← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అన్యదేవతోపాసన anyadēvatōpāsana

Original — తెలుగు

“కామై స్తై స్తై ర్హృత జ్ఞానాం ప్రపద్యంతే అన్య దేవతాః |

తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా||“. (శ్రీమద్భగవద్గీత- 7 - 20)

“యతః సమానే ప్యాయా సే కృష్ణ భక్తాః క్రమేణచ |

సర్వోత్కృష్టం చ మోక్షాఖ్యం లభంతే ఫలమ క్షయం |

యే క్షుద్రదేవతా భక్తాః క్షుద్రమేద పునః పునః |

ఫలం సంసరణాత్మైవ లభంతే మంద భాగ్యతః |

పురుషార్థఫలం శ్రీశభజనం సముపేక్ష్యయత్ |

భజనం క్షుద్ర దేవానం తత్రకారణముచ్యతే |

పుత్ర పశ్వాది విషయైః కామైః క్షుద్రైః అనర్థ దైః |

తై స్తైర్భగవతో మత్తో విముఖీ కృత్యమానసం |

క్షుద్రదేవాభి ముఖ్యం చ నీతం యేషాంసురాగిణాం |

తత్తత్ఫల ప్రధాతృత్వాభిమతా యాన్య దేవతా |

తస్యా ఆరాధనే యో యః ప్రసిద్ధో నియమో భవేత్ |

తం తం జపోపవాసాది నియమం సముపాశ్రితాః |

తత్తత్ క్షుద్రఫలప్రాప్తి వాంఛయై వాతి వంచితాః |

అసాధారణయా పూర్వా భ్యస్త వాసనయా స్వయా |

వశీకృతాః పరిత్యజ్యమాం భజంతే (అ) న్యదేవతాః||“. (గీతాభావప్రకాశము- 7 - 126 to 136)

(శ్రీకృష్ణపరమాత్మయందు భక్తి సలుపుటలోను, అన్యదేవతలందు - క్షుద్రదేవతలందు - భక్తి సలుపుటలోను కలుగు అయాశము - శ్రమ -సమానమే అయినప్పటికీ శ్రీకృష్ణభక్తులు క్రమముగా అన్నింటికన్న ఉత్కృష్టమైనది, మోక్షము అనుపేరుగల అక్షయఫలము - క్షీణించని ఫలము - ను పొందెదరు. ఇతరదేవతులను - క్షుద్రదేవతులను - భజించువారు మందభాగ్యులగుటవలన సంసార రూపమగు - జననమరణ రూపమగు - క్షుద్రఫలమునే పొందుదురు. పరమ పురుషార్థమైన మోక్షఫలమునిచ్చు శ్రీ కృష్ణపరమాత్మ భక్తి వదలిక్షుద్ర దేవతులను భజించుటకు కారణమేమనగా, క్షుద్రములు, అనర్థములను కలుగచేయునవియు అగు పుత్రులు, పశువులు మొదలగు భోగములను కలుగచేయు విషయముల గుఱించి కోరిక గలవారై భగవంతుడైన నానుండి మనస్సును త్రిప్పివేసి, క్షుద్రదేవతలపట్ల మనస్సును మార్చి, ఆయా కోరిన ఫలములను ఇచ్చునట్టి దేవతుల ఆరాధనయందు ఏ యే నియమములున్నవో, ఆయా జపము, ఉపాసన మొదలగు నియమములను పాటించి, ఆ క్షుద్రఫలమును పొందగోరి వాటిచేత వంచింపబడినవారై పూర్వ జన్మలలో అలవడిన వాసనా రూపమైన నైజము వశములోనున్నవారై పరమాత్మ అయిన నన్ను విడిచిపెట్టి అన్యదేవతులను భజింతురు.)

“యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధ యార్చితుమిచ్ఛతి |

తస్య తస్యా చలాం శ్రద్ధాం తామేవ విద దామ్యహం ||” - (శ్రీమద్భగవద్గీత- 7 - 21)

ఎవరెవరు ఏ యే ఇతర దేవతామూర్తిని వారి వారి పూర్వాభ్యాసవాసనా బలమువల్ల కలిగిన భక్తితో భజింప తలచుదురో, వారిలో నేను అంతరాత్మయై యుండుటచేత, వారికి ఆయా దేవతామూర్తియందు శ్రద్ధను కలిగించెదను, అట్టివారికి నాయందు భక్తిని కలుగచేయను - అనేకమైన కోరికలు అను ఒక గ్రహముచే పట్టుబడి యుండినవారు నా భక్తికి అధికారులు - తగినవారు – కారు.)

“స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధన మీహతే |

లభతే చ తతః కామాన్ మ యైవ విహితాన్ హి తాన్ ||” (శ్రీమద్భగవద్గీత- 7 - 22)

(అట్టి కోరికలు కలవాడు - నేను అతనిలో అంతర్యామిగానుండి అతనికి ఇచ్చిన శ్రద్ధతో ఆ దేవతా పూజ భక్తితో చేయుచు ఆ దేవతనుండి నాచే నిర్మింపబడిన కోరికలను పొందును. అ దేవతారూపములన్నియు నా రూపములే కనుక ఆయా దేవతారూపమున ఆఫలములను నేనే ఇచ్చెదను -.)

“అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్ప మేథసాం |

దేవాన్ దేవయజో యాంతి మద్భక్తాః యాంతి మామపి ||” (శ్రీమద్భగవద్గీత- 7 - 23)

(దేవతులందరు నారూపములే - వారినిపూజించిన నన్నుపూజించినట్లే యగును - అయినను, వారు - ఇతర దేవతలను పూజించువారు - అల్పబుద్ధి గలవారగుటచేతను, వివేకము లేనివారగుటచేతను వారు - పొందుఫలముచిరస్థాయి కాదు - ఇతర దేవతులు నశించువారు కనుక వారిద్వారా కలిగెడు ఫలముకూడ నశించును. నేను నిత్యుడను. అందుచేత నా భక్తులు నావలన పొందు ఫలము అగు అద్వయుడనగు నన్నే పొందుదురు - ఈశ్వరఫలమును పొందుదురు - పరమపదమును పొందుదురు - ఇతర దేవతాభక్తులకు నా భక్తులకు కోరికలు కలుగుట సమానమే అయినను వారిద్దరిమధ్య తేడా చాలా ఉన్నది. అన్యదేవతోపాసకులకు భేదబుద్ధికలదు - అనగా, నేనువేరు, ప్రపంచమువేరు అను బుద్ధికలవారు - వారు భజించు దేవతులుకూడ నేనే అను జ్ఞానము లేనివారు.)

“అహం హి సర్వ య జ్ఞానాం భోక్తా చ ప్రభు రేవచ |”

(సమస్త యజ్ఞముల భోక్తను నేనే - ఈ సంగతి వారికి తెలియదు. అందుచేత ఇతరదేవతాభక్తులు ఆ ఫలమును అనుభవించి మరల సంసారములో పడుదురు - ఎవరు ఆ సమస్త దేవతలలోను సర్వేశ్వరుడనైన నన్నే చూతురో చూచి నన్ను భజింతురో వారు ముక్తిని పొందుదురు.

“యాంతి దేవవ్రతా దేవాన్ పితృఊన్ యాంతి పితృ వ్రతాః |

భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోపిమాం ||“. (శ్రీమద్భగవద్గీత- 9 - 25)

(ఇతర దేవతులను ఉపాసించినవారు ఆయా దేవతులను పొందుదురు - పితరులను ఉపాసించువారు పితృవులను పొందుదురు – భూతములనుపాసించువారు భూతములను పొందుదురు - నన్ను ఉపాసించువారు నన్ను చేరుదురు.)

Transliteration

“kāmai stai stai rhṛta jñānāṃ prapadyaṃtē anya dēvatāḥ |

taṃ taṃ niyamamāsthāya prakṛtyā niyatāḥ svayā||“. (śrīmadbhagavadgīta- 7 - 20)

“yataḥ samānē pyāyā sē kṛṣṇa bhaktāḥ kramēṇaca |

sarvōtkṛṣṭaṃ ca mōkṣākhyaṃ labhaṃtē phalama kṣayaṃ |

yē kṣudradēvatā bhaktāḥ kṣudramēda punaḥ punaḥ |

phalaṃ saṃsaraṇātmaiva labhaṃtē maṃda bhāgyataḥ |

puruṣārthaphalaṃ śrīśabhajanaṃ samupēkṣyayat |

bhajanaṃ kṣudra dēvānaṃ tatrakāraṇamucyatē |

putra paśvādi viṣayaiḥ kāmaiḥ kṣudraiḥ anartha daiḥ |

tai stairbhagavatō mattō vimukhī kṛtyamānasaṃ |

kṣudradēvābhi mukhyaṃ ca nītaṃ yēṣāṃsurāgiṇāṃ |

tattatphala pradhātṛtvābhimatā yānya dēvatā |

tasyā ārādhanē yō yaḥ prasiddhō niyamō bhavēt |

taṃ taṃ japōpavāsādi niyamaṃ samupāśritāḥ |

tattat kṣudraphalaprāpti vāṃchayai vāti vaṃcitāḥ |

asādhāraṇayā pūrvā bhyasta vāsanayā svayā |

vaśīkṛtāḥ parityajyamāṃ bhajaṃtē (a) nyadēvatāḥ||“. (gītābhāvaprakāśamu- 7 - 126 to 136)

(śrīkṛṣṇaparamātmayaṃdu bhakti salupuṭalōnu, anyadēvatalaṃdu - kṣudradēvatalaṃdu - bhakti salupuṭalōnu kalugu ayāśamu - śrama -samānamē ayinappaṭikī śrīkṛṣṇabhaktulu kramamugā anniṃṭikanna utkṛṣṭamainadi, mōkṣamu anupērugala akṣayaphalamu - kṣīṇiṃcani phalamu - nu poṃdedaru. itaradēvatulanu - kṣudradēvatulanu - bhajiṃcuvāru maṃdabhāgyulaguṭavalana saṃsāra rūpamagu - jananamaraṇa rūpamagu - kṣudraphalamunē poṃduduru. parama puruṣārthamaina mōkṣaphalamuniccu śrī kṛṣṇaparamātma bhakti vadalikṣudra dēvatulanu bhajiṃcuṭaku kāraṇamēmanagā, kṣudramulu, anarthamulanu kalugacēyunaviyu agu putrulu, paśuvulu modalagu bhōgamulanu kalugacēyu viṣayamula guṟiṃci kōrika galavārai bhagavaṃtuḍaina nānuṃḍi manassunu trippivēsi, kṣudradēvatalapaṭla manassunu mārci, āyā kōrina phalamulanu iccunaṭṭi dēvatula ārādhanayaṃdu ē yē niyamamulunnavō, āyā japamu, upāsana modalagu niyamamulanu pāṭiṃci, ā kṣudraphalamunu poṃdagōri vāṭicēta vaṃciṃpabaḍinavārai pūrva janmalalō alavaḍina vāsanā rūpamaina naijamu vaśamulōnunnavārai paramātma ayina nannu viḍicipeṭṭi anyadēvatulanu bhajiṃturu.)

“yō yō yāṃ yāṃ tanuṃ bhaktaḥ śraddha yārcitumicchati |

tasya tasyā calāṃ śraddhāṃ tāmēva vida dāmyahaṃ ||” - (śrīmadbhagavadgīta- 7 - 21)

evarevaru ē yē itara dēvatāmūrtini vāri vāri pūrvābhyāsavāsanā balamuvalla kaligina bhaktitō bhajiṃpa talacudurō, vārilō nēnu aṃtarātmayai yuṃḍuṭacēta, vāriki āyā dēvatāmūrtiyaṃdu śraddhanu kaligiṃcedanu, aṭṭivāriki nāyaṃdu bhaktini kalugacēyanu - anēkamaina kōrikalu anu oka grahamucē paṭṭubaḍi yuṃḍinavāru nā bhaktiki adhikārulu - taginavāru – kāru.)

“sa tayā śraddhayā yuktaḥ tasyārādhana mīhatē |

labhatē ca tataḥ kāmān ma yaiva vihitān hi tān ||” (śrīmadbhagavadgīta- 7 - 22)

(aṭṭi kōrikalu kalavāḍu - nēnu atanilō aṃtaryāmigānuṃḍi ataniki iccina śraddhatō ā dēvatā pūja bhaktitō cēyucu ā dēvatanuṃḍi nācē nirmiṃpabaḍina kōrikalanu poṃdunu. a dēvatārūpamulanniyu nā rūpamulē kanuka āyā dēvatārūpamuna āphalamulanu nēnē iccedanu -.)

“aṃtavattu phalaṃ tēṣāṃ tadbhavatyalpa mēthasāṃ |

dēvān dēvayajō yāṃti madbhaktāḥ yāṃti māmapi ||” (śrīmadbhagavadgīta- 7 - 23)

(dēvatulaṃdaru nārūpamulē - vārinipūjiṃcina nannupūjiṃcinaṭlē yagunu - ayinanu, vāru - itara dēvatalanu pūjiṃcuvāru - alpabuddhi galavāraguṭacētanu, vivēkamu lēnivāraguṭacētanu vāru - poṃduphalamucirasthāyi kādu - itara dēvatulu naśiṃcuvāru kanuka vāridvārā kaligeḍu phalamukūḍa naśiṃcunu. nēnu nityuḍanu. aṃducēta nā bhaktulu nāvalana poṃdu phalamu agu advayuḍanagu nannē poṃduduru - īśvaraphalamunu poṃduduru - paramapadamunu poṃduduru - itara dēvatābhaktulaku nā bhaktulaku kōrikalu kaluguṭa samānamē ayinanu vāriddarimadhya tēḍā cālā unnadi. anyadēvatōpāsakulaku bhēdabuddhikaladu - anagā, nēnuvēru, prapaṃcamuvēru anu buddhikalavāru - vāru bhajiṃcu dēvatulukūḍa nēnē anu jñānamu lēnivāru.)

“ahaṃ hi sarva ya jñānāṃ bhōktā ca prabhu rēvaca |”

(samasta yajñamula bhōktanu nēnē - ī saṃgati vāriki teliyadu. aṃducēta itaradēvatābhaktulu ā phalamunu anubhaviṃci marala saṃsāramulō paḍuduru - evaru ā samasta dēvatalalōnu sarvēśvaruḍanaina nannē cūturō cūci nannu bhajiṃturō vāru muktini poṃduduru.

“yāṃti dēvavratā dēvān pitṛūn yāṃti pitṛ vratāḥ |

bhūtāni yāṃti bhūtējyā yāṃti madyājinōpimāṃ ||“. (śrīmadbhagavadgīta- 9 - 25)

(itara dēvatulanu upāsiṃcinavāru āyā dēvatulanu poṃduduru - pitarulanu upāsiṃcuvāru pitṛvulanu poṃduduru – bhūtamulanupāsiṃcuvāru bhūtamulanu poṃduduru - nannu upāsiṃcuvāru nannu cēruduru.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.