← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవ్యయ యోగము avyaya yōgamu

Original — తెలుగు
  1. యోగం అవ్యయ ఫలత్వాత్ అవ్యయం.

(వ్యయముకానటువంటి - క్షీణించి నశించనటువంటి - ఫలముగల యోగము కనుక అవ్యయ యోగము).

  1. సాంఖ్యయోగం కర్మయోగ రూపోపాయ సహితం, అవ్యయం అవిచ్ఛిన్న సాంప్రదాయం.

(కర్మయోగము ఉపాయముగా - సాధనముగా గల సాంఖ్యయోగము - నిష్కామకర్మయోగము అను ఉపాయముద్వారా పొందదగిన సాంఖ్య యోగ,ము -

  1. జ్ఞాన నిష్టా లక్షణం, కర్మ నిష్ఠోపాయ లభ్యం.

(కర్మనిష్ఠ ఉపాయముగా సాధించతగిన బ్రహ్మజ్ఞాన నిష్ఠయేలక్షణముగా గల యోగము).

  1. “అనాది వేద మూలత్వేన, అనంత ఫలత్వేన అనాది గురు శిష్య పరంపరా ప్రాప్తత్వేన చ కృతిమత్వ శంకానాస్పదత్వాత్ మహోగ్ర భావో అయం యోగః”. (మధుసూదనీ వ్యాఖ్య)

(అనాదియైన వేదమే అధారముగా గలదగుటచేతను, నాశము లేనిది, శాశ్వతమైనది అయిన మోక్షమే ఫలముగా కలదియగుటచేతను, ఎప్పటినుండియో గురు శిష్యుల పరంపర ద్వారా అందింపబడినదగుటచేతను. కృత్రిమమనిగాని, సంశయాస్పదమనిగాని, ఈ మొదలగువాటికి అవకాశము నీయకపోవుటచేతను, ఈ యోగము గొప్ప ప్రభావముకలిగియున్నదగుటచేత అవ్యయ యోగము అని చెప్పబడుచున్నది).

  1. (నిష్కామకర్మ యోగముద్వారా చిత్తశుద్ధి, దానిద్వారా నాశరహితమగు మోక్షము అను ఫలముగల బ్రహ్మజ్ఞానము అను అధ్యాత్మ విద్య అవ్యయ యోగము).

  2. మూడు కాలములందు నశింపకుండునది సత్యము - భగవంతుడు సత్యస్వరూపుడు. అట్టి సత్యస్వరూ పుని పొందించగల ఉపాయమునకు నాశము ఎప్పటికినీ లేదు. కావున అట్టి ఉపాయము కూడ అవ్యయమే - కాలక్రమేణ అవసరమునుబట్టి దానికి ఏ విధమైన కలుగబోయినను భగవంతుడు అవతారమూర్తియై - శ్రీకృష్ణుడు అర్జుననకు బోధించినట్లు - తగిన అధికారిని చూచి మరల ప్రసరింపచేయుచుండును. ఈ రీతిగా, అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ప్రచారములోనున్న భగవత్ జ్ఞానము అను యోగము అవ్యయ యోగము-

Transliteration
  1. yōgaṃ avyaya phalatvāt avyayaṃ.

(vyayamukānaṭuvaṃṭi - kṣīṇiṃci naśiṃcanaṭuvaṃṭi - phalamugala yōgamu kanuka avyaya yōgamu).

  1. sāṃkhyayōgaṃ karmayōga rūpōpāya sahitaṃ, avyayaṃ avicchinna sāṃpradāyaṃ.

(karmayōgamu upāyamugā - sādhanamugā gala sāṃkhyayōgamu - niṣkāmakarmayōgamu anu upāyamudvārā poṃdadagina sāṃkhya yōga,mu -

  1. jñāna niṣṭā lakṣaṇaṃ, karma niṣṭhōpāya labhyaṃ.

(karmaniṣṭha upāyamugā sādhiṃcatagina brahmajñāna niṣṭhayēlakṣaṇamugā gala yōgamu).

  1. “anādi vēda mūlatvēna, anaṃta phalatvēna anādi guru śiṣya paraṃparā prāptatvēna ca kṛtimatva śaṃkānāspadatvāt mahōgra bhāvō ayaṃ yōgaḥ”. (madhusūdanī vyākhya)

(anādiyaina vēdamē adhāramugā galadaguṭacētanu, nāśamu lēnidi, śāśvatamainadi ayina mōkṣamē phalamugā kaladiyaguṭacētanu, eppaṭinuṃḍiyō guru śiṣyula paraṃpara dvārā aṃdiṃpabaḍinadaguṭacētanu. kṛtrimamanigāni, saṃśayāspadamanigāni, ī modalaguvāṭiki avakāśamu nīyakapōvuṭacētanu, ī yōgamu goppa prabhāvamukaligiyunnadaguṭacēta avyaya yōgamu ani ceppabaḍucunnadi).

  1. (niṣkāmakarma yōgamudvārā cittaśuddhi, dānidvārā nāśarahitamagu mōkṣamu anu phalamugala brahmajñānamu anu adhyātma vidya avyaya yōgamu).

  2. mūḍu kālamulaṃdu naśiṃpakuṃḍunadi satyamu - bhagavaṃtuḍu satyasvarūpuḍu. aṭṭi satyasvarū puni poṃdiṃcagala upāyamunaku nāśamu eppaṭikinī lēdu. kāvuna aṭṭi upāyamu kūḍa avyayamē - kālakramēṇa avasaramunubaṭṭi dāniki ē vidhamaina kalugabōyinanu bhagavaṃtuḍu avatāramūrtiyai - śrīkṛṣṇuḍu arjunanaku bōdhiṃcinaṭlu - tagina adhikārini cūci marala prasariṃpacēyucuṃḍunu. ī rītigā, appaṭikī, ippaṭikī, eppaṭikī pracāramulōnunna bhagavat jñānamu anu yōgamu avyaya yōgamu-

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.