“తీర్థములు బాహ్యాభ్యంతర భేదంబున ద్వివిధంబులైయుండు”.
“తే. ఎల్లవియు బాహ్యతీర్థంబులిందువదన
యరయ బాహ్యంబులయ్యు నాభ్యంతరములు
కాశికాతీర్థమాదిగా గలవు కొన్ని
వాని వినిపింతు పరిపాటి వినుము“.
“సీ. శీర్షంబునందలి శ్రీశైలతీర్థంబు మల్లికార్జున దేవుని మనికిపట్టు
ఫాలభాగమునందు ప్రాలేయమయమైన విమలకేదార తీర్థము వసించు
గుచ చూచుకములందు గురుజాంగలముల తీర్థరాజము సంప్రతిష్టనొందు
భ్రూవల్లరీయుగ్మమునకు మధ్యంబున ఆనందతీర్థమధివసించు
నంతరంగమున ప్రయాగమాశ్రయించు
నిమ్మహాతీర్థములు పార్వతీశ్వరునకు
విహరణస్థానములు వేదవిశ్రుతములు
వెలుపలను లోపలను నుండు దలిరు బోడి
. “బాహ్యాంతరతీర్థంబులందున అవిముక్తతీర్థంబుత్త
మోత్తమంబు - - -
సంసారసాగరంబు తరింప సాధనంబగుట తీర్థంబయ్యె” (కాశీ ఖండము - శ్రీనాధుడు)
(చూడుము - ‘మానసతీర్థములు’; ‘అవిముక్తము’ -).
“tīrthamulu bāhyābhyaṃtara bhēdaṃbuna dvividhaṃbulaiyuṃḍu”.
“tē. ellaviyu bāhyatīrthaṃbuliṃduvadana
yaraya bāhyaṃbulayyu nābhyaṃtaramulu
kāśikātīrthamādigā galavu konni
vāni vinipiṃtu paripāṭi vinumu”.
“sī. śīrṣaṃbunaṃdali śrīśailatīrthaṃbu mallikārjuna dēvuni manikipaṭṭu
phālabhāgamunaṃdu prālēyamayamaina vimalakēdāra tīrthamu vasiṃcu
guca cūcukamulaṃdu gurujāṃgalamula tīrtharājamu saṃpratiṣṭanoṃdu
bhrūvallarīyugmamunaku madhyaṃbuna ānaṃdatīrthamadhivasiṃcu
naṃtaraṃgamuna prayāgamāśrayiṃcu
nimmahātīrthamulu pārvatīśvarunaku
viharaṇasthānamulu vēdaviśrutamulu
velupalanu lōpalanu nuṃḍu daliru bōḍi
. “bāhyāṃtaratīrthaṃbulaṃduna avimuktatīrthaṃbutta
mōttamaṃbu - - -
saṃsārasāgaraṃbu tariṃpa sādhanaṃbaguṭa tīrthaṃbayye” (kāśī khaṃḍamu - śrīnādhuḍu)
(cūḍumu - ‘mānasatīrthamulu’; ‘avimuktamu’ -).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.