← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతాదిరహితుడు aṃtādirahituḍu

Original — తెలుగు
  1. అంతము వినాశము, ఆది, మొదలు, ఈ రెండును లేనివాడు - కొస, మొదలు లేనివాడు - ఆది, అంతములు, జనన మరణములు లేనివాడు. “అనాది నిధనం”

  2. ఆది, అంతము లేనివాడని చెప్పుట వలన మధ్యావస్థ కూడ లేనివాడు. అందుచేత ఆది మధ్యాంతరహితుడు అని చెప్పినట్లే.

“క. అంతాదిరహితు డచ్యుతు

డంతర్ధానంబునొందె ---“. (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 3 - 6 - 173)

  1. తనకు ఆది అంతములు లేని వాడైనను తాను చేసిన సృష్టికి - సృష్టి లోని ప్రతి వస్తువునకు - ఆదిమధ్యాంతములు తానే అయినవాడు.

“క. ఒకపరి జగములు వెలినిడి

ఒకపరి లోపలికి గొనుచు నుభయము తానై ---- ” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 8 - 3 -74)

సృష్టికి ముందును, సృష్టి అంతమందును మిగిలి యుండువాడు; కనుకనే ఆది శేషుడు అని చెప్పబడుచున్నాడు.

  1. “ఆది అంత మేమి లేక అఖిల రూపు డైనవాని” (శ్రీ త్యాగరాజ స్వామి)
Transliteration
  1. aṃtamu vināśamu, ādi, modalu, ī reṃḍunu lēnivāḍu - kosa, modalu lēnivāḍu - ādi, aṃtamulu, janana maraṇamulu lēnivāḍu. “anādi nidhanaṃ”

  2. ādi, aṃtamu lēnivāḍani ceppuṭa valana madhyāvastha kūḍa lēnivāḍu. aṃducēta ādi madhyāṃtarahituḍu ani ceppinaṭlē.

“ka. aṃtādirahitu ḍacyutu

ḍaṃtardhānaṃbunoṃde ---“. (śrīmadāṃdhra mahābhāgavatamu - 3 - 6 - 173)

  1. tanaku ādi aṃtamulu lēni vāḍainanu tānu cēsina sṛṣṭiki - sṛṣṭi lōni prati vastuvunaku - ādimadhyāṃtamulu tānē ayinavāḍu.

“ka. okapari jagamulu veliniḍi

okapari lōpaliki gonucu nubhayamu tānai ---- ” (śrīmadāṃdhra mahābhāgavatamu - 8 - 3 -74)

sṛṣṭiki muṃdunu, sṛṣṭi aṃtamaṃdunu migili yuṃḍuvāḍu; kanukanē ādi śēṣuḍu ani ceppabaḍucunnāḍu.

  1. “ādi aṃta mēmi lēka akhila rūpu ḍainavāni” (śrī tyāgarāja svāmi)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.