అన్వయః
కార్యేషు కారణత్వేన అనువృత్తిః - కారణావస్థాయాం చ తేభ్యః వ్యతిరేకః తథా జాగ్రదాద్యవస్థా సుత త్సాక్షితయా
అన్వయః |
వ్యతిరేకశ్చ
సమాద్యాదౌ, ఏవం అన్వయ వ్యతిరేకా భ్యాం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా చ తదేవ ఆత్మనః స్వరూపం. అన్వయ
వ్యతిరేక సాధనేన ఆత్మా జిజ్ఞాస్యః.
(కార్యములందు
కారణమగు వస్తువు ఉండుట అన్వయము; కారణ దశలో దీనికి వ్యతిరేకముగా నుండుట వ్యతిరేకము - మట్టి
కారణము - మట్టితో చేయబడిన కుండ కార్యము. కుండలో దాని కారణవస్తువైన మట్టి యున్నది - ఇది అన్వయము.
కుండ కారణరూపమైన మట్టిగా ఉన్నపుడు మట్టిలో కార్యమైన కుండ ఉండదు. అందుచేత అది అన్వయమునకు
వ్యతిరేకము. జాగ్రత్ మొదలగు అవస్థల యందు సాక్షి రూపముగా ఆత్మ యుండుట అన్వయము - సమాధిలో దీనికి
వ్యతిరేకముగానుండును - ఆత్మ యొక్కటే యుండునుగాని దానిలో అవస్థలు ఉండవు.) (ఈ ప్రకారముగా అన్వయ
వ్యతిరేకముల ద్వారా పరబ్రహ్మను - ఏది అంతటా ఎల్లపుడు ఉండునో అదియే ఆత్మ స్వరూపము - అను
విషయమును తెలుసుకోనగును.)
అన్వయః
కారణత్వేన అన్వయః; వ్యతిరేకః అఖిల హేయ ప్రత్యనీక కల్యాణైక తానతా సత్వేన స్వేతర సమస్త వస్తు భేదః.
ఉభాభ్యాం అన్వయ వ్యతిరేకాభ్యాం విశిష్టం సత్, యద్వస్తు సర్వత్ర సర్వదాస్యాత్ సర్వేషు దేశేషు, సర్వేషు
కాలేషు చస్యాత్ ఏతదేవ జిజ్ఞాస్యం.
(కారణమగుట
వలన కార్యములో నుండుట అన్వయము. ఇది మంచిది, ఇది చెడ్డది అను విచక్షణ లేకుండగ సమస్త వస్తువు
లందును ఒకే సత్తయై యుండి, తన కన్న వేరైన సమస్త వస్తువుల లోను కలుగు భేదము వ్యతిరేకము. ఈ
రెండు అన్వయ వ్యతిరేకముల చేత కూడి యున్న వస్తువు అన్నిచోట్ల, ఎల్లపుడు, అన్ని వస్తువులందు
ఉండు దానిని ధ్యానించ వలెను. భగవంతుడు సృష్టిలో నున్న వస్తువులన్నింటికి కారణమైనవాడు. అందుచేత
కుండలో దాని కారణమైన మట్టి యున్నట్లు సమస్త వస్తువులలోను వాటికి కారణమైన భగవంతుడు ఉన్నాడు.
కార్యములగు సమస్త వస్తువులకు కారణమైన భగవంతునిలో ఈ వస్తువులు లేవు.)
“మయా తతమిదం సర్వం జగదవ్యక్త
మూర్తినా |
మత్స్థాని సర్వభూతాని న చాహం
తేష్వవస్థితః||“. (శ్రీమద్భగవద్గీత - 9 - 4)
(కంటికి
కనబడని రూపముతో ఈ జగత్తు అంతటిలోను నేను వ్యాపించి యున్నాను. కాని, నాలో ఈ భూతము లన్నియు
లేవు.) (వాటికి నేను కారణము కనుక వాటిలో నేను ఉన్నాను - కుండలో దానికి కారణమైన మట్టియున్నట్లు -
కుండకు కారణమైన మట్టిలో కార్యమైన కుండలేదు - అట్లే భూతములకు కారణమైన నాలో భూతములు
లేవు.)
పొగను
చూచి అనుమాన ప్రమాణము చేత అచట అగ్ని ఉన్నదని ఊహించ వచ్చును. ఎందుచేతననగా, అగ్ని కారణము, పొగ
కార్యము. అగ్నిలేనిదే పొగ యుండదు - ఇది అన్వయము - పొగలో అగ్నిలేదు - ఇది వ్యతిరేకము – కార్యములో
కారణముండును గాని. కారణములో కార్యము ఉండదు.)
దేహము
మొదలు ప్రాణముల వరకు గల సమస్త వస్తువులను అనాత్మలని, - ఆత్మకాదని - వాటిని “నేతి, నేతి”-
ఇదికాదు, ఇదికాదు అని నిరాకరించి, అన్వయ వ్యతిరేకముల చేత విమర్శించి నిరాకరించి, మిగిలినదే పరమాత్మయని మహా
వాక్యము వలన తెలుసుకొనవలెను.
భగవంతుడు
సూక్ష్మాతి సూక్ష్ముడు. అందుచేత తన కార్యములైన సృష్టిలోని సమస్త వస్తువు లందును - ఎంత
చిన్నవైనను వాటిలో - వాటిలో ప్రవేశించియున్నాడు. సృష్టిలో ఉన్న ఎంత చిన్నవస్తువైనను అతనిలో ఉండడముకు
అవకాశములేదు - “అణోరణీయాన్” చిన్నదాని కంటె చిన్నది కనుక - ఇంతేకాక భగవంతుడు చిన్మాత్రుడు -
చైతన్యమే అతను. సృష్టి పూర్వము, ప్రళయము తర్వాత ఇంతకుముందు సృష్టిలోనున్న సమస్త వస్తువులు
అతనిలో సూక్ష్మరూపములో ఉండును అని చెప్పుటలో యధార్థమేమనగా - అతనితో కలిసియున్న మాయ యను ప్రకృతిలో
అవన్నియు సూక్ష్మరూపములో లీనమగును - అట్టి ప్రకృతి రూపముగానే ఉండును.
Transliteration
anvayaḥ
kāryēṣu kāraṇatvēna anuvṛttiḥ - kāraṇāvasthāyāṃ ca tēbhyaḥ vyatirēkaḥ
tathā jāgradādyavasthā suta tsākṣitayā anvayaḥ |
vyatirēkaśca
samādyādau, ēvaṃ anvaya vyatirēkā bhyāṃ yat syāt sarvatra sarvadā ca
tadēva ātmanaḥ svarūpaṃ. anvaya vyatirēka sādhanēna ātmā jijñāsyaḥ.
(kāryamulaṃdu
kāraṇamagu vastuvu uṃḍuṭa anvayamu; kāraṇa daśalō dīniki vyatirēkamugā
nuṃḍuṭa vyatirēkamu - maṭṭi kāraṇamu - maṭṭitō cēyabaḍina kuṃḍa kāryamu.
kuṃḍalō dāni kāraṇavastuvaina maṭṭi yunnadi - idi anvayamu. kuṃḍa
kāraṇarūpamaina maṭṭigā unnapuḍu maṭṭilō kāryamaina kuṃḍa uṃḍadu.
aṃducēta adi anvayamunaku vyatirēkamu. jāgrat modalagu avasthala yaṃdu
sākṣi rūpamugā ātma yuṃḍuṭa anvayamu - samādhilō dīniki
vyatirēkamugānuṃḍunu - ātma yokkaṭē yuṃḍunugāni dānilō avasthalu
uṃḍavu.) (ī prakāramugā anvaya vyatirēkamula dvārā parabrahmanu - ēdi
aṃtaṭā ellapuḍu uṃḍunō adiyē ātma svarūpamu - anu viṣayamunu
telusukōnagunu.)
anvayaḥ
kāraṇatvēna anvayaḥ; vyatirēkaḥ akhila hēya pratyanīka kalyāṇaika tānatā
satvēna svētara samasta vastu bhēdaḥ. ubhābhyāṃ anvaya vyatirēkābhyāṃ
viśiṣṭaṃ sat, yadvastu sarvatra sarvadāsyāt sarvēṣu dēśēṣu, sarvēṣu
kālēṣu casyāt ētadēva jijñāsyaṃ.
(kāraṇamaguṭa
valana kāryamulō nuṃḍuṭa anvayamu. idi maṃcidi, idi ceḍḍadi anu
vicakṣaṇa lēkuṃḍaga samasta vastuvu laṃdunu okē sattayai yuṃḍi, tana
kanna vēraina samasta vastuvula lōnu kalugu bhēdamu vyatirēkamu. ī reṃḍu
anvaya vyatirēkamula cēta kūḍi yunna vastuvu annicōṭla, ellapuḍu, anni
vastuvulaṃdu uṃḍu dānini dhyāniṃca valenu. bhagavaṃtuḍu sṛṣṭilō nunna
vastuvulanniṃṭiki kāraṇamainavāḍu. aṃducēta kuṃḍalō dāni kāraṇamaina
maṭṭi yunnaṭlu samasta vastuvulalōnu vāṭiki kāraṇamaina bhagavaṃtuḍu
unnāḍu. kāryamulagu samasta vastuvulaku kāraṇamaina bhagavaṃtunilō ī
vastuvulu lēvu.)
“mayā tatamidaṃ sarvaṃ
jagadavyakta mūrtinā |
matsthāni
sarvabhūtāni na cāhaṃ tēṣvavasthitaḥ||“. (śrīmadbhagavadgīta - 9 -
4)
(kaṃṭiki
kanabaḍani rūpamutō ī jagattu aṃtaṭilōnu nēnu vyāpiṃci yunnānu. kāni,
nālō ī bhūtamu lanniyu lēvu.) (vāṭiki nēnu kāraṇamu kanuka vāṭilō nēnu
unnānu - kuṃḍalō dāniki kāraṇamaina maṭṭiyunnaṭlu - kuṃḍaku kāraṇamaina
maṭṭilō kāryamaina kuṃḍalēdu - aṭlē bhūtamulaku kāraṇamaina nālō
bhūtamulu lēvu.)
poganu
cūci anumāna pramāṇamu cēta acaṭa agni unnadani ūhiṃca vaccunu.
eṃducētananagā, agni kāraṇamu, poga kāryamu. agnilēnidē poga yuṃḍadu -
idi anvayamu - pogalō agnilēdu - idi vyatirēkamu – kāryamulō
kāraṇamuṃḍunu gāni. kāraṇamulō kāryamu uṃḍadu.)
dēhamu
modalu prāṇamula varaku gala samasta vastuvulanu anātmalani, -
ātmakādani - vāṭini “nēti, nēti”- idikādu, idikādu ani nirākariṃci,
anvaya vyatirēkamula cēta vimarśiṃci nirākariṃci, migilinadē
paramātmayani mahā vākyamu valana telusukonavalenu.
bhagavaṃtuḍu
sūkṣmāti sūkṣmuḍu. aṃducēta tana kāryamulaina sṛṣṭilōni samasta vastuvu
laṃdunu - eṃta cinnavainanu vāṭilō - vāṭilō pravēśiṃciyunnāḍu. sṛṣṭilō
unna eṃta cinnavastuvainanu atanilō uṃḍaḍamuku avakāśamulēdu -
“aṇōraṇīyān” cinnadāni kaṃṭe cinnadi kanuka - iṃtēkāka bhagavaṃtuḍu
cinmātruḍu - caitanyamē atanu. sṛṣṭi pūrvamu, praḷayamu tarvāta
iṃtakumuṃdu sṛṣṭilōnunna samasta vastuvulu atanilō sūkṣmarūpamulō uṃḍunu
ani ceppuṭalō yadhārthamēmanagā - atanitō kalisiyunna māya yanu
prakṛtilō avanniyu sūkṣmarūpamulō līnamagunu - aṭṭi prakṛti rūpamugānē
uṃḍunu.
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.