← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆభాసవాదము ābhāsavādamu

Original — తెలుగు

“జీవేశ్వరౌ న కేవల ఆభాసరూపే. కింతు మాయాధిష్టాన చైతన్యం, మాయా, తత్ర చైతన్యాభాసః ఇత్యే తత్రయం మిలిత్వా ఈశ్వరః - అవిద్యాధుష్ఠాన చైతన్యం, అవిద్యాంశః తత్రచైతన్యాభాసః ఇత్యేతత్తయం మిలిత్వా జీవః. ఈశ్వరోపాధౌ శుద్ధ సత్వ గుణస్య సత్వాత్ ఈశ్వరే సర్వజ్ఞత్వ సర్వ శక్తి మత్వాది ధర్మాః వర్తంతే - జీవోపాధౌ మలినసత్వ గుణస్య సత్వాత్ జీవే అల్పశక్తిమత్వ కించిజ్ఞత్వాది ధర్మాః వర్తంతే. అయమేవ ఆభాసవాదః ఇత్యుచ్యతే”.

(జీవుడు, ఈశ్వరుడు, - ఈ ఇద్దరు కేవలము అభాసరూపులుకారు. మాయను అధిష్ఠించియున్న చైతన్యము, మాయ, మాయలో చైతన్యమువలె కనబడు అభాసము - ఈ మూడు కలిసిన ఈశ్వరుడు అభాసుడు. అవిద్యనధిష్ఠించియున్న చైతన్యము, అవిద్యయొక్క అంశ ఆ అవిద్యలో చైతన్యముగా ప్రకాశించు ఆభాసము కలిసిన జీవుడు ఈశ్వరోపాధియందు శుద్ధ సత్వ గుణము, సత్వమువలన ఈశ్వరుని యందు సర్వశక్తులు కలిగియుండుట సర్వ అజ్ఞానముకలిగి యుండుట అను ధర్మములుండును. జీవునకు ఉపాధియైన మలిన సత్వగుణప్రభావమువలన జీవునియందు అల్పశక్తికలిగియుండుట, అల్పజ్ఞానము కలిగియుండుట యనెడి ధర్మములుండును. దీనినే అభాసవాదమందురు).

Transliteration

“jīvēśvarau na kēvala ābhāsarūpē. kiṃtu māyādhiṣṭāna caitanyaṃ, māyā, tatra caitanyābhāsaḥ ityē tatrayaṃ militvā īśvaraḥ - avidyādhuṣṭhāna caitanyaṃ, avidyāṃśaḥ tatracaitanyābhāsaḥ ityētattayaṃ militvā jīvaḥ. īśvarōpādhau śuddha satva guṇasya satvāt īśvarē sarvajñatva sarva śakti matvādi dharmāḥ vartaṃtē - jīvōpādhau malinasatva guṇasya satvāt jīvē alpaśaktimatva kiṃcijñatvādi dharmāḥ vartaṃtē. ayamēva ābhāsavādaḥ ityucyatē”.

(jīvuḍu, īśvaruḍu, - ī iddaru kēvalamu abhāsarūpulukāru. māyanu adhiṣṭhiṃciyunna caitanyamu, māya, māyalō caitanyamuvale kanabaḍu abhāsamu - ī mūḍu kalisina īśvaruḍu abhāsuḍu. avidyanadhiṣṭhiṃciyunna caitanyamu, avidyayokka aṃśa ā avidyalō caitanyamugā prakāśiṃcu ābhāsamu kalisina jīvuḍu īśvarōpādhiyaṃdu śuddha satva guṇamu, satvamuvalana īśvaruni yaṃdu sarvaśaktulu kaligiyuṃḍuṭa sarva ajñānamukaligi yuṃḍuṭa anu dharmamuluṃḍunu. jīvunaku upādhiyaina malina satvaguṇaprabhāvamuvalana jīvuniyaṃdu alpaśaktikaligiyuṃḍuṭa, alpajñānamu kaligiyuṃḍuṭa yaneḍi dharmamuluṃḍunu. dīninē abhāsavādamaṃduru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.