← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతఃకరణశుధ్ధి aṃtaḥkaraṇaśudhdhi

Original — తెలుగు

“అతోవై కవయో నిత్యం భక్తిం పరమయాముదా |

వాసు దేవే భగవతి కుర్వం త్యాత్మ ప్రసాదనం ||” (శ్రీమద్భాగవతం - 1 - 2 -)

పై శ్లోకమునకు శ్రీమదాంధ్ర మహాభాగవతములో ఈ విధముగా అంధ్రీకరణము చేయబడినది : -

“క. గురుమతులు దపసులంతః

కరణంబులు శుధ్ధి సేయు ఘనతరభక్తిన్

హరియందు సమర్పింతురు

పరమానందమున భిన్న భవబంధనులై ” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1 - 2 - 57)

(అంతఃకరణమనగా లోపలి ఇంద్రియము - మనస్సు. మనస్సును నిర్మలముగా చేయుట, దోషము లేకుండునట్లు చేయుట, చెడ్డతలంపులు లేకుండ చేయుట. ఇది ఎట్లు సాధ్యమగుననగా - భగవంతునియందు భక్తి కలిగియుండుట వలననే సాధ్యమగును - గొప్ప మనస్సు కలిగి, సంసారబంధమును తెంచుకొనినవారైన తపశ్శాలురు అంతఃకరణశుధ్ధి కొరకు హరి భక్తులగుదురు.)

  1. భక్తి అంతఃకరణమును శుధ్ధి చేయు ప్రకారము ఎట్లంటే –

“వ. --- కర్మనిర్మూలన హేతువులైన కమలలోచను కథలం దెవ్వడు రతిసేయు, విననిచ్చగించు, వాని కితరంబు లెవ్వియు రుచి పుట్టింపనేరవు. పుణ్య శ్రవణకీర్తనుండైన కృష్ణుండు దన కధలు వినువారి హృదయంబులందు నిలిచి శుభంబు లాచరించు. అశుభంబులు నిరసించు. అశుభంబులు నష్టంబులయిన భాగవతశాస్త్ర సేవావిశేషంబున నిశ్చలభక్తి యుదయించు. భక్తిగలుగ రజస్తమోగుణ ప్రభూతంబులైన కామలోభాదులకు వశంబు గాక చిత్తంబు సత్వగుణంబున బ్రసన్నంబగు. ప్రసన్న మనస్కుండైన ముక్తసంగుండగు. ముక్తసంగుం డైన నీశ్వర తత్వజ్ఞానంబు సిద్ధించు. ఈశ్వరుండు గానంబడిన జిజ్జడగ్రధన రూపంబైన యహంకారంబు భిన్నంబగు. అహంకారంబు భిన్నంబైన నసంభావది రూపంబులగు సంశయంబులు విఛ్చిన్నంబులగు. సంశయ విఛ్చేదంబైన ననారబ్ధఫలంబులైన కర్మంబులు నశించును --.” (శ్రీమదాంధ్రమహభాగవతము - 1 - 2 - 21)

Transliteration

“atōvai kavayō nityaṃ bhaktiṃ paramayāmudā |

vāsu dēvē bhagavati kurvaṃ tyātma prasādanaṃ ||” (śrīmadbhāgavataṃ - 1 - 2 -)

pai ślōkamunaku śrīmadāṃdhra mahābhāgavatamulō ī vidhamugā aṃdhrīkaraṇamu cēyabaḍinadi : -

“ka. gurumatulu dapasulaṃtaḥ

karaṇaṃbulu śudhdhi sēyu ghanatarabhaktin

hariyaṃdu samarpiṃturu

paramānaṃdamuna bhinna bhavabaṃdhanulai ” (śrīmadāṃdhra mahābhāgavatamu - 1 - 2 - 57)

(aṃtaḥkaraṇamanagā lōpali iṃdriyamu - manassu. manassunu nirmalamugā cēyuṭa, dōṣamu lēkuṃḍunaṭlu cēyuṭa, ceḍḍatalaṃpulu lēkuṃḍa cēyuṭa. idi eṭlu sādhyamagunanagā - bhagavaṃtuniyaṃdu bhakti kaligiyuṃḍuṭa valananē sādhyamagunu - goppa manassu kaligi, saṃsārabaṃdhamunu teṃcukoninavāraina tapaśśāluru aṃtaḥkaraṇaśudhdhi koraku hari bhaktulaguduru.)

  1. bhakti aṃtaḥkaraṇamunu śudhdhi cēyu prakāramu eṭlaṃṭē –

“va. --- karmanirmūlana hētuvulaina kamalalōcanu kathalaṃ devvaḍu ratisēyu, vinaniccagiṃcu, vāni kitaraṃbu levviyu ruci puṭṭiṃpanēravu. puṇya śravaṇakīrtanuṃḍaina kṛṣṇuṃḍu dana kadhalu vinuvāri hṛdayaṃbulaṃdu nilici śubhaṃbu lācariṃcu. aśubhaṃbulu nirasiṃcu. aśubhaṃbulu naṣṭaṃbulayina bhāgavataśāstra sēvāviśēṣaṃbuna niścalabhakti yudayiṃcu. bhaktigaluga rajastamōguṇa prabhūtaṃbulaina kāmalōbhādulaku vaśaṃbu gāka cittaṃbu satvaguṇaṃbuna brasannaṃbagu. prasanna manaskuṃḍaina muktasaṃguṃḍagu. muktasaṃguṃ ḍaina nīśvara tatvajñānaṃbu siddhiṃcu. īśvaruṃḍu gānaṃbaḍina jijjaḍagradhana rūpaṃbaina yahaṃkāraṃbu bhinnaṃbagu. ahaṃkāraṃbu bhinnaṃbaina nasaṃbhāvadi rūpaṃbulagu saṃśayaṃbulu vichcinnaṃbulagu. saṃśaya vichcēdaṃbaina nanārabdhaphalaṃbulaina karmaṃbulu naśiṃcunu --.” (śrīmadāṃdhramahabhāgavatamu - 1 - 2 - 21)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.