← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనికేతః anikētaḥ

Original — తెలుగు

“నికేతః ఆశ్రయః, నివాసః నియతః న విద్యతే యస్య సః అనికేతః”. (శ్రీ శంకరః)

(నికేతమనగా ఆశ్రయము, నిర్ధిష్టమైన నివాసము, అదిలేనివాడు.)

నియతా వసధి రహితః. (నిర్ణీతమైన అవసధము - బస - విశ్రమస్థానము, లేనివాడు.)

గృహశూన్యః (ఇల్లు అనునది లేనివాడు.)

శూన్యో నియత వాసేన. (నియతమైన నివాసము లేనివాడు.)

యో గృహం ద్వారం సర్వం భగవతః ఇతి కృతమతిః.

(గృహము, ద్వారము, అన్నియు భగవంతునివియే అని తలచువాడు.)

యస్యాత్మనః కదృశమపి గృహం నాస్తి, యో గృహే మమత్వరహితః ఇత్యర్థః.

(తనది అయిన ఏ విధమైన గృహములేనివాడు; గృహమందు మమత్వము - ఈ ఇల్లు నాది యను అనుభావము లేనివాడు.)

“ఆత్మని స్థిరమతిత్వేన నికేతనాదిషు అసక్తః” (శ్రీరామానుజః)

(ఆత్మయందు స్థిరమైన మనస్సు కలిగియుండుటచేత వసతిస్థానమందు ఆసక్తి లేనివాడు.)

ఇల్లు వాకిలి, విడిచినవాడు.

Transliteration

“nikētaḥ āśrayaḥ, nivāsaḥ niyataḥ na vidyatē yasya saḥ anikētaḥ”. (śrī śaṃkaraḥ)

(nikētamanagā āśrayamu, nirdhiṣṭamaina nivāsamu, adilēnivāḍu.)

niyatā vasadhi rahitaḥ. (nirṇītamaina avasadhamu - basa - viśramasthānamu, lēnivāḍu.)

gṛhaśūnyaḥ (illu anunadi lēnivāḍu.)

śūnyō niyata vāsēna. (niyatamaina nivāsamu lēnivāḍu.)

yō gṛhaṃ dvāraṃ sarvaṃ bhagavataḥ iti kṛtamatiḥ.

(gṛhamu, dvāramu, anniyu bhagavaṃtuniviyē ani talacuvāḍu.)

yasyātmanaḥ kadṛśamapi gṛhaṃ nāsti, yō gṛhē mamatvarahitaḥ ityarthaḥ.

(tanadi ayina ē vidhamaina gṛhamulēnivāḍu; gṛhamaṃdu mamatvamu - ī illu nādi yanu anubhāvamu lēnivāḍu.)

“ātmani sthiramatitvēna nikētanādiṣu asaktaḥ” (śrīrāmānujaḥ)

(ātmayaṃdu sthiramaina manassu kaligiyuṃḍuṭacēta vasatisthānamaṃdu āsakti lēnivāḍu.)

illu vākili, viḍicinavāḍu.

English

"Niketa means a support, a fixed dwelling; that which has none of this is aniketa" (Śrī Śaṅkara) — one without any settled abode; without a fixed lodging or resting place; without even a house of one's own; one who considers that his house, his very door, everything, belongs to God — free of the sense of "mine" regarding any dwelling. "Unattached to dwellings and the like, owing to a mind made steady in the Self" (Śrī Rāmānuja) — here the point is not the absence of a house, but a mind so fixed on the Self that it simply has no attachment to wherever it happens to live.