రూపశూన్యం, - (రూపములేనివాడు, రూపరహితుడు.)
నీల, పీతాదిరూప నిర్ముక్తం. (నీలము, పసుపు మొదలగు రంగుగల రూపములు లేనివాడు.)
నిష్కలత్వాత్ అరూపం. (కళలు లేనందున, రూపము లేనివాడు.)
రూపం విషయః అవిష యం.
(రూపము విషయము - రూపరసగంధములు ఇంద్రియములకు విషయములు. రూపములేనిదికనుక అవిషయం.)
(చైతన్యమొక్కటే తనలోని రసము గలవాడు - ‘చిద్ఘనం’ ఘనీభవించిన చైతన్యమైనవాడు - అందుచేత ఇతర రసములు లేనివాడు - జ్ఞానమొక్కటే, లేక, చైతన్యమొక్కటే తనలోని రసముగా గలవాడు.)
చిదానదేతర రూపరహితం. (చైతన్యము, ఆనందము కాక ఇతర రూపములు లేనివాడు.)
విభుత్వేన పరిచ్ఛేద రూపరహియం.
(అన్నింటికి విభుడు, పాలకుడు, ఈశ్వరుడు అగుటచేత పరిచ్ఛేదమువలన కలిగే రూపములు లేనివాడు.)
(రూపము లేనివాడు - నిర్గుణ, నిరాకార, నిర్విశేష పరబ్రహ్మమగుటవలన శ్రీరామచంద్రపరబ్రహ్మ రూపము లేనివాడు. సత్వరజస్తమములను మూడు గుణములుగల ప్రకృతితోకలిసి సగుణబ్రహ్మ అయినప్పుడు, అవతారములందు సొగసైన రూపముగలవాడు - తనలోనుండియే సమస్త వస్తువులు పుట్టియుండుటచేత సమస్తవస్తువులు తనరూపమే అయినవాడు.)
rūpaśūnyaṃ, - (rūpamulēnivāḍu, rūparahituḍu.)
nīla, pītādirūpa nirmuktaṃ. (nīlamu, pasupu modalagu raṃgugala rūpamulu lēnivāḍu.)
niṣkalatvāt arūpaṃ. (kaḷalu lēnaṃduna, rūpamu lēnivāḍu.)
rūpaṃ viṣayaḥ aviṣa yaṃ.
(rūpamu viṣayamu - rūparasagaṃdhamulu iṃdriyamulaku viṣayamulu. rūpamulēnidikanuka aviṣayaṃ.)
(caitanyamokkaṭē tanalōni rasamu galavāḍu - ‘cidghanaṃ’ ghanībhaviṃcina caitanyamainavāḍu - aṃducēta itara rasamulu lēnivāḍu - jñānamokkaṭē, lēka, caitanyamokkaṭē tanalōni rasamugā galavāḍu.)
cidānadētara rūparahitaṃ. (caitanyamu, ānaṃdamu kāka itara rūpamulu lēnivāḍu.)
vibhutvēna paricchēda rūparahiyaṃ.
(anniṃṭiki vibhuḍu, pālakuḍu, īśvaruḍu aguṭacēta paricchēdamuvalana kaligē rūpamulu lēnivāḍu.)
(rūpamu lēnivāḍu - nirguṇa, nirākāra, nirviśēṣa parabrahmamaguṭavalana śrīrāmacaṃdraparabrahma rūpamu lēnivāḍu. satvarajastamamulanu mūḍu guṇamulugala prakṛtitōkalisi saguṇabrahma ayinappuḍu, avatāramulaṃdu sogasaina rūpamugalavāḍu - tanalōnuṃḍiyē samasta vastuvulu puṭṭiyuṃḍuṭacēta samastavastuvulu tanarūpamē ayinavāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.