(నీటితో నిండియున్న తీర్థములను, క ఱ్ఱ మొదలగువాటితో నిర్మింపబడిన దేవతలను ఆత్మకు ప్రతీకములగుట వలన యోగులు వాటిని సేవింపరు - బహి స్తీర్థములకన్న అంతస్తీర్థములు - అనగా ప్రపంచములో ఉన్న తీర్థములకన్న మనసులో తీర్థములు ఉత్కృష్టములైనవి. ఆత్మ యను తీర్థము మహా తీర్థము, అనగా - అన్నిటికంటే ఉత్కృష్ట మైనది. ఇతర తీర్థములు నిరర్థకములు, ఉపయోగము లేనివి. లోపలనున్న దుష్టమైన మనస్సు బాహ్యతీర్థముల చేత శుద్ధి చేయ బడదు, నిర్మలము కానేరదు. భగవంతుడు శరీరము లోనే ఉన్నాడు.)
“ఈశ్వరస్సర్వ భూతానాం హృద్దేశే అర్జున తిష్టతి -” (శ్రీమద్భగవద్గీత - 18 - 61)
(సమస్త భూతముల హృదయ ప్రదేశమందు ఈశ్వరుడు - భగవంతుడు - ఉన్నాడు.)అయినను ఈ సంగతి తెలుసు కొన లేక మూఢుడు తీర్థములందు, రాతిలోనూ (రాతితో చేయబడిన దేవ విగ్రహములందు, కర్రతో చేయబడిన దేవ విగ్రహములందు, దానములందు, జపములందు, యజ్ఞములందు దేవుడు ఉన్నాడని అనుకొనుచున్నారు. యోగులు తమలోనే భగవంతుని చూచెదరు. అజ్ఞానులు ధ్యానము చేయుటకు ప్రతిమలు - దేవతా విగ్రహములు - కల్పింప బడినవి.)
(భోజరాజు తన ఆస్థానములో నున్న పండితులకు ధన సహాయము చేసి కాశీకి వెళ్ళి విశ్వనాధుని దర్శనము చేసుకొని రమ్మని చెప్పెను. వారందఱు ప్రయాణ సన్నాహములు చేయు చుండగా కాళిదాసు ఏ విధమైన సన్నాహము చేయకుండుట చూచి భోజరాజు అతనిని కారణమడిగెను - “వారందఱికి విశ్వనాధుడు కాశీలో నున్నాడు, నాకు నా హృదయము లోనే ఉన్నాడని” బదులు చెప్పెను.)
(nīṭitō niṃḍiyunna tīrthamulanu, ka ṟṟa modalaguvāṭitō nirmiṃpabaḍina dēvatalanu ātmaku pratīkamulaguṭa valana yōgulu vāṭini sēviṃparu - bahi stīrthamulakanna aṃtastīrthamulu - anagā prapaṃcamulō unna tīrthamulakanna manasulō tīrthamulu utkṛṣṭamulainavi. ātma yanu tīrthamu mahā tīrthamu, anagā - anniṭikaṃṭē utkṛṣṭa mainadi. itara tīrthamulu nirarthakamulu, upayōgamu lēnivi. lōpalanunna duṣṭamaina manassu bāhyatīrthamula cēta śuddhi cēya baḍadu, nirmalamu kānēradu. bhagavaṃtuḍu śarīramu lōnē unnāḍu.)
“īśvarassarva bhūtānāṃ hṛddēśē arjuna tiṣṭati -” (śrīmadbhagavadgīta - 18 - 61)
(samasta bhūtamula hṛdaya pradēśamaṃdu īśvaruḍu - bhagavaṃtuḍu - unnāḍu.)ayinanu ī saṃgati telusu kona lēka mūḍhuḍu tīrthamulaṃdu, rātilōnū (rātitō cēyabaḍina dēva vigrahamulaṃdu, karratō cēyabaḍina dēva vigrahamulaṃdu, dānamulaṃdu, japamulaṃdu, yajñamulaṃdu dēvuḍu unnāḍani anukonucunnāru. yōgulu tamalōnē bhagavaṃtuni cūcedaru. ajñānulu dhyānamu cēyuṭaku pratimalu - dēvatā vigrahamulu - kalpiṃpa baḍinavi.)
(bhōjarāju tana āsthānamulō nunna paṃḍitulaku dhana sahāyamu cēsi kāśīki veḷḷi viśvanādhuni darśanamu cēsukoni rammani ceppenu. vāraṃdaṟu prayāṇa sannāhamulu cēyu cuṃḍagā kāḷidāsu ē vidhamaina sannāhamu cēyakuṃḍuṭa cūci bhōjarāju atanini kāraṇamaḍigenu - “vāraṃdaṟiki viśvanādhuḍu kāśīlō nunnāḍu, nāku nā hṛdayamu lōnē unnāḍani” badulu ceppenu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.