← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అసిధారా వ్రతము asidhārā vratamu

Original — తెలుగు

“యువా యువత్యాసార్థం యన్ముగ్ధ భర్తృక వదా చరేత్ |

అంతర్నివృత్త సంగాస్యా అసిధారా వ్రతం హితత్ ||”

(యౌవనవంతుడుయౌవనవతియగు తన సతితో కలిసియుండియు, మనసులో సంభోగవాంచలేక, మన్మధవికారమును పొందకయుండు వ్రతము - నియమము).

  1. శయనే మధ్యే ఖడ్గం నిధాయ స్త్రీ పుంసౌ యత్ర బ్రహ్మచర్యేణ స్వపతః తదసిధారావ్రతం.

(స్త్రీ పురుషులు ఇద్దరు ఒకే పరుపుమీద పడుకొని, ఇద్దరి మధ్య ఖడ్గమునుంచి, బ్రహ్మచర్యమును పాటించి నిదురించుటాసిధారావ్రతము - ఏ మాత్రము ఇద్దరు దగ్గరకు చచ్చినను కత్తి తగులునని భయముచేత దూరముగానుండి, కలుసుకొనకుండుట).

  1. అసిధారాయాం స్థితిరివ దుష్కరం వ్రతం -

(కత్తి యొక్క పదునుగనుండు అంచుమీద నిలబడునట్లు, లేక దానిమీద నిలబడి సాము చేయుటవలెమిక్కిలి కష్టమైన వ్రతము - ఏ మాత్రము తొట్రుబాటు లేనిది).

  1. అవ్యభిచరితం వ్రతం - అసిధారవన్నిశితత్వాత్, అసిధారా సంచారవత్ సావధానే నైకాగ్రతయా విధాయ విధాయత్వార్వా అసిధారా వ్రతం.

(వ్యభచరించని వ్రతము - ఏ పరిస్థితిలోనైనను నియమము నతిక్రమించని వ్రతము. కత్తి పదును వలె కఱకుగునుండుటవలన, కత్తిమీద నడచునట్లు సావధానముగను, జాగ్రత్తతోను, ఏకాగ్రబుద్ధితోను, తదేక ధ్యానముతో చేయు వ్రతము).

  1. “నాతిగల బ్రహ్మచర్యము -”
Transliteration

“yuvā yuvatyāsārthaṃ yanmugdha bhartṛka vadā carēt |

aṃtarnivṛtta saṃgāsyā asidhārā vrataṃ hitat ||”

(yauvanavaṃtuḍuyauvanavatiyagu tana satitō kalisiyuṃḍiyu, manasulō saṃbhōgavāṃcalēka, manmadhavikāramunu poṃdakayuṃḍu vratamu - niyamamu).

  1. śayanē madhyē khaḍgaṃ nidhāya strī puṃsau yatra brahmacaryēṇa svapataḥ tadasidhārāvrataṃ.

(strī puruṣulu iddaru okē parupumīda paḍukoni, iddari madhya khaḍgamunuṃci, brahmacaryamunu pāṭiṃci niduriṃcuṭāsidhārāvratamu - ē mātramu iddaru daggaraku caccinanu katti tagulunani bhayamucēta dūramugānuṃḍi, kalusukonakuṃḍuṭa).

  1. asidhārāyāṃ sthitiriva duṣkaraṃ vrataṃ -

(katti yokka padunuganuṃḍu aṃcumīda nilabaḍunaṭlu, lēka dānimīda nilabaḍi sāmu cēyuṭavalemikkili kaṣṭamaina vratamu - ē mātramu toṭrubāṭu lēnidi).

  1. avyabhicaritaṃ vrataṃ - asidhāravanniśitatvāt, asidhārā saṃcāravat sāvadhānē naikāgratayā vidhāya vidhāyatvārvā asidhārā vrataṃ.

(vyabhacariṃcani vratamu - ē paristhitilōnainanu niyamamu natikramiṃcani vratamu. katti padunu vale kaṟakugunuṃḍuṭavalana, kattimīda naḍacunaṭlu sāvadhānamuganu, jāgrattatōnu, ēkāgrabuddhitōnu, tadēka dhyānamutō cēyu vratamu).

  1. “nātigala brahmacaryamu -”
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.