమే. దుష్టుడని చెప్పబడినవాడు అనాత్మవాది. వాడు చెప్పిన ప్రకారము అంధుడు తప్పు మార్గమున పడి గమ్యస్థానము అయిన ఆత్మ చేరుకొనలేడు. సరికదా అనేక అనర్ధములను పొందెను - బాధలు పడెను - అందుచేతసరియైన గురువాక్యముల ద్వారా పరమాత్మను చేరవచ్చును గాని ఇతర సిధ్ధాంతములనమ్మి చేరుట వీలుకాదు.”)
“ఆత్మజ్ఞానా భావేసతి విహన్యేత మోక్షం నప్రాప్నుయాత్, ప్రత్యుతానర్ధం సంసారం చ ప్రాప్నుయా దిత్యర్ధః.” (భాష్య రత్న ప్రభా)
(ఆత్మజ్ఞానము లేకపోవుటచేత బాధలు పడును, మోక్షము పొందక యుండును. మీది మిక్కిలి జననమరణరూపమైన సంసారమను అనర్థమును పొందును అని దీనివలన గ్రహించతగి యున్నది.)
kaścitkila duṣṭātmā mahāraṇya mārgē patitamaṃdhaṃ svabaṃdhunagaraṃ jigamiṣuṃ babāṣē – “kimatra āyuṣmatā duḥkhitēna sthīyati” iti. sa cāṃdaḥ sukhāṃ vāṇīmākarṇyataṃ āptaṃ matvā uvāca – “ahō! madbhāga dhēyaṃ yadatra bhavān māṃdīnaṃ svābhīṣṭanagara prāvtya samarthaṃbhāṣata” iti. saca vipralupsuḥ duṣṭaṃ gōyanānaṃ ānīya tadīya lāṃgūlamaṃdhaṃ grāhayāmāsa, upadi dēśaca ēvamaṃdhaṃ :-
“ē ṣa gōyudā tvāṃ nagaraṃ nēṣyati, mā tyaja lāṃgūlaṃ” iti. sa cāṃdhaḥ
“śradhdhāḷutayā tadatyajan svābhīṣṭaṃ aprāpya anardha paraṃparāṃ prāptaḥiti nyāyaṃ” (śrī śaṃkaraḥ - brahma sūtrabhāṣyē)
(ābharaṇamulatōnunna oka dhanavaṃtuni putruni doṃgalu ettukoni pōyi aḍavilō vāni ābharaṇamulanniyu tīsukoni, vāḍi kannulu poḍici veḷḷipōyiri. akkaḍa ēḍcucunna ābāluni oka durmārguḍu cūci eṃduku ēḍcucunnāvani yaḍigenu.ā bāluḍu ī palakariṃpu maṃcivākyamani nammi, ā durmārguni āptuḍani talaci - tana mēlu kōruvāḍani nammi - atanitō iṭlanenu : - “āhā ! nā adṛṣṭamu ! nāsvagrāmamunu cērukonuṭa teliyani nātō māṭalāḍucunnāvu”. ā durmārguḍu oka peṃki yeddunu tīsukonivacci dāni tōkanu yī gruḍḍi vāni cētilō peṭṭi “ī tōkanu viḍici peṭṭakumu, idi ninnu nī ūru cērcunu” ani ceppenu. ā guḍḍivāḍu ā durmārguni māṭayaṃdu nammakamu kaligi yuṃḍenu.ā yeddu tōka paṭṭukoninaṃduku ā aṃdhuni muppa tippalu peṭṭi, viparītamaina bādhalu kalugacēsenu. aṃdhuḍu tana gamyastānamaina tana nagaramu cērakapōvaḍamē kāka, nānāvidhamaina bādhalu paḍenu - idiyē gōlāṃgūlanyāyamu. (ī nyāyamu ādhyātmamārgamulō ē prakāramu upacariṃcunanagā : - “yadicā jñasya satō mumukṣōḥ acētanamātmānaṃ ātmāityupadiśēt pramāṇa bhūtaṃ śāstraṃ sa śraddha dhānatayā aṃdhagōlāṃgūlanyāyēna tadātma dṛṣṭiṃ, naparityajēt tadvyati riktaṃ cātmānaṃ na pratipadyēta, tadā mōkṣāt vihanyēta, anardhaṃ vā bucchēt.” (śrīśaṃkaraḥ - brahma sūtra bhāṣyē)
(brahma jñānamu lēni mumukṣuvunaku - mōkṣamu kōruvāniki - anātma ayinaṭuvaṃṭi - ātma kānaṭuvaṃṭi - śarīramē ātma yani upadēśiṃcinacō, vāḍu, gōlāṃgūla nyāyamu nanusariṃci, adē nijamani nammi ā upadēśiṃpabaḍina anātmayē ātma yani nammi, dāni yaṃdē śraddha vahiṃci, dānini vadalaka yuṃḍunu. aṃducēta dānikivyatirēkamaina ātmanu - parabrahmamunu - poṃdakayuṃḍunu - mōkṣamunu poṃdakayuṃḍunu.)
(ī pai viṣayamu ādhyātma dṛṣṭilō ī vidhamugā nanva yiṃcukona vaccunu : - “doṃgalu viṣayamulu. aṃdhuni ābharaṇamulu, ātma sukharūpamaina vaibhavamu. ā aṃdhuni nētramulu tīsivēyuṭa jñānanētramu lēkuṃḍaga cēyuṭayē. araṇyamanu saṃsāramulō vāḍini paḍavēyuṭa - jñānanētramu pōyinaṃduna aṃtā araṇyamē, aṃtā cīkaṭē. aṭuvaṃṭi saṃsāramulō ā aṃdhuḍu paḍi pōyenu. tirigi svagrāmamucēruṭa anu kōrika tirigi ātma jñānamu saṃpādiṃcu nuddēśamē. duṣṭuḍani ceppabaḍinavāḍu anātmavādi. vāḍu ceppina prakāramu aṃdhuḍu tappu mārgamuna paḍi gamyasthānamu ayina ātma cērukonalēḍu. sarikadā anēka anardhamulanu poṃdenu - bādhalu paḍenu - aṃducētasariyaina guruvākyamula dvārā paramātmanu cēravaccunu gāni itara sidhdhāṃtamulanammi cēruṭa vīlukādu.”)
“ātmajñānā bhāvēsati vihanyēta mōkṣaṃ naprāpnuyāt, pratyutānardhaṃ saṃsāraṃ ca prāpnuyā dityardhaḥ.” (bhāṣya ratna prabhā)
(ātmajñānamu lēkapōvuṭacēta bādhalu paḍunu, mōkṣamu poṃdaka yuṃḍunu. mīdi mikkili jananamaraṇarūpamaina saṃsāramanu anarthamunu poṃdunu ani dīnivalana grahiṃcatagi yunnadi.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.