“అన్నమ
యరసేనైవ భూత్వా, అన్నరసేనైవ అభివృద్ధిం ప్రాప్య, అన్నమయ పృధివ్యాం యద్విలీయతే, సో అన్నమయకోశః; తదేవ
స్థూల శరీరం” (పైంగలోపనిషత్)
(అన్నరసమువలన
పుట్టి, అన్నరసముచే వృద్ధినొంది, అన్నరసమ యమైన భూమియందే లీనమై పోవునది - కలిసిపోవునది - అన్నమ
యకోశము. అదియే స్థూలశరీరము)
(భూమిలోనుండియే
అన్ని విధములైన అన్నము – తిను పదార్థము - పుట్టుచున్నది - అనగా, అట్టి పదార్థములన్నింటికీ భూమి
కారణము, అన్నపదార్థములు కార్యములు - కార్యములు కారణములోనే లీనమగును - కనుక ఈ అన్నముగా
ఉపకరించు పదార్థములన్నియు వాటి కారణమైన భూమి లోనే లీనమగును - కలిసిపోవును. అట్టి అన్నపదార్థముల
రసముతో పుట్టిపెరిగిన స్థూలశరీరము ఈ కారణమువలన అన్నమయకోశమని చెప్పబడుచున్నది.)
“అన్నకార్యాణాం కోశానాం సమూహో
అన్నమయ కోశః ఇత్యుచ్యతే” (సర్వ సారోపనిషత్)
(అన్నముయొక్క
కార్యములైన, అన్నమే కోశముగా మారినటువంటి వాటియొక్క సమూహము అన్నమ యకోశము - కోశరూపముగా
నుండునది.)
“మాతా
పితృభ్యాం ఉపభుక్త అన్నరస పరిణామరూప శుక్లశోణిత సంబంధాత్ మాతురుదరే ఉత్పన్నః జననాంతరమపి
క్షీరశాకాది రూపాన్నేన వర్థితః, మరణానంతరమపి అన్నరూప పృధివ్యామేవ లీయమానో దేహో అన్నమ యకోశః
ఉచ్యతే”.
(తలిదండ్రులు
తినినటువంటి అన్నముయొక్క రసము శుక్రశోణిత రూపములుగా మారి కలియుటచేత తల్లి కడుపులో పుట్టి, పాలు
పెరుగు రూపములలో ఉన్న అన్నము తినుటచే పెరిగి, చనిపోయిన తర్వాతకూడ అన్నరూపమైన భూమిలోనే కలిసిపోవు
దేహము అన్నమయకోశము.)
“పితృమాతృ
శుక్లశోణీతంబు వలననగు స్థూలశరీరంబు అన్నమ యకోశంబనంబడు” (వివేకచింతామణి - 1)
అన్నమయ కోశః భోగస్థానం.
(భోగములకు
స్థానమైనది అన్నమ య కోశము - అన్నమ యమైన స్థూలశరీరము ద్వారానే భోగములననుభవించుట యగును.
అందుచేత అది భోగములకు స్థానము - స్థూలశరీరము ఉండిననే పాపపుణ్యముల ఫలములగు
కష్టసుఖములననుభవించుట.)
ప్రత్యక్షముగా కంటికి
కనబడుచు, చేతులు, కాళ్ళు మొదలగు అవయవములతోనున్న స్థూలదేహము.
Transliteration
“annama
yarasēnaiva bhūtvā, annarasēnaiva abhivṛddhiṃ prāpya, annamaya pṛdhivyāṃ
yadvilīyatē, sō annamayakōśaḥ; tadēva sthūla śarīraṃ”
(paiṃgalōpaniṣat)
(annarasamuvalana
puṭṭi, annarasamucē vṛddhinoṃdi, annarasama yamaina bhūmiyaṃdē līnamai
pōvunadi - kalisipōvunadi - annama yakōśamu. adiyē sthūlaśarīramu)
(bhūmilōnuṃḍiyē
anni vidhamulaina annamu – tinu padārthamu - puṭṭucunnadi - anagā, aṭṭi
padārthamulanniṃṭikī bhūmi kāraṇamu, annapadārthamulu kāryamulu -
kāryamulu kāraṇamulōnē līnamagunu - kanuka ī annamugā upakariṃcu
padārthamulanniyu vāṭi kāraṇamaina bhūmi lōnē līnamagunu - kalisipōvunu.
aṭṭi annapadārthamula rasamutō puṭṭiperigina sthūlaśarīramu ī
kāraṇamuvalana annamayakōśamani ceppabaḍucunnadi.)
“annakāryāṇāṃ
kōśānāṃ samūhō annamaya kōśaḥ ityucyatē” (sarva sārōpaniṣat)
(annamuyokka
kāryamulaina, annamē kōśamugā mārinaṭuvaṃṭi vāṭiyokka samūhamu annama
yakōśamu - kōśarūpamugā nuṃḍunadi.)
“mātā
pitṛbhyāṃ upabhukta annarasa pariṇāmarūpa śuklaśōṇita saṃbaṃdhāt
māturudarē utpannaḥ jananāṃtaramapi kṣīraśākādi rūpānnēna varthitaḥ,
maraṇānaṃtaramapi annarūpa pṛdhivyāmēva līyamānō dēhō annama yakōśaḥ
ucyatē”.
(talidaṃḍrulu
tininaṭuvaṃṭi annamuyokka rasamu śukraśōṇita rūpamulugā māri
kaliyuṭacēta talli kaḍupulō puṭṭi, pālu perugu rūpamulalō unna annamu
tinuṭacē perigi, canipōyina tarvātakūḍa annarūpamaina bhūmilōnē
kalisipōvu dēhamu annamayakōśamu.)
“pitṛmātṛ
śuklaśōṇītaṃbu valananagu sthūlaśarīraṃbu annama yakōśaṃbanaṃbaḍu”
(vivēkaciṃtāmaṇi - 1)
annamaya kōśaḥ
bhōgasthānaṃ.
(bhōgamulaku
sthānamainadi annama ya kōśamu - annama yamaina sthūlaśarīramu dvārānē
bhōgamulananubhaviṃcuṭa yagunu. aṃducēta adi bhōgamulaku sthānamu -
sthūlaśarīramu uṃḍinanē pāpapuṇyamula phalamulagu
kaṣṭasukhamulananubhaviṃcuṭa.)
pratyakṣamugā
kaṃṭiki kanabaḍucu, cētulu, kāḷḷu modalagu avayavamulatōnunna
sthūladēhamu.
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.