శరీరము, ఇంద్రియములు, మనస్సు,
బుద్ధి.
దేహము
అన్నమువలన కలిగినది - అన్న పరిమాణము. అందుచేత వినాశి అగుటవలన ఆత్మ కాదు. బుద్ధి,
ఇంద్రియములు, మనస్సు, అన్నపరిమాణములే - మార్పులే. అందుచేత అవి ఆత్మ కావు.
“శ్రుతి పరిప్రాపితో (అ)
యమర్ధః అనాత్మా బుద్ధ్యాది దేహాంత” ఇతి (నైష్కర్మ్యసిద్ధి)
(బుద్ధిమొదలు
దేహమువరకు గల వస్తువులన్నియు అనగా, బుద్ధి, మనస్సు, ఇంద్రియములు. దేహము ఆత్మ కావని శ్రుతి
చెప్పుచున్నది - (ఛాందోగ్యోపనిషత్తు)
“శరీరేంద్రియ
మనోబుద్ధిష్వనాత్మసు ఆత్మేతి నిస్సంధిబంధనం, మిధ్యాజ్ఞానం” అజ్ఞానం. (నైష్కర్మ్యసిద్ధి)
(శరీరము,
ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అను అనాత్మవస్తువులందు ఆత్మ అని తలంచుటే మిధ్యాజ్ఞానము –
అజ్ఞానము.)
“దృశ్యత్వాత్
ఘటవద్దేహో దేహ విచ్చేంద్రి యాణ్యపి మనశ్చేంద్రియవత్ జ్ఞేయం, మనోవన్నిశ్చ యాదిమత్ |
తధా కార్య కారణాగమాపాయి
విభాగసాక్షిత్వేనాపి |” (నైష్కర్మ్యసిద్ధి- 3 - 54, 125)
(శరీరము
దృశ్యమైనందున ఘటము వంటిది. ఇంద్రియములు దేహము వంటివి, మనస్సు ఇంద్రియముల వంటిది, బుద్ధి
మనస్సు వంటిది. ఘటము ఆత్మ కాదు - ఆ ప్రకారము గానే శరీరము మొదలగునవి దృశ్యము లైనవి జడములు;
స్యయంప్రకాశములు కావు; కనుక ఇవి అనాత్మలు - సమస్తమైన ఘటపటాది కార్యములు మృత్పిండాది కార్యములు,
ఉత్పత్తి వినాశములు కలవై, జడములై స్వయం ప్రకాశములు కానందున అనాత్మలు.) దేహాదులవలె అహంకారము
దృశ్యముగా నున్నందున జడమై యుండుటవలన, స్వయం ప్రకాశము కానందున అనాత్మయే. అనాత్మలగు
ఘటాదులందు దృశ్యత్వము, ఉత్పత్తి వినాశములు ముఖ్య ధర్మములు - ఈ ధర్మములు శరీరేంద్రియ
మనోబుద్ధుల యందు గలవు గాన ఆ శరీరేంద్రి యాదులు అనాత్మలే. అహంకారము కూడ దృశ్వత్వాది గుణములు
గలదియై యున్నందుననూ, ఘటాదులవలె మఱియొక దానిచేత ప్రకాశింపబడుచున్నందున అనాత్మయే.
Transliteration
śarīramu,
iṃdriyamulu, manassu, buddhi.
dēhamu
annamuvalana kaliginadi - anna parimāṇamu. aṃducēta vināśi aguṭavalana
ātma kādu. buddhi, iṃdriyamulu, manassu, annaparimāṇamulē - mārpulē.
aṃducēta avi ātma kāvu.
“śruti
pariprāpitō (a) yamardhaḥ anātmā buddhyādi dēhāṃta” iti
(naiṣkarmyasiddhi)
(buddhimodalu
dēhamuvaraku gala vastuvulanniyu anagā, buddhi, manassu, iṃdriyamulu.
dēhamu ātma kāvani śruti ceppucunnadi - (chāṃdōgyōpaniṣattu)
“śarīrēṃdriya
manōbuddhiṣvanātmasu ātmēti nissaṃdhibaṃdhanaṃ, midhyājñānaṃ” ajñānaṃ.
(naiṣkarmyasiddhi)
(śarīramu,
iṃdriyamulu, manassu, buddhi anu anātmavastuvulaṃdu ātma ani talaṃcuṭē
midhyājñānamu – ajñānamu.)
“dṛśyatvāt
ghaṭavaddēhō dēha viccēṃdri yāṇyapi manaścēṃdriyavat jñēyaṃ,
manōvanniśca yādimat |
tadhā
kārya kāraṇāgamāpāyi vibhāgasākṣitvēnāpi |” (naiṣkarmyasiddhi- 3 - 54,
125)
(śarīramu
dṛśyamainaṃduna ghaṭamu vaṃṭidi. iṃdriyamulu dēhamu vaṃṭivi, manassu
iṃdriyamula vaṃṭidi, buddhi manassu vaṃṭidi. ghaṭamu ātma kādu - ā
prakāramu gānē śarīramu modalagunavi dṛśyamu lainavi jaḍamulu;
syayaṃprakāśamulu kāvu; kanuka ivi anātmalu - samastamaina ghaṭapaṭādi
kāryamulu mṛtpiṃḍādi kāryamulu, utpatti vināśamulu kalavai, jaḍamulai
svayaṃ prakāśamulu kānaṃduna anātmalu.) dēhādulavale ahaṃkāramu
dṛśyamugā nunnaṃduna jaḍamai yuṃḍuṭavalana, svayaṃ prakāśamu kānaṃduna
anātmayē. anātmalagu ghaṭādulaṃdu dṛśyatvamu, utpatti vināśamulu mukhya
dharmamulu - ī dharmamulu śarīrēṃdriya manōbuddhula yaṃdu galavu gāna ā
śarīrēṃdri yādulu anātmalē. ahaṃkāramu kūḍa dṛśvatvādi guṇamulu
galadiyai yunnaṃdunanū, ghaṭādulavale maṟiyoka dānicēta
prakāśiṃpabaḍucunnaṃduna anātmayē.
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.