← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవిద్యా పంచకము avidyā paṃcakamu

Original — తెలుగు

“స సర్జాగ్రే (అ) oధతామిశ్రమధతామిశ్రమాదికృత్ |

మహామోహంచ మోహంచతమశ్చా జ్ఞాన వృత్తయః ||“. (శ్రీమద్భాగవతము - 3 - 12 - 2)

(మొదట భగవంతుడు మోహమును, మహామోహమును, తమమును, తామిశ్రమును, అంధతామిశ్రమును అను అయిదు అజ్ఞానవృత్తులను సృష్టించెను).

  1. “అహమ్మను దేహాభిమాన బుద్ధిం గల మోహమును, అంగనా సంగమ స్రక్చందనాది గ్రామ్య భోగేచ్ఛలు మహా మోహంబును, తత్ప్ర్తతిఘాత జాతంబైన క్రోధంబును, అందుకలుగు అంధతామిశ్రంబును, తన్నాశంబు ను, తన్నాశంబునందు అహమేవమృతోస్మి అను తామిశ్రంబును (తమోవికారము), చిత్త విభ్రమంబును అనునవి అవిద్యా పంచకము”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 12 - 387)

“తమో (అ) వివేకో, మోహస్స్యాదంతః కరణ విభ్రమః |

మహా మోహస్తు విజ్ఞేయా గ్రామ్య భోగైక సుఖేషణా |

మరణం హ్యం ధతా మిశ్రం తామిశ్రః క్రోధ ఉచ్యతే |

అవిద్యా పంచసర్వైషా ప్రాదుర్భూతా మహాత్మనః ||“. (పాతంజలి)

(తమస్సు అనగా అవివేకము. అంతఃకరణవిభ్రమము మోహమని చెప్పబడును, స్త్రీసంగమము, మంచిగంధము, పూలమాలలు మొదలగువిషయములవలన సుఖము కలుగవలెనను కోరిక మహామోహము. అంధతామిశ్రమనగా మరణము. తామిశ్రమనగా క్రోధము - ఈ అయిదును అవిద్యా పంచకము).

Transliteration

“sa sarjāgrē (a) odhatāmiśramadhatāmiśramādikṛt |

mahāmōhaṃca mōhaṃcatamaścā jñāna vṛttayaḥ ||“. (śrīmadbhāgavatamu - 3 - 12 - 2)

(modaṭa bhagavaṃtuḍu mōhamunu, mahāmōhamunu, tamamunu, tāmiśramunu, aṃdhatāmiśramunu anu ayidu ajñānavṛttulanu sṛṣṭiṃcenu).

  1. “ahammanu dēhābhimāna buddhiṃ gala mōhamunu, aṃganā saṃgama srakcaṃdanādi grāmya bhōgēcchalu mahā mōhaṃbunu, tatprtatighāta jātaṃbaina krōdhaṃbunu, aṃdukalugu aṃdhatāmiśraṃbunu, tannāśaṃbu nu, tannāśaṃbunaṃdu ahamēvamṛtōsmi anu tāmiśraṃbunu (tamōvikāramu), citta vibhramaṃbunu anunavi avidyā paṃcakamu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 12 - 387)

“tamō (a) vivēkō, mōhassyādaṃtaḥ karaṇa vibhramaḥ |

mahā mōhastu vijñēyā grāmya bhōgaika sukhēṣaṇā |

maraṇaṃ hyaṃ dhatā miśraṃ tāmiśraḥ krōdha ucyatē |

avidyā paṃcasarvaiṣā prādurbhūtā mahātmanaḥ ||“. (pātaṃjali)

(tamassu anagā avivēkamu. aṃtaḥkaraṇavibhramamu mōhamani ceppabaḍunu, strīsaṃgamamu, maṃcigaṃdhamu, pūlamālalu modalaguviṣayamulavalana sukhamu kalugavalenanu kōrika mahāmōhamu. aṃdhatāmiśramanagā maraṇamu. tāmiśramanagā krōdhamu - ī ayidunu avidyā paṃcakamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.