← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవాంతర ప్రళయము avāṃtara praḷayamu

Original — తెలుగు
  1. ఒక బ్రహ్మాండమునకును, దానిని సృష్టించిన బ్రహ్మకును కలుగు ప్రయోజనము.

  2. “సీ. వసుమతీనాధ, సర్వస్వామియైన గోవిందుండు చిదచిదానందమూర్తి

సలలిత స్వోపాధి శక్తి సమేతుడై తనరారు స్వాత్మీయధామమందు

ఫణిరాజ మృదుల తల్పంబు పై సుఖలీల యోగనిద్రారతినున్నవేళ

నఖిల జీవులు నిజవ్యాపారశూన్యులై యున్నత తేజంబులురలు కొనగ

తే. జరుగు నయ్యవస్థా విశేషంబులెల్ల

విదితమగునట్లు పలుకుట యిది నిరోధ

మన, నిది యవాంతరప్రళయం బనంగ

బరగు - - -.” (శ్రీమదాంధ్రమహాభాగవతము- 2 - 10 - 266)

Transliteration
  1. oka brahmāṃḍamunakunu, dānini sṛṣṭiṃcina brahmakunu kalugu prayōjanamu.

  2. “sī. vasumatīnādha, sarvasvāmiyaina gōviṃduṃḍu cidacidānaṃdamūrti

salalita svōpādhi śakti samētuḍai tanarāru svātmīyadhāmamaṃdu

phaṇirāja mṛdula talpaṃbu pai sukhalīla yōganidrāratinunnavēḷa

nakhila jīvulu nijavyāpāraśūnyulai yunnata tējaṃbuluralu konaga

tē. jarugu nayyavasthā viśēṣaṃbulella

viditamagunaṭlu palukuṭa yidi nirōdha

mana, nidi yavāṃtarapraḷayaṃ banaṃga

baragu - - -.” (śrīmadāṃdhramahābhāgavatamu- 2 - 10 - 266)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.