← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనాది ప్రపంచము anādi prapaṃcamu

Original — తెలుగు

అనాది సర్వప్రపంచో దృశ్యతే, నిత్యో అనిత్యో వా ఇతి సంశయతే. ప్రపంచోపి ద్వివిధః - విద్యా ప్రపంచశ్యా విద్యాప్రపంచశ్చేతి. విద్యా ప్రపంచస్య నిత్యత్వం సిద్ధమేవ, నిత్యానందచిద్వి లాసాత్మకత్వాత్, అధచ శుద్ధ బుద్ధ ముక్త సత్యానంద స్వరూపత్వాచ్చ.అవిద్యా ప్రపంచస్య నిత్యత్వ మనిత్యత్వం వా కథమితి - ప్రవాహతో నిత్యత్వం వదంతి కే చన, ప్రళయాదికం శ్రూయ మానత్వాత్ అనిత్యత్వం వదం త్యన్యే, ఉభయన్న భవతి. పునః కథమితి. సంకోచ వికాసాత్మక మహా మాయా విలాసాత్మ క ఏవ సర్వో (అ) ప్య విద్యా విలాసత్వాత్. తత్కధమితి ? “ఏకమేవా ద్వయం బ్రహ్మ”, “నేహ నానాస్తి కించన”, తస్మాత్ బ్రహ్మ వ్యతిరిక్తం సర్వం బాధిత మేవ. సత్యమేవ పరంబ్రహ్మ, “సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ”. తతస్సవిలాస మూలా విద్యోపసంహార క్రమః కథమితి ? - - -వత్సర శతం బ్రహ్మ మానేన బ్రహ్మణః పరమాయుః ప్రమాణం. తావత్కాలస్తస్య స్థితి రుచ్యతే, స్థిత్యంతే అండవిరాట్పురుషః స్వాంశ హిరణ్య గర్భ మభ్యేతి. హిరణ్య గర్భస్య కారణం పరమాత్మానం అండపరిపాలకం నారాయణమభ్యేతి. పునర్వత్సర శతం తస్య ప్రళయో భవతి. తదా జీవాస్సర్వే ప్రకృతౌ ప్రలీయంతే, ప్రళయేనసర్వం శూన్యం భవతి. తస్య బ్రహ్మణః స్థితి ప్రళయావాది నారాయణస్యాం శే నావతీర్ణస్య అజాండ పరిపాలకస్య మహావిష్ణో రహోరాతీ సంజ్ఞికా, తస్యస్థిత్యం తే స్వాంశం మహా విరాట్పురుష మభ్యేతి. తతస్సావరణం బ్రహ్మాండం వినాశమేతి, బ్రహ్మాండావరణం వినశ్యతి తద్ధి విష్ణో స్స్వరూపం. తస్య తావత్ ప్రళయో భవతి; ప్రళయే సర్వ శూన్యం భవతి. అండపరిపాలక మహా విష్ణోః స్థితిప్రళయే ఆది విరాట్పురుషస్య అహోరాత్రి సంజ్ఞికా. తస్య స్థిత్యంతే ఆది విరాట్పురుషః స్వంశం మాయోపాధిక నారాయణ మభ్యేతి. తస్య ప్రళయే సర్వశూన్యం భవతి. తస్య ఆదినారాయణస్య స్థిత్యంతే త్రిపాద్విభూతి - నారాయణస్య ఇచ్ఛావశాత్ నిమేషో జాయతే, తస్మాన్మూలా విద్యాండస్య సావరణస్య విలయో భవతి. తతస్స విలాసా మూలా విద్యా సర్వకార్యోపాధి సమన్వితా, సదసద్విలక్షణా, నిర్వాచ్య లక్షణ శూన్యా విర్భావతి రో భావాత్మికా నాద్యాఖిల కరణానంత మహా మాయా విశేషణ విశేషితా పరమసూక్ష్మ మూలకారణమవ్యక్తం విశతి, అవ్యక్తం విశేద్బ్రహ్మణి; నిరింధినో వైశ్యానరో యథా. తస్మా న్మాయోపాథిక ఆదినారాయణస్త థా స్వస్వరూపం భజతి. సర్వే జీవాః స్వస్వరూపం భజంతే, యథా కుసుమ సాన్నిధ్యాత్ రక్త స్ఫటిక పతీతః, తద భావే శుద్ధస్ఫటిక ప్రతీతిః. బ్రహ్మణో మాయోపాధి వశాత్ సగుణ పరిచ్ఛిన్నాది ప్రతీతిః, ఉపాధి విలయాన్నిర్గుణ నిరవయవాది ప్రతీతిః“. (మహా నారాయాణోపనిషత్)

(ఈ సమస్త ప్రపంచము అనాదివలె - మొదలు, ప్రారంభము లేనివానివలె కనిపించుచున్నది. ఇది నిత్యమైనదా? లేక అనిత్యమైనదా? - అనగా, ఎల్ల కాలమందు ఇట్లే ఉండునదా? లేక నశించి మరల పుట్టునదా? అని సంశయము కలుగును. ఈ ప్రపంచము రెండువిధములుగా ఉన్నది: విద్యా ప్రపంచమని, అవిద్యా ప్రపంచమని. విద్యాప్రపంచము నిత్యమైనదే. ఎందుచేతననగా, సచ్చిదానందముల రూపము గలదగుటచేతను, శుద్ధ,బుద్ధ, ముక్త సత్యానందస్వరూపము గలదగుటచేతను.అవిద్యాప్రపంచము నిత్యమా? అనిత్యమా? ఇది ప్రవాహరూపమువలన నిత్యము అని కొందఱి అభిప్రాయము. ప్రళయము సంభవించునది అగుటచేత అనిత్యము అని కొందఱి అభిప్రాయము. ఇది ఈ రెండును కాదు. సంకోచవికాసాత్మకమైన మహామాయా విలాసమే. అది ఎట్లంటే, పరబ్రహ్మ అనునది ఒక్కడే, రెండవ పరబ్రహ్మ కాని, ఇంకేవిధమైన రెండవ వస్తువు కాని లేనిది. ఈ సృష్టిలో అనేక వస్తువులు లేవు, ఉన్నదంతా ఒక్క పరబ్రహ్మమే. అందుచేత బ్రహ్మకానివస్తువే లేదు. పరబ్రహ్మ ఎల్లపుడూ - మూడుకాలములందు - ఉండువాడు - పరబ్రహ్మ “సత్యం, జ్ఞానమనంతం బ్రహ్మ” అయిన పరబ్రహ్మయొక్క విలాసమునకు మూలమైన అవిద్య లేకుండుట యెట్లు? బ్రహ్మ కాలమానము ప్రకారము బ్రహ్మ యొక్క - చతుర్ముఖ బ్రహ్మ యొక్క - పరమాయువు నూరు సంవత్సరములు.అంతకాలము చతుర్ముఖబ్రహ్మ ఉండును. చతుర్ముఖ బ్రహ్మ ఆయుర్దాయము అయిపోయిన తర్వాత అండవిరాట్పురుషుడు తన అంశ అయిన హిరణ్యగర్భునందు లీనమగును. హిరణ్యగర్భుని కారణమైనటువంటిన్నీ, అండపరిపాలకుడు అయినటువంటిన్నీ నారాయణునిపొందును. మరల నూరు వత్సరములు ప్రళయము కలుగును. అప్పుడు సమస్త జీవులు ప్రకృతిలో లీనమగుదురు. ఈ ప్రళయమువలన అంతా శూన్యమగును. ఇట్లు బ్రహ్మయొక్క స్థితి ప్రళయములు ఆదినారాయణుని అంశవలన అవతరించిన బ్రహ్మాండ పరిపాలకుడగు మహావిష్ణువుయొక్క - రాత్రి, పగలు - అహోరాత్రులు - అగును. అట్టి స్థితి తర్వాత తన అంశయే అయిన మహావిరాట్పురుషునిలో ఏకమగును. అప్పుడు ఆవరణముతోకూడ బ్రహ్మాండము నశించును. బ్రహ్మాండముయొక్కావరణ నశించిన అదియే విష్ణువుయొక్క స్వస్వరూపము. అప్పుడు ప్రళయము కలుగును.ఈ ప్రళయములో అంతా శూన్యమగును. బ్రహ్మాండపరిపాలకుడైన మహావిష్ణువు యొక్క స్థితి ప్రళయములు ఆదివిరాట్పురుషుని యొక్క అహోరాత్రులు.ఆ ప్రళయము తర్వాత ఆదివిరాట్పురుషుడు తన అంశ అయిన మాయ ఉపాధిగాగల నారాయణుని చెందును. ఆ ప్రళయములో అంతా శూన్యమగును. ఈ ఆదినారాయణుని అంతమందు త్రిపాద్విభూతియగు నారాయణుని ఇచ్ఛావశమున నిమేషమగును.దాని వలన మూలావిద్యాండము దాని ఆవరణతో లయమగును. అటు తర్వాత సమస్త కార్యములకు ఉపాధితో కూడిన సదసద్విలక్షణములు గలదిన్నీ, ఇటువంటిది అని నిర్వచించుటకు - నిర్ణయించి చెప్పుటకు వీలు కానిది - ఆవిర్భావ తిరోభావములుకలదిన్నీ,అనాది మూలావిద్యాయగు మహా మాయ ఒకటే మిగిలి యుండి, పరమసూక్ష్మము, మూలకారణము అయిన అవ్యక్తములో కలియును. అవ్యక్తము కాష్టములు లేని అగ్నివలె బ్రహ్మలో కలియును. అప్పుడు మాయ ఉపాధిగాగల ఆదినారాయణుడు స్వస్వరూపముతో నుండును. జీవులందరు స్వరూపమును పొందుదురు - భగవంతుని రూపులే యగుదురు - జపాకుసుమములకుదగ్గరగా ఉన్న స్ఫటికరక్తవర్ణము కలిగియుండి, అవి లేనపుడు శుద్ధస్ఫటికగా నుండునట్లుగానే, బ్రహ్మయొక్క మాయోపాధివశమున సగుణరూపమును మాయోపాధిలేని సమయమున నిర్గుణరూపము, నిరవయవమగు రూపమును గలవాడుగా బ్రహ్మ చెప్పబడుచున్నాడు.

(పైన చెప్పిన ప్రళయప్రకారము ననుసరించి నిర్గుణపరబ్రహ్మనుండి ప్రపంచవస్తువులన్నియు పుట్టి, అతనిలోనే లయమగుచున్నవి. కాని,మరలమరల పుట్టుచు, లయమగుటవలన ఆది, అంతము కలదైనను ప్రవాహరూపముగా ఉండుటవలన, కాలమునిర్ణయించుటకు వీలుపడనందున ప్రపంచము భగవంతునివలె అనాది అని చెప్పబడుచున్నది.)

“సర్వ భూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం |

కల్పక్షయే, పునస్తానికల్పాదౌ విశృ జామ్యహం |

ప్రకృతిం స్వామవిష్ఠభ్య విశృజామి పునః పునః. ||

భూతగ్రామ మిమం కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్ ||” (శ్రీమద్భగవద్గీత- 9 - 7, 8)

(కల్పాంతమందు సమస్తభూతములు నాయొక్క ప్రకృతిని పొందును - ప్రకృతిలో కలిసిపోవును. తిరిగి కల్ప ప్రారంభమున నేను వాటిని పైకి వదలివేయు చున్నాను - తిరిగి పుట్టినట్లు చేయుచున్నాను. నేను ప్రకృతిని అధిష్టించియుండి దానిలో లీనమైన భూతములన్నింటినీ మరల మరల పైకి విడిచి పెట్టుచుందును.ఈ ప్రకారముగా మరల మరల సృష్టి (ఆగక) జరుగుచున్నది కనుక, అది ప్రవాహరూపముగనుండుటచేత ఈ ప్రపంచము అనాది.)

“అవ్యక్తాత్ వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే |

రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞికే |

భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |

రాత్ర్యాగమే (అ) వశః పార్థ !ప్రభవంత్యహ రాగమే||“. (శ్రీమద్భగవద్గీత- 8 - 18, 19)

(సకల జీవులు చతుర్ముఖబ్రహ్మ, లేక, అవ్యక్తము అను పేరుగల - కంటికి కనబడని సూక్ష్మరూపములో నున్న -ప్రకృతి నుండి బ్రహ్మ పగటికాలములో వ్యక్తమగునట్లు బ్రహ్మలోనుండి పుట్టుచున్నవి. ఆ బ్రహ్మయొక్క రాత్రి కాలములో తిరిగి దానియందే లీనమగుచున్నవి.ఇట్లు సకల వస్తువులు వివశులయి చతుర్ముఖబ్రహ్మయొక్క పగటికాలమున పుట్టుచూ, రాత్రికాలమున అతనిలోనే లీనమగుచున్నవి.) (చూడుము: - ‘అనాదిసంసారము - 3’)

Transliteration

anādi sarvaprapaṃcō dṛśyatē, nityō anityō vā iti saṃśayatē. prapaṃcōpi dvividhaḥ - vidyā prapaṃcaśyā vidyāprapaṃcaścēti. vidyā prapaṃcasya nityatvaṃ siddhamēva, nityānaṃdacidvi lāsātmakatvāt, adhaca śuddha buddha mukta satyānaṃda svarūpatvācca.avidyā prapaṃcasya nityatva manityatvaṃ vā kathamiti - pravāhatō nityatvaṃ vadaṃti kē cana, praḷayādikaṃ śrūya mānatvāt anityatvaṃ vadaṃ tyanyē, ubhayanna bhavati. punaḥ kathamiti. saṃkōca vikāsātmaka mahā māyā vilāsātma ka ēva sarvō (a) pya vidyā vilāsatvāt. tatkadhamiti ? “ēkamēvā dvayaṃ brahma”, “nēha nānāsti kiṃcana”, tasmāt brahma vyatiriktaṃ sarvaṃ bādhita mēva. satyamēva paraṃbrahma, “satyaṃ jñānamanaṃtaṃ brahma”. tatassavilāsa mūlā vidyōpasaṃhāra kramaḥ kathamiti ? - - -vatsara śataṃ brahma mānēna brahmaṇaḥ paramāyuḥ pramāṇaṃ. tāvatkālastasya sthiti rucyatē, sthityaṃtē aṃḍavirāṭpuruṣaḥ svāṃśa hiraṇya garbha mabhyēti. hiraṇya garbhasya kāraṇaṃ paramātmānaṃ aṃḍaparipālakaṃ nārāyaṇamabhyēti. punarvatsara śataṃ tasya praḷayō bhavati. tadā jīvāssarvē prakṛtau pralīyaṃtē, praḷayēnasarvaṃ śūnyaṃ bhavati. tasya brahmaṇaḥ sthiti praḷayāvādi nārāyaṇasyāṃ śē nāvatīrṇasya ajāṃḍa paripālakasya mahāviṣṇō rahōrātī saṃjñikā, tasyasthityaṃ tē svāṃśaṃ mahā virāṭpuruṣa mabhyēti. tatassāvaraṇaṃ brahmāṃḍaṃ vināśamēti, brahmāṃḍāvaraṇaṃ vinaśyati taddhi viṣṇō ssvarūpaṃ. tasya tāvat praḷayō bhavati; praḷayē sarva śūnyaṃ bhavati. aṃḍaparipālaka mahā viṣṇōḥ sthitipraḷayē ādi virāṭpuruṣasya ahōrātri saṃjñikā. tasya sthityaṃtē ādi virāṭpuruṣaḥ svaṃśaṃ māyōpādhika nārāyaṇa mabhyēti. tasya praḷayē sarvaśūnyaṃ bhavati. tasya ādinārāyaṇasya sthityaṃtē tripādvibhūti - nārāyaṇasya icchāvaśāt nimēṣō jāyatē, tasmānmūlā vidyāṃḍasya sāvaraṇasya vilayō bhavati. tatassa vilāsā mūlā vidyā sarvakāryōpādhi samanvitā, sadasadvilakṣaṇā, nirvācya lakṣaṇa śūnyā virbhāvati rō bhāvātmikā nādyākhila karaṇānaṃta mahā māyā viśēṣaṇa viśēṣitā paramasūkṣma mūlakāraṇamavyaktaṃ viśati, avyaktaṃ viśēdbrahmaṇi; niriṃdhinō vaiśyānarō yathā. tasmā nmāyōpāthika ādinārāyaṇasta thā svasvarūpaṃ bhajati. sarvē jīvāḥ svasvarūpaṃ bhajaṃtē, yathā kusuma sānnidhyāt rakta sphaṭika patītaḥ, tada bhāvē śuddhasphaṭika pratītiḥ. brahmaṇō māyōpādhi vaśāt saguṇa paricchinnādi pratītiḥ, upādhi vilayānnirguṇa niravayavādi pratītiḥ”. (mahā nārāyāṇōpaniṣat)

(ī samasta prapaṃcamu anādivale - modalu, prāraṃbhamu lēnivānivale kanipiṃcucunnadi. idi nityamainadā? lēka anityamainadā? - anagā, ella kālamaṃdu iṭlē uṃḍunadā? lēka naśiṃci marala puṭṭunadā? ani saṃśayamu kalugunu. ī prapaṃcamu reṃḍuvidhamulugā unnadi: vidyā prapaṃcamani, avidyā prapaṃcamani. vidyāprapaṃcamu nityamainadē. eṃducētananagā, saccidānaṃdamula rūpamu galadaguṭacētanu, śuddha,buddha, mukta satyānaṃdasvarūpamu galadaguṭacētanu.avidyāprapaṃcamu nityamā? anityamā? idi pravāharūpamuvalana nityamu ani koṃdaṟi abhiprāyamu. praḷayamu saṃbhaviṃcunadi aguṭacēta anityamu ani koṃdaṟi abhiprāyamu. idi ī reṃḍunu kādu. saṃkōcavikāsātmakamaina mahāmāyā vilāsamē. adi eṭlaṃṭē, parabrahma anunadi okkaḍē, reṃḍava parabrahma kāni, iṃkēvidhamaina reṃḍava vastuvu kāni lēnidi. ī sṛṣṭilō anēka vastuvulu lēvu, unnadaṃtā okka parabrahmamē. aṃducēta brahmakānivastuvē lēdu. parabrahma ellapuḍū - mūḍukālamulaṃdu - uṃḍuvāḍu - parabrahma “satyaṃ, jñānamanaṃtaṃ brahma” ayina parabrahmayokka vilāsamunaku mūlamaina avidya lēkuṃḍuṭa yeṭlu? brahma kālamānamu prakāramu brahma yokka - caturmukha brahma yokka - paramāyuvu nūru saṃvatsaramulu.aṃtakālamu caturmukhabrahma uṃḍunu. caturmukha brahma āyurdāyamu ayipōyina tarvāta aṃḍavirāṭpuruṣuḍu tana aṃśa ayina hiraṇyagarbhunaṃdu līnamagunu. hiraṇyagarbhuni kāraṇamainaṭuvaṃṭinnī, aṃḍaparipālakuḍu ayinaṭuvaṃṭinnī nārāyaṇunipoṃdunu. marala nūru vatsaramulu praḷayamu kalugunu. appuḍu samasta jīvulu prakṛtilō līnamaguduru. ī praḷayamuvalana aṃtā śūnyamagunu. iṭlu brahmayokka sthiti praḷayamulu ādinārāyaṇuni aṃśavalana avatariṃcina brahmāṃḍa paripālakuḍagu mahāviṣṇuvuyokka - rātri, pagalu - ahōrātrulu - agunu. aṭṭi sthiti tarvāta tana aṃśayē ayina mahāvirāṭpuruṣunilō ēkamagunu. appuḍu āvaraṇamutōkūḍa brahmāṃḍamu naśiṃcunu. brahmāṃḍamuyokkāvaraṇa naśiṃcina adiyē viṣṇuvuyokka svasvarūpamu. appuḍu praḷayamu kalugunu.ī praḷayamulō aṃtā śūnyamagunu. brahmāṃḍaparipālakuḍaina mahāviṣṇuvu yokka sthiti praḷayamulu ādivirāṭpuruṣuni yokka ahōrātrulu.ā praḷayamu tarvāta ādivirāṭpuruṣuḍu tana aṃśa ayina māya upādhigāgala nārāyaṇuni ceṃdunu. ā praḷayamulō aṃtā śūnyamagunu. ī ādinārāyaṇuni aṃtamaṃdu tripādvibhūtiyagu nārāyaṇuni icchāvaśamuna nimēṣamagunu.dāni valana mūlāvidyāṃḍamu dāni āvaraṇatō layamagunu. aṭu tarvāta samasta kāryamulaku upādhitō kūḍina sadasadvilakṣaṇamulu galadinnī, iṭuvaṃṭidi ani nirvaciṃcuṭaku - nirṇayiṃci ceppuṭaku vīlu kānidi - āvirbhāva tirōbhāvamulukaladinnī,anādi mūlāvidyāyagu mahā māya okaṭē migili yuṃḍi, paramasūkṣmamu, mūlakāraṇamu ayina avyaktamulō kaliyunu. avyaktamu kāṣṭamulu lēni agnivale brahmalō kaliyunu. appuḍu māya upādhigāgala ādinārāyaṇuḍu svasvarūpamutō nuṃḍunu. jīvulaṃdaru svarūpamunu poṃduduru - bhagavaṃtuni rūpulē yaguduru - japākusumamulakudaggaragā unna sphaṭikaraktavarṇamu kaligiyuṃḍi, avi lēnapuḍu śuddhasphaṭikagā nuṃḍunaṭlugānē, brahmayokka māyōpādhivaśamuna saguṇarūpamunu māyōpādhilēni samayamuna nirguṇarūpamu, niravayavamagu rūpamunu galavāḍugā brahma ceppabaḍucunnāḍu.

(paina ceppina praḷayaprakāramu nanusariṃci nirguṇaparabrahmanuṃḍi prapaṃcavastuvulanniyu puṭṭi, atanilōnē layamagucunnavi. kāni,maralamarala puṭṭucu, layamaguṭavalana ādi, aṃtamu kaladainanu pravāharūpamugā uṃḍuṭavalana, kālamunirṇayiṃcuṭaku vīlupaḍanaṃduna prapaṃcamu bhagavaṃtunivale anādi ani ceppabaḍucunnadi.)

“sarva bhūtāni kauṃtēya prakṛtiṃ yāṃti māmikāṃ |

kalpakṣayē, punastānikalpādau viśṛ jāmyahaṃ |

prakṛtiṃ svāmaviṣṭhabhya viśṛjāmi punaḥ punaḥ. ||

bhūtagrāma mimaṃ kṛtsnamavaśaṃ prakṛtērvaśāt ||” (śrīmadbhagavadgīta- 9 - 7, 8)

(kalpāṃtamaṃdu samastabhūtamulu nāyokka prakṛtini poṃdunu - prakṛtilō kalisipōvunu. tirigi kalpa prāraṃbhamuna nēnu vāṭini paiki vadalivēyu cunnānu - tirigi puṭṭinaṭlu cēyucunnānu. nēnu prakṛtini adhiṣṭiṃciyuṃḍi dānilō līnamaina bhūtamulanniṃṭinī marala marala paiki viḍici peṭṭucuṃdunu.ī prakāramugā marala marala sṛṣṭi (āgaka) jarugucunnadi kanuka, adi pravāharūpamuganuṃḍuṭacēta ī prapaṃcamu anādi.)

“avyaktāt vyaktayaḥ sarvāḥ prabhavaṃtyaharāgamē |

rātryāgamē pralīyaṃtē tatraivāvyakta saṃjñikē |

bhūtagrāmaḥ sa ēvāyaṃ bhūtvā bhūtvā pralīyatē |

rātryāgamē (a) vaśaḥ pārtha !prabhavaṃtyaha rāgamē||“. (śrīmadbhagavadgīta- 8 - 18, 19)

(sakala jīvulu caturmukhabrahma, lēka, avyaktamu anu pērugala - kaṃṭiki kanabaḍani sūkṣmarūpamulō nunna -prakṛti nuṃḍi brahma pagaṭikālamulō vyaktamagunaṭlu brahmalōnuṃḍi puṭṭucunnavi. ā brahmayokka rātri kālamulō tirigi dāniyaṃdē līnamagucunnavi.iṭlu sakala vastuvulu vivaśulayi caturmukhabrahmayokka pagaṭikālamuna puṭṭucū, rātrikālamuna atanilōnē līnamagucunnavi.) (cūḍumu: - ‘anādisaṃsāramu - 3’)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.