← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవస్థా త్రయము avasthā trayamu

Original — తెలుగు
  1. “తిస్రస్తావదవస్థాః శరీరస్య జీవస్య ప్రసిద్ధా - జాగరితం స్వప్నః, సుషుప్తమితి”.

(జీవుని ప్రసిద్ధిపొందిన అవస్థలు మూడు - జాగ్రత్, స్వప్నము, సుషుప్తి అని.)

  1. “వ. --- జాగ్రత్స్వప్న సుషుప్త్యస్థా భేదం బాత్మమయంబై బుద్ధి యుక్తంబయిన యోగంబునం బరిణమించు ---”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 12 - 24 -)

  1. జాగ్రత్త, స్వప్నము, సుషిప్తి ఇవి క్రమముగా సత్వరజస్తమో గుణముల స్వభావము - ఈ అవస్థలు పుట్టుటకు, నిలిచియుండుటకు, నశించిపోవుటకు బుద్ధియే కారణము - జ్ఞానము, తెలివి కలిగియుండుటచేత జాగ్రదవస్థ; ఇది సత్వమయము. మనస్సువల్ల పుట్టినదగుటచేత స్వప్నావస్థ రజోమయము. అజ్ఞానరూపమగుటవలన సుషుప్తి తమోగుణము.

  2. “అంతఃకరణ ప్రతిబింబ చైతన్యం యత్ తదేవ అవస్థా త్రయ భాక్ భవతి, సజాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థాం ప్రాప్య ఘటీయంత్రవత్ ఉద్విగ్నో జాతోమృతః ఇవస్థితఓ భవతి”. (పైంగలోపనిషత్)

(అంతఃకరణంబులో ప్రతిబింబించిన చైతన్యమే ఈ అవస్థా త్రయమును అనుభవించువాడు. ఆ చైతన్యమైనజీవుడు ఈ జాగ్రత్, స్వప్న సుషుప్త్యవస్థలను పొంది యాతమువలె ఉద్వేగమును పొందుచున్నాడు, చనిపోయినవాడువలె అగుచున్నాడు.)

  1. “తస్య త్రయావస్థా స్స్వప్నాః” ఇతి శ్రుతేః –

జాగ్రత్స్వప్నసుషుప్త్యాది ప్రపంచం యత్ప్రకాశతే |

తద్బ్రహ్మా హమితి జ్ఞాత్వా సర్వ బంధైః ప్రముచ్యతే ||” (కైవల్యోపనిషత్)

(జాగ్రత్స్వప్నసుషుప్తులు మొదలగువాటితో కూడి ప్రకాశించు - కనబడు - ఈ ప్రపంచము ” బ్రహ్మ హం ”

(నేను బ్రహ్మను) (అహం బ్రహ్మాస్మి) అను మహావాక్యముయొక్క అర్థము తెలుసుకొనినంతనే బంధములన్నియు తెగిపోవును.)

  1. జాగరః, స్వప్నః సుషుప్తిః ఇతి బుద్ధేః ఏతా వృత్త యః, తాశ్చ న స్వాభావికాః, కింతు గుణతః ఏవ

“శ్లో”. సత్వాత్ జాగరణం విద్యాత్ రజసా స్వప్నమాది శేత్ ప్రస్వాపం తమసా జంతోః తురీయం త్రిషు సంతతః ||”

జీవస్తు విలక్షణః, తదవస్తా రహితః ఏవ వినిశ్చితః, తాసాం సాక్షిత్వేన -

(జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ ఈ మూడున్నూ బుద్ధియొక్క వృత్తులు - అవి స్వాభావములు కావు - సత్వరజస్తమోగుణములవలన కలిగినవే - సత్వగుణమువలన కలిగినది జాగ్రదవస్థ, రజో గుణమువలన కలిగినది స్వప్నావస్థ, తమోగుణమువలన కలిగినది సుషుప్త్యవస్థ. జీవుడు ఈ అవస్థ లకు విలక్షణుడైనవాడు; వాటికి సాక్షి అయినవాడు గనుక అవస్థలు లేనివాడు.)

  1. “కౌమారం యౌవనం జరా” అని శరీరావస్థలు మూడు అని శ్రీమద్భగవద్గీతలో చెప్పబడినది -

“దేహినో(అ)స్మిన్ యథా దేహ కౌమారం యౌవనం జరా |” (2 - 12)

(బాల్యము ఒక అవస్థయని వేరే చెప్పబడలేదుకాని బాల్యము కౌమారములో కలిసియున్నది. 15 సంవత్సరములవరకు బాల్యము, 30 సంవత్సరముల వరకు కౌమారము, యౌవనము 50 సంవత్సరములవరకు ఆ పైన వార్థక్యము.)

  1. “బాలద్యాః జాగ్రదాద్యాశ్చ వ్యావృత్తాః పరస్పరం |

అవస్థాః కల్పితా భ్రాంత్యా ప్రత్యగాత్మని కేవలే ||“. (గీతాభావ ప్రకాశము - 2 - 131)

(బాల్యము, కౌమారము, యౌవనము, వార్థక్యము అను నాలుగు అవస్థలున్నూ, జాగ్రత్ స్వప్న సుషుప్తి అను అవస్థలున్నూ కేవలుడు అయిన ప్రత్యగాత్మయందు భ్రాంతిచేత కల్పింపబడినవి.)

  1. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అను త్రిమూర్తులు భగవంతుని అవస్థలు - త్రిగుణములు అని చెప్పబడినది.

  2. జాగ్రదవస్థాభిమాని అయిన జీవుడు విశ్వుడనియు, స్వప్నావస్థాభిమాని తైజసుడనియు, సుషుప్త్యవస్థాభి మాని ప్రాజ్ఞుడనియు చెప్పబడుచున్నాడు. ఇది వ్యష్టి - సమష్టిలో వైశ్యానరుడు, హిరణ్యగర్భుడు, ఈశ్వరుడు అని చెప్పబడుచున్నాడు.

Transliteration
  1. “tisrastāvadavasthāḥ śarīrasya jīvasya prasiddhā - jāgaritaṃ svapnaḥ, suṣuptamiti”.

(jīvuni prasiddhipoṃdina avasthalu mūḍu - jāgrat, svapnamu, suṣupti ani.)

  1. “va. --- jāgratsvapna suṣuptyasthā bhēdaṃ bātmamayaṃbai buddhi yuktaṃbayina yōgaṃbunaṃ bariṇamiṃcu ---”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 12 - 24 -)

  1. jāgratta, svapnamu, suṣipti ivi kramamugā satvarajastamō guṇamula svabhāvamu - ī avasthalu puṭṭuṭaku, niliciyuṃḍuṭaku, naśiṃcipōvuṭaku buddhiyē kāraṇamu - jñānamu, telivi kaligiyuṃḍuṭacēta jāgradavastha; idi satvamayamu. manassuvalla puṭṭinadaguṭacēta svapnāvastha rajōmayamu. ajñānarūpamaguṭavalana suṣupti tamōguṇamu.

  2. “aṃtaḥkaraṇa pratibiṃba caitanyaṃ yat tadēva avasthā traya bhāk bhavati, sajāgrat svapna suṣuptyavasthāṃ prāpya ghaṭīyaṃtravat udvignō jātōmṛtaḥ ivasthitaō bhavati”. (paiṃgalōpaniṣat)

(aṃtaḥkaraṇaṃbulō pratibiṃbiṃcina caitanyamē ī avasthā trayamunu anubhaviṃcuvāḍu. ā caitanyamainajīvuḍu ī jāgrat, svapna suṣuptyavasthalanu poṃdi yātamuvale udvēgamunu poṃducunnāḍu, canipōyinavāḍuvale agucunnāḍu.)

  1. “tasya trayāvasthā ssvapnāḥ” iti śrutēḥ –

jāgratsvapnasuṣuptyādi prapaṃcaṃ yatprakāśatē |

tadbrahmā hamiti jñātvā sarva baṃdhaiḥ pramucyatē ||” (kaivalyōpaniṣat)

(jāgratsvapnasuṣuptulu modalaguvāṭitō kūḍi prakāśiṃcu - kanabaḍu - ī prapaṃcamu ” brahma haṃ ”

(nēnu brahmanu) (ahaṃ brahmāsmi) anu mahāvākyamuyokka arthamu telusukoninaṃtanē baṃdhamulanniyu tegipōvunu.)

  1. jāgaraḥ, svapnaḥ suṣuptiḥ iti buddhēḥ ētā vṛtta yaḥ, tāśca na svābhāvikāḥ, kiṃtu guṇataḥ ēva

“ślō”. satvāt jāgaraṇaṃ vidyāt rajasā svapnamādi śēt prasvāpaṃ tamasā jaṃtōḥ turīyaṃ triṣu saṃtataḥ ||”

jīvastu vilakṣaṇaḥ, tadavastā rahitaḥ ēva viniścitaḥ, tāsāṃ sākṣitvēna -

(jāgradavastha, svapnāvastha, suṣuptyavastha ī mūḍunnū buddhiyokka vṛttulu - avi svābhāvamulu kāvu - satvarajastamōguṇamulavalana kaliginavē - satvaguṇamuvalana kaliginadi jāgradavastha, rajō guṇamuvalana kaliginadi svapnāvastha, tamōguṇamuvalana kaliginadi suṣuptyavastha. jīvuḍu ī avastha laku vilakṣaṇuḍainavāḍu; vāṭiki sākṣi ayinavāḍu ganuka avasthalu lēnivāḍu.)

  1. “kaumāraṃ yauvanaṃ jarā” ani śarīrāvasthalu mūḍu ani śrīmadbhagavadgītalō ceppabaḍinadi -

“dēhinō(a)smin yathā dēha kaumāraṃ yauvanaṃ jarā |” (2 - 12)

(bālyamu oka avasthayani vērē ceppabaḍalēdukāni bālyamu kaumāramulō kalisiyunnadi. 15 saṃvatsaramulavaraku bālyamu, 30 saṃvatsaramula varaku kaumāramu, yauvanamu 50 saṃvatsaramulavaraku ā paina vārthakyamu.)

  1. “bāladyāḥ jāgradādyāśca vyāvṛttāḥ parasparaṃ |

avasthāḥ kalpitā bhrāṃtyā pratyagātmani kēvalē ||“. (gītābhāva prakāśamu - 2 - 131)

(bālyamu, kaumāramu, yauvanamu, vārthakyamu anu nālugu avasthalunnū, jāgrat svapna suṣupti anu avasthalunnū kēvaluḍu ayina pratyagātmayaṃdu bhrāṃticēta kalpiṃpabaḍinavi.)

  1. brahma, viṣṇu, mahēśvarulu anu trimūrtulu bhagavaṃtuni avasthalu - triguṇamulu ani ceppabaḍinadi.

  2. jāgradavasthābhimāni ayina jīvuḍu viśvuḍaniyu, svapnāvasthābhimāni taijasuḍaniyu, suṣuptyavasthābhi māni prājñuḍaniyu ceppabaḍucunnāḍu. idi vyaṣṭi - samaṣṭilō vaiśyānaruḍu, hiraṇyagarbhuḍu, īśvaruḍu ani ceppabaḍucunnāḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.