← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అత్యంత సుఖం atyaṃta sukhaṃ

Original — తెలుగు
  1. “అపరిమితం సుఖం” (శ్రీరామానుజః)

  2. “అత్యంతం ఉత్కృష్టం నిరతిశయం సుఖం” (శ్రీ శంకరః)

(అపరిమితమైన సుఖము, హద్దులేనిసుఖము, మిక్కిలి ఉత్కృష్టమైనది, శ్రేష్టమైనది, అన్నింటిని మించినది అయిన సుఖము; (బ్రహ్మానందసుఖము ; మోక్షానందము.)

  1. “యోవై భూమా తత్సుఖం” (అంతకు మించిన సుఖము లేనిది. దేశకాలవస్తు పరిచ్ఛేద రహితమగు అనంత స్వరూపము కలవి.)

  2. “యధా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే |

నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా |

యధా దీపో నివాతస్తో నేంగతే సోపమా స్మృతా |

యోగినో యతచిత్త స్య యుం జతో యోగమాత్మనః |

యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా |

యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్ముని తుష్యతి |

సుఖమాత్యం తికం యత్తద్బుద్ధిగ్రాహ్య మతీంద్రియం |

వేత్తి యత్ర న చైవాయంస్థితి శ్చలతి తత్వతః |

యం లబ్ద్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః |

యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ||. (శ్రీమద్భగవద్గీత- 6 -18 to 22)

(ఏ విధమైన కోరికలందు స్పృహలేకయుండి, మనస్సును పరమాత్మయందే నిలకడగా నుంచువాడు యుక్తుడు అనబడును - యోగయుక్తుడు అనబడును ఇటువంటి యోగము నభ్యసించువాడు, గాలిలేనిచోట నున్న దీపము చలించనట్లు ఉండును. అట్టి యోగము చేత స్వాధీనము చేసుకోబడిన మనస్సు గలవాడు. తన మనసులో పరమాత్మనే ధ్యానించుచు, పరమాత్మయందే సంతోషించుచుండును. ఇటువంటి యోగములో నిశ్చలముగానున్నవాడు ఇంద్రియములచేత గ్రహించుట కతీతమైనదిన్నీ, బుద్ధిచేతనే - బ్రహ్మజ్ఞానముచేతనే - గ్రహించతగినదిన్నీ, అయిన అత్యంత సుఖమును తత్వతః - యదార్ధముగా- నిజస్థితిని - తెలుసుకొనును. ఆ స్థితిలో నున్నవాడు ఇంతకంటె అధికమైన సుఖము మఱిలేదని తలచును. ఎట్టి పరిస్థితిలోను - ఎటువంటి దుఃఖము - దుఃఖకారణము - కలిగినను ఆ స్థితినుండి చలించడు. అందుచేత అట్టివాడు పొందు ఆ సుఖము ఆత్యంతికసుఖము.

  1. “సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వా నశేషతః |

మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః |

శనైః శనైరు పరమేద్బుద్ధ్యా ధృతి గృహీతయా |

ఆత్మ సంస్థం మనః కృత్వా ననించి దపి చింతయేత్ |

యతో యతో నిశ్చరతి మనశ్చంచల మస్థిరం |

తతస్తతో నియమ్యై తదాత్మన్యేవ వశం నయేత్ |

ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖ ముత్తమం |

ఉపైతి శాంత రజసం బ్రహ్మ భూత మ కల్మషం |

యుం జన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః |

సుఖేన బ్రహ్మ సంస్పర్శ మత్యంతం సుఖమశ్నుతే ||” (శ్రీ మద్భగవద్గీత- 6 - 24 to 28)

(సమస్తమైన కోరికలను విడిచిపెట్టి నిశ్శేషముగా - ఏమీ మిగిలియుండకుండునట్లు - విడిచిపెట్టి, సమస్త విషయములవైపు పోవకుండా ఉండునట్లు మనస్సును, ఇంద్రియములను కట్టిపెట్టి - తనస్వాధీనములో నుంచుకొని - ధైర్యము,నిలకడ కలిగిన బుద్ధిచేత ఉపరతి పొందవలెను - మనస్సును ఆత్మయందే యుంచి, ఇతరమును దేనిని చింతింపక యుండవలెను. మనస్సు ఎఫ్ఫు డెప్పుడు స్థిరముగనుండక చంచలముగా నుండునో, అప్పు డప్పుడు మనస్సు మరల దానిని ఆత్మయందే నియమించి వశము చేసుకోవలెను - మనస్సు దాని వృత్తులవెంట పరుగెత్తకుండునట్లు చేయుట వలన శాంతి పొందిన మనస్సు కలిగి, రజోగుణము నశించినటువంటిన్నీ, ఏ విధమైన కల్మషం లేనటువంటిన్నీ, బ్రహ్మ భూతుడైనటువంటిన్నీ - అనగా, ఈ సర్వము బ్రహ్మ వస్తువేయను తెలుసుకొనినవాడిని, ఉత్తమ సుఖము తనంతట అదే వచ్చి పొందును. అనగా, ఈ కనబడు ప్రపంచము మిధ్య - లేనిదే - అంతా భగవంతుడే అను నిశ్చయము కలిగినందువలన కలుగు సుఖము అంతము లేని సుఖము, శాశ్వతసుఖము. స్వయముగానే, అప్రయత్నముగానే ఆవిర్భవించును.)

Transliteration
  1. “aparimitaṃ sukhaṃ” (śrīrāmānujaḥ)

  2. “atyaṃtaṃ utkṛṣṭaṃ niratiśayaṃ sukhaṃ” (śrī śaṃkaraḥ)

(aparimitamaina sukhamu, haddulēnisukhamu, mikkili utkṛṣṭamainadi, śrēṣṭamainadi, anniṃṭini miṃcinadi ayina sukhamu; (brahmānaṃdasukhamu ; mōkṣānaṃdamu.)

  1. “yōvai bhūmā tatsukhaṃ” (aṃtaku miṃcina sukhamu lēnidi. dēśakālavastu paricchēda rahitamagu anaṃta svarūpamu kalavi.)

  2. “yadhā viniyataṃ cittamātmanyēvāvatiṣṭhatē |

nispṛhaḥ sarvakāmēbhyō yukta ityucyatē tadā |

yadhā dīpō nivātastō nēṃgatē sōpamā smṛtā |

yōginō yatacitta sya yuṃ jatō yōgamātmanaḥ |

yatrō paramatē cittaṃ niruddhaṃ yōgasēvayā |

yatra caivātmanātmānaṃ paśyannātmuni tuṣyati |

sukhamātyaṃ tikaṃ yattadbuddhigrāhya matīṃdriyaṃ |

vētti yatra na caivāyaṃsthiti ścalati tatvataḥ |

yaṃ labdvā cāparaṃ lābhaṃ manyatē nādhikaṃ tataḥ |

yasmin sthitō na duḥkhēna guruṇāpi vicālyatē ||. (śrīmadbhagavadgīta- 6 -18 to 22)

(ē vidhamaina kōrikalaṃdu spṛhalēkayuṃḍi, manassunu paramātmayaṃdē nilakaḍagā nuṃcuvāḍu yuktuḍu anabaḍunu - yōgayuktuḍu anabaḍunu iṭuvaṃṭi yōgamu nabhyasiṃcuvāḍu, gālilēnicōṭa nunna dīpamu caliṃcanaṭlu uṃḍunu. aṭṭi yōgamu cēta svādhīnamu cēsukōbaḍina manassu galavāḍu. tana manasulō paramātmanē dhyāniṃcucu, paramātmayaṃdē saṃtōṣiṃcucuṃḍunu. iṭuvaṃṭi yōgamulō niścalamugānunnavāḍu iṃdriyamulacēta grahiṃcuṭa katītamainadinnī, buddhicētanē - brahmajñānamucētanē - grahiṃcataginadinnī, ayina atyaṃta sukhamunu tatvataḥ - yadārdhamugā- nijasthitini - telusukonunu. ā sthitilō nunnavāḍu iṃtakaṃṭe adhikamaina sukhamu maṟilēdani talacunu. eṭṭi paristhitilōnu - eṭuvaṃṭi duḥkhamu - duḥkhakāraṇamu - kaliginanu ā sthitinuṃḍi caliṃcaḍu. aṃducēta aṭṭivāḍu poṃdu ā sukhamu ātyaṃtikasukhamu.

  1. “saṃkalpa prabhavān kāmān tyaktvā sarvā naśēṣataḥ |

manasaivēṃdriya grāmaṃ viniyamya samaṃtataḥ |

śanaiḥ śanairu paramēdbuddhyā dhṛti gṛhītayā |

ātma saṃsthaṃ manaḥ kṛtvā naniṃci dapi ciṃtayēt |

yatō yatō niścarati manaścaṃcala masthiraṃ |

tatastatō niyamyai tadātmanyēva vaśaṃ nayēt |

praśāṃta manasaṃ hyēnaṃ yōginaṃ sukha muttamaṃ |

upaiti śāṃta rajasaṃ brahma bhūta ma kalmaṣaṃ |

yuṃ jannēvaṃ sadātmānaṃ yōgī vigatakalmaṣaḥ |

sukhēna brahma saṃsparśa matyaṃtaṃ sukhamaśnutē ||” (śrī madbhagavadgīta- 6 - 24 to 28)

(samastamaina kōrikalanu viḍicipeṭṭi niśśēṣamugā - ēmī migiliyuṃḍakuṃḍunaṭlu - viḍicipeṭṭi, samasta viṣayamulavaipu pōvakuṃḍā uṃḍunaṭlu manassunu, iṃdriyamulanu kaṭṭipeṭṭi - tanasvādhīnamulō nuṃcukoni - dhairyamu,nilakaḍa kaligina buddhicēta uparati poṃdavalenu - manassunu ātmayaṃdē yuṃci, itaramunu dēnini ciṃtiṃpaka yuṃḍavalenu. manassu ephphu ḍeppuḍu sthiramuganuṃḍaka caṃcalamugā nuṃḍunō, appu ḍappuḍu manassu marala dānini ātmayaṃdē niyamiṃci vaśamu cēsukōvalenu - manassu dāni vṛttulaveṃṭa parugettakuṃḍunaṭlu cēyuṭa valana śāṃti poṃdina manassu kaligi, rajōguṇamu naśiṃcinaṭuvaṃṭinnī, ē vidhamaina kalmaṣaṃ lēnaṭuvaṃṭinnī, brahma bhūtuḍainaṭuvaṃṭinnī - anagā, ī sarvamu brahma vastuvēyanu telusukoninavāḍini, uttama sukhamu tanaṃtaṭa adē vacci poṃdunu. anagā, ī kanabaḍu prapaṃcamu midhya - lēnidē - aṃtā bhagavaṃtuḍē anu niścayamu kaliginaṃduvalana kalugu sukhamu aṃtamu lēni sukhamu, śāśvatasukhamu. svayamugānē, aprayatnamugānē āvirbhaviṃcunu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.