← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతఃకరణ వృత్తులు aṃtaḥkaraṇa vṛttulu

Original — తెలుగు

“అంతఃకరణమేకం స్వాత్ వృత్తిభేదాత్ చతుర్విధం |

యధాతు సంకల్ప వికల్ప కృత్యం తదా భావేత్ తన్మన ఇత్యభిఖ్యం |

స్వాత్ బుధ్ధి సంజ్ఞంచ యదా ప్రవేత్తి సునిశ్చితంసంశయ హీన రూపం |

అనుసంధాన రూపం తచ్చిత్తంచ పరికీర్తితం |

అహం కృత్యాత్మ వృత్త్యాతు తదహంకార తాం గతం ||” (దేవీ భాగవతం)

(అంతఃకరణము ఒకటే అయినను దాని వృత్తి భేదము వలన, అనగా అది చేయు పనులలో భేదము వలన, నాలుగు విధములుగా నున్నది : -

(1) సంకల్ప వికల్పములు చేయునది మనస్సు

(2) పదార్ధముల యొక్క మంచి చెడ్డలు సంశయము లేకుండునట్లు నిశ్చయించి తెలుసుకొనునది బుద్ధి

(3) అనుసంధానరూపమైనదానిని - చింతించుదానిని చిత్తమందురు

(4) ‘నేను’ అని అభిమానించు వృత్తిని అహంకారమందురు - యుక్తా యుక్త విచారము లేక ‘నేనీ పని చేయగలను’ అని చేయుట.)

  1. (పైనచెప్పిన విషయమే ఇంకొకవిధముగా చెప్పబడినది: -

“సంకల్ప వికల్ప కృత్యంయదాంతఃకరణ మన ఇత్యభిఖ్యం మనస్సంజ్ఞికం భవతి. యదా సంశయ హీనం యధాస్యాత్ తధా సునిశ్చితం వస్తు తదంతఃకరణం ప్రవేత్తి, తదా తత్బుధ్ధి సంజ్ఞకం భవతి, యదా అనుసంధాన వృత్తిర్భవతి తదాంతఃకరణస్య చిత్తమితి సంజ్ఞా |”)

  1. “యదా తథా గోదకం చిద్రాన్నిర్గత్య కుల్యాత్మనా కేదారాన్ ప్రవిశ్య తన్వదేవ చతుష్కోణాద్యాకారం భవతి, తథా తైజసమంతఃకరణమపి చక్షురాది ద్వారా నిర్గత్య ఘటాది విషయదేశంగత్వా ఘటాది విషయం కారేణపరిణమతే, స ఏవ పరిణామో వృత్తిరిత్యుచ్యతే”

(తటాకములోని నీరు కన్నముద్వారా - మదుముద్వారా - పైకి వచ్చి కాలువద్వారా పొలములలో ప్రవేశించి వాటివలె నాలుగు కోణములు గలదిగా యెట్లుండునో, ఆ ప్రకారముగానే తైజసాహంకారము వలన కలిగిన అంతఃకరణము కూడా కండ్లు మొదలగు వాటి ద్వారా పైకి వచ్చి, ఘటము మొదలగు వస్తువులుండు దేశమునకు వెళ్ళి ఆ ఘటము మొదలగు వస్తువుల ఆకారమువలే పరిణమించును, మారును. ఆవిధమగు పరిణామమే వృత్తి యని చెప్పబడుచున్నది.)

(ఇది స్తాణువా, పురుషుడా అను సంశయము కలుగచేయునది సంకల్ప వికల్ప రూపము. ఇది ఈ ప్రకారము అని (ఇదమిత్థం అని) తెలియునది నిశ్చయాకారము. ఇది నేను అనునది గర్వాకారము. ఇది ఘటము అనునది స్మరణాకరము.)

  1. “సరస్యావర్తాదివ వృత్తిరంతఃకరణ పరిణామః” (యోగసారోపనిషత్)

(మనస్సు అను సరోవరములోని సుడిని వృత్తి యందురు. మనస్సుయొక్క పరిణామము వృత్తి.)

  1. అంతఃకరణ పరిణామస్య వృత్తిః ఇతి సంజ్ఞా.

(అంతఃకరణము యొక్క పరిమాణమును - మార్పును, కార్యమును - వృత్తి యందురు.)

Transliteration

“aṃtaḥkaraṇamēkaṃ svāt vṛttibhēdāt caturvidhaṃ |

yadhātu saṃkalpa vikalpa kṛtyaṃ tadā bhāvēt tanmana ityabhikhyaṃ |

svāt budhdhi saṃjñaṃca yadā pravētti suniścitaṃsaṃśaya hīna rūpaṃ |

anusaṃdhāna rūpaṃ taccittaṃca parikīrtitaṃ |

ahaṃ kṛtyātma vṛttyātu tadahaṃkāra tāṃ gataṃ ||” (dēvī bhāgavataṃ)

(aṃtaḥkaraṇamu okaṭē ayinanu dāni vṛtti bhēdamu valana, anagā adi cēyu panulalō bhēdamu valana, nālugu vidhamulugā nunnadi : -

(1) saṃkalpa vikalpamulu cēyunadi manassu

(2) padārdhamula yokka maṃci ceḍḍalu saṃśayamu lēkuṃḍunaṭlu niścayiṃci telusukonunadi buddhi

(3) anusaṃdhānarūpamainadānini - ciṃtiṃcudānini cittamaṃduru

(4) ‘nēnu’ ani abhimāniṃcu vṛttini ahaṃkāramaṃduru - yuktā yukta vicāramu lēka ‘nēnī pani cēyagalanu’ ani cēyuṭa.)

  1. (painaceppina viṣayamē iṃkokavidhamugā ceppabaḍinadi: -

“saṃkalpa vikalpa kṛtyaṃyadāṃtaḥkaraṇa mana ityabhikhyaṃ manassaṃjñikaṃ bhavati. yadā saṃśaya hīnaṃ yadhāsyāt tadhā suniścitaṃ vastu tadaṃtaḥkaraṇaṃ pravētti, tadā tatbudhdhi saṃjñakaṃ bhavati, yadā anusaṃdhāna vṛttirbhavati tadāṃtaḥkaraṇasya cittamiti saṃjñā |”)

  1. “yadā tathā gōdakaṃ cidrānnirgatya kulyātmanā kēdārān praviśya tanvadēva catuṣkōṇādyākāraṃ bhavati, tathā taijasamaṃtaḥkaraṇamapi cakṣurādi dvārā nirgatya ghaṭādi viṣayadēśaṃgatvā ghaṭādi viṣayaṃ kārēṇapariṇamatē, sa ēva pariṇāmō vṛttirityucyatē”

(taṭākamulōni nīru kannamudvārā - madumudvārā - paiki vacci kāluvadvārā polamulalō pravēśiṃci vāṭivale nālugu kōṇamulu galadigā yeṭluṃḍunō, ā prakāramugānē taijasāhaṃkāramu valana kaligina aṃtaḥkaraṇamu kūḍā kaṃḍlu modalagu vāṭi dvārā paiki vacci, ghaṭamu modalagu vastuvuluṃḍu dēśamunaku veḷḷi ā ghaṭamu modalagu vastuvula ākāramuvalē pariṇamiṃcunu, mārunu. āvidhamagu pariṇāmamē vṛtti yani ceppabaḍucunnadi.)

(idi stāṇuvā, puruṣuḍā anu saṃśayamu kalugacēyunadi saṃkalpa vikalpa rūpamu. idi ī prakāramu ani (idamitthaṃ ani) teliyunadi niścayākāramu. idi nēnu anunadi garvākāramu. idi ghaṭamu anunadi smaraṇākaramu.)

  1. “sarasyāvartādiva vṛttiraṃtaḥkaraṇa pariṇāmaḥ” (yōgasārōpaniṣat)

(manassu anu sarōvaramulōni suḍini vṛtti yaṃduru. manassuyokka pariṇāmamu vṛtti.)

  1. aṃtaḥkaraṇa pariṇāmasya vṛttiḥ iti saṃjñā.

(aṃtaḥkaraṇamu yokka parimāṇamunu - mārpunu, kāryamunu - vṛtti yaṃduru.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.