← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతరంగ సాధనములు aṃtaraṃga sādhanamulu

Original — తెలుగు
  1. వివేకా దీని అష్టౌ అపి అంతరంగ సాధనాని

(వివేకాదులు నాలుగు - నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్రార్ధ భోగవిరాగము, శమదమాది సంపద, ముముక్షుత్వము, శ్రవణ, మనన, నిధి ధ్యాసములను మూడు, తత్వం పదార్ధశోధనము - ఇవన్నీ కలిసి యెనిమిదిన్నీ అంతరంగసాధనములు. వీటినే వివేకాద్యష్టక మందురు.)

  1. “తత్వమసి” వాక్యార్ధ చింతన ఏవ అంతరంగ సాధనం, ఆత్మ బోధస్య (వేదాంతసారోపనిషత్)

(“ఆపరబ్రహ్మ నీవే” అను మహావాక్యమును అర్ధము చేసుకొని, దానిని చింతించుచూ ఉండడమేఆత్మ జ్ఞానమునకు అంతరంగ సాధనము.)

  1. యన్య సాధనన్య శ్రవణాదికం తత్కార్యభూతం అవరోక్షజ్ఞానం వా దృష్టంఫలం తదంతరంగముచ్యతే.

(ఏ సాధనమువలన శ్రవణాదులు, వాటివలన కలుగు అపరోక్ష జ్ఞానము అను ఫలము కలుగునో అది అంతరంగసాధనము.)

(వివేకాదులు లేక శ్రవణమందాసక్తి కలుగదు. శ్రవణాదికములేక ఆత్మజ్ఞానము అను ఫలము కలుగదు - అందుచేత వివేకాద్యష్టకము అంతరంగసాధనము.)

Transliteration
  1. vivēkā dīni aṣṭau api aṃtaraṃga sādhanāni

(vivēkādulu nālugu - nityānitya vastu vivēkamu, ihāmutrārdha bhōgavirāgamu, śamadamādi saṃpada, mumukṣutvamu, śravaṇa, manana, nidhi dhyāsamulanu mūḍu, tatvaṃ padārdhaśōdhanamu - ivannī kalisi yenimidinnī aṃtaraṃgasādhanamulu. vīṭinē vivēkādyaṣṭaka maṃduru.)

  1. “tatvamasi” vākyārdha ciṃtana ēva aṃtaraṃga sādhanaṃ, ātma bōdhasya (vēdāṃtasārōpaniṣat)

(“āparabrahma nīvē” anu mahāvākyamunu ardhamu cēsukoni, dānini ciṃtiṃcucū uṃḍaḍamēātma jñānamunaku aṃtaraṃga sādhanamu.)

  1. yanya sādhananya śravaṇādikaṃ tatkāryabhūtaṃ avarōkṣajñānaṃ vā dṛṣṭaṃphalaṃ tadaṃtaraṃgamucyatē.

(ē sādhanamuvalana śravaṇādulu, vāṭivalana kalugu aparōkṣa jñānamu anu phalamu kalugunō adi aṃtaraṃgasādhanamu.)

(vivēkādulu lēka śravaṇamaṃdāsakti kalugadu. śravaṇādikamulēka ātmajñānamu anu phalamu kalugadu - aṃducēta vivēkādyaṣṭakamu aṃtaraṃgasādhanamu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.