← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అష్టావరణములు aṣṭāvaraṇamulu

Original — తెలుగు

ప్రకృతి మహదహంకారసహితాః పృధివ్యాదిపంచభూతస్వరూపాః -

(ఆత్మ కేవలుడు - అనగా, ఏ ఉపాధితోనూకూడి ఉండని ఏకరసమైనవాడు. సృష్టిచేయుటలో ఆ పరమాత్మకు ఎనిమిది ఉపాధులు ఆవరించనవి. అవి సృష్టిక్రమములో ఒకటి తర్వాత ఒకటిగా ఆవరించినవి. అవి ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, పంచభూతములు - అనగా ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఇవి ఒకదానిలోనుండి ఒకటి పుట్టినవి - ఆకాశములోనుండి వాయువు ఈ రీతిగా - ఈవి భూమి మొదలు వెనుక, వెనుకవి ఒకదానికన్ననొకటి సూక్ష్మము. ముందు పుట్టినవి తర్వాత వాటిలో ఇమిడియున్నవి - కారణవస్తువులు కార్యవస్తువులో ఇమిడియున్నవి.ఇవి అన్నియు ఉల్లిపాయపొరలవలె అన్నింటికీ లోపల ఉన్న ఆత్మను ఆవరించి కప్పిపుచ్చి యున్నవి. అందుచేతనే ఇవి ఆత్మకు ఆవరణములని చెప్పబడుచున్నవి. ఇవియే ఆత్మకు ఉపాధులు - ఆత్మకు శరీరమువంటివి - ఆత్మ ఉండుచోటు).

Transliteration

prakṛti mahadahaṃkārasahitāḥ pṛdhivyādipaṃcabhūtasvarūpāḥ -

(ātma kēvaluḍu - anagā, ē upādhitōnūkūḍi uṃḍani ēkarasamainavāḍu. sṛṣṭicēyuṭalō ā paramātmaku enimidi upādhulu āvariṃcanavi. avi sṛṣṭikramamulō okaṭi tarvāta okaṭigā āvariṃcinavi. avi prakṛti, mahattatvamu, ahaṃkāramu, paṃcabhūtamulu - anagā ākāśamu, vāyuvu, agni, nīru, bhūmi, ivi okadānilōnuṃḍi okaṭi puṭṭinavi - ākāśamulōnuṃḍi vāyuvu ī rītigā - īvi bhūmi modalu venuka, venukavi okadānikannanokaṭi sūkṣmamu. muṃdu puṭṭinavi tarvāta vāṭilō imiḍiyunnavi - kāraṇavastuvulu kāryavastuvulō imiḍiyunnavi.ivi anniyu ullipāyaporalavale anniṃṭikī lōpala unna ātmanu āvariṃci kappipucci yunnavi. aṃducētanē ivi ātmaku āvaraṇamulani ceppabaḍucunnavi. iviyē ātmaku upādhulu - ātmaku śarīramuvaṃṭivi - ātma uṃḍucōṭu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.