హృదయస్థానమున
నుండు నాడీచక్రము, వాయువునకు నివాసమైనది.
తంత్రశాస్త్రే ప్రసిద్ధం హృదయస్థితం
సుషుమ్నా మధ్యస్థం ద్వాదశదళపద్మం.
(తంత్ర శాస్త్రములో
చెప్పబడిన పద్మము, సుషుమ్నానాడి మధ్యనుండునది, హృదయమందున్నది.)
శబ్ద బ్రహ్మమయః
శబ్దో అనాహతో యత్రదృశ్యతే అనాహితాఖ్యం తత్ పద్మం మునిభిః పరికీర్తితం.
(కొట్టబడకయే
శరీరములో ఎక్కడ శబ్దము వినబడుచున్నదో అది అనాహతమను పేరుగల పద్మము.)
(క,
ఖ, గ, ఘ, ఙ, చ ఛ, జ, ఝ, ఞ, ట, ఠ, అను పండ్రెండు అక్షరములు దళములు - రేకులుగాగల
పద్మము - పద్మమువలె ఉండునది, త్వగింద్రియమునకు కారణమైనది -” శరీర చర్మమునకు విషయములైన శీత,
ఉష్ణ, మిశ్రోష్ణ, ఉష్ణమిశ్రశీత, మృదు, కఠిన స్పర్శంబులారును, అల్ప, అధికంబులచేత
పండ్రెండువిధములైన స్పర్శంబులే పండ్రెండు దళములుగా గలది.
“హృత్పద్మే విలయార్కకోటి
సదృశం కాఠాంత వర్ణో జ్వలే |
ప్రాణాంత
ప్రణవాంతరే ప్రవిలసద్దోర్బాణ పీఠాంతరే |
- - - వాసం - - - రామం భజే తారకం
||“. (శ్రీకృష్ణకర్ణామృతం- 2 - 56)
(క
కారము మొదలు ఠ కారము ఆఖరుగా గల వర్ణములు గల - అవే దళములుగా గల - రెండు బాహువుల
మధ్యనున్న హృదయపద్మమందు నివసించియుండు తారకరాముని భజించెదను.)
దీనికి రుద్రుడు అధి దేవత.
Transliteration
hṛdayasthānamuna
nuṃḍu nāḍīcakramu, vāyuvunaku nivāsamainadi.
taṃtraśāstrē
prasiddhaṃ hṛdayasthitaṃ suṣumnā madhyasthaṃ dvādaśadaḷapadmaṃ.
(taṃtra
śāstramulō ceppabaḍina padmamu, suṣumnānāḍi madhyanuṃḍunadi,
hṛdayamaṃdunnadi.)
śabda
brahmamayaḥ śabdō anāhatō yatradṛśyatē anāhitākhyaṃ tat padmaṃ munibhiḥ
parikīrtitaṃ.
(koṭṭabaḍakayē
śarīramulō ekkaḍa śabdamu vinabaḍucunnadō adi anāhatamanu pērugala
padmamu.)
(ka,
kha, ga, gha, ṅa, ca cha, ja, jha, ña, ṭa, ṭha, anu paṃḍreṃḍu akṣaramulu
daḷamulu - rēkulugāgala padmamu - padmamuvale uṃḍunadi,
tvagiṃdriyamunaku kāraṇamainadi -” śarīra carmamunaku viṣayamulaina
śīta, uṣṇa, miśrōṣṇa, uṣṇamiśraśīta, mṛdu, kaṭhina sparśaṃbulārunu,
alpa, adhikaṃbulacēta paṃḍreṃḍuvidhamulaina sparśaṃbulē paṃḍreṃḍu
daḷamulugā galadi.
“hṛtpadmē
vilayārkakōṭi sadṛśaṃ kāṭhāṃta varṇō jvalē |
prāṇāṃta
praṇavāṃtarē pravilasaddōrbāṇa pīṭhāṃtarē |
- - -
vāsaṃ - - - rāmaṃ bhajē tārakaṃ ||“. (śrīkṛṣṇakarṇāmṛtaṃ- 2 - 56)
(ka
kāramu modalu ṭha kāramu ākharugā gala varṇamulu gala - avē daḷamulugā
gala - reṃḍu bāhuvula madhyanunna hṛdayapadmamaṃdu nivasiṃciyuṃḍu
tārakarāmuni bhajiṃcedanu.)
dīniki rudruḍu adhi
dēvata.
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.