← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనాదిసంసారము anādisaṃsāramu

Original — తెలుగు

సంసారమునకు ఆది (మొదలు) లేదు. జననమరణములు - జన్మ పరంపర - ప్రవాహరూపముగా గలది.

“సూర్యా చంద్రమసౌ ధాతా యధా పూర్వమకల్ప యత్|”

ఇతి చ మంత్రవర్ణః పూర్వకల్ప సద్భావం దర్శయతి. స్మృతౌ అపి సంసారస్య అనాదిత్వం ఉపలభ్యతే- “న రూపస్యేహ తధోప లభ్యతే, నాంతో, న చాదిర్నచ సంప్రతిష్టా ఇతి పురాణేచ అతీతానాం అనాగ తానాంచ కల్పానాం న పరిమాణమస్తి ఇతి స్థాపితం”

(శ్రీశంకరః - బ్రహ్మసూత్రభాష్యే)

(పూర్వమువలనే బ్రహ్మ సూర్యచంద్రులను సృష్టించెను. అని మంత్రము, అంతకుముందు కల్పమున్నదనిన్నీ, దానిలో సృష్టి ఏ ప్రకారము జరిగెనో ఈ కల్పమునందుకూడ ఆ ప్రకారముగనే సృష్టి జరిగినదని మంత్రము చెప్పుచున్నది. అనగా, కల్పము తర్వాత కల్పము సృష్టింపబడుచునే యుండును - ఒక కల్పము ప్రకారముగనే ప్రతి కల్పము జరుగుచుండును. ఈ ప్రకారముగానే ప్రవాహరూపముగా, అంతములేకుండా సృష్టి జరుగుచునే యుండును, సూర్యచంద్రులని చెప్పుటబట్టి సృష్టిలో మిగిలిన వస్తువులన్నియు చెప్పినట్లే - గ్రహించవలెను – “దివంచ పృద్వీంచ అంతరిక్షమధోస్వహా” (ఆకాశము, భూమి, అంతరిక్షము, అధోలోకములు అని కూడా చెప్పినట్లే గ్రహించవలెను.)

(స్మృతిలో - పురాణములో - కూడా సంసారము అనాది అని చెప్పబడినది - “దీనికి రూపములేదు, ఆది, అంతము, స్థితి లేదు -” అని పురాణములో చెప్పబడియుండుటవలన గడిచినకల్పములకు రాబోవు కల్పములకు పరిమాణము లేదు. సృష్టి జరుగుచునే ఉండును, ప్రళయము వచ్చుచునే యుండును. ఇది ప్రవాహరూపముగా జరుగుచుండుటవలన ఇది - సంసారమను ఈ ప్రపంచము - అనాది.) (చూడుము - ‘సృష్టి’, ‘ప్రపంచము’ ‘సంసారము’.)

(ప్రళయకాలమందు సమస్త వస్తువులు సూక్ష్మరూపముతో లయమై సృష్టికాలమందు తిరిగి స్థూలరూపమును పొందుచుండును. ఈ సృష్టి ప్రళయములకు అంతము లేనందున ఈ సంసారమను ప్రపంచము అనాది.)

(“In short by the time the Universe was condensed to something approaching the ‘Cosmic Egg’ (బ్రహ్మాండము) it would be all hydrogen again (జలతత్వము) (సూక్ష్మరూపములో జలము.). Following the formation of the ‘Cosmic Egg’ there would be another ‘Big Bang’ (బ్రహ్మాండ భేదనము) and the whole procedure would start over again. The result would be endlessly”pulsating universe”, or, “oscillating Universe”, - -. Such a Universe would be eternal in a real way, for, although catastrophic changes take place these are periodical. There is no clear beginning or ending, no steady irreversible change from one grand Universal structure to another quite different one. As the Universe is right now, so it will be again in an indefinite aeons in the future after it collapses and explodes again, and so it was an indefinite number of aeons in the past prior to its last Collapse and explosion “- - -” After the ‘big bang’, (బ్రహ్మాండ భేదనము), in other words, the Universe expands at a slowly decreasing rate until it comes to a momentary halt - - -.It then begins to fall together again, contracting for another such period of years till it is a ‘Cosmic Egg’ (బ్రహ్మాండము) again and there is a second ‘Big Bang’ (బ్రహ్మాండ భేదనము).) (Isac Asimov)

(పైన వివరించబడిన ఆధునిక శాస్త్రజ్ఞుల అభిప్రాయము ప్రకారము బ్రహ్మాండము పేలి, బ్రద్దలయి, దాని ముక్కలు విరజల్లుకుపోయి లోకములుగామారి, వృద్ధిని పొందిపొంది, కొన్ని సంవత్సరములతర్వాత ఒక్క క్షణమాత్రములో ప్రళయోన్ముఖము ప్రారంభముకాగా, అవన్నీ తరగి, తరగి, అన్నియు కలిసి, కలిసి మరల బ్రహ్మాండముగా మారి, మరల బ్రహ్మాండము పేలి, దాని ముక్కలు లోకములుగా మారి పెరిగి, పెరిగి, మరల ప్రళయోన్ముఖము అయి, తరిగి, తరిగి, ఒకదానితో నొకటి కలిసి, కలిసి మరల బ్రహ్మాండరూపము నొందుననిన్నీ, ఈ ప్రకారముగా ఆగకుండా ఈ సృష్టి ప్రళయములు ఈ ప్రపంచమునకు ఒకదాని తర్వాత ఒకటిగా -రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి వలె - జరుగుచునే యుండుననిన్నీ, దీనికి అంతము అనునది లేనట్లున్నదనిన్నీ స్పష్టముగా తెలియవచ్చుచున్నది. దీని ప్రారంభమెప్పుడో తెలియనందువలననూ, అనాది అనిన్నీ మధ్య మధ్య ప్రళయములు జరుగుచున్నను - ఇది ఆగని ప్రవాహరూపముగా ఉన్నందున నిత్యమనిన్నీ తెలియుచున్నది.)

ఈ విషయము శ్రీమద్భ్గవద్గీతలో ఈ క్రింద విధముగా చెప్పబడినది : -

“అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహ రాగమే |

రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞికే ||

భూతగ్రామః స ఏవాయం భూత్వా, భూత్వా ప్రలీయతే |

రాత్ర్యాగమే (అ) వశః పార్థ ప్రభవత్య హ రాగమే ||“. (శ్రీమద్భ్గవద్గీత - 8 - 18, 19)

పై శ్లోకమునకు వ్యాఖ్యానము : -

“స్వాపావస్థా విధేరస్య ప్రోక్తే హా వ్యక్త శబ్దతః |

విధేః ప్రభోధసమయే స్వాపావస్థాత్మన స్తతః |

శరీర విషయాద్యాత్మ వ్యక్తయోభోగభూమయః |

వ్యవహారక్షమత్వేన ప్రభవంత్య హరాగమే |

స్వాపకాలే విధేరాత్ర్యాగమే తత్రైవ కారణే |

అవ్యక్త సంజ్ఞకే లీయంతే స్యక్త యస్తదా |

ఏ వమాశు వినాశిత్వేప్యస్య నాస్తి పరిక్షయః |

సంసార దీర్ఘరోగస్య పంచ క్లేశైః పునః పునః |

జాయమానస్య త త్రైషాం సంసారే భ్రమతాం నృణాం |

అస్వాతంత్త్రా జ్జరామృత్యు జన్మాది దుఃఖ చక్రతః |

కదాపి నాస్తి విశ్రాంతివితి వైరాగ్య సిద్ధయే |

అకృతా భ్యాగమో దోషః కృతనాశ స్తధా పరః |

స్యాద్యదాదిమతీ సృష్టిర్జాయమానా వినశ్వరా |

బంధమోక్ష వ్యవస్థా యాః సాధకం శాస్త్రమప్యథ |

నిష్ఫలం స్యాద్యదా సృష్టిరాది మత్యేవ సం మతా |

ఏత ద్దోషాపనుత్త్యర్థం ప్రాహైవం శ్రీరమా పతిః||“. (గీతాభావప్రకాశము- 8 - 106 to 114)

“భూతగ్రామో య ఏవా సీ త్పూర్వకల్పే స ఏవహి |

చరా చరాత్మకో నాన్యో భూత్వా ప్రలీయతే |

నిశాగమే దినాదౌచస ఏవాయం ప్రజాయతే |

స్వావిద్యాది పరాధీనో భూతగ్రామో హ్యనేకథా |

అవిద్యా ది క్లేశమూలకర్మాశయ వశాదయం |

భూతగ్రామః పరాయత్తో జాయతే లీయతే పునః |

స ఏవేతి విరాగాది సిద్ధయే హరిణోచ్యతే||“. (గీతాభావప్రకాశము- 8 - 114 to 117)

(ఈ సందర్భములో అవ్యక్తమనగా చతుర్ముఖ బ్రహ్మ చెప్పబడినది. చహ్తుర్ముఖ బ్రహ్మకు కాలము పగలు వేయి యుగములు, రాత్రి వేయి యుగములు. ఈ చతుర్ముఖబ్రహ్మ యొక్క పగటికాలమందు వ్యవహరించుటకు సమర్ధతగల వస్తువులన్నియు (అంతకుముందు అట్టి అవస్థలో లేనివన్నియును) పుట్టుచున్నవి - చతుర్ముఖబ్రహ్మ సృష్టిచేయు కాలము పగలు. చతుర్ముఖబ్రహ్మయొక్క రాత్రికాలములో అవన్నియు అతనిలో లీనమై పోవుచున్నవి. ఇట్లుదీనికి అంతము అనునది లేదు. ఈ ప్రకారము తరుచు నశించుచు పంచక్లేశములవలన కలుగుచున్న సంసారమను ఈ దీర్ఘరోగమునకు పూర్తి వినాశములేదు. ఇట్టి సంసారమందు భ్రమించుచున్న నరులకు స్వాతంత్ర్యము లేనందువలన - కర్మవశులయినందువల్ల జననము, ముసలితనము, మృత్యువు మొదలగువాటివలన కలుగు దుఃఖము చక్రమువలె ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చుచు, మరల మరల వచ్చుచుండుటవలన దీనికి విశ్రాంతి లేదు - వైరాగ్యము సిద్ధించదు. ఈ సృష్టి ఇట్లు కలుగుచూ నశించుచూ పోవుననినచో శాస్త్రములవసరముండదు అను శంక నివృత్తికొఱకు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు చెప్పెను : - పూర్వ కల్పములో చరాచరరూపములైన భూతములు ఏవి ఉండెనో అవియే మరల మరల పుట్టి అవ్యక్తములో చతుర్ముఖబ్రహ్మలో- అతని రాత్రివేళ లీనమగుచున్నవి. అతనికి పగలు ప్రారంభము అయిన తోడనే అవియే పుట్టుచున్నవి. తన అవిద్య మొదలగువాటి - వశములో ఉండుటవలన అవిద్య మొదలగు క్లేశములు కారణములుగా గల కర్మలవశములోనుండునవి కనుక అవే భూతములు ఇతరుల ఆధీనములోనుండి మరల, మరలపుట్టుచు, లీనమై పోవుచుండును. ఇట్లు చెప్పుటవలన ముందు జన్మ తర్వాత జన్మకు కారణము - అయినను మొట్ట మొదటిజన్మకు కారణము కానరాదు - మొట్టమొదటి జన్మకు ముందు కర్మలేదు కనుక. అందుచేత దానికారణము - ఆది - లేదు, కాని తర్వాత జన్మలన్నింటికి కారణమున్నది. ఈ జన్మ పరంపర రూపమైన సంసారమునకు ‘ఆది’ లేదు - అందుచేత ఇది అనాది సంసారము.)

“రాగద్వేష మోహాః క్లేశాః, తేషాం వాసనాభిః ఆక్షిప్తాని కర్మాణి దర్మాధర్మ వ్యామిశ్రరూపాణి, తదపేక్షాతు అవిద్యా సుఖాది సర్గ వైచిత్ర్యహేతుః. తస్మాదవిద్యా సహకారిత్వే క్లేశకర్మణామనాది ప్రవాహో అంగీకర్తవ్యః ఇతి భావః. కించ, సృష్టేస్సావిత్వే ప్రధమ శరీరస్య ఉత్పత్తిర్న సంభవతి, హేత్వభావాత్, నచ కర్మహేతుః, శరీరాత్ప్రాక్ కర్మా సంభవాత్. తస్మాత్ కర్మశరీరయోః అన్యోన్యాశ్రయ పరిహారాయ సర్వై రేవ వాదిభిః సంసారస్య అనాది త్వం అంగీకార్యం” (భాష్యరత్న ప్రభా)

(రాగద్వేష మోహములు క్లేశములు. వాటియొక్క వాసన వలన పాపపుణ్యముల మిశ్రమరూపములైన కర్మలు కలుగుచున్నవి. వీటికి కారణము స్వర్గము మొదలగు సుఖములు కలుగుచేయునను ఆశ కలిగించు అవిద్య.అవిద్య అనాది కనుక దానివలన కలుగు సుఖ దుఃఖములు వాటికి కారణమైన కర్మలు ప్రవాహరూపముగా కలుగుచునే యుండును గనుక కర్మలు అనాదియే, అనగా, వాటివలనకలుగు సంసారము కూడ అనాదియే అని అంగీకరింపవలసినది. కాని, సృష్టి ఆదికలదియైన మొట్టమొదటి శరీరము పుట్టుట సంభవము కాదు - దానికి కారణమైన మరొక శరీరము లేకపోవుటవల్ల - కర్మచేయుటవలన దాని ఫలమనుభవించుటకు శరీరము కలుగును, శరీరము కలిగియుండుటవలన కర్మ చేయుట యగును. సృష్టి మొదటిలో మొదటి శరీరము ఉండవలెనన్న దానికికారణము అయిన మొదటి కర్మలేదు. చెట్టు ముందా, విత్తనము ముందా అనునట్లు. ఈ కర్మ శరీరములు అన్యోన్యాశ్రయములు - ఒకదానినొకటి ఆశ్రయించియున్నవి - ఒకదానినుండి ఒకటి కలుగుచున్నవి. దీనివలన అనవస్థా దోషము పట్టును. ఈ అనవస్థాదోషము పట్టకుండుటకు - అన్యోన్యాశ్రయదోషము పట్టకుండుటకు - పరిహరించుటకు - అన్ని మతములవారును ఈ జననమరణరూపమైన సంసారము, దాని కారణముతో, అనాదియని అంగీకరించతగినది.)

“ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి |” (శ్రీమద్భగవద్గీత- 15 - 19)

(ప్రకృతి, పురుషుడు - ఈ రెండునూ అనాదులే - పురుషుడు అనగా పురమందు శయనించువాడు - భగవంతుడు. ప్రకృతిలోని ప్రతి అణువులోను ఉన్నాడు - అందుచేత అది అతనికి శయనించు వస్తువు. ప్రకృతిలోని ప్రతివస్తువులోను, ప్రతివస్తువులోని ప్రతి అణువులోను ఉన్నాడు. కుమ్మరివాడు కుండలు చేయుటకు మట్టికావలెను - (Material). అట్లే బంగారపు పనివాడు బంగారపు ఆభరణములు చేయుటకు బంగారము కావలెను - అట్లే భగవంతుడు సృష్టి సృష్టిలోని సమస్త వస్తువులు చేయుటకు ప్రకృతిని సృష్టిచేసి దానిలో తన చిచ్ఛక్తిని నిలిపి, దానినే అనేకరూపములుగా మారునట్లు చేసెను - మొట్టమొదట చేయబడినది - ప్రధమం కృతం - కనుక ప్రకృతియని చెప్పబడినది. ఈ ప్రకృతి పురుష సం యోగమువలననే సృష్టిలోని వస్తువులు కలుగుచున్నవి - పుట్టుచున్నవి - (Energy and Matter).

“యాదత్సం జాయతే కిం చిత్సత్త్వం స్థావర జంగమం |

క్షేత్ర క్షేత్రజ్ఞ సం యోగాత్ తద్విద్ధి భరతర్షభ ||” (శ్రీమద్భగవద్గీత - 13 - 26)

(చరాచర రూపములగు సమస్త భూతములలోను ఏ చిన్నవస్తువు అయినను - సత్వము గలది - యున్నయడల అది క్షేత్రము క్షేత్రజ్ఞుడు - అను ఈ ఇద్దరి సంయోగము వలననే - కలియుట చేతనే - కలుగుచున్నది - దాని సృష్టి ప్రకృతి పురుషుల సంయోగము వలననే కలుగుచున్నది. శివుని అర్థనారీశ్వరుడు (సాంబుడు) గాను, శ్రీమహావిష్ణువుని వక్షస్థలమందు శ్రీమహాలక్ష్మి నిత్యము ఎడబాయక యుండునదిగాను – నిత్యనపాయిని గాను - పురాణములలో వర్ణించి యున్నారు. ఆధినిక శాస్త్రజ్ఞులు కూడ “creation is the result of the combination of matter and Energy అని చెప్పుచున్నారు - వారు చెప్పుచున్న matter = ప్రకృతి, Energy = సత్వమయుడగు భగవంతుడు. ఈ ప్రకృతి పురుషులిద్దరు అనాదులే కనుక వారి సంయోగము వలన కలిగిన ఈ ప్రపంచమను సంసారము కూడ అనాదియే.) (చూడుము - ‘సృష్టి’)

“న రూపమస్యేహ తధోప లభ్యతే, నాంతో నచాదిర్నఛ సం ప్రతిష్ఠా |

అశ్వత్థమేనం - - - ||” (శ్రీమద్భగవద్గీత - 15 - 3)

(సంసారము అస్వత్థవృక్షముతో పోల్చబడినది - దీనికి రూపముగాని, ఆదిగాని, అంతము గాని లేదు - ఈ సంసారవృక్షము కర్మములను పుణ్యపాపములతో నరులను బంధించి యుండినది - ఇది క్షణికముగాని కర్మఫలానుభవము కొఱకు మరల మరల కలుగుచుండును. అందుచేత పూర్తిగా నశించునదికాదు - ఇది ఎప్పుడు ప్రారంభమైనదో తెలియదు - అందుచేత అనాది. ప్రవాహరూపముగా ఉన్నది కనుక అంతములేనిది. ఒకప్పుడు ఉండునట్లు, మరియొకప్పుడు లేనట్లు ఉండుటవలన దీనిరూపము స్పష్టముగా తెలియదు.)

Transliteration

saṃsāramunaku ādi (modalu) lēdu. jananamaraṇamulu - janma paraṃpara - pravāharūpamugā galadi.

“sūryā caṃdramasau dhātā yadhā pūrvamakalpa yat|”

iti ca maṃtravarṇaḥ pūrvakalpa sadbhāvaṃ darśayati. smṛtau api saṃsārasya anāditvaṃ upalabhyatē- “na rūpasyēha tadhōpa labhyatē, nāṃtō, na cādirnaca saṃpratiṣṭā iti purāṇēca atītānāṃ anāga tānāṃca kalpānāṃ na parimāṇamasti iti sthāpitaṃ”

(śrīśaṃkaraḥ - brahmasūtrabhāṣyē)

(pūrvamuvalanē brahma sūryacaṃdrulanu sṛṣṭiṃcenu. ani maṃtramu, aṃtakumuṃdu kalpamunnadaninnī, dānilō sṛṣṭi ē prakāramu jarigenō ī kalpamunaṃdukūḍa ā prakāramuganē sṛṣṭi jariginadani maṃtramu ceppucunnadi. anagā, kalpamu tarvāta kalpamu sṛṣṭiṃpabaḍucunē yuṃḍunu - oka kalpamu prakāramuganē prati kalpamu jarugucuṃḍunu. ī prakāramugānē pravāharūpamugā, aṃtamulēkuṃḍā sṛṣṭi jarugucunē yuṃḍunu, sūryacaṃdrulani ceppuṭabaṭṭi sṛṣṭilō migilina vastuvulanniyu ceppinaṭlē - grahiṃcavalenu – “divaṃca pṛdvīṃca aṃtarikṣamadhōsvahā” (ākāśamu, bhūmi, aṃtarikṣamu, adhōlōkamulu ani kūḍā ceppinaṭlē grahiṃcavalenu.)

(smṛtilō - purāṇamulō - kūḍā saṃsāramu anādi ani ceppabaḍinadi - “dīniki rūpamulēdu, ādi, aṃtamu, sthiti lēdu -” ani purāṇamulō ceppabaḍiyuṃḍuṭavalana gaḍicinakalpamulaku rābōvu kalpamulaku parimāṇamu lēdu. sṛṣṭi jarugucunē uṃḍunu, praḷayamu vaccucunē yuṃḍunu. idi pravāharūpamugā jarugucuṃḍuṭavalana idi - saṃsāramanu ī prapaṃcamu - anādi.) (cūḍumu - ‘sṛṣṭi’, ‘prapaṃcamu’ ‘saṃsāramu’.)

(praḷayakālamaṃdu samasta vastuvulu sūkṣmarūpamutō layamai sṛṣṭikālamaṃdu tirigi sthūlarūpamunu poṃducuṃḍunu. ī sṛṣṭi praḷayamulaku aṃtamu lēnaṃduna ī saṃsāramanu prapaṃcamu anādi.)

(“In short by the time the Universe was condensed to something approaching the ‘Cosmic Egg’ (brahmāṃḍamu) it would be all hydrogen again (jalatatvamu) (sūkṣmarūpamulō jalamu.). Following the formation of the ‘Cosmic Egg’ there would be another ‘Big Bang’ (brahmāṃḍa bhēdanamu) and the whole procedure would start over again. The result would be endlessly”pulsating universe”, or, “oscillating Universe”, - -. Such a Universe would be eternal in a real way, for, although catastrophic changes take place these are periodical. There is no clear beginning or ending, no steady irreversible change from one grand Universal structure to another quite different one. As the Universe is right now, so it will be again in an indefinite aeons in the future after it collapses and explodes again, and so it was an indefinite number of aeons in the past prior to its last Collapse and explosion “- - -” After the ‘big bang’, (brahmāṃḍa bhēdanamu), in other words, the Universe expands at a slowly decreasing rate until it comes to a momentary halt - - -.It then begins to fall together again, contracting for another such period of years till it is a ‘Cosmic Egg’ (brahmāṃḍamu) again and there is a second ‘Big Bang’ (brahmāṃḍa bhēdanamu).) (Isac Asimov)

(paina vivariṃcabaḍina ādhunika śāstrajñula abhiprāyamu prakāramu brahmāṃḍamu pēli, braddalayi, dāni mukkalu virajallukupōyi lōkamulugāmāri, vṛddhini poṃdipoṃdi, konni saṃvatsaramulatarvāta okka kṣaṇamātramulō praḷayōnmukhamu prāraṃbhamukāgā, avannī taragi, taragi, anniyu kalisi, kalisi marala brahmāṃḍamugā māri, marala brahmāṃḍamu pēli, dāni mukkalu lōkamulugā māri perigi, perigi, marala praḷayōnmukhamu ayi, tarigi, tarigi, okadānitō nokaṭi kalisi, kalisi marala brahmāṃḍarūpamu noṃdunaninnī, ī prakāramugā āgakuṃḍā ī sṛṣṭi praḷayamulu ī prapaṃcamunaku okadāni tarvāta okaṭigā -rātri tarvāta pagalu, pagalu tarvāta rātri vale - jarugucunē yuṃḍunaninnī, dīniki aṃtamu anunadi lēnaṭlunnadaninnī spaṣṭamugā teliyavaccucunnadi. dīni prāraṃbhameppuḍō teliyanaṃduvalananū, anādi aninnī madhya madhya praḷayamulu jarugucunnanu - idi āgani pravāharūpamugā unnaṃduna nityamaninnī teliyucunnadi.)

ī viṣayamu śrīmadbhgavadgītalō ī kriṃda vidhamugā ceppabaḍinadi : -

“avyaktādvyaktayaḥ sarvāḥ prabhavaṃtyaha rāgamē |

rātryāgamē pralīyaṃtē tatraivāvyakta saṃjñikē ||

bhūtagrāmaḥ sa ēvāyaṃ bhūtvā, bhūtvā pralīyatē |

rātryāgamē (a) vaśaḥ pārtha prabhavatya ha rāgamē ||“. (śrīmadbhgavadgīta - 8 - 18, 19)

pai ślōkamunaku vyākhyānamu : -

“svāpāvasthā vidhērasya prōktē hā vyakta śabdataḥ |

vidhēḥ prabhōdhasamayē svāpāvasthātmana stataḥ |

śarīra viṣayādyātma vyaktayōbhōgabhūmayaḥ |

vyavahārakṣamatvēna prabhavaṃtya harāgamē |

svāpakālē vidhērātryāgamē tatraiva kāraṇē |

avyakta saṃjñakē līyaṃtē syakta yastadā |

ē vamāśu vināśitvēpyasya nāsti parikṣayaḥ |

saṃsāra dīrgharōgasya paṃca klēśaiḥ punaḥ punaḥ |

jāyamānasya ta traiṣāṃ saṃsārē bhramatāṃ nṛṇāṃ |

asvātaṃttrā jjarāmṛtyu janmādi duḥkha cakrataḥ |

kadāpi nāsti viśrāṃtiviti vairāgya siddhayē |

akṛtā bhyāgamō dōṣaḥ kṛtanāśa stadhā paraḥ |

syādyadādimatī sṛṣṭirjāyamānā vinaśvarā |

baṃdhamōkṣa vyavasthā yāḥ sādhakaṃ śāstramapyatha |

niṣphalaṃ syādyadā sṛṣṭirādi matyēva saṃ matā |

ēta ddōṣāpanuttyarthaṃ prāhaivaṃ śrīramā patiḥ||“. (gītābhāvaprakāśamu- 8 - 106 to 114)

“bhūtagrāmō ya ēvā sī tpūrvakalpē sa ēvahi |

carā carātmakō nānyō bhūtvā pralīyatē |

niśāgamē dinādaucasa ēvāyaṃ prajāyatē |

svāvidyādi parādhīnō bhūtagrāmō hyanēkathā |

avidyā di klēśamūlakarmāśaya vaśādayaṃ |

bhūtagrāmaḥ parāyattō jāyatē līyatē punaḥ |

sa ēvēti virāgādi siddhayē hariṇōcyatē||“. (gītābhāvaprakāśamu- 8 - 114 to 117)

(ī saṃdarbhamulō avyaktamanagā caturmukha brahma ceppabaḍinadi. cahturmukha brahmaku kālamu pagalu vēyi yugamulu, rātri vēyi yugamulu. ī caturmukhabrahma yokka pagaṭikālamaṃdu vyavahariṃcuṭaku samardhatagala vastuvulanniyu (aṃtakumuṃdu aṭṭi avasthalō lēnivanniyunu) puṭṭucunnavi - caturmukhabrahma sṛṣṭicēyu kālamu pagalu. caturmukhabrahmayokka rātrikālamulō avanniyu atanilō līnamai pōvucunnavi. iṭludīniki aṃtamu anunadi lēdu. ī prakāramu tarucu naśiṃcucu paṃcaklēśamulavalana kalugucunna saṃsāramanu ī dīrgharōgamunaku pūrti vināśamulēdu. iṭṭi saṃsāramaṃdu bhramiṃcucunna narulaku svātaṃtryamu lēnaṃduvalana - karmavaśulayinaṃduvalla jananamu, musalitanamu, mṛtyuvu modalaguvāṭivalana kalugu duḥkhamu cakramuvale okadāni tarvāta okaṭigā vaccucu, marala marala vaccucuṃḍuṭavalana dīniki viśrāṃti lēdu - vairāgyamu siddhiṃcadu. ī sṛṣṭi iṭlu kalugucū naśiṃcucū pōvunaninacō śāstramulavasaramuṃḍadu anu śaṃka nivṛttikoṟaku śrīkṛṣṇa bhagavānuḍu iṭlu ceppenu : - pūrva kalpamulō carācararūpamulaina bhūtamulu ēvi uṃḍenō aviyē marala marala puṭṭi avyaktamulō caturmukhabrahmalō- atani rātrivēḷa līnamagucunnavi. ataniki pagalu prāraṃbhamu ayina tōḍanē aviyē puṭṭucunnavi. tana avidya modalaguvāṭi - vaśamulō uṃḍuṭavalana avidya modalagu klēśamulu kāraṇamulugā gala karmalavaśamulōnuṃḍunavi kanuka avē bhūtamulu itarula ādhīnamulōnuṃḍi marala, maralapuṭṭucu, līnamai pōvucuṃḍunu. iṭlu ceppuṭavalana muṃdu janma tarvāta janmaku kāraṇamu - ayinanu moṭṭa modaṭijanmaku kāraṇamu kānarādu - moṭṭamodaṭi janmaku muṃdu karmalēdu kanuka. aṃducēta dānikāraṇamu - ādi - lēdu, kāni tarvāta janmalanniṃṭiki kāraṇamunnadi. ī janma paraṃpara rūpamaina saṃsāramunaku ‘ādi’ lēdu - aṃducēta idi anādi saṃsāramu.)

“rāgadvēṣa mōhāḥ klēśāḥ, tēṣāṃ vāsanābhiḥ ākṣiptāni karmāṇi darmādharma vyāmiśrarūpāṇi, tadapēkṣātu avidyā sukhādi sarga vaicitryahētuḥ. tasmādavidyā sahakāritvē klēśakarmaṇāmanādi pravāhō aṃgīkartavyaḥ iti bhāvaḥ. kiṃca, sṛṣṭēssāvitvē pradhama śarīrasya utpattirna saṃbhavati, hētvabhāvāt, naca karmahētuḥ, śarīrātprāk karmā saṃbhavāt. tasmāt karmaśarīrayōḥ anyōnyāśraya parihārāya sarvai rēva vādibhiḥ saṃsārasya anādi tvaṃ aṃgīkāryaṃ” (bhāṣyaratna prabhā)

(rāgadvēṣa mōhamulu klēśamulu. vāṭiyokka vāsana valana pāpapuṇyamula miśramarūpamulaina karmalu kalugucunnavi. vīṭiki kāraṇamu svargamu modalagu sukhamulu kalugucēyunanu āśa kaligiṃcu avidya.avidya anādi kanuka dānivalana kalugu sukha duḥkhamulu vāṭiki kāraṇamaina karmalu pravāharūpamugā kalugucunē yuṃḍunu ganuka karmalu anādiyē, anagā, vāṭivalanakalugu saṃsāramu kūḍa anādiyē ani aṃgīkariṃpavalasinadi. kāni, sṛṣṭi ādikaladiyaina moṭṭamodaṭi śarīramu puṭṭuṭa saṃbhavamu kādu - dāniki kāraṇamaina maroka śarīramu lēkapōvuṭavalla - karmacēyuṭavalana dāni phalamanubhaviṃcuṭaku śarīramu kalugunu, śarīramu kaligiyuṃḍuṭavalana karma cēyuṭa yagunu. sṛṣṭi modaṭilō modaṭi śarīramu uṃḍavalenanna dānikikāraṇamu ayina modaṭi karmalēdu. ceṭṭu muṃdā, vittanamu muṃdā anunaṭlu. ī karma śarīramulu anyōnyāśrayamulu - okadāninokaṭi āśrayiṃciyunnavi - okadāninuṃḍi okaṭi kalugucunnavi. dīnivalana anavasthā dōṣamu paṭṭunu. ī anavasthādōṣamu paṭṭakuṃḍuṭaku - anyōnyāśrayadōṣamu paṭṭakuṃḍuṭaku - parihariṃcuṭaku - anni matamulavārunu ī jananamaraṇarūpamaina saṃsāramu, dāni kāraṇamutō, anādiyani aṃgīkariṃcataginadi.)

“prakṛtiṃ puruṣaṃ caiva viddhyanādī ubhāvapi |” (śrīmadbhagavadgīta- 15 - 19)

(prakṛti, puruṣuḍu - ī reṃḍunū anādulē - puruṣuḍu anagā puramaṃdu śayaniṃcuvāḍu - bhagavaṃtuḍu. prakṛtilōni prati aṇuvulōnu unnāḍu - aṃducēta adi ataniki śayaniṃcu vastuvu. prakṛtilōni prativastuvulōnu, prativastuvulōni prati aṇuvulōnu unnāḍu. kummarivāḍu kuṃḍalu cēyuṭaku maṭṭikāvalenu - (Material). aṭlē baṃgārapu panivāḍu baṃgārapu ābharaṇamulu cēyuṭaku baṃgāramu kāvalenu - aṭlē bhagavaṃtuḍu sṛṣṭi sṛṣṭilōni samasta vastuvulu cēyuṭaku prakṛtini sṛṣṭicēsi dānilō tana cicchaktini nilipi, dāninē anēkarūpamulugā mārunaṭlu cēsenu - moṭṭamodaṭa cēyabaḍinadi - pradhamaṃ kṛtaṃ - kanuka prakṛtiyani ceppabaḍinadi. ī prakṛti puruṣa saṃ yōgamuvalananē sṛṣṭilōni vastuvulu kalugucunnavi - puṭṭucunnavi - (Energy and Matter).

“yādatsaṃ jāyatē kiṃ citsattvaṃ sthāvara jaṃgamaṃ |

kṣētra kṣētrajña saṃ yōgāt tadviddhi bharatarṣabha ||” (śrīmadbhagavadgīta - 13 - 26)

(carācara rūpamulagu samasta bhūtamulalōnu ē cinnavastuvu ayinanu - satvamu galadi - yunnayaḍala adi kṣētramu kṣētrajñuḍu - anu ī iddari saṃyōgamu valananē - kaliyuṭa cētanē - kalugucunnadi - dāni sṛṣṭi prakṛti puruṣula saṃyōgamu valananē kalugucunnadi. śivuni arthanārīśvaruḍu (sāṃbuḍu) gānu, śrīmahāviṣṇuvuni vakṣasthalamaṃdu śrīmahālakṣmi nityamu eḍabāyaka yuṃḍunadigānu – nityanapāyini gānu - purāṇamulalō varṇiṃci yunnāru. ādhinika śāstrajñulu kūḍa “creation is the result of the combination of matter and Energy ani ceppucunnāru - vāru ceppucunna matter = prakṛti, Energy = satvamayuḍagu bhagavaṃtuḍu. ī prakṛti puruṣuliddaru anādulē kanuka vāri saṃyōgamu valana kaligina ī prapaṃcamanu saṃsāramu kūḍa anādiyē.) (cūḍumu - ‘sṛṣṭi’)

“na rūpamasyēha tadhōpa labhyatē, nāṃtō nacādirnacha saṃ pratiṣṭhā |

aśvatthamēnaṃ - - - ||” (śrīmadbhagavadgīta - 15 - 3)

(saṃsāramu asvatthavṛkṣamutō pōlcabaḍinadi - dīniki rūpamugāni, ādigāni, aṃtamu gāni lēdu - ī saṃsāravṛkṣamu karmamulanu puṇyapāpamulatō narulanu baṃdhiṃci yuṃḍinadi - idi kṣaṇikamugāni karmaphalānubhavamu koṟaku marala marala kalugucuṃḍunu. aṃducēta pūrtigā naśiṃcunadikādu - idi eppuḍu prāraṃbhamainadō teliyadu - aṃducēta anādi. pravāharūpamugā unnadi kanuka aṃtamulēnidi. okappuḍu uṃḍunaṭlu, mariyokappuḍu lēnaṭlu uṃḍuṭavalana dīnirūpamu spaṣṭamugā teliyadu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.