అనేకశబ్దో అనంతవాచీ.
(అనేకమనగా ఒకటిని మించినది, అనంతమని అర్థము
-.)
(అనేకమైన
బాహువులు, ఉదరములు, నోళ్ళు, కళ్ళు గలవాడు. భగవంతుడు విశ్వరూపుడు – ప్రపంచమంతా తనరూపే,
ప్రపంచములోనున్న సమస్త వస్తువులూ తన రూపములే అయినవాడు. అందుచేత సమస్త వస్తువుల
అవయవములు అన్నీ - బాహువులు మొదలగునవి అన్నీ - అతని అవయవములే అయినందున అనంతమైన -
లెక్కలేనన్ని - రూపములయొక్క - బాహువులు మొదలగు అవయవములు గలవాడు.)
“తత్ సృష్ట్వా తదేవాసు ప్రావిశత్
- తదను ప్రవిశ్య సచ్చ త్యచ్చ అభవత్”.
(సృష్టించిన
ప్రతివస్తువులోను - అణువు మొదలు మహత్తత్త్వమువరకుగల సమస్త వస్తువులలోను - భగవంతుడు
ప్రవేశించియున్నాడు. అందుచేతనే అతనిని విష్ణువని చెప్పిరి - (చూడుము –‘విష్ణుః’.)అట్లు
ప్రతివస్తువులోను భగవంతుడు ప్రవేశించి ‘సత్, త్యత్’ అన్ని వస్తువులు తానే ఆయెను - అన్ని
వస్తువులుగాను తానే మారెను. అందుచేత సృష్టించబడిన ప్రతివస్తువు అతనిరూపమే.)
“మ. బహు పా
దోరు భుజాన నేక్షణ శిరః ఫాల శ్రవో యుక్తుడై
విహరించున్
బహుదేహి దేహగతుడై విద్వాంసు లూహించి త
ద్బహురూ
పావయవంబులన్ భువన సంపత్తిన్ విచారింతురు ---“. (శ్రీమదాంధ్ర మహాభాగవతము- 2 - 4 - 88)
(అనేకమైన
పాదములు, తొడలు, భుజములు, ముఖములు, కండ్లు, శిరస్సులు, ఫాలభాగములు గలవాడై అనేక జీవుల
దేహమందుండువాడు పరమాత్మ. ఈ రూపములను అవయవములను లోకములుగా విద్వాంసులు ఊహించి చెప్పుదురు.
విశ్వము - ప్రపంచమంతయు - భగవంతుని రూపము - ఆ విశ్వరూపములోని అవయవములన్నియు భగవంతునివే
అనియు చెప్పెదరు - అందుచేత భగవంతుడు అనేకమైన బాహువులు మొదలగు అవయవములు గలవాడుగ
చెప్పబడుచున్నాడు -.
“అనేక బాహూదరవక్తనేత్రం పశ్యామి
త్వాం” - (శ్రీమద్భగవద్గీత- 11 - 16)
(అనేకమైన బాహువులు,
ఉదరములు, వక్త్రములు, నేత్రములు గలవానినిగా నేను నిన్ను చూచుచున్నాను.)
“బహు రూపా దోదర
వక్త్ర లోచనం” (శ్రీరామ కర్ణామృతం--24)
“సహస్ర శీర్షం దేవం
విశ్వాక్షం - - -” (మంత్ర పుష్పము)
(వేలకొలది శిరస్సులుగల దేవుడు, అనేకమైన
కండ్లు గలవాడు.)
Transliteration
anēkaśabdō
anaṃtavācī.
(anēkamanagā
okaṭini miṃcinadi, anaṃtamani arthamu -.)
(anēkamaina
bāhuvulu, udaramulu, nōḷḷu, kaḷḷu galavāḍu. bhagavaṃtuḍu viśvarūpuḍu –
prapaṃcamaṃtā tanarūpē, prapaṃcamulōnunna samasta vastuvulū tana
rūpamulē ayinavāḍu. aṃducēta samasta vastuvula avayavamulu annī -
bāhuvulu modalagunavi annī - atani avayavamulē ayinaṃduna anaṃtamaina -
lekkalēnanni - rūpamulayokka - bāhuvulu modalagu avayavamulu
galavāḍu.)
“tat
sṛṣṭvā tadēvāsu prāviśat - tadanu praviśya sacca tyacca abhavat”.
(sṛṣṭiṃcina
prativastuvulōnu - aṇuvu modalu mahattattvamuvarakugala samasta
vastuvulalōnu - bhagavaṃtuḍu pravēśiṃciyunnāḍu. aṃducētanē atanini
viṣṇuvani ceppiri - (cūḍumu –‘viṣṇuḥ’.)aṭlu prativastuvulōnu
bhagavaṃtuḍu pravēśiṃci ‘sat, tyat’ anni vastuvulu tānē āyenu - anni
vastuvulugānu tānē mārenu. aṃducēta sṛṣṭiṃcabaḍina prativastuvu
atanirūpamē.)
“ma.
bahu pā dōru bhujāna nēkṣaṇa śiraḥ phāla śravō yuktuḍai
vihariṃcun
bahudēhi dēhagatuḍai vidvāṃsu lūhiṃci ta
dbahurū
pāvayavaṃbulan bhuvana saṃpattin vicāriṃturu ---“. (śrīmadāṃdhra
mahābhāgavatamu- 2 - 4 - 88)
(anēkamaina
pādamulu, toḍalu, bhujamulu, mukhamulu, kaṃḍlu, śirassulu,
phālabhāgamulu galavāḍai anēka jīvula dēhamaṃduṃḍuvāḍu paramātma. ī
rūpamulanu avayavamulanu lōkamulugā vidvāṃsulu ūhiṃci ceppuduru. viśvamu
- prapaṃcamaṃtayu - bhagavaṃtuni rūpamu - ā viśvarūpamulōni
avayavamulanniyu bhagavaṃtunivē aniyu ceppedaru - aṃducēta bhagavaṃtuḍu
anēkamaina bāhuvulu modalagu avayavamulu galavāḍuga ceppabaḍucunnāḍu
-.
“anēka
bāhūdaravaktanētraṃ paśyāmi tvāṃ” - (śrīmadbhagavadgīta- 11 - 16)
(anēkamaina
bāhuvulu, udaramulu, vaktramulu, nētramulu galavāninigā nēnu ninnu
cūcucunnānu.)
“bahu rūpā
dōdara vaktra lōcanaṃ” (śrīrāma karṇāmṛtaṃ--24)
“sahasra
śīrṣaṃ dēvaṃ viśvākṣaṃ - - -” (maṃtra puṣpamu)
(vēlakoladi
śirassulugala dēvuḍu, anēkamaina kaṃḍlu galavāḍu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.