(స్వాభావికమై పరిమితిలేని జ్ఞానము, బలము, ఐశ్వర్యము. వీర్యము, శక్తి, తేజస్సు మొదలగు లెక్కకు మించిన కల్యాణగుణములతో సముద్రునివలె నిండియుండువాడు పరమాత్మ. ఈ గుణములలో ముఖ్యమైనది భగవంతుడు అను పదమునకు కలిగిన జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజస్సులు మొదలగునవి అని చెప్పుటవలన సౌశీల్యము మొదలగునవి సంగ్రహముగా చేప్పబడినట్లే. సృష్టిస్థితులకు కారణభూతమైన సంకర్షణవ్యూహము, ప్రద్యుమ్నవ్యూహము, అనిరుద్ధవ్యూహము అను వ్యూహ త్రయములో జ్ఞానబలాదులు అను గుణములు వాటి వాటి కార్యము చేయుటలో ఉన్ముఖమై యుండుటచేత జ్ఞానబలాదుగుణములు కలిగియున్నట్లు చెప్పబడియున్నవి. భగవంతుడు తానే స్వయముగ అన్నింటినీ, అన్నివిధముల అన్ని వేళల కలుగ చేయు చున్నాడు, అట్లు కలుగచేయుదాని నంతను ధరించుచున్నాడు - ధరించుచూ వాటిని వాటి వాటి పనులలో నియమించుచున్నాడు -;ధరించి, నియమించి తాని మట్టుకు - ఇంతచేసినను - శిధిలముకాడు - క్షీణించడు, అఘటితమును ఘటించును, సంభవముకానిదానిని సంభవించునట్లు చేయును.ఈ పనులలో ఇతరుల సహాయమవసరములేక తానొక్కడే చేయుచుండును - ఇవి భగవంతుని యొక్క అసంఖ్యాకమైన కల్యాణగుణములు).
(సముద్రములో లేక్కలేనన్ని రత్నములుండును - అట్లే ఏ విధముగానైనను అంతములేనటువంటి భగవంతునియొక్క రూపములు, గుణములు లెక్కలేనన్నియే - పరిమితి - ఇవి యిన్నియని పరిమితి - చెప్పుటకు వీలుకానివి భగవతునియొక్క గుణములను లెక్కపెట్టనలవికాదు - గుణములన సముద్రములోని రత్నములతో పోల్చుటవలన మనోహరమైన గుణములని తెలియనగును. అట్టిగుణములు కలవాడు భగవంతుడు అని చెప్పుటవలన అసంఖ్యాకరత్నములుగల సముద్రమువలె గంభీరమైనవాడు, లోతైనవాడు - ఎన్నియేని కల్యాణగుణములు కలవాడు అని అభిప్రాయము). (చూడుము - ‘కల్యాణగుణములు’, ‘భగవంతుడు’).
(svābhāvikamai parimitilēni jñānamu, balamu, aiśvaryamu. vīryamu, śakti, tējassu modalagu lekkaku miṃcina kalyāṇaguṇamulatō samudrunivale niṃḍiyuṃḍuvāḍu paramātma. ī guṇamulalō mukhyamainadi bhagavaṃtuḍu anu padamunaku kaligina jñāna, bala, aiśvarya, vīrya, śakti, tējassulu modalagunavi ani ceppuṭavalana sauśīlyamu modalagunavi saṃgrahamugā cēppabaḍinaṭlē. sṛṣṭisthitulaku kāraṇabhūtamaina saṃkarṣaṇavyūhamu, pradyumnavyūhamu, aniruddhavyūhamu anu vyūha trayamulō jñānabalādulu anu guṇamulu vāṭi vāṭi kāryamu cēyuṭalō unmukhamai yuṃḍuṭacēta jñānabalāduguṇamulu kaligiyunnaṭlu ceppabaḍiyunnavi. bhagavaṃtuḍu tānē svayamuga anniṃṭinī, annividhamula anni vēḷala kaluga cēyu cunnāḍu, aṭlu kalugacēyudāni naṃtanu dhariṃcucunnāḍu - dhariṃcucū vāṭini vāṭi vāṭi panulalō niyamiṃcucunnāḍu -;dhariṃci, niyamiṃci tāni maṭṭuku - iṃtacēsinanu - śidhilamukāḍu - kṣīṇiṃcaḍu, aghaṭitamunu ghaṭiṃcunu, saṃbhavamukānidānini saṃbhaviṃcunaṭlu cēyunu.ī panulalō itarula sahāyamavasaramulēka tānokkaḍē cēyucuṃḍunu - ivi bhagavaṃtuni yokka asaṃkhyākamaina kalyāṇaguṇamulu).
(samudramulō lēkkalēnanni ratnamuluṃḍunu - aṭlē ē vidhamugānainanu aṃtamulēnaṭuvaṃṭi bhagavaṃtuniyokka rūpamulu, guṇamulu lekkalēnanniyē - parimiti - ivi yinniyani parimiti - ceppuṭaku vīlukānivi bhagavatuniyokka guṇamulanu lekkapeṭṭanalavikādu - guṇamulana samudramulōni ratnamulatō pōlcuṭavalana manōharamaina guṇamulani teliyanagunu. aṭṭiguṇamulu kalavāḍu bhagavaṃtuḍu ani ceppuṭavalana asaṃkhyākaratnamulugala samudramuvale gaṃbhīramainavāḍu, lōtainavāḍu - enniyēni kalyāṇaguṇamulu kalavāḍu ani abhiprāyamu). (cūḍumu - ‘kalyāṇaguṇamulu’, ‘bhagavaṃtuḍu’).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.