← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అతీంద్రియ జ్ఞాని atīṃdriya jñāni

Original — తెలుగు
  1. అతీంద్రియాః ఇంద్రియమతి క్రాంతాః దేశకాలస్వరూపా ద్వి

ప్రకృష్టార్ధః, తేషాం జ్ఞానం అస్య అస్తీతి - సర్వార్థ ద్రష్టా ఇత్యర్ధః.

(అతీంద్రియములు అనగా ఇంద్రియములను అతిక్రమించునవి, ఇంద్రియ గోచరము కానివి - అనగా, దేశము, కాలము, స్వరూపము మొదలగునవి. వాటియొక్క జ్ఞానము కలవాడు, వాటిని ఎఱిగినవాడు - సమస్తమును చూచువాడు, కనిపెట్టువాడు.)

  1. సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాత్మను సాధారణమైన ఇంద్రియములతో చూచుటకు అలవికాదు; దివ్య దృష్టి దివ్యజ్ఞానము కలవారు చూడగలుగుదురు. “తద్విష్ణోః పరమం పదం సదా పస్యంతి సూరయః” (పరమాత్మ అయిన ఆ విష్ణునియొక్క ఉత్కృష్టమైన పదమును, స్థానమును, రూపమును సూరిజనులు - యోగీశ్వరులు, బ్రహ్మజ్ఞానము కలవారు, మహా భక్తులు అయినవారు ఎల్లపుడు చూచుచుందురు - అనగా, వారు అతీంద్రియ జ్ఞానమును సంపాదించినవారు.)

  2. “ఏష సర్వేషు భూతేషు గూఢాత్మా న ప్రకాశతే |

దృశ్యతే త్వగ్ర్ర్యా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మ దర్శిభిః ||”

(సమస్త భూతములందు ఈ పరమాత్మ గూఢముగా ఉండి, ఉన్నట్లు పైకి ప్రకాశముగా కనబడడు. గొప్ప కుశాగ్రబుద్ధి కలిగి - తీక్ష్ణమైన బుద్ధికలిగి, సూక్ష్మాతి సూక్ష్మమైన వస్తువును చూడగలిగిన శక్తి గలవారు అతనిని చూడగలుగుచున్నారు. ఇట్టివారుఅతీంద్రియ జ్ఞానులు.)

  1. అతీత వాక్య పథః = 1. అతీతో వాక్పథో యేనసః అవాఙ్మానస గోచరః ఇత్యర్ధః“యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సః” ఇతి శ్రుతేః.

(వాక్పథమునకతీతుడైన వాడు - వాక్కుకు, మనసుకు గోచరము కానివాడు - “దానిని -ఆత్మను పొందకుండ వాక్కు, మనసు విఫలమై తిరిగి వెనుకకు మరలిపోవు చున్నది”అని శ్రుతి చెప్పుచున్నది - అనగా, వాక్కు చేత చెప్పుటకుగాని, మనస్సుచేనూహించుటకుగాని వీలుకానివాడు.)

Transliteration
  1. atīṃdriyāḥ iṃdriyamati krāṃtāḥ dēśakālasvarūpā dvi

prakṛṣṭārdhaḥ, tēṣāṃ jñānaṃ asya astīti - sarvārtha draṣṭā ityardhaḥ.

(atīṃdriyamulu anagā iṃdriyamulanu atikramiṃcunavi, iṃdriya gōcaramu kānivi - anagā, dēśamu, kālamu, svarūpamu modalagunavi. vāṭiyokka jñānamu kalavāḍu, vāṭini eṟiginavāḍu - samastamunu cūcuvāḍu, kanipeṭṭuvāḍu.)

  1. sūkṣmāti sūkṣmamaina paramātmanu sādhāraṇamaina iṃdriyamulatō cūcuṭaku alavikādu; divya dṛṣṭi divyajñānamu kalavāru cūḍagaluguduru. “tadviṣṇōḥ paramaṃ padaṃ sadā pasyaṃti sūrayaḥ” (paramātma ayina ā viṣṇuniyokka utkṛṣṭamaina padamunu, sthānamunu, rūpamunu sūrijanulu - yōgīśvarulu, brahmajñānamu kalavāru, mahā bhaktulu ayinavāru ellapuḍu cūcucuṃduru - anagā, vāru atīṃdriya jñānamunu saṃpādiṃcinavāru.)

  2. “ēṣa sarvēṣu bhūtēṣu gūḍhātmā na prakāśatē |

dṛśyatē tvagrryā buddhyā sūkṣmayā sūkṣma darśibhiḥ ||”

(samasta bhūtamulaṃdu ī paramātma gūḍhamugā uṃḍi, unnaṭlu paiki prakāśamugā kanabaḍaḍu. goppa kuśāgrabuddhi kaligi - tīkṣṇamaina buddhikaligi, sūkṣmāti sūkṣmamaina vastuvunu cūḍagaligina śakti galavāru atanini cūḍagalugucunnāru. iṭṭivāruatīṃdriya jñānulu.)

  1. atīta vākya pathaḥ = 1. atītō vākpathō yēnasaḥ avāṅmānasa gōcaraḥ ityardhaḥ”yatō vācō nivartaṃtē aprāpya manasā saḥ” iti śrutēḥ.

(vākpathamunakatītuḍaina vāḍu - vākkuku, manasuku gōcaramu kānivāḍu - “dānini -ātmanu poṃdakuṃḍa vākku, manasu viphalamai tirigi venukaku maralipōvu cunnadi”ani śruti ceppucunnadi - anagā, vākku cēta ceppuṭakugāni, manassucēnūhiṃcuṭakugāni vīlukānivāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.