(మన లోపలనే, మన మనస్సులోనే ఉండి మనలను ముక్తి మార్గములో ప్రేరేపించక, జనన మరణ రూపమైన సంసారమార్గములో ప్రవర్తించునట్లు పురికొల్పునవగుటచేత, మనకి ఇవి పైకి యీ విధముగా హాని చేయుచున్నట్లు కనబడక, మనలోపలనుండే మనకి హానిచేయునవి కనుక ఇవి అంతశ్శత్రువులు.)
(లోపలి శత్రువులైన కామము, క్రోధము మొదలగు వాటియొక్క కూటమి యే అరిషడ్వర్గము)-కామ క్రోధాదులు ఏవి యనగా
(కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఇవి ఆరు శత్రువులు - ఆ ఆరు కలిసి అరిషడ్వర్గము.)
(అంతశత్రువులు ప్రేరేపించిన ప్రకారము చేయక వాటిని నిగ్రహించిన యడల బాహ్యముగా, లోకములో ఎవడూ శత్రువనేవాడు ఉండనే ఉండడు. వీటిని గెలువలేకపోయినందుననే ఎంత బలశాలి అయినను హిరణ్యకశిపునకు శ్రీమహావిష్ణువుతోను, అతని భక్తులతోను శత్రుత్వము కలిగెను. - అందుచేతనే అతను ఎంత పరాక్రమవంతుడైనను శత్రువు వలననే నశించెను. అందుచేత ఈ అంతశ్శత్రువులను సాధించి వశములోనుంచవలెను.)
(mana lōpalanē, mana manassulōnē uṃḍi manalanu mukti mārgamulō prērēpiṃcaka, janana maraṇa rūpamaina saṃsāramārgamulō pravartiṃcunaṭlu purikolpunavaguṭacēta, manaki ivi paiki yī vidhamugā hāni cēyucunnaṭlu kanabaḍaka, manalōpalanuṃḍē manaki hānicēyunavi kanuka ivi aṃtaśśatruvulu.)
(lōpali śatruvulaina kāmamu, krōdhamu modalagu vāṭiyokka kūṭami yē ariṣaḍvargamu)-kāma krōdhādulu ēvi yanagā
(kāmamu, krōdhamu, lōbhamu, mōhamu, madamu, mātsaryamu ivi āru śatruvulu - ā āru kalisi ariṣaḍvargamu.)
(aṃtaśatruvulu prērēpiṃcina prakāramu cēyaka vāṭini nigrahiṃcina yaḍala bāhyamugā, lōkamulō evaḍū śatruvanēvāḍu uṃḍanē uṃḍaḍu. vīṭini geluvalēkapōyinaṃdunanē eṃta balaśāli ayinanu hiraṇyakaśipunaku śrīmahāviṣṇuvutōnu, atani bhaktulatōnu śatrutvamu kaligenu. - aṃducētanē atanu eṃta parākramavaṃtuḍainanu śatruvu valananē naśiṃcenu. aṃducēta ī aṃtaśśatruvulanu sādhiṃci vaśamulōnuṃcavalenu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.