ముగింపు లేకపోవుట. (No
finality.)
“గ్రహకాదే
రన్య సాక్షి పూర్వకత్వ సిద్ధేఃస్వ సాక్షిణోపి అన్యసాక్షి పూర్వకత్వా దనవస్థా”. (నైష్కర్మ్యసిద్ధి - 2 -
230)
(అన్నింటినీ
చూచుచున్న ద్రష్ట సాక్షి చేత చూడబడుచున్నాడు అని చెప్పినచో ఆ సాక్షి ఇంకొక సాక్షిచేత చూడబడుచున్నాడు
అని చెప్ప వలసి వచ్చును. ఆ సాక్షిని ఇంకొక సాక్షి చూచుచున్నాడు. ఆ ఇంకొక సాక్షిని వేఱొక సాక్షి
చూచుచున్నాడు. ఇట్లు దీనికి అంతముండదు. ఇట్లు చెప్పుట వలన అనవస్థాదోషము పట్టును.
(Logical fallacy.)
ఈ
సృష్టిలో ఉన్న వస్తువులన్నీ కార్యములే - ప్రతీ వస్తువు ఇంకొక వస్తువులోనుండి పుట్టినదే.
పుట్టినవస్తువు కార్యము. అది యే వస్తువునుండి పుట్టినదో అది దానికి కారణము. ఆ కారణవస్తువుకూడ
ఇంకొక వస్తువునుండి పుట్టినదే. అందుచేత మొదటి కారణవస్తువుకూడ కార్యమే. ఆ రెండవ
కారణవస్తువుకూడా ఇంకొక వస్తువులోనుండి పుట్టినదే. దీనిని బట్టి ప్రతి కార్యవస్తువునకు ఒక
కారణముండవలెను -
“కారణేన
వినా కార్యం నాస్తి” - కారణము లేనిదే కార్యముండదు -.ఈ ప్రకారముగా చూచిన యెడల ఈ చరాచరరూప
వస్తువులన్నీయు పంచభూతములకలయికవలన పుట్టినవి - అనగా, ఈ వస్తువులన్నింటికీ పంచభూతములు
కారణము. ఆ పంచభూతములు ఒకదానిలోనుండి ఒకటి పుట్టినవి - “ఆకాశద్వాయుః, వాయోరగ్నిః అగ్నేరాపః,
అవోభ్యః పృధివీ” ఆకాశములోనుండి వాయువు,వాయువులోనుండి అగ్ని, అగ్నిలోనుండి జలము, జలములోనుండి
భూమి పుట్టినవి. అందుచేత ఈ పంచభూతములూ కార్యములే. ఆకాశము అహంకారమునుండి పుట్టినది.
అహంకారము మహత్తత్త్వమునుండి పుట్టినది. మహత్తత్త్వము మాయతోకూడిన - ప్రకృతితో కలిసియున్న
పరబ్రహ్మనుండి పుట్టినది.. ఈ ప్రకారముగా భగవంతుడు సృష్టిలో ఉన్న అన్ని వస్తువులకు - కారణ
కార్యములకు - మూలకారణము. “యచ్చాపి సర్వ భూతనాం బీజం తదహ మర్జున”.
(శ్రీమద్భగవద్గీత- 10 -
39)
(సమస్త
భూతములకు - జన్మ కలిగిన సమస్త వస్తువులకు మూలబీజము - కారణము - నేను) అని శ్రీమద్భగవద్గీతలో
శ్రీకృష్ణభగవానుడు చెప్పియున్నాడు. పైన చెప్పిన “కారణేన వినా కార్యం నాస్తి” అను సిద్ధాంతము ప్రకారము
పరబ్రహ్మకు - పరమాత్మకు, భగవంతునికి - కూడా కారణముండవలయును.- అనగా, పరబ్రహ్మ ఇంకొక
వస్తువులోనుండి పుట్టియుండవలయును - అతనికి జన్మ ఉండవలయును. ఆ కారణవస్తువునకు ఇంకొక
కారణముండవలయును. ఈ ప్రకారముగా చెప్పిన దానికి అంతము ఉండదు - ఇదియే అనవస్థాదోషము - ఎక్కడో
ఒకచోట పరిమితి యుండవలయును. భగవంతుడు తాను సృష్టించిన కార్యవస్తువులవలె కార్యవస్తువు కాడు,
తనకు కారణమగు వస్తువు లేదు, జన్మ లేదు - ” న మే విదుః సురగుణాః ప్రభవం న మహర్షయః”
(శ్రీమద్భగవద్గీత - 10 - 2)
(దేవతలకుగాని,
మహర్షులకుగాని నా జననము తెలియదు -.) “యోమామ జమనాదిం చ వేత్తి లోక మహేశ్వరం”
(శ్రీమద్భగవద్గీత - 10
- 3)
(నాకు జన్మ లేదు - ఆది అనగా
జన్మ, మొదలు - మొదలు లేదు, కారణములేదు.)
(అందుచేత
పరమాత్మ అన్నింటికి మూలకారణమైనవాడైనప్పటికీ, తనకు మట్టుకు ఏదీ కారణములేదు.) ఈ ప్రకారముగా
చెప్పుటచేతకారణకార్యములకు సాధారణముగా పట్టు అనవస్థాదోషము పట్టదు. భగవంతునికి జన్మ అనునది ఉంటే
- భగవంతుడు కార్య వస్తువే అయి యుండినయడల ఆ కారణవస్తువునికూడ క్రాంత దర్శనులగు మహాత్ములు
చూచియే యుందురు. అట్లు చెప్పి యుండలేదు. సాక్షాత్తు శ్రీకృష్ణభగవానుడే తనకి జన్మ లేదని చెప్పుటవలన
ఈ కార్యకారణ పరంపరకు అవధికలిగి ఈ అనవస్థాదోషము కలుగకపోయినది. ఈ విషయము ఇంకొక రీతిగా
చెప్పవచ్చును. చెట్టు విత్తనములోనుండిపుట్టును, చెట్టు కార్యము, విత్తనము కారణము. ఆ
కారణవిత్తనము ఇంతకుముందు చెట్టునుండి పుట్టినది. ఆ చెట్టు దానికి కారణము. ఈ రీతిగా అయిన యడల
మొదటి విత్తనమునకు కారణమేమిటి? ఈ ప్రకారము వెనుకకు వెనుకకు వెళ్ళినకొలది కార్య కారణములు
అనంతములుగా ఉండును. ఎక్కడో ఒకచోట హద్దు - మితి - ఉండవలెను. ఈ సృష్టిలో కారణ
కార్యవస్తువులన్నింటికి మూలకారణము పరమాత్మయే కనుక అతనే ఈ అనవస్థాదోషమునకు ఆవధి. భగవంతుని
సృష్టికి ముందు భగవంతుడు ఒక్కడే తప్ప మరియేవస్తువు లేదు అని శ్రుతి చెప్పుచున్నది. అందుచేత ఈ
అనవస్థాదోషము భగవంతునికి వర్తించనిది. ఈ అనవస్థాదోషము తార్కికము - తర్కమువలన భగవంతుని
తెలుసుకొనలేము - అందుచేత అట్టితార్కికసిద్ధాంతము భగవంతునియందు వర్తింపదు - తర్కములో కూడ
“(Every rule has an exception)” అని ఉన్నది. తర్కము ప్రకృతికి సంబంధించినది,
భగవంతుడు ప్రకృతికి అతీతుడు. అందుచేత ప్రాకృతికసిద్ధాంతములు అతనికివర్తింపవు.
Transliteration
mugiṃpu
lēkapōvuṭa. (No finality.)
“grahakādē
ranya sākṣi pūrvakatva siddhēḥsva sākṣiṇōpi anyasākṣi pūrvakatvā
danavasthā”. (naiṣkarmyasiddhi - 2 - 230)
(anniṃṭinī
cūcucunna draṣṭa sākṣi cēta cūḍabaḍucunnāḍu ani ceppinacō ā sākṣi iṃkoka
sākṣicēta cūḍabaḍucunnāḍu ani ceppa valasi vaccunu. ā sākṣini iṃkoka
sākṣi cūcucunnāḍu. ā iṃkoka sākṣini vēṟoka sākṣi cūcucunnāḍu. iṭlu
dīniki aṃtamuṃḍadu. iṭlu ceppuṭa valana anavasthādōṣamu paṭṭunu.
(Logical fallacy.)
ī
sṛṣṭilō unna vastuvulannī kāryamulē - pratī vastuvu iṃkoka
vastuvulōnuṃḍi puṭṭinadē. puṭṭinavastuvu kāryamu. adi yē vastuvunuṃḍi
puṭṭinadō adi dāniki kāraṇamu. ā kāraṇavastuvukūḍa iṃkoka vastuvunuṃḍi
puṭṭinadē. aṃducēta modaṭi kāraṇavastuvukūḍa kāryamē. ā reṃḍava
kāraṇavastuvukūḍā iṃkoka vastuvulōnuṃḍi puṭṭinadē. dīnini baṭṭi prati
kāryavastuvunaku oka kāraṇamuṃḍavalenu -
“kāraṇēna
vinā kāryaṃ nāsti” - kāraṇamu lēnidē kāryamuṃḍadu -.ī prakāramugā cūcina
yeḍala ī carācararūpa vastuvulannīyu paṃcabhūtamulakalayikavalana
puṭṭinavi - anagā, ī vastuvulanniṃṭikī paṃcabhūtamulu kāraṇamu. ā
paṃcabhūtamulu okadānilōnuṃḍi okaṭi puṭṭinavi - “ākāśadvāyuḥ, vāyōragniḥ
agnērāpaḥ, avōbhyaḥ pṛdhivī” ākāśamulōnuṃḍi vāyuvu,vāyuvulōnuṃḍi agni,
agnilōnuṃḍi jalamu, jalamulōnuṃḍi bhūmi puṭṭinavi. aṃducēta ī
paṃcabhūtamulū kāryamulē. ākāśamu ahaṃkāramunuṃḍi puṭṭinadi. ahaṃkāramu
mahattattvamunuṃḍi puṭṭinadi. mahattattvamu māyatōkūḍina - prakṛtitō
kalisiyunna parabrahmanuṃḍi puṭṭinadi.. ī prakāramugā bhagavaṃtuḍu
sṛṣṭilō unna anni vastuvulaku - kāraṇa kāryamulaku - mūlakāraṇamu.
“yaccāpi sarva bhūtanāṃ bījaṃ tadaha marjuna”.
(śrīmadbhagavadgīta- 10 - 39)
(samasta
bhūtamulaku - janma kaligina samasta vastuvulaku mūlabījamu - kāraṇamu -
nēnu) ani śrīmadbhagavadgītalō śrīkṛṣṇabhagavānuḍu ceppiyunnāḍu. paina
ceppina “kāraṇēna vinā kāryaṃ nāsti” anu siddhāṃtamu prakāramu
parabrahmaku - paramātmaku, bhagavaṃtuniki - kūḍā kāraṇamuṃḍavalayunu.-
anagā, parabrahma iṃkoka vastuvulōnuṃḍi puṭṭiyuṃḍavalayunu - ataniki
janma uṃḍavalayunu. ā kāraṇavastuvunaku iṃkoka kāraṇamuṃḍavalayunu. ī
prakāramugā ceppina dāniki aṃtamu uṃḍadu - idiyē anavasthādōṣamu -
ekkaḍō okacōṭa parimiti yuṃḍavalayunu. bhagavaṃtuḍu tānu sṛṣṭiṃcina
kāryavastuvulavale kāryavastuvu kāḍu, tanaku kāraṇamagu vastuvu lēdu,
janma lēdu - ” na mē viduḥ suraguṇāḥ prabhavaṃ na maharṣayaḥ”
(śrīmadbhagavadgīta - 10 - 2)
(dēvatalakugāni,
maharṣulakugāni nā jananamu teliyadu -.) “yōmāma jamanādiṃ ca vētti lōka
mahēśvaraṃ”
(śrīmadbhagavadgīta - 10 - 3)
(nāku
janma lēdu - ādi anagā janma, modalu - modalu lēdu, kāraṇamulēdu.)
(aṃducēta
paramātma anniṃṭiki mūlakāraṇamainavāḍainappaṭikī, tanaku maṭṭuku ēdī
kāraṇamulēdu.) ī prakāramugā ceppuṭacētakāraṇakāryamulaku sādhāraṇamugā
paṭṭu anavasthādōṣamu paṭṭadu. bhagavaṃtuniki janma anunadi uṃṭē -
bhagavaṃtuḍu kārya vastuvē ayi yuṃḍinayaḍala ā kāraṇavastuvunikūḍa
krāṃta darśanulagu mahātmulu cūciyē yuṃduru. aṭlu ceppi yuṃḍalēdu.
sākṣāttu śrīkṛṣṇabhagavānuḍē tanaki janma lēdani ceppuṭavalana ī
kāryakāraṇa paraṃparaku avadhikaligi ī anavasthādōṣamu kalugakapōyinadi.
ī viṣayamu iṃkoka rītigā ceppavaccunu. ceṭṭu vittanamulōnuṃḍipuṭṭunu,
ceṭṭu kāryamu, vittanamu kāraṇamu. ā kāraṇavittanamu iṃtakumuṃdu
ceṭṭunuṃḍi puṭṭinadi. ā ceṭṭu dāniki kāraṇamu. ī rītigā ayina yaḍala
modaṭi vittanamunaku kāraṇamēmiṭi? ī prakāramu venukaku venukaku
veḷḷinakoladi kārya kāraṇamulu anaṃtamulugā uṃḍunu. ekkaḍō okacōṭa haddu
- miti - uṃḍavalenu. ī sṛṣṭilō kāraṇa kāryavastuvulanniṃṭiki
mūlakāraṇamu paramātmayē kanuka atanē ī anavasthādōṣamunaku āvadhi.
bhagavaṃtuni sṛṣṭiki muṃdu bhagavaṃtuḍu okkaḍē tappa mariyēvastuvu lēdu
ani śruti ceppucunnadi. aṃducēta ī anavasthādōṣamu bhagavaṃtuniki
vartiṃcanidi. ī anavasthādōṣamu tārkikamu - tarkamuvalana bhagavaṃtuni
telusukonalēmu - aṃducēta aṭṭitārkikasiddhāṃtamu bhagavaṃtuniyaṃdu
vartiṃpadu - tarkamulō kūḍa “(Every rule has an exception)” ani unnadi.
tarkamu prakṛtiki saṃbaṃdhiṃcinadi, bhagavaṃtuḍu prakṛtiki atītuḍu.
aṃducēta prākṛtikasiddhāṃtamulu atanikivartiṃpavu.
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.