← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనన్య మనస్కులు ananya manaskulu

Original — తెలుగు

మఱియొకదానియందు లగ్నము కాక - ఇతర వ్యాపకము లేక ఒకే ధ్యేయము నందు నిలకడ కలిగియున్నచో అది అనన్య మనస్సు - అట్టి మనస్సు కలవారు అనన్య మనస్కులు.

ఏకాగ్రమనస్సు కలవారు.

భగవంతునిమీద తప్ప మరియొకదానియందు మనస్సు లేనివారు.

“బహు జన్మార్జితైః పుణ్యైర్యేషాం ధీ సంస్కృతా భవేత్ |

కామై రనభి భూతాస్తే మహాత్మానో గుణా కరాః |

అభయం సత్వ సంశుద్ధి రిత్యాది ప్రకృతిం శ్రితాః |

అత ఏవ నచాన్యస్మిన్ మనో యేషాం హి గోచరే ||.” (గీతాభావప్రకాశము- 9 - 96, 97)

(అనేక జన్మములలో ఆర్జించిన పుణ్యముచేత ఎవరి బుద్ధి సత్వవృద్ధి కలిగి పరిపక్వమగునో, వారు కోరికలు లేక సద్గుణములు కలిగియుండువారు, దైవీ ప్రకృతి గలవారు. అందుచేత అట్టివారు భగవంతుని యందు తప్ప మరిదేనియందును మనస్సు లేనివారు - అనన్య మనస్కులు.)

Transliteration

maṟiyokadāniyaṃdu lagnamu kāka - itara vyāpakamu lēka okē dhyēyamu naṃdu nilakaḍa kaligiyunnacō adi ananya manassu - aṭṭi manassu kalavāru ananya manaskulu.

ēkāgramanassu kalavāru.

bhagavaṃtunimīda tappa mariyokadāniyaṃdu manassu lēnivāru.

“bahu janmārjitaiḥ puṇyairyēṣāṃ dhī saṃskṛtā bhavēt |

kāmai ranabhi bhūtāstē mahātmānō guṇā karāḥ |

abhayaṃ satva saṃśuddhi rityādi prakṛtiṃ śritāḥ |

ata ēva nacānyasmin manō yēṣāṃ hi gōcarē ||.” (gītābhāvaprakāśamu- 9 - 96, 97)

(anēka janmamulalō ārjiṃcina puṇyamucēta evari buddhi satvavṛddhi kaligi paripakvamagunō, vāru kōrikalu lēka sadguṇamulu kaligiyuṃḍuvāru, daivī prakṛti galavāru. aṃducēta aṭṭivāru bhagavaṃtuni yaṃdu tappa maridēniyaṃdunu manassu lēnivāru - ananya manaskulu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.