← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అర్థజరతీయ న్యాయము arthajaratīya nyāyamu

Original — తెలుగు
  1. అర్థం ముఖం మాత్రం జరత్యాః వృద్ధాయాః, కామయతే, నాం గాని

(న + అంగాని) ఇతి సో (అ) యమర్థ జరతీయ న్యాయః.-

(ముసలిదైన స్త్రీ యొక్క శరీరములోని అంగములలో సగము మాత్రమే - ముఖము మాత్రమే కోరి మిగిలిన అంగములను కోరడు అనునది అర్థజరతీయన్యాయము. దేనినైన సగము ఇష్టపడి మిగిలినదానిని ఇష్టపడక వదలివేయుట తగదు - పూర్తిగ అంగీకరించవలెను.)

  1. కోడిగుడ్డు సగము వండి తినుటకును, మిగిలిన సగము పిల్లగ పొదుగుటకును పనికిరాదు - ఒకే పనికి వాడవలెను - అట్లే ఒక విషయములో నొకభాగము ప్రమాణమని, రెండవభాగము అప్రమాణమని ఉపయోగింపతగదు.)

  2. నవా జీవ పరమార్థభేదమంగీకృత్య అభోక్తృత్వం త్యక్తుం యుక్తం. శ్రుత్వైవ. అభేద సిద్ధ్యర్థం భోక్తృత్వ వారణాత్.

(జీవుడు, పరమాత్మ - ఈ ఇద్దరికి భేదము లేదని అంగీకరించి, భోక్తకాడు అని అంగీకరింపకుండుట యుక్తముకాదు. ఎందుచేతననగా జీవపరమాత్మలకు భేదము లేదనుట సిద్ధించుటకు భోక్తృత్వం లేదని శ్రుతి చెప్పుచున్నది.)

Transliteration
  1. arthaṃ mukhaṃ mātraṃ jaratyāḥ vṛddhāyāḥ, kāmayatē, nāṃ gāni

(na + aṃgāni) iti sō (a) yamartha jaratīya nyāyaḥ.-

(musalidaina strī yokka śarīramulōni aṃgamulalō sagamu mātramē - mukhamu mātramē kōri migilina aṃgamulanu kōraḍu anunadi arthajaratīyanyāyamu. dēninaina sagamu iṣṭapaḍi migilinadānini iṣṭapaḍaka vadalivēyuṭa tagadu - pūrtiga aṃgīkariṃcavalenu.)

  1. kōḍiguḍḍu sagamu vaṃḍi tinuṭakunu, migilina sagamu pillaga poduguṭakunu panikirādu - okē paniki vāḍavalenu - aṭlē oka viṣayamulō nokabhāgamu pramāṇamani, reṃḍavabhāgamu apramāṇamani upayōgiṃpatagadu.)

  2. navā jīva paramārthabhēdamaṃgīkṛtya abhōktṛtvaṃ tyaktuṃ yuktaṃ. śrutvaiva. abhēda siddhyarthaṃ bhōktṛtva vāraṇāt.

(jīvuḍu, paramātma - ī iddariki bhēdamu lēdani aṃgīkariṃci, bhōktakāḍu ani aṃgīkariṃpakuṃḍuṭa yuktamukādu. eṃducētananagā jīvaparamātmalaku bhēdamu lēdanuṭa siddhiṃcuṭaku bhōktṛtvaṃ lēdani śruti ceppucunnadi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.