← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతవంతములు aṃtavaṃtamulu

Original — తెలుగు
  1. వినాశ స్వభావాః - (నశించు స్వభావము కలవి)

  2. “అంతో వినాశో విద్యతే యేషాంతే. అంతవంతః - యధా మృగతృష్ణ కోద కాదౌ సద్బుధ్ధిరను వృత్తా ప్రమాణ నిరూపణాం తే విచ్ఛిద్యతే, స తస్యాంతః; తథా ఇమే దేహః స్వప్న మాయా దేహాదివత్ చ అంతవంతః |” (శ్రీ శంకరః)

(అంతము అనగా వినాశము, అది కలవి అంతవంతములు - ఎండమావులందలి ఉదకములు సద్బుద్ధిచేత ప్రమాణముద్వారా అవి ఉదకములవలె నగపడుచున్నవి కాని నిజముగ ఉదకములుకావు అని నిరూపణచేసిన తర్వాత అవి అంతమై పోవును - అనగా, అది నీరు అని అభిప్రాయము తొలగును.అట్లు తొలగిపోవుట యే వాటికి అంతము. ఈ ప్రకారమే కలలో చూచిన మాయాదేహమువలె అంతమును పొందవలసినవే, నశించవలసినవే.)

  1. “అంత వంత ఇమే దేహాః నిత్యస్యోక్తాః శరీరిణః” – (శ్రీమద్భగవద్గీత - 2 - 18)

పై శ్లోకమునకు ఈ క్రింది విధముగా వ్యాఖ్యానము చేయ బడినది : -

“స్వప్నమాయా శరీరాదివదేతే కల్పితాః జడాః |

దేహాః వినాశినః సర్వే దేవతిర్య ఙ్నరావయః |

దృశ్యత్వేన దృశః ప్రోక్తా శ్రుతిభిర్బ్రహ్మ వాదిభిః |

భస్మే భూతోమృతో దేహో నష్టశ్చా దరర్శనం గతః |

యథా వ్యాధి భిర్యుక్తో దేహో నష్టః ఇతీర్యతే ||“. (గీతా భావప్రకాశము - 2 – 228 to 232)

(శరీరముకలవాడు శరీరి, ఆత్మ. ఆత్మ నిత్యుడు. ఈ ఆత్మ యొక్క శరీరము అంతము పొందునది. ఎందుచేతననగా - కలలో కనబడు శరీరములు కల్పితములు, జడములు, అనగా లోపల ఆత్మలేనిదే పనిచేయలేనివి. దేవతుల శరీరములని, మానవుల శరీరములని, జంతువుల శరీరములని విచక్షణలేక, శరీరములన్నియు నశించి పోవలసినవే. చనిపోయిన తర్వాత దేహము దహింపబడి రూపము లేకుండ నశించును. అందుచేత అవి మరి కనబడవు.)

  1. “జాతస్య ధ్రువం మృత్యుః” (శ్రీమద్భగవద్గీత - 2 - 27)

“జాతస్య మరణం ధ్రువం”

(పుట్టినదానికి మృత్యువు తప్పదు - పరబ్రహ్మ ఒక్కడే మృత్యువు లేనివాడు - అజుడు.పుట్టుట లేదు కనుక మరణించుట లేదు - అమరుడు, నిత్యుడు, శాశ్వతుడు.)

Transliteration
  1. vināśa svabhāvāḥ - (naśiṃcu svabhāvamu kalavi)

  2. “aṃtō vināśō vidyatē yēṣāṃtē. aṃtavaṃtaḥ - yadhā mṛgatṛṣṇa kōda kādau sadbudhdhiranu vṛttā pramāṇa nirūpaṇāṃ tē vicchidyatē, sa tasyāṃtaḥ; tathā imē dēhaḥ svapna māyā dēhādivat ca aṃtavaṃtaḥ |” (śrī śaṃkaraḥ)

(aṃtamu anagā vināśamu, adi kalavi aṃtavaṃtamulu - eṃḍamāvulaṃdali udakamulu sadbuddhicēta pramāṇamudvārā avi udakamulavale nagapaḍucunnavi kāni nijamuga udakamulukāvu ani nirūpaṇacēsina tarvāta avi aṃtamai pōvunu - anagā, adi nīru ani abhiprāyamu tolagunu.aṭlu tolagipōvuṭa yē vāṭiki aṃtamu. ī prakāramē kalalō cūcina māyādēhamuvale aṃtamunu poṃdavalasinavē, naśiṃcavalasinavē.)

  1. “aṃta vaṃta imē dēhāḥ nityasyōktāḥ śarīriṇaḥ” – (śrīmadbhagavadgīta - 2 - 18)

pai ślōkamunaku ī kriṃdi vidhamugā vyākhyānamu cēya baḍinadi : -

“svapnamāyā śarīrādivadētē kalpitāḥ jaḍāḥ |

dēhāḥ vināśinaḥ sarvē dēvatirya ṅnarāvayaḥ |

dṛśyatvēna dṛśaḥ prōktā śrutibhirbrahma vādibhiḥ |

bhasmē bhūtōmṛtō dēhō naṣṭaścā dararśanaṃ gataḥ |

yathā vyādhi bhiryuktō dēhō naṣṭaḥ itīryatē ||“. (gītā bhāvaprakāśamu - 2 – 228 to 232)

(śarīramukalavāḍu śarīri, ātma. ātma nityuḍu. ī ātma yokka śarīramu aṃtamu poṃdunadi. eṃducētananagā - kalalō kanabaḍu śarīramulu kalpitamulu, jaḍamulu, anagā lōpala ātmalēnidē panicēyalēnivi. dēvatula śarīramulani, mānavula śarīramulani, jaṃtuvula śarīramulani vicakṣaṇalēka, śarīramulanniyu naśiṃci pōvalasinavē. canipōyina tarvāta dēhamu dahiṃpabaḍi rūpamu lēkuṃḍa naśiṃcunu. aṃducēta avi mari kanabaḍavu.)

  1. “jātasya dhruvaṃ mṛtyuḥ” (śrīmadbhagavadgīta - 2 - 27)

“jātasya maraṇaṃ dhruvaṃ”

(puṭṭinadāniki mṛtyuvu tappadu - parabrahma okkaḍē mṛtyuvu lēnivāḍu - ajuḍu.puṭṭuṭa lēdu kanuka maraṇiṃcuṭa lēdu - amaruḍu, nityuḍu, śāśvatuḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.