అమలినో, యోగపురుషః.
(బ్రహ్మముతో ఆత్మను అనుసంధానము చేయుట యందు తత్పరుడై యుండి, బాహ్య ప్రపంచమును మఱచి, జీవన్ముక్తుడనుపించుకొనియుండి, దోషములేని యోగ పురుషుడు.)
బ్రహ్మవిత్ (బ్రహ్మజ్ఞాని) (బ్రహ్మ తత్వమును తెలిసినవాడు.)
వల్కలాజిన ధారీ.
అసంస్కృత దేహః (దేహమును పోషించుటయందు - శుభ్రముగానుంచుటయందు ఆశలేనివాడు.)
సన్యాసి, దిగంబరసన్యాసి; సన్యాసులలో చరమస్థితిని చేరినవాడు; సన్యాసానంతరము దండము, కమండలము మొదలగువాటిని విడిచిన యోగి..
అనజ్ఞయా జనైః త్యక్తో యః.
(తన నిజస్థితిని తెలియకపోవుటచేత జనులచేత విడువబడినవాడు.)
అతి వర్ణాశ్రమీ యోగీ అవధూతః స ఉచ్యతే ||“. (అవధూతోపనిషత్)
(వర్ణాశ్రమధర్మములను విడిచిపెట్టి ఆత్మయందే నిష్ఠగలయోగి అవధూత అని చెప్పబడును - వానినే అతి వర్ణాశ్రమీ అందురు - వర్ణాశ్రమ ధర్మములను అతిక్రమించిన యోగి.)
తత్వమస్యాది లక్షణత్వాత్ అవదూత ఇతీర్యతే ||“. (అవధూతోపనిషత్)
(సంసార బంధమును విడిచిపెట్టుటచేతను, “తత్వమసి” అను మహావాక్యార్థమును లక్ష్యముగానుంచు కొనుటచేతను, ఉత్తముడగుటచేతను అవధూతయని చెప్పబడుచున్నాడు.) (సన్యాసోపనిషత్)
(ఏ విధమైన నియమము లేనివాడు - అజగరవృత్తిననుసరించి ఏది దొరికితే దానినే ఆహారముగా గొని పరమాత్మానుసంధానమందు మగ్నుడైయుండువాడు.)
“సీ. ప్రతినిమేషము బరబ్రహ్మంబు నీక్షించి మది జొక్కి వెలుపల మఱచువాడు
కమలములమీద భృంగములకైవడి మోముపై నెఱసిన కేశపటలివాడు
గెఱువాసి, మాయనంగీకరించిన భంగి వసనంబు కట్టకవచ్చువాడు
సంగికాడని వెంట జాటు భూతములు నావచ్చు బాలురహస శబ్దములవాడు
తే. మహిత పదజానుజం ఘోరుమధ్యహస్త
బాహు వక్షోగళానన ఫాలకర్ణ
నాసికా గండ మస్తక నయన యుగళు
డైన యవధూతమూర్తి వాడరుగుదెంచె.”
“ఉ. ఈరని లోకులం గినిసి యెగ్గులు వల్కనివాడు, గోరికల్
గోరనివాడు, గూటువల్ గూడనివాడు, వృధాప్రపంచమున్
చేరనివాడు, దైవగతి జేరిన లాభము జూచి తుష్టుడై
నేరనివాని చందముననేర్పులు మాపనివాడు, వెండియున్“.
“ఆ. వెఱ్ఱి తనముమాని విజ్ఞానమూర్తియై
బ్రహ్మభావమునను బర్యటింప
వెఱ్ఱియంచు శుకుని వెంటనెతెంతురు
వేలదులర్భకులును వెఱ్ఱులగుచు“. (శ్రీమదాంధ్రమహాగవతము 1 - 19 - 479, 480, 482)
“వ. --- వ్యాసపుత్రుడైన శుకుండును మహాయోగి, సమదర్శనుండేకాంతమతి, మాయాశయనంబువలనం దెలిసినవాడు, గూఢుండు, మూఢుని క్రియనుండు నిరస్త భేదుండు ---.”
“వ. --- నీ పుత్రుండు స్త్రీ పురుషులనెడు భేద దృష్టి లేకయుండు, మఱియు నతడు నిర్వికల్పుండు ---”
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 4 - 39, 41)
అవధూతమార్గమందుండువాడు లోకమందు మిక్కిలి దుర్లభుడు, ఇటువంటివారు చాలామంది ఉండరు - ఎవడో ఒకడున్నయడల అతను నిత్యము పవిత్రమైనవాడు, వైరాగ్యము మూర్తీభవించినట్లుగా ఉండును. అతనే వేద పురుషుడు అని జ్ఞానులు తలచెదరు. మహాపురుషుడైనవాని చిత్తము నాయందే లగ్నమై యుండును. నేను వానియందే యుండును. అట్టివాడు క్రమముగా కుటీచకుడై, తర్వాత బహూదకుడై, తర్వాత హంసుడై, పరమ హంసయై, స్వరూపాను సంధానముచేత ప్రపంచమంటటినీ తెలుసుకొని, దండము, కమండలము, కటిసూత్రము, కౌపీనము, శరీరము నాచ్ఛాదించు ఇతరవస్తువులను - కప్పుకొనునవి -,వాటికి సంబంధించిన విధ్యుక్త ధర్మములను విడిచిపెట్టి, దిగంబరుడై - బట్టలేనివాడై, దిక్కులే బట్టగాగలవాడై - మాసిన చినిగిన వాటినైనను విడిచిపెట్టి, క్షౌరము, స్నానము, బొట్టు మొదలగువాటిని విడిచి, లోకమునకు సంబంధించినవి, వేదమునకు సంబంధించినవి యగు కార్యములు మాని, అంతటా పుణ్యము, పాపము అనువాటిని విసర్జించి, జ్ఞానాజ్ఞానములను విడిచి, శీతోష్ణములను, మానావమానములను, సుఖదుఃఖములను జయించి, వాసనాత్రయములతో కూడా, నిందానిందలు, గర్వము, మత్సరము, దంభము, దర్పము, ఇచ్ఛాద్వేషము, కామము, క్రోధము, లోభము, మోహము,హర్షము, అనుర్ష, అసూయ, ఆత్మ సం రక్షణము మొదలగువాటిని దగ్ధముచేసి, తనశరీరమును కుణపాకారముగా చూచుచూ, అప్రయత్నముగా, నియమముతో లాభాలాభములను సమముగా చూచుచూ, గోవృత్తివలె ఏది దొరికిన దానితోనే ప్రాణమును ధరించియుండుచు, సమస్తవిద్యలందు పాండిత్యమును భస్మముచేసి, తనరూపమును దాచుకొనుచూ, సర్వఓత్కృష్టమైన, సమస్తమునకు ఆత్మయైన అద్వైతభావము కల్పించికొని, ఇందుకు వ్యతిరేకమైనది ఏదియులేదని, దుఃఖముచేత ఉద్విగ్నమనస్కుడు కాక, సుఖముచేత సంతోషించక, వాటియందు ఏ విధమైఅన స్పృహలేనివాడై, శుభా శుభములను గణింపక, ఇంద్రియములన్నింటికీ ఉపరతుడై, పూర్వాశ్రమములందు కలిగిన ఆచార విద్యాధర్మముల ప్రభావమును స్మరణలోనికి తెచ్చుకొనక, వర్ణాశ్రమాచారములను వదలి,పగలనక, రాత్రియనక, నిద్రలేక ఎల్లపుడు సంచరించుచు, దేహమాత్రమే మిగిలియున్నవాడై, పిచ్చివాడువలెను, దయ్యముపట్టినవాడువలెను, ఒక్కడే తిరిగుచు, మాటలాడుటమాని భగవంతుని స్వస్వరూపమును ధ్యానించుచు, దేనియందును ఆలంబనము చేయక, స్వాత్మనిష్ఠలోనుండుటచేత అన్నింటినీ మరచి, తురీయాతీతమైన అవధూతరూపముతో అద్వైతనిష్ఠాపరుడై, ప్రణవము మనసులోనుంచి ధ్యానించుచూ, జపించుచూ, దేహత్యాగము చేయువాడు అవధూత యనబడును - అతనే కృత కృత్యుడు ” అని తురీయాతీతోపనిషత్తు చెప్పుచున్నది.)
amalinō, yōgapuruṣaḥ.
(brahmamutō ātmanu anusaṃdhānamu cēyuṭa yaṃdu tatparuḍai yuṃḍi, bāhya prapaṃcamunu maṟaci, jīvanmuktuḍanupiṃcukoniyuṃḍi, dōṣamulēni yōga puruṣuḍu.)
brahmavit (brahmajñāni) (brahma tatvamunu telisinavāḍu.)
valkalājina dhārī.
asaṃskṛta dēhaḥ (dēhamunu pōṣiṃcuṭayaṃdu - śubhramugānuṃcuṭayaṃdu āśalēnivāḍu.)
sanyāsi, digaṃbarasanyāsi; sanyāsulalō caramasthitini cērinavāḍu; sanyāsānaṃtaramu daṃḍamu, kamaṃḍalamu modalaguvāṭini viḍicina yōgi..
anajñayā janaiḥ tyaktō yaḥ.
(tana nijasthitini teliyakapōvuṭacēta janulacēta viḍuvabaḍinavāḍu.)
ati varṇāśramī yōgī avadhūtaḥ sa ucyatē ||“. (avadhūtōpaniṣat)
(varṇāśramadharmamulanu viḍicipeṭṭi ātmayaṃdē niṣṭhagalayōgi avadhūta ani ceppabaḍunu - vāninē ati varṇāśramī aṃduru - varṇāśrama dharmamulanu atikramiṃcina yōgi.)
tatvamasyādi lakṣaṇatvāt avadūta itīryatē ||“. (avadhūtōpaniṣat)
(saṃsāra baṃdhamunu viḍicipeṭṭuṭacētanu, “tatvamasi” anu mahāvākyārthamunu lakṣyamugānuṃcu konuṭacētanu, uttamuḍaguṭacētanu avadhūtayani ceppabaḍucunnāḍu.) (sanyāsōpaniṣat)
(ē vidhamaina niyamamu lēnivāḍu - ajagaravṛttinanusariṃci ēdi dorikitē dāninē āhāramugā goni paramātmānusaṃdhānamaṃdu magnuḍaiyuṃḍuvāḍu.)
“sī. pratinimēṣamu barabrahmaṃbu nīkṣiṃci madi jokki velupala maṟacuvāḍu
kamalamulamīda bhṛṃgamulakaivaḍi mōmupai neṟasina kēśapaṭalivāḍu
geṟuvāsi, māyanaṃgīkariṃcina bhaṃgi vasanaṃbu kaṭṭakavaccuvāḍu
saṃgikāḍani veṃṭa jāṭu bhūtamulu nāvaccu bālurahasa śabdamulavāḍu
tē. mahita padajānujaṃ ghōrumadhyahasta
bāhu vakṣōgaḷānana phālakarṇa
nāsikā gaṃḍa mastaka nayana yugaḷu
ḍaina yavadhūtamūrti vāḍarugudeṃce.”
“u. īrani lōkulaṃ ginisi yeggulu valkanivāḍu, gōrikal
gōranivāḍu, gūṭuval gūḍanivāḍu, vṛdhāprapaṃcamun
cēranivāḍu, daivagati jērina lābhamu jūci tuṣṭuḍai
nēranivāni caṃdamunanērpulu māpanivāḍu, veṃḍiyun”.
“ā. veṟṟi tanamumāni vijñānamūrtiyai
brahmabhāvamunanu baryaṭiṃpa
veṟṟiyaṃcu śukuni veṃṭaneteṃturu
vēladularbhakulunu veṟṟulagucu”. (śrīmadāṃdhramahāgavatamu 1 - 19 - 479, 480, 482)
“va. --- vyāsaputruḍaina śukuṃḍunu mahāyōgi, samadarśanuṃḍēkāṃtamati, māyāśayanaṃbuvalanaṃ delisinavāḍu, gūḍhuṃḍu, mūḍhuni kriyanuṃḍu nirasta bhēduṃḍu ---.”
“va. --- nī putruṃḍu strī puruṣulaneḍu bhēda dṛṣṭi lēkayuṃḍu, maṟiyu nataḍu nirvikalpuṃḍu ---”
(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 4 - 39, 41)
avadhūtamārgamaṃduṃḍuvāḍu lōkamaṃdu mikkili durlabhuḍu, iṭuvaṃṭivāru cālāmaṃdi uṃḍaru - evaḍō okaḍunnayaḍala atanu nityamu pavitramainavāḍu, vairāgyamu mūrtībhaviṃcinaṭlugā uṃḍunu. atanē vēda puruṣuḍu ani jñānulu talacedaru. mahāpuruṣuḍainavāni cittamu nāyaṃdē lagnamai yuṃḍunu. nēnu vāniyaṃdē yuṃḍunu. aṭṭivāḍu kramamugā kuṭīcakuḍai, tarvāta bahūdakuḍai, tarvāta haṃsuḍai, parama haṃsayai, svarūpānu saṃdhānamucēta prapaṃcamaṃṭaṭinī telusukoni, daṃḍamu, kamaṃḍalamu, kaṭisūtramu, kaupīnamu, śarīramu nācchādiṃcu itaravastuvulanu - kappukonunavi -,vāṭiki saṃbaṃdhiṃcina vidhyukta dharmamulanu viḍicipeṭṭi, digaṃbaruḍai - baṭṭalēnivāḍai, dikkulē baṭṭagāgalavāḍai - māsina cinigina vāṭinainanu viḍicipeṭṭi, kṣauramu, snānamu, boṭṭu modalaguvāṭini viḍici, lōkamunaku saṃbaṃdhiṃcinavi, vēdamunaku saṃbaṃdhiṃcinavi yagu kāryamulu māni, aṃtaṭā puṇyamu, pāpamu anuvāṭini visarjiṃci, jñānājñānamulanu viḍici, śītōṣṇamulanu, mānāvamānamulanu, sukhaduḥkhamulanu jayiṃci, vāsanātrayamulatō kūḍā, niṃdāniṃdalu, garvamu, matsaramu, daṃbhamu, darpamu, icchādvēṣamu, kāmamu, krōdhamu, lōbhamu, mōhamu,harṣamu, anurṣa, asūya, ātma saṃ rakṣaṇamu modalaguvāṭini dagdhamucēsi, tanaśarīramunu kuṇapākāramugā cūcucū, aprayatnamugā, niyamamutō lābhālābhamulanu samamugā cūcucū, gōvṛttivale ēdi dorikina dānitōnē prāṇamunu dhariṃciyuṃḍucu, samastavidyalaṃdu pāṃḍityamunu bhasmamucēsi, tanarūpamunu dācukonucū, sarvaōtkṛṣṭamaina, samastamunaku ātmayaina advaitabhāvamu kalpiṃcikoni, iṃduku vyatirēkamainadi ēdiyulēdani, duḥkhamucēta udvignamanaskuḍu kāka, sukhamucēta saṃtōṣiṃcaka, vāṭiyaṃdu ē vidhamaiana spṛhalēnivāḍai, śubhā śubhamulanu gaṇiṃpaka, iṃdriyamulanniṃṭikī uparatuḍai, pūrvāśramamulaṃdu kaligina ācāra vidyādharmamula prabhāvamunu smaraṇalōniki teccukonaka, varṇāśramācāramulanu vadali,pagalanaka, rātriyanaka, nidralēka ellapuḍu saṃcariṃcucu, dēhamātramē migiliyunnavāḍai, piccivāḍuvalenu, dayyamupaṭṭinavāḍuvalenu, okkaḍē tirigucu, māṭalāḍuṭamāni bhagavaṃtuni svasvarūpamunu dhyāniṃcucu, dēniyaṃdunu ālaṃbanamu cēyaka, svātmaniṣṭhalōnuṃḍuṭacēta anniṃṭinī maraci, turīyātītamaina avadhūtarūpamutō advaitaniṣṭhāparuḍai, praṇavamu manasulōnuṃci dhyāniṃcucū, japiṃcucū, dēhatyāgamu cēyuvāḍu avadhūta yanabaḍunu - atanē kṛta kṛtyuḍu ” ani turīyātītōpaniṣattu ceppucunnadi.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.