(సూక్ష్మాతి సూక్ష్మమైన అణువు కన్న చిన్నది. అందుచేత ‘అణోరణీయాన్’.అన్నింటికంటె పెద్దది, పూర్తిగా వ్యాపించియున్నది అయిన మహత్తత్వము కన్న పెద్దది కనుక ‘మహతో మహీయాన్’.లోకములో పృధివి (సూక్ష్మరూపములోనున్న పృధివి) కన్న చిన్నది కాని, పెద్దది కాని యేదియున్నను అది అంతయు నిత్యమైన అత్మ వలననేకలుగుచున్నది. అవి అన్నియు వాటిలో ఆత్మలేనియడల అసత్తులే. ఎంత పెద్ద వస్తువైనను ఆత్మ కారణముగానే పెద్దదగుచున్నది; ఎంత చిన్నది అయినను ఆత్మకారణముగా ఉన్నందువలననే చిన్నదిగా ఉన్నది. అందుచేత ఆత్మ చిన్న దాని కన్న చిన్నది, పెద్ద దానికన్న పెద్దది. సమస్తమైన నామములు రూపములు గల సమస్త వస్తువులకు ఉపాధి ఆత్మయే యగుటవలన.)
(సమస్తమైన చేతనవస్తువుల కన్న అణువు అనునది సూక్ష్మమైనది. ఆత్మ అట్టి అణువు కన్న చిన్నది - అనగా, వాటి అన్నింటిలోపల ప్రవేశించి యుండు సామర్ధ్యము కలది. పెద్దదైన ఆకాశముకన్న పెద్దది - అనగా ఎంత పెద్ద వస్తువైనను తను వ్యాపించ యుండనటువంటిది లేదు అని అర్ధము.)
(అణీయస్త్వమనగా అణువుగా చిన్నదిగా నుండుట, అన్నింటిలోను వ్యాపించియుండుట. జ్యాయస్త్వమనగా పెద్దదగుట, సర్వేశ్వరుడగుట, అన్నింటికీ ప్రభువు శాసించువాడగుట. ఈ రెండు గుణములు, శక్తులు అన్నింటిలోను వ్యాపించియుండుటవలన, అన్నింటికీ ప్రభువై యుండుటవలననే ఆత్మకు కలుగుచున్నవి. అందుచేత ఆత్మ కానిది ఏ వస్తువైనను, దీని కన్న చిన్నది అయినను పెద్దది అయినను మఱి లేదు.)
(ఒకే వస్తువు చిన్నది గాను పెద్దది గాను ఉండుట విరుద్ధము - సంభవించునదికాదు. అట్లయిన ఎట్లు పొసగును అనగా అధ్యాసితమైన అధిష్ఠానమును బట్టి అణువు (చిన్నది) అని వ్యవహరింపబడుచున్నది. కాని, యదార్ధముగా కాదు. అందుచేత ఈ ప్రకారముగ రెండు విధములుగను - చిన్నదానికన్న చిన్నది, పెద్దదానికన్న పెద్దది అని చెప్పుటలో విరోధము లేదు.
(‘అణోరణీయాన్ మహతో మహీయాన్’ అని చెప్పుటవలన ఆత్మ యొక్క స్వరూపము అణువు అని కాదు, పెద్ద వస్తువు అయిన ఆకాశముయొక్క రూపము కూడ. వస్తువు పెద్దది అయిన దానిలో వ్యాపించియుండు ఆత్మ అంత పెద్దది, ఎంత చిన్నది అయిన అందులో వ్యాపించియున్న ఆత్మ అంత చిన్నది. ఆత్మ ఏ ఉపాధిలో ఉంటే దానిని బట్టి ఆత్మకు అణుత్వము గాని మహత్వము గాని ఉండును - ఉపాధిలోపల, బైట పూర్తిగా వ్యాపించి యుండుటచేత - “అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః” (మంత్రపుష్పము) (కనబడునది, వినబడునది, కనబడనిది, వినబడనిది అయిన ప్రపంచము ఎంత ఉన్నదో దాని అంతటిలోను - అనగా, దానిలోనున్న ప్రతి వస్తువులోను - లోపల బైట పూర్తిగా వ్యాపించియున్నాడు.) పెద్ద వస్తువైనను చిన్నవస్తువైనను దానిలో పూర్తిగా వ్యాపించియున్నాడు.”అంతః ప్రవేశ సమర్ధతయా సూక్ష్మం” - ప్రతి దానిలోపల ప్రవేశించియుండు శక్తి, శీలము కలవాడగుటచేతనే ఆత్మ సూక్ష్మము - ఇట్లు ప్రవేశించు సామర్ధ్యము గలవాడగుటచేతనే ఆత్మ “విష్ణు” అని చెప్పబడుచున్నాడు.)
సమస్తానాంచ గరిష్టంచ భూతాదీనాం గరీ యసాం ||” (శ్రీ విష్ణుపురాణే)
(సమస్త అణుమాత్ర వస్తువులకంటె చిన్నది అయినట్టియు, పెద్ద వస్తువులగు భూతములకంటె చాలా పెద్దది అయినట్టిది యగు నారాయణుని గుఱించి నమస్కారము.)
(సూక్ష్మమార్గము - అర్చిరాదిమార్గము - ఈ అర్చిరాది మార్గము ఎవరికి క్షుణ్ణముగా, స్పష్టముగా అవగాహన కానందువలన అణుమార్గము, సూక్ష్మమార్గము అని చెప్పబడినది.)
(sūkṣmāti sūkṣmamaina aṇuvu kanna cinnadi. aṃducēta ‘aṇōraṇīyān’.anniṃṭikaṃṭe peddadi, pūrtigā vyāpiṃciyunnadi ayina mahattatvamu kanna peddadi kanuka ‘mahatō mahīyān’.lōkamulō pṛdhivi (sūkṣmarūpamulōnunna pṛdhivi) kanna cinnadi kāni, peddadi kāni yēdiyunnanu adi aṃtayu nityamaina atma valananēkalugucunnadi. avi anniyu vāṭilō ātmalēniyaḍala asattulē. eṃta pedda vastuvainanu ātma kāraṇamugānē peddadagucunnadi; eṃta cinnadi ayinanu ātmakāraṇamugā unnaṃduvalananē cinnadigā unnadi. aṃducēta ātma cinna dāni kanna cinnadi, pedda dānikanna peddadi. samastamaina nāmamulu rūpamulu gala samasta vastuvulaku upādhi ātmayē yaguṭavalana.)
(samastamaina cētanavastuvula kanna aṇuvu anunadi sūkṣmamainadi. ātma aṭṭi aṇuvu kanna cinnadi - anagā, vāṭi anniṃṭilōpala pravēśiṃci yuṃḍu sāmardhyamu kaladi. peddadaina ākāśamukanna peddadi - anagā eṃta pedda vastuvainanu tanu vyāpiṃca yuṃḍanaṭuvaṃṭidi lēdu ani ardhamu.)
(aṇīyastvamanagā aṇuvugā cinnadigā nuṃḍuṭa, anniṃṭilōnu vyāpiṃciyuṃḍuṭa. jyāyastvamanagā peddadaguṭa, sarvēśvaruḍaguṭa, anniṃṭikī prabhuvu śāsiṃcuvāḍaguṭa. ī reṃḍu guṇamulu, śaktulu anniṃṭilōnu vyāpiṃciyuṃḍuṭavalana, anniṃṭikī prabhuvai yuṃḍuṭavalananē ātmaku kalugucunnavi. aṃducēta ātma kānidi ē vastuvainanu, dīni kanna cinnadi ayinanu peddadi ayinanu maṟi lēdu.)
(okē vastuvu cinnadi gānu peddadi gānu uṃḍuṭa viruddhamu - saṃbhaviṃcunadikādu. aṭlayina eṭlu posagunu anagā adhyāsitamaina adhiṣṭhānamunu baṭṭi aṇuvu (cinnadi) ani vyavahariṃpabaḍucunnadi. kāni, yadārdhamugā kādu. aṃducēta ī prakāramuga reṃḍu vidhamuluganu - cinnadānikanna cinnadi, peddadānikanna peddadi ani ceppuṭalō virōdhamu lēdu.
(‘aṇōraṇīyān mahatō mahīyān’ ani ceppuṭavalana ātma yokka svarūpamu aṇuvu ani kādu, pedda vastuvu ayina ākāśamuyokka rūpamu kūḍa. vastuvu peddadi ayina dānilō vyāpiṃciyuṃḍu ātma aṃta peddadi, eṃta cinnadi ayina aṃdulō vyāpiṃciyunna ātma aṃta cinnadi. ātma ē upādhilō uṃṭē dānini baṭṭi ātmaku aṇutvamu gāni mahatvamu gāni uṃḍunu - upādhilōpala, baiṭa pūrtigā vyāpiṃci yuṃḍuṭacēta - “aṃtarbahiśca tatsarvaṃ vyāpya nārāyaṇa sthitaḥ” (maṃtrapuṣpamu) (kanabaḍunadi, vinabaḍunadi, kanabaḍanidi, vinabaḍanidi ayina prapaṃcamu eṃta unnadō dāni aṃtaṭilōnu - anagā, dānilōnunna prati vastuvulōnu - lōpala baiṭa pūrtigā vyāpiṃciyunnāḍu.) pedda vastuvainanu cinnavastuvainanu dānilō pūrtigā vyāpiṃciyunnāḍu.”aṃtaḥ pravēśa samardhatayā sūkṣmaṃ” - prati dānilōpala pravēśiṃciyuṃḍu śakti, śīlamu kalavāḍaguṭacētanē ātma sūkṣmamu - iṭlu pravēśiṃcu sāmardhyamu galavāḍaguṭacētanē ātma “viṣṇu” ani ceppabaḍucunnāḍu.)
samastānāṃca gariṣṭaṃca bhūtādīnāṃ garī yasāṃ ||” (śrī viṣṇupurāṇē)
(samasta aṇumātra vastuvulakaṃṭe cinnadi ayinaṭṭiyu, pedda vastuvulagu bhūtamulakaṃṭe cālā peddadi ayinaṭṭidi yagu nārāyaṇuni guṟiṃci namaskāramu.)
(sūkṣmamārgamu - arcirādimārgamu - ī arcirādi mārgamu evariki kṣuṇṇamugā, spaṣṭamugā avagāhana kānaṃduvalana aṇumārgamu, sūkṣmamārgamu ani ceppabaḍinadi.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.