జాగరణ, స్వప్న, సుషుప్తి, తుర్య, తుర్యాతీతములు పంచ అవస్థలు.
“స్థావరంబులకు సుషుప్తియు, పశువులకు స్వప్న సుషుప్తులు, దేవతులకు జాగరణంబును, మను ష్యులకు అవస్థాత్రయమును - జాగ్రత్స్వప్నసుషుప్తులును -, యోగులకు తుర్యంబును, ఆరూఢులకు తుర్యాతీతంబును నగు” (వివేకచింతామణి - 1)
“రజోగుణము అధికముగాగల బ్రహ్మ స్థూలదేహము, సత్వగుణము అధికముగాగలది విష్ణువు లింగ దేహము, సర్వకారణరూపుడును, తమోగుణము అధికముగాగల రుద్రుడు - శివుడు - కారణదేహము - గుణత్రయములయొక్క సామ్యావస్థ అని చెప్పబడుమాయ తురీయావస్థ, మాయలేనిది, తురీయమును మించినది నిర్గుణబ్రహ్మ - ఇది అవస్థాపంచకము”.
“యా గుణత్రయ సామ్యావస్థాంతర్ముఖా మాయా సామే తురీయా రూపస్య ఉపాధిః ఇత్యర్థః - మాయా రహితం తు తురీయాతీతం యత్ తదేవ నిర్గుణబ్రహ్మ విశిష్యతి”.
(సత్వరజస్తమో గుణములు సమముగా ఉన్న మాయ నాయొక్క - (దేవీయొక్క) - తురీయ రూపమునకు (అవస్థకు) ఉపాధి - మాయలేనిది, తురీయమును మించినది - అతీతమైనది పరబ్రహ్మయే.)
(జాగ్రత్, స్వప్నము, సుషుప్తి, మూర్చ, మరణము అను అవస్థలు అయిదు.) (అంతఃకరణములు, ఇంద్రియ ములు వీటిద్వారా విషయములను గ్రహించుట జాగ్రదవస్థ. స్వతంత్రముగనే కల్పితపదార్థములను గ్రహించుట స్వప్నావస్థ. మఱియొక దేహమును పొందుటకు ఉద్యుక్తమగుట మూర్చావస్థా. ఈ దేహమును విడిచిపెట్టి మఱియొక దేహమునుపొందుట మరణావస్థ.)
తతః సత్వగుణః, తతః రజోగుణః. ఏ తద్గుణత్రయ విశిష్ట చైతన్యస్య నామాంతరాణి - గుణత్రయ మధ్యే ఏకైక గుణాభిమానినః బ్రహ్మోదయః.
“గుణత్రయాత్మకాః ప్రోక్తాః బ్రహ్మ విష్ణు మహేశ్వరాః |
రజోగుణాధికో బ్రహ్మా, విష్ణుస్సత్వాధికో భవేత్ |
తమోగుణాధికో రుద్రః సర్వకారణరూపదృక్ |
స్థూలదేహో భవేద్బ్రహ్మా, లింగదేహో హరిస్మృతః |
రుద్రస్తు కారణో దేహః తురీ యాతు అహమేవహి |
సామ్యావస్థాతు యా ప్రోక్తా సర్వాంతర్యామిణీ |
అతః ఊర్థ్వం పరం బ్రహ్మ మద్రూపం రూప వర్జితం |
నిర్గుణం సగుణం చేతి ద్విధామద్రూపముచ్యతే |
నిర్గుణం మాయాహీనం సగుణం మాయ యా యుతం ||'. (శ్రీదేవీ భాగవతం.)
యాగుణత్రయ సామ్యవస్థాంతర్ముఖా మాయా సామే తురీయ రూపస్య ఉపాధిః ఇత్యర్థః. మాయారహితం తు తురీయాతీతం యత్ తదేవ నిర్గుణం బ్రహ్మ విశిష్యతి. ఇదమవస్థా పంచకం“.
(మొట్టమొదట అవ్యక్తమునుండి తమోగుణము పుట్టినది. తర్వాత సత్వగుణము, తర్వాత రజోగుణము పుట్టినవి. ఈ త్రిగుణములతోగూడిన చైతన్యమునకు ఒక్కొక్కదానికి ఒక్కొక్క పేరు. వీరు బ్రహ్మ మొదలగువారు. ఈ మూడు గుణముల స్వరూపులుబ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు - రజోగుణము అధిక ముగానున్నవాడు బ్రహ్మ. సత్వగుణము అధికముగాగలవాడు విష్ణువు. తమోగుణము అధికముగాగల వాడు రుద్రుడు. స్థూలదేహము బ్రహ్మ. లింగదేహము - సూక్ష్మదేహము - విష్ణువు. కారణదేహము రుద్రుడు. తురీయము నేనే, అనగా, ఈ త్రిగుణములయొక్క సామ్యావస్థ - ఒకటి హెచ్చుగాను, ఒకటి తక్కువగాను కాక మూడూ ఒకే పాళ్ళలో - సమానముగా - కలిసియున్న అవస్థ - సర్వాంతర్యామి అయినది నేనే - ఈ నా అవస్థకన్న మీదనున్నది, ఉత్కృష్టమైనది, పరబ్రహ్మ అను రూపములేనిది నారూపము, నేనే. ఆకారము లేని నేనే. నారూపము నిర్గుణమని, సగుణమని రెండు విధములుగా చెప్పబడినది. నిర్గుణమనగా మాయతో కలియనిది, సగుణమనగా మాయతో కూడినది.)
(సత్వ రజస్తమోగుణముల యొక్క సామ్యావస్థగా ఉన్న మాయ నాయొక్క తురీయరూపమునకు ఉపాధి అని పైన చెప్పబడినదాని అర్థము. మాయలేనిది, మాయతో కలియనిది, మాయ యను ఉపాధిలేనిది నా తురీయా వస్థకు అతీతమైనది - అదియే నిర్గుణబ్రహ్మ - ఈ విధముగా అవస్థలు అయిదు - అనగా సత్వరజస్తమములలో ఒక్కొక్కటి అధికముగా ఉన్నవి మూడు - స్థూల సూక్ష్మ కారణ శరీరములు, త్రిమూర్తి స్వరూపములు. నాల్గవది మాయతో కలిసిన తురీయావస్థ. అయిదవది మాయతో కలియని తురీయాతీతమైన నిర్గుణపరబ్రహ్మ.)
jāgaraṇa, svapna, suṣupti, turya, turyātītamulu paṃca avasthalu.
“sthāvaraṃbulaku suṣuptiyu, paśuvulaku svapna suṣuptulu, dēvatulaku jāgaraṇaṃbunu, manu ṣyulaku avasthātrayamunu - jāgratsvapnasuṣuptulunu -, yōgulaku turyaṃbunu, ārūḍhulaku turyātītaṃbunu nagu” (vivēkaciṃtāmaṇi - 1)
“rajōguṇamu adhikamugāgala brahma sthūladēhamu, satvaguṇamu adhikamugāgaladi viṣṇuvu liṃga dēhamu, sarvakāraṇarūpuḍunu, tamōguṇamu adhikamugāgala rudruḍu - śivuḍu - kāraṇadēhamu - guṇatrayamulayokka sāmyāvastha ani ceppabaḍumāya turīyāvastha, māyalēnidi, turīyamunu miṃcinadi nirguṇabrahma - idi avasthāpaṃcakamu”.
“yā guṇatraya sāmyāvasthāṃtarmukhā māyā sāmē turīyā rūpasya upādhiḥ ityarthaḥ - māyā rahitaṃ tu turīyātītaṃ yat tadēva nirguṇabrahma viśiṣyati”.
(satvarajastamō guṇamulu samamugā unna māya nāyokka - (dēvīyokka) - turīya rūpamunaku (avasthaku) upādhi - māyalēnidi, turīyamunu miṃcinadi - atītamainadi parabrahmayē.)
(jāgrat, svapnamu, suṣupti, mūrca, maraṇamu anu avasthalu ayidu.) (aṃtaḥkaraṇamulu, iṃdriya mulu vīṭidvārā viṣayamulanu grahiṃcuṭa jāgradavastha. svataṃtramuganē kalpitapadārthamulanu grahiṃcuṭa svapnāvastha. maṟiyoka dēhamunu poṃduṭaku udyuktamaguṭa mūrcāvasthā. ī dēhamunu viḍicipeṭṭi maṟiyoka dēhamunupoṃduṭa maraṇāvastha.)
tataḥ satvaguṇaḥ, tataḥ rajōguṇaḥ. ē tadguṇatraya viśiṣṭa caitanyasya nāmāṃtarāṇi - guṇatraya madhyē ēkaika guṇābhimāninaḥ brahmōdayaḥ.
“guṇatrayātmakāḥ prōktāḥ brahma viṣṇu mahēśvarāḥ |
rajōguṇādhikō brahmā, viṣṇussatvādhikō bhavēt |
tamōguṇādhikō rudraḥ sarvakāraṇarūpadṛk |
sthūladēhō bhavēdbrahmā, liṃgadēhō harismṛtaḥ |
rudrastu kāraṇō dēhaḥ turī yātu ahamēvahi |
sāmyāvasthātu yā prōktā sarvāṃtaryāmiṇī |
ataḥ ūrthvaṃ paraṃ brahma madrūpaṃ rūpa varjitaṃ |
nirguṇaṃ saguṇaṃ cēti dvidhāmadrūpamucyatē |
nirguṇaṃ māyāhīnaṃ saguṇaṃ māya yā yutaṃ ||'. (śrīdēvī bhāgavataṃ.)
yāguṇatraya sāmyavasthāṃtarmukhā māyā sāmē turīya rūpasya upādhiḥ ityarthaḥ. māyārahitaṃ tu turīyātītaṃ yat tadēva nirguṇaṃ brahma viśiṣyati. idamavasthā paṃcakaṃ”.
(moṭṭamodaṭa avyaktamunuṃḍi tamōguṇamu puṭṭinadi. tarvāta satvaguṇamu, tarvāta rajōguṇamu puṭṭinavi. ī triguṇamulatōgūḍina caitanyamunaku okkokkadāniki okkokka pēru. vīru brahma modalaguvāru. ī mūḍu guṇamula svarūpulubrahma, viṣṇu, mahēśvarulu - rajōguṇamu adhika mugānunnavāḍu brahma. satvaguṇamu adhikamugāgalavāḍu viṣṇuvu. tamōguṇamu adhikamugāgala vāḍu rudruḍu. sthūladēhamu brahma. liṃgadēhamu - sūkṣmadēhamu - viṣṇuvu. kāraṇadēhamu rudruḍu. turīyamu nēnē, anagā, ī triguṇamulayokka sāmyāvastha - okaṭi heccugānu, okaṭi takkuvagānu kāka mūḍū okē pāḷḷalō - samānamugā - kalisiyunna avastha - sarvāṃtaryāmi ayinadi nēnē - ī nā avasthakanna mīdanunnadi, utkṛṣṭamainadi, parabrahma anu rūpamulēnidi nārūpamu, nēnē. ākāramu lēni nēnē. nārūpamu nirguṇamani, saguṇamani reṃḍu vidhamulugā ceppabaḍinadi. nirguṇamanagā māyatō kaliyanidi, saguṇamanagā māyatō kūḍinadi.)
(satva rajastamōguṇamula yokka sāmyāvasthagā unna māya nāyokka turīyarūpamunaku upādhi ani paina ceppabaḍinadāni arthamu. māyalēnidi, māyatō kaliyanidi, māya yanu upādhilēnidi nā turīyā vasthaku atītamainadi - adiyē nirguṇabrahma - ī vidhamugā avasthalu ayidu - anagā satvarajastamamulalō okkokkaṭi adhikamugā unnavi mūḍu - sthūla sūkṣma kāraṇa śarīramulu, trimūrti svarūpamulu. nālgavadi māyatō kalisina turīyāvastha. ayidavadi māyatō kaliyani turīyātītamaina nirguṇaparabrahma.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.